ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం! : మాజీ మంత్రి షబ్బీర్‌అలీ | - | Sakshi

ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం! : మాజీ మంత్రి షబ్బీర్‌అలీ

Jan 6 2024 12:44 AM | Updated on Jan 6 2024 8:22 AM

- - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ

నిజామాబాద్‌: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నిజామాబాద్‌ అర్బన్‌ ఇన్‌చార్జి షబ్బీర్‌అలీ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారెంటీలు అమలు చేశామన్నారు. మరో రెండింటిని కూడా త్వరలో అమలు చేస్తామని పే ర్కొన్నారు. మున్సిపల్‌ వార్డుల్లో ఐదుగురు సభ్యుల బృందంతో పాటు నోడల్‌ అధికారులు కలిసి ఈ పథకాలను అమలు చేస్తారని చెప్పారు. అంతా పారదర్శకంగా ఉంటుందని తెలిపారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో కేటీఆర్‌ ఫస్ట్రేషన్‌లో పిల్లచేష్టలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, డబుల్‌ బెడ్‌ రూంలు, రుణామాఫీ పథకాలు అమలు చే యలేదన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రజాపాలన సెంటర్లను పరిశీలించారు. నగరంలో అభయహస్తం దరఖాస్తులు లక్ష అందించగా, 88వేల వచ్చాయన్నారు. దరఖాస్తుల గడువు పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు కేశవేణు, నాయకులు భక్తవత్సలం, వైశాక్షి సంతోష్‌, వేణురాజ్‌, మైనారిటీ జావీద్‌, ప్రీతమ్‌, రేవతి పాల్గొన్నారు.

ఇవి చ‌ద‌వండి: ఒక్కొక్కరుగా.. ముఖ్య నేతల జంప్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement