Shabbir Ali
-
ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం! : మాజీ మంత్రి షబ్బీర్‌అలీ
నిజామాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని మాజీ మంత్రి, కాంగ్రెస్ నిజామాబాద్ అర్బన్ ఇన్చార్జి షబ్బీర్‌అలీ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారెంటీలు అమలు చేశామన్నారు. మరో రెండింటిని కూడా త్వరలో అమలు చేస్తామని పే ర్కొన్నారు. మున్సిపల్ వార్డుల్లో ఐదుగురు సభ్యుల బృందంతో పాటు నోడల్ అధికారులు కలిసి ఈ పథకాలను అమలు చేస్తారని చెప్పారు. అంతా పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో కేటీఆర్ ఫస్ట్రేషన్లో పిల్లచేష్టలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూంలు, రుణామాఫీ పథకాలు అమలు చే యలేదన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రజాపాలన సెంటర్లను పరిశీలించారు. నగరంలో అభయహస్తం దరఖాస్తులు లక్ష అందించగా, 88వేల వచ్చాయన్నారు. దరఖాస్తుల గడువు పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశవేణు, నాయకులు భక్తవత్సలం, వైశాక్షి సంతోష్, వేణురాజ్, మైనారిటీ జావీద్, ప్రీతమ్, రేవతి పాల్గొన్నారు. ఇవి చదవండి: ఒక్కొక్కరుగా.. ముఖ్య నేతల జంప్! -
తెలంగాణ నుంచి సోనియా పోటీ.. కాంగ్రెస్ పీఏసీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది. ఐదు అంశాలే ఎజెండాగా సమావేశం కొనసాగింది. పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై పీఏసీలో చర్చించారు. అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు పీఏసీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్బంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని తీర్మానించారు. కాగా, పీఏసీ సమావేశం అనంతరం పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేశాం. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాల అసెంబ్లీ వేదికగా వివరిస్తాం. సభలో మంత్రి భట్టి విక్రమార్క.. గత ప్రభుత్వ అప్పులపై ప్రజెంటేషన్ ఇస్తారు. ఇక, తెలంగాణ చేపట్టిన ప్రాజెక్ట్‌ల అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ప్రాజెక్ట్‌ల్లో ఏం జరిగిందో ఆయన వివరిస్తారు. త్వరలోనే గ్రామసభలు నిర్వహించి అర్హులైన వారికి రేషన్‌కార్డులు పంపిణీ చేస్తాం. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని తీర్మానం చేశాం. గతంలో ఇందిరా గాంధీ కూడా మెదక్ నుంచి పోటీ చేశారు. ఇక, త్వరలోనే రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్టీ. అలాగే, ప్రతీ పార్లమెంట్ సెగ్మెంట్‌కు ఒక్కో మంత్రికి ఇంఛార్జి భాధ్యతలు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఉంటుంది’ అని స్పష్టం చేశారు. పార్లమెంట్ స్థానాల వారీగా బాధ్యతలు అప్పగింత.. సీఎం రేవంత్ రెడ్డి: చేవెళ్ల, మహబూబ్‌నగర్ భట్టి విక్రమార్క: ఆదిలాబాద్ పొంగులేటి: ఖమ్మం ఉత్తమ్ కుమార్ రెడ్డి: నల్లగొండ పొన్నం ప్రభాకర్: కరీంనగర్ -
ఎవరైతేనేం..? పోటీకి ఏమాత్రం తగ్గేదేలే..!
సాక్షి, కామారెడ్డి: సీఎం కేసీఆర్ పోటీ చేయనున్న కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గులాబీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు శనివారం కామారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రత్యర్థులపై చేసిన విమర్శలకు వారి నుంచి అదే స్థాయిలో ప్రతిస్పందన వచ్చింది. సీఎం కేసీఆర్‌ను ఓడించి కామారెడ్డి ప్రజలు కొత్త చరిత్ర రాస్తారని పేర్కొంటున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థిగా సీఎం పేరును ప్రకటించగా.. కాంగ్రెస్‌నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ, బీజేపీ అభ్యర్థిగా జెడ్పీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి నిలవడం దాదాపు ఖాయమైంది. ముగ్గురూ బలమైన నేతలే కావడంతో అందరి దృష్టి కామరెడ్డిపైనే కేంద్రీకృతమైంది. గజ్వేల్ అభివృద్ధి నమూనాగా కామారెడ్డిని ప్రగతి పథంలో నడిపిస్తామని అధికార పార్టీ నేతలు చెబుతుండగా.. అక్కడ అభివృద్ధి ఏమోగానీ వేలాది కుటుంబాలను రోడ్డున పడేశారని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చూపిస్తానంటూ బీజేపీ నేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి చలో గజ్వేల్ కార్యక్రమానికి పిలుపునివ్వగా.. కార్యక్రమానికి ఒకరోజు ముందే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. బీజేపీ శ్రేణులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి చలో గజ్వేల్ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. బీజేపీ రాష్ట్రస్థాయి నేతలు రంగంలోకి దిగడంతో పోలీసులు ఆయనను విడుదల చేశారు. అదే రోజు రాత్రి బీజేపీ నేతలు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి, అందరి దృష్టిని ఆకర్షించారు. కాగా కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్‌అలీ ఇటీవల వాహనాల్లో గజ్వేల్‌కు తరలివెళ్లారు. అక్కడ జరిగిన అభివృద్ధి ఏమిటన్న దానిపై అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఇలా కేసీఆర్ ప్రత్యర్థులిద్దరూ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇద్దరు నేతలు నిత్యం జనంలో తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. ఎదురుదాడి.. మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలపై అటు షబ్బీర్ అలీ, ఇటు వెంకటరమణారెడ్డి ఎదురుదాడికి దిగారు. పార్టీ కార్యక్రమాలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. అవినీతిలో కూరుకుపోయిన వాళ్లు అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కమీషన్లపై కక్కుర్తితో డబుల్ బెడ్రూం ఇళ్లను నాసిరకంగా నిర్మించారని ఆరోపించారు. దళితబంధు పథకంలో అధికార పార్టీ నేతలు రూ. మూడు లక్షల చొప్పున కమీషన్లు దండుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయని, అయితే పొత్తు ధర్మాన్ని విస్మరించి టీఆర్ఎస్ నాయకుడికి బీఫామ్ ఇచ్చి తనను ఓడించే కుట్ర చేశారని ఆరోపించారు. మంత్రి విమర్శలపై బీజేపీ నేత వెంకటరమణారెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ను ఓడించి తీరుతానన్నారు. సీఎం గజ్వేల్‌ను పూర్తిగా వదిలేసి కామారెడ్డిలో మాత్రమే పోటీ చేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్‌ను ఓడించకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. బీఆర్ఎస్ సభా వేదికపై ఉద్యమకారుడొక్కరూ లేరన్నారు. మంత్రి కేటీఆర్‌కు తన పేరు ఉచ్చరించడం కూడా రాలేదని, ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించి జీవితంలో మరిచిపోలేని దెబ్బకొడతానని పేర్కొన్నారు. ఇలా కేటీఆర్ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎదురు దాడికి దిగడంతో కామారెడ్డిలో రాజకీయ వేడి పెరిగింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశాలున్నాయి. కేటీఆర్ విమర్శలు.. కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్.. ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా షబ్బీర్ అలీ పోటీ చేయ గా, మిత్ర ధర్మంతో మద్దతు ఇచ్చి గెలిపించా మని పేర్కొన్నారు. అలాంటి షబ్బీర్ అలీ సీఎం కేసీఆర్ మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, ఎన్నికల్లో డిపాజిట్టు కూడా రాకుండా ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే బీజేపీ నేత వెంకటరమణారెడ్డిపైనా ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పేరు ప్రకటించగానే పోటీ నుంచి తప్పుకుని ఇంట్లో పండుకుంటానన్నాడన్నారు. కేసీఆర్ మీద పోటీ చేయడమంటే పోచమ్మ ముందు పొట్టేలును కట్టేసినట్టేనని పేర్కొన్నారు. రెండు పార్టీలకు డిపాజిట్టు కూడా రాకుండా దిమ్మ తిరిగే దెబ్బకొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
TS Election 2023: షబ్బీర్ అలీకి లైన్‌క్లియర్..! ఎల్లారెడ్డి నుంచి ఇద్దరి పేర్ల పరిశీలన..!
కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ కొనసాగుతోంది. పార్టీ నాయకత్వం దరఖాస్తులను వడపోసి, ఒక్కో నియోజకవర్గంనుంచి ఇద్దరు, ముగ్గురు పేర్లతో జాబితాను రూపొందించింది. కామారెడ్డి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. ఎల్లారెడ్డి నుంచి నలుగురు దరఖాస్తు చేసుకోగా.. వాటిని పరిశీలించిన పీసీసీ ఎన్నికల కమిటీ.. పీసీసీ ప్రధాన కార్యదర్శి సుభాష్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మదన్‌మోహన్‌రావుల పేర్లను సిఫారసు చేసింది. జుక్కల్ నుంచి ఎనిమిది మంది దరఖాస్తు చేసుకోగా ముగ్గురి పేర్లను ఎంపిక చేశారు. మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం, డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్‌తో పాటు తోట లక్ష్మీకాంత్‌రావ్‌ల పేర్లు జాబితాలో ఉన్నాయి. బాన్సువాడ నియోజకవర్గం టికెట్టు కోసం 16 మంది దరఖాస్తు చేసుకోగా.. నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాల్‌రాజు పేరుతో పాటు మరో ఇద్దరి పేర్లను ఎంపిక చేశారు. వారి వివరాలు తెలియరాలేదు. ఈ జాబితాను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించిన అనంతరం పార్టీ కేంద్ర నాయకత్వానికి పంపిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. -
‘ప్రజలే నా బలగం’
నిజామాబాద్: నియోజకవర్గ ప్రజలే తన బలగమని మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేర్కొన్నారు. శుక్రవారం భిక్కనూరులో ని ర్వహించిన కార్యక్రమంలో పలువురు యువకులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త తీవ్రంగా కృషిచేయాలని సూచించారు. తాను ఎప్పటికీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానన్నారు. అధికారంలో లేనప్పటికి ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని, వారికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటున్నానని పేర్కొన్నారు. వానలతో ప్రజ లు ఇబ్బందులు పడుతున్నా సీ ఎం కేసీఆర్ ప్రగతిభవన్, ఫామ్‌హౌస్ వదిలి బయటకు రావడం లేదని విమర్శించారు. అధికారంలో కి వస్తే అమలు చేసే కార్యక్రమాలను ఆయ న ప్రజలకు వివరించారు. సమవేశంలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మద్ది చంద్రకాంత్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యా ల సుదర్శన్, సీనియర్ నేతలు దయాకర్‌రెడ్డి, గజ్జె సురేశ్, సిద్ధగౌడ్, నీల అంజయ్య, దుర్గయ్య, ద్యాగల కిరణ్, చేపూరి రాజు, కొట్లని స్వామి తదితరులు పాల్గొన్నారు. -
అమిత్ షాకు వరుసగా కౌంటర్లు
-
‘రిజర్వేషన్లు తొలగించడం అమిత్ షా తరం కాదు’
సాక్షి, హుస్నాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. చేవెళ్ల సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లను రద్దు చేస్తామని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. అయితే, అమిత్ షా రిజర్వేషన్ల తొలగింపు వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు సీరియస్ అవుతున్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఈ క్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అమిత్‌షా వ్యాఖ్యలు బాధ కలిగించాయి. దేశ హోంమంత్రి మతానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారు?. మత రాజకీయాలు చేస్తే దేశాన్ని ఎవరు కాపాడాలి?. అమిత్ షా వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎందుకు ఖండించలేదు అని ప్రశ్నించారు. ఇక, అమిత్ షా వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కౌంటర్ ఇచ్చారు. తాజాగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ రాజ్యాంగం నడుస్తోంది. ముస్లిం రిజర్వేషన్లను తొలగించడం అమిత్ షా తరం కాదు. అమిత్ షాపై రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. -
అధిష్టానం అవకాశమిస్తే కామారెడ్డి నుంచి పోటీ చేస్తా: అజారుద్దీన్
సాక్షి, కామారెడ్డి జిల్లా: అధిష్టానం అవకాశమిస్తే వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని లింగంపేట్‌లో అజారుద్దీన్ శుక్రవారం పర్యటించారు. ఆయన సమక్షంలో పలువురు వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అజారుద్దీన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. అధిష్ఠానం అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అయితే ఇప్పటికే కామారెడ్డి నుంచి బరిలో దిగేందుకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అజార్ వ్యాఖ్యలతో మరోసారి జిల్లా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. కాగా గతంలోనూ కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమంటూ అజారుద్దీన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించండి
సాక్షి, హైదరాబాద్: మండలిలో కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో విలీనం చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి ఈ నెల 21న జారీ చేసిన బులెటిన్‌ను సవాల్ చేస్తూ కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించింది. ఓ రాజకీయ పార్టీ విలీనం ఎన్నికల సంఘం పరిధిలోని వ్యవహారమని, ఈ విషయంలో అసెంబ్లీ కార్యదర్శికి ఎలాంటి పరిధి లేదని, అందువల్ల విలీన బులెటిన్ అమలును నిలిపేయడంతోపాటు, రాజ్యాం గ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ మండలి కాంగ్రెస్ సభ్యుడు షబ్బీర్ అలీ సోమవారం హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో అసెంబ్లీ కార్యదర్శి, ఫిరాయింపులపై విచారణ జరిపే ట్రిబ్యునల్ హోదాలో మండలి చైర్మన్, కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్‌కుమార్, ఎంఎస్ ప్రభాకర్‌రావు, కె.దామోదర్‌రెడ్డిలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీలో విలీనం చేయడానికి రాజ్యాంగ నిబంధనలు అంగీకరించవని షబ్బీర్ పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహా రం ట్రిబ్యునల్ ముందు పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. దీనిపై ట్రిబ్యునల్ చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగానే మండలి చైర్మన్ విలీన నిర్ణయం తీసుకోవడం, అసెంబ్లీ కార్యదర్శి విలీన బులెటిన్ జారీ చేయడం సరికాదన్నారు. పార్టీ విలీన వ్యవహారం ఎన్నికల కమిషన్‌కు సంబం ధించిందని, దీనిపై మండలి చైర్మన్‌కు ఎటువంటి నిర్ణయాధికారం లేదన్నారు. ఫిరాయింపులపై తామిచ్చిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తున్న మండలి చైర్మన్.. ఫిరాయింపుదారుల విజ్ఞప్తిపై మాత్రం వెంటనే స్పందించి విలీనానికి ఉత్తర్వులిచ్చారని పేర్కొన్నారు. -
25 లక్షల మందికి రూ.500 కోట్లు ఖర్చు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కొడంగల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ..‘ సెప్టెంబర్ 2 న జరగబోయే కొంగరకలాన్ సభకు 25 లక్షల మందిని తరలించాలంటే 2.5 లక్షల వాహనాలు కావాలి..కనీసం నియోజకవర్గానికి 25 వేల మందిని తరలించాలి..25 లక్షల మందిని తేవాలంటే..రెండున్నర లక్షల వాహనాలు కావాలి. కొంగరకలాన్ సభకు రెండున్నర లక్షల మందికి మించి జనసమీకరణ చేయలేరు. 25 లక్షల మందిని తరలించడానికి ఉపయోగించే రెండున్నర లక్షల వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేస్తారు. ఈ టెక్నికల్ వివరాలు విడుదల చేయాలి. సభకు ప్రజలను తరలించేందుకు ఒక్కో వాహనానికి సరాసరి కనీసం ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది. 25 లక్షల మందిని సభకు తరలించాలంటే..4 నుంచి 5 వందల కోట్లు ఖర్చవుతుంది. టీఆర్ఎస్ నాయకులకు గ్రామాల్లో మొఖం చెల్లక హైదరాబాద్‌లో సభ పెడుతున్నార’ ని వ్యాఖ్యానించారు. నిన్న పంపిణీ చేసిన డబ్బాల్లో ప్రచార సామగ్రి లేదు..డబ్బులు పెట్టి పంపిణీ చేశారని ఆరోపించారు. ఒక్కో డబ్బాలో కోటి రూపాయలు పెట్టి పంపిణీ చేశారని అన్నారు. ఇంత జరుగుతుంటే నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.విచారణ సంస్థలు తక్షణమే ఆ సొమ్ముపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గన్మెన్లతో డబ్బాలు మోయించినందుకు ఆ ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టాలని అన్నారు. మా అధిష్టానం ఢిల్లీలో ఉంది...కేసీఆర్ అధిష్టానం మోదీ కూడా ఢిల్లీలోనే ఉన్నారని, టీఆర్ఎస్ బీజేపీకి అనుబంధ శాఖగా కొనసాగుతుందని విమర్శించారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని ప్రశ్నించారు. కొత్తోళ్లకు టిక్కెట్లు ఇస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడగొడతారు..సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇస్తే ప్రజలు ఓడగొట్టే పరిస్థితి టీఆర్ఎస్లో ఉందన్నారు. రెండు వేల కోట్లు కేసీఆర్‌కు ఎక్కడివి: షబ్బీర్ అలీ ప్రజల సమస్యలు గాలికి వదిలేసి ముందస్తు ఎన్నికలు అంటూ కేసీఆర్ టైం పాస్ చేస్తున్నారని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మండిపడ్డారు. నిజామాబాద్ రైతులు నీళ్లు అడుగుతుంటే కేసీఆర్‌కు కనబడటం లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల నిర్వహణకు ఒక్కొక్కరికి రూ. 10 కోట్లు ఇస్తామనడం ఎలక్షన్ రూల్స్‌కి విరుద్ధమన్నారు. రూ. రెండు వేల కోట్లు కేసీఆర్‌కు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ సుమోటోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. సీఎంగా కేసీఆర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.ఎన్నికలంటే కాంగ్రెస్‌కు భయం లేదని, అర్ధరాత్రి పెట్టినా తాము ఎన్నికలకు రెడీ అని వ్యాఖ్యానించారు. -
విందులు కాదు...12% రిజర్వేషన్ కావాలి
హైదరాబాద్: . తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రంజాన్ కానుకలు ప్రకటించడంపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 100 మసీదుల్లో ఇఫ్తార్ విందు ఇస్తానని ప్రకటించడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాగా వేసే ఎత్తులో భాగంగానే ముస్లింలపై వరాల జల్లు కురిపించారని మండిపడ్డారు. అసలు ఇమామ్‌లకు గౌరవ వేతనాలు ప్రకటించే ముందు సీఎం కేసీఆర్ ముస్లిం మతపెద్దలతో చర్చించారా అని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ముస్లింలు 12 శాతం రిజర్వేషన్లు కోరుతున్నారు తప్ప ఇలాంటి చిన్న చిన్నఅంశాలు కాదని విమర్శించారు. ఇమామ్‌లకు వేతనాలు, పేదలకు వస్త్రాలు పంపిణీ చేయడమంటే ముస్లిం వర్గంలోని పేదలను అవమానించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలపై అంత ప్రేమ ఉంటే ఆలేరు ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణ జరిపించాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా దీనిపై ఎంఐఎం స్పందించాలని కోరారు. కాగా ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ సందర్భంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 8న రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించినున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించాంరు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇమామ్‌లకు, మౌసమ్‌లకు నెలకు 1000 రూపాయల భృతిని అందించనున్నామని తెలిపారు.