
సాక్షి, కామారెడ్డి జిల్లా: అధిష్టానం అవకాశమిస్తే వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని లింగంపేట్‌లో అజారుద్దీన్ శుక్రవారం పర్యటించారు. ఆయన సమక్షంలో పలువురు వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అజారుద్దీన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు.
అధిష్ఠానం అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అయితే ఇప్పటికే కామారెడ్డి నుంచి బరిలో దిగేందుకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అజార్ వ్యాఖ్యలతో మరోసారి జిల్లా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. కాగా గతంలోనూ కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమంటూ అజారుద్దీన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment