సాక్షి, కామారెడ్డి: ఏడాదికోసారి రేషన్, పింఛన్లను అప్‌డేట్ చేయాల్సిందేనని కాంగ్రెస్ ప్రభుత్వానికి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, కామారెడ్డిలో అవినీతి రహిత పాలన అందిస్తానని.. ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తానని తెలిపారు.
కామారెడ్డిని అభివృద్ధి దిశగా తీసుకెళ్తా. విజయం అందించిన ప్రజలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు. కేసీఆర్, రేవంత్ ఇక్కడ పోటీ చేయడంతో కామారెడ్డికి గుర్తింపు వచ్చింది. నిజాయితీకి ఓటు వేయాలని కామారెడ్డి ప్రజలు నిర్ణయించుకుని నన్ను గెలిపించారు’’ అని వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.
కాగా, కామారెడ్డి నియోజకవర్గంలో ఐదేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్న వెంకటరమణారెడ్డిని నాయకుడిగా నిలబెట్టింది. ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. అదే విశ్వాసం ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించింది. అది కూడా ఇద్దరు ఉద్ధండులను ఓడించి రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేంతగా.. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి(కేవీఆర్).. కేసీఆర్, రేవంత్‌రెడ్డిలను ఓడించి జాయింట్ కిల్లర్ అన్న పేరు సాధించారు.
ఇదీ చదవండి: కేసీఆర్, రేవంత్‌ను ఓడించిన కమలయోధుడు..
Comments
Please login to add a commentAdd a comment