Venkataramana Reddy
-
రియల్ఎస్టేట్ పడిపోతే పోయేదేం లేదు: కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి
సాక్షి,హైదరాబాద్: కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మంగళవారం(డిసెంబర్10) ఐదు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. హైడ్రాతో పాటు రెరా,టీజీఐఐసీ,జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఏల్లో కాటిపల్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం ఈ అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఐదు కంపెనీలు చెరువులను కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. దీనిపై రెండు నెలల క్రితమే నేను ప్రెస్ మీట్ పెట్టాను. సరిగా నేను మాట్లాడిన 10 రోజుల తర్వాత పర్మిషన్ ఇచ్చిన నిర్మాణాల జోలికి వెళ్లబోమని సీఎం, డిప్యూటీ సీఎం ప్రకటించారు. వీటికి పర్మిషన్ ఇచ్చిన వారు ఎవరు? పర్మిషన్ ఇచ్చిన వారిపై చర్యలేందుకు లేవు ? ఈ ఐదు కంపెనీల మీద హైడ్రా రంగనాథ్‌కు ఫిర్యాదు చేశా.దీనిపై అసెంబ్లీలో మాట్లాడతాం.తప్పు చేసిన మంత్రులు అధికారులు ఎవరైనా శిక్షకు అర్హులే. ఈ ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తేవాలి.ఈ యాక్ట్‌తో కబ్జాల నివారణ వీలవుతుంది.దీనిపై అసెంబ్లీలో చర్చకు పట్టు పడతాం.ప్రభుత్వం స్పందించకుంటే కోర్టుకి వెళ్తాం. ల్యాండ్ గ్రాభింగ్ పై రిఫార్మ్స్ తీసుకురాకుంటే నాయకులను ప్రజలు తరిమి కొడతారు. రియల్ ఎస్టేట్ పడిపోతే నష్టం ఏమి లేదు’అని వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. -
కబ్జా కథలు చెప్పారు.. కారకుల్ని వదిలేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: ‘చెరువుల పరిరక్షణ పేరుతో పేదలు, మధ్య, ఎగువ మధ్యతరగతి ప్రజలు నిర్తించుకున్న ఇళ్లను కూల్చేస్తున్న ప్రభుత్వానికి బడా బాబులు చేసిన కబ్జాలు కనిపించట్లేదా?’అంటూ కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ప్రభుత్వ వ్యవహారశైలిని విమర్శించారు. ఆరు ప్రముఖ సంస్థలు చెరువుల్ని ఎలా కబ్జా చేశాయో, దానికి ప్రభుత్వ విభాగాలు ఏ విధంగా సహకరించాయో వివరిస్తూ బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తాను చెప్పిన విషయాల్లో ఏ ఒక్కటి తప్పని నిరూపించినా రాజీనామా కాదని, ఏకంగా ప్రాణత్యాగమే చేస్తానంటూ సవాల్ విసిరారు. ఎస్ఎంఆర్ కాసా కరీనో గండిపేట మండలం బండ్లగూడ జాగీర్‌లోని సర్వే నంబరు 13లో 1.49 ఎకరాల విస్తీర్ణంలో కుంటఉండేది. ఇందులో గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణానికి హెచ్ఎండీఏ అధికారులు అనుమతి ఇచ్చారు.దీంతో చెరువును పూర్తిగా మింగేసిన ఎస్ఎంఆర్ కాసా కరీనో సంస్థ విల్లాలు నిర్మించింది. ప్రస్తుతం చెరువు ఉండాల్సిన ప్రాంతంలో 15 విల్లాలునిర్మించినట్టు కనిపిస్తోంది. ఒక్కో విల్లా విలువ రూ.10 కోట్లు లెక్కేసుకున్నా వీటి ఖరీదు రూ.150 కోట్లకు పైనే. వజ్రం ఇక్సోరా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలో సర్వే నంబరు 29లో 1.86 ఎకరాల విస్తీర్ణంలో మేడ్లకుంట చెరువు ఉండేది. ఇందులో గేటెడ్ కమ్యూనిటీ నిర్మించడానికి హెచ్ఎండీఏ 2022లో వజ్రం ఇక్సోరాకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం అక్కడ జీ+11 అంతస్తులతో నిర్మాణాలు సిద్ధమవుతున్నాయి. దీని మార్కెట్ విలువ రూ.900 కోట్లు. ఫీనిక్స్, కాండూర్ గండిపేట మండలం పుప్పాలగూడలోని సర్వే నంబర్లు.185, 186, 187, 188, 285, 286, 287, 288, 289ల్లో ముక్కసాని కుంట 19.58 ఎకరాల్లో విస్తరించి ఉండేది. ఈ ప్రాంతాన్ని తొలుత సెజ్‌గా మార్చిన గత ప్రభుత్వం ఆపై తెలంగాణ స్టేట్ ఇండ్రస్టియల్ ఇన్‌ఫ్రాస్ట్చక్చర్ కార్పొరేషన్‌కు (టీఎస్ఐఐసీ) బదిలీ చేసింది. ఫీనిక్స్ సంస్థ ఎనిమిది ఎకరాల్లో, కాండూర్ సంస్థ ఏడు ఎకరాల్లో వాణిజ్య భవనాలు నిర్మించడానికి టీఎస్ఐఐసీ 2023లో అనుమతులు మంజూరు చేసింది. ఫీనిక్స్ నిర్మాణాలను పూర్తి చేయగా, కాండూర్ సంస్థ స్కైలైన్ పేరుతో చేపట్టింది. వీటి విలువ రూ.6 వేల కోట్లు. ఫీనిక్స్ గండిపేట మండలం పుప్పాలగూడలోని 9.25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో గెటేడ్ కమ్యూనిటీ నిర్మించడానికి హెచ్ఎండీఏ 2021లో ఫీనిక్స్కు అనుమతి ఇచ్చింది. ప్లాన్‌తోపాటు గ్రామ మ్యాప్‌లోనూ సర్వే నంబర్లు 272, 273లను వాటర్ బాడీస్‌గా పేర్కొన్నా, అనుమతులు లభించాయి. వీటిలో ఫీనిక్స్ సంస్థ ఆరు సెల్లార్లు, గ్రౌండ్+30 అంతస్తుల్లో 37 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు చేపడుతోంది. దీని మార్కెట్ విలువ కూడా రూ.వందల కోట్లే. ది ప్రెస్టేజ్ సిటీ ప్రేమావతిపేటలోని సర్వే నంబరు 86లో 98 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద చెరువు ఉంది. ఇందులో 31 ఎకరాల్లో ది ప్రెస్టేజ్ సిటీ పేరుతో గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణానికి హెచ్ఎండీఏ అనుమతులు ఇచ్చింది. ఇందులో 90 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు వచ్చాయి. మరో 24 ఎకరాల్లో 8.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టడంతోపాటు 15 ఎకరాల బఫర్ జోన్‌నూ మింగేశారు. వీటి విలువ రూ.8,600 కోట్లు. 1955–1976 మధ్య శిఖం తలాబ్‌లో రికార్డుల్లో ఉన్న ఈ భూమి 1985–86 నాటికి ప్రభుత్వ పట్టా భూమిగా మారిపోయింది. చెరువు పేరే మారిపోయింది గడ్డిపోతారంలోని ఉస్మాన్‌కుంట చుట్టూ 70 ఎకరాల్లో 884 విల్లాలు నిర్మించుకోవడానికి హెచ్ఎండీఏ 2021లో ప్రణీత్ ప్రవణ్ సంస్థకు అనుమతి ఇచ్చింది. వీరు చెరువు, దానిలోని నీళ్లు వచ్చి, వెళ్లే మార్గాలను అలానే ఉంచి... చుట్టూ 884 విల్లాలు నిర్మించారు. ప్రణీత్–ప్రణవ్ గ్రోవ్ పార్క్ లేక్ అంటూ ఆ చెరువు పేరునే మార్చేశారు. తెల్లాపూర్‌లోని చెరువు, శ్మశానాన్ని కబ్జా చేసిన ఏలియన్ స్పేస్ స్టేషన్ సంస్థ గేటెడ్ కమ్యూనిటీ నిర్మించడానికి అనుమతి పొందింది. ప్రస్తుతం ఈ చెరువు రికార్డులు సైతం అందుబాటులో లేకుండా చేశారు. నోటిఫికేషన్ల జారీలోనూ గోల్మాల్ రెండు వేలకు పైగా చెరువులు ఉండగా, గడిచిన 14 ఏళ్లల్లో కేవలం 229 చెరువులకే ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. గత నెలలోనే అనూహ్యంగా 95 చెరువులకు ఇది జారీ అయ్యింది. ఇందులోనూ ఏదో గోల్మాల్ ఉందనిపిస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి రాక్స్, లేక్స్, పార్క్ అంటున్నారు. వాస్తవానికి జరిగింది ఏమిటంటే... డ్యామేజెస్, ప్యాకేజెస్, పర్సంటేజెస్. పర్మిషన్ ఇచ్చిన అధికారులు, వెనుక ఉండి ఇప్పించిన రాజకీయ నాయకులు, నిర్మించిన బిల్డర్లు బాగానే ఉంటున్నారు. ఏమీ తెలియకుండా కొనుక్కున్నవారు నష్టపోతున్నారు. ఇలాంటి అనుమతులు ఇచ్చి న అధికారులపై కేసులు పెట్టి అరెస్టు చేయాలి. రిటైర్ అయితే వారి ఆస్తులను జప్తు చేయాలి. మరో 30 సంస్థల బాగోతాలు నా దగ్గర ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకుంటే హైడ్రాకు ఫిర్యాదు చేయడం, హైకోర్టును ఆశ్రయించడంతోపాటు ప్రజా పోరాటం చేస్తా. ఇళ్లు కూల్చిన వారికి ఏం చేద్దాం అంటూ సీఎం ప్రశ్నిస్తున్నారు. నా ఐదేళ్ల జీతభత్యాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. రాష్ట్రంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు ముందుకొస్తే దాదాపు రూ.300 కోట్లు సమకూరుతాయి. వీటితో నిర్వాసితులకు ఇళ్లు కట్టిద్దాం. చెరువుల్లో కట్టిన ఆ భవనాలు కూడా అక్రమ భవనాలే వాటిని కూడా కూల్చేయండి. లేనిపక్షంలో ఇప్పటివరకు కూల్చివేతలతో ఇళ్లు కోల్పోయి బాధితులుగా మారిన వారికి వాటిలో ఇళ్లు ఇవ్వండి. అప్పుడే అది ప్రజాప్రభుత్వం అవుతుంది. లేకపోతే పైసల ప్రభుత్వం అవుతుంది. – కె.వెంకటరమణారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే -
అనుమతి పొందిన కట్టడాలను ఎలా కూలుస్తారు?: బీజేపీ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: హైడ్రా ఆలోచన బాగున్నా ఆచరణలో మాత్రం సరైన తీరు లేదని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘సామాన్య ప్రజలకు శికం భూమా, బఫర్ జోన్లో ఉందా? అనేది తెలీదు. కష్టపడి సంపాదించిన సొమ్మంతా పెట్టి భూమి కొంటారు. అధికారులు చేసే పనుల వల్ల సామాన్య జనం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది’’ అని వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు.‘‘చెరువులను కాపాడాలి. అక్రమ కట్టడాలను కుల్చాలి కానీ అనుమతులు ఇచ్చిన అధికారులను ఏం చేస్తారు?. అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలను కూల్చితే మంచిదే.. కానీ హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అనుమతి పొందిన వాటిని ఎలా కూలుస్తారు? రాజకీయ నాయకులు, అధికారులు కలిసి సామాన్య ప్రజలది తప్పు అన్నట్లు చేస్తున్నారు. రంగనాథ్ లాంటి సిన్సియర్ ఆఫీసర్ ఉండటం తెలంగాణకు మంచిదే కానీ ఇలా ఎంతకాలం చేస్తారు?. నోటీసు ఇవ్వకుండా రాత్రికి రాత్రే కూలగొట్టడం మంచిది కాదు’’ అని వెంకటరమణారెడ్డి చెప్పారు.‘‘గత ప్రభుత్వ తప్పిదాలకు ప్రజలను బలి పశువు చేస్తారా..?. రేవంత్ రాత్రికి రాత్రి తీసుకునే నిర్ణయంతో సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. చెరువుల్లో కట్టడాలకు అనుమతి ఇచ్చిన వారికి బేడీలు వేసి జైల్లో వేయాలి అప్పుడే మిగతావారికి భయం వస్తుంది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం పక్కకి పోయాయి ఇప్పుడు హైడ్రా కొన్నాళ్లు హడావుడి’’ అంటూ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు. -
బీజేఎల్పీ నేత ఎవరు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ శాసనసభాపక్షనేత ఎన్నికపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు దగ్గరపడుతున్నా, బీజేపీ నేతలు ఎటూ తేల్చలేకపోతున్నారు. గత డిసెంబర్లోనే కేంద్రహోంమంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడే బీజేఎల్పీ నేత ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని అంతా భావించారు. అయితే అప్పుడు తగిన సమయం లేకపోవడంతో తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కొద్దిరోజులకు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి తరుణ్‌చుగ్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నేతలు ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయసేకరణ నిర్వహించారు. ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించాక బీజేఎల్పీ నేతను ప్రకటిస్తామన్నారు. ఇది జరిగి కొద్దిరోజులు గడుస్తున్నా బీజేఎల్పీనేత ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీజేఎల్పీనేతగా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై రాజకీయంగా, పార్టీలో చర్చనీయాంశమవుతోంది. శాసనసభ కార్యకలాపాలపై అవగాహన, వివిధ అంశాలపై విషయ పరిజ్ఞానం, రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అసెంబ్లీ వేదికపై చోటుచేసుకునే ఆయా పరిణామాలకు తగ్గట్టుగా చురుగ్గా స్పందించగలిగే వారికి ఈ బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయంతో పార్టీ నేతలున్నట్టు సమాచారం. ► వరుసగా మూడుసార్లు గెలవడంతోపాటు నగరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే టి.రాజాసింగ్ ఈ పదవి కోరుకుంటున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డితోపాటు పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, పైడి రాకేష్‌రెడ్డిలు కూడా బీజేఎల్పీ నేత పదవిని ఆశిస్తున్నారు. ► గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే బీసీ నేతను సీఎం చేస్తామని నాయ కత్వం ప్రకటించిందని, కనీసం బీజేఎల్పీ నేతగా బీసీ ఎమ్మెల్యేకు అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడా పార్టీలో అంతర్గతంగా వినిపిస్తోంది. ► ఈ నెల 8న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశానికి వివిధ రాజకీయపక్షాల తరఫున నేతలు హాజరై ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి లేదా బీఏసీ భేటీ జరిగే నాటికి బీజేఎల్పీనేతను ఎన్నుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అయితే బీఏసీ భేటీకి శాసనసభాపక్షం ఎవరో ఒకరిని నామినేట్ చేసినా సరిపోతుందని, అందువల్ల దానితో బీజేఎల్పీనేత ఎన్నికకు ముడిపెట్టాల్సిన అవసరం లేదని మరికొందరు వాదిస్తున్నారు. -
TS: రోడ్డు విస్తరణ కోసం ఇంటిని కూల్చేసిన ఎమ్మెల్యే
కామారెడ్డి టౌన్: అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ, ప్రస్తుత సీఎంలను ఓడించి జెయింట్ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మళ్లీ సంచలనంగా మారారు. కామారెడ్డి పట్టణాభివృద్ధిలో భాగంగా రోడ్ల విస్తరణ కోసం ఎమ్మెల్యే తన సొంత ఇంటినే త్యాగం చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. తాతల కాలం నాటి ఆ ఇంట్లోనే నివసించే ఆయన అందులోనే పుట్టి పెరిగారు. అడ్లూర్ రోడ్లో గల తన ఇంటి ముందు ఆర్ అండ్‌బీ, మున్సిపల్ అధికారులతో చర్చించిన అనంతరం జేసీబీలతో కూల్చివేయించారు. సుమారు వెయ్యిగజాల ఆ ఇంటిస్థలాన్ని మున్సిపల్ అధికారులకు అప్పగించారు. పట్టణ అభివృద్ధి, రోడ్ల విస్తరణకు ప్రజలు సహకరించాలని, ఎవరూ ఆందోళన చెందవద్దని, ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ముందుగా తన ఇంటిని కూల్చేసి అభివృద్ధికి సహకరించానని, ఇలాగే ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం త్వరలోనే రోడ్లన్నీ విస్తరించనున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: TS: క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..! -
కరప్షన్ ఫ్రీ కామారెడ్డి
‘‘ఎన్నికల్లో డబ్బు..మద్యం పంచకుండా గెలిచి చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కార్యకర్తలు అండగా నిలవడం, జనం నన్ను నమ్మి ఓటేయడంతో నా లక్ష్యం నెరవేరింది. ఇక కామారెడ్డిలో పెరిగిన రాజకీయ అవినీతిని రూపుమాపి కరప్షన్ ఫ్రీ కామారెడ్డి అన్న పేరు తేవడానికి కృషి చేస్తా’’అని ఇద్దరు రాజకీయ ఉద్ధండులను ఓడించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(కేవీఆర్) అంటున్నారు. సాక్షి, కామారెడ్డి: ‘‘ఎన్నికల్లో డబ్బు..మద్యం పంచకుండా గెలిచి చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కార్యకర్తలు అండగా నిలవడం, జనం నన్ను నమ్మి ఓటేయడంతో నా లక్ష్యం నెరవేరింది. ఇక కామారెడ్డిలో పెరిగిన రాజకీయ అవినీతిని రూపుమాపి కరప్షన్ ఫ్రీ కామారెడ్డి అన్న పేరు తేవడానికి కృషి చేస్తా’’అని ఇద్దరు రాజకీయ ఉద్ధండులను ఓడించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(కేవీఆర్) అంటున్నారు. ‘‘దేమె రాజిరెడ్డి కొడుకు తండ్రిలా నిజాయితీపరుడు అన్న పేరు రావాలి. నేను చనిపోయినప్పుడు లక్షలాది మంది ప్రజలు ఆఖరి చూపునకు రావాలి. అదే నా కోరిక’’అంటు న్న కేవీఆర్‌ను మంగళవారం ‘సాక్షి’పలకరించింది. జెయింట్ కిల్లర్ అవుతాననుకున్నారా ? కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్నపుడు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేసినా, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పోటీ చేసినా ఇక్కడ బీజేపీ జెండా ఎగరాలని, అందుకు మనం కష్టపడా లని కార్యకర్తలతో మాటవరుసకు అన్న. దైవ నిర్ణయమో ఏమోగానీ, ఆ రోజు నా నోటి నుంచి వచ్చి నట్టే నామీద కేసీఆర్, రేవంత్‌రెడ్డి పోటీకి వచ్చారు. ఆ ఇద్దరితో తలపడి ఓడించే అవకాశాన్ని ప్రజలు నాకిచ్చారు. అందుకే రాష్ట్రం, దేశం మొత్తం కామా రెడ్డి ఎన్నికల ఫలితం కోసం ఎదురుచూసింది. ఆ ఇద్దరితో పోటీ అని తెలియగానే ఎలా ఫీల్ అయ్యారు ? దేశంలో ఎవరికీ రాని అవకాశం నాకు దక్కింది. సీఎం, కాబోయే సీఎంలిద్దరూ కామారెడ్డిలో నిలబడుతున్నారని తెలియడంతో ఇద్దరినీ ఓడిస్తానని, ఓడించకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన. ఇద్దరితో పోటీపడడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ల దగ్గర డబ్బు, అధికారం, బలం, బలగం అన్నీ ఉన్నాయి. నా దగ్గర ఆత్మస్థైర్యం ఉంది. నా కోసం దేనికైనా తెగించే కార్యకర్తల బలం ఉంది. అన్నింటికి మించి ప్రజల్లో నామీద నమ్మకం ఉంది. ఆ నమ్మకం, ఆ ధైర్యంతోనే వాళ్లను ఓడిస్తానని శపథం చేసిన. ఒకేసారి ఇద్దరు రాజకీయ ఉద్ధండులను కొట్టే అవకాశం రావడం అదృష్టంగానే భావిస్తున్నా. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఇక్కడి ప్రజలు తమ సొంత ఇంటి వ్యక్తిగా భావించి నన్ను గెలిపించారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత మందిని లొంగదీసుకున్నా, ప్రజలు మాత్రం నావైపు నిలిచారు. ఏ ఊరికి వెళ్లినా మహిళలు ఎంతో ఆదరించారు. వారికి రావాల్సిన వడ్డీ రాయితీ డబ్బుల కోసం చేసిన పోరాటం, భూముల కోసం చేసిన ఉద్యమాలతో నన్ను సొంత అన్నలా, తమ్ముడిలా భావించారు. పోయిన ప్రతిచోటా నువ్వే గెలుస్తావంటూ దీవించి పంపించారు. మీకు రాజకీయ ప్రేరణ ఎవరు? నా చిన్నతనంలో మా నాన్న రాజిరెడ్డి సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. చదువుకునేరోజుల్లో, ఆ తర్వాత ఎక్కడకు వెళ్లినా ఆయన గురించి మాట్లాడుతుంటే ఆసక్తిగా వినేవాన్ని. దేమె రాజిరెడ్డి ఉద్యోగం ఇప్పించాడని చెబుతుండేవారు. వారితో మాట్లాడుతున్నపుడు తాను రాజిరెడ్డి కొడుకునని వారికి తెలియదు. ఆ రాజిరెడ్డి కొడుకును నేనే అన్నప్పుడు వారు నాకు ఇచ్చిన మర్యాద ఇప్పటికీ కళ్లముందు కదలాడుతుంది. ఇంటికి వెళ్లిన తర్వాత అన్నీ నాన్నతో చర్చించేవాడిని. నీతి, నిజాయితీగా పనిచేసినపుడు ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని ఆయన చెప్పిన మాటలు నా మనసులో నిండిపోయాయి. మా నాన్నలాగా గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆ రోజే అనుకున్నాను. హామీలు నెరవేర్చడానికి ఎంత సమయం తీసుకుంటారు? కామారెడ్డి నియోజకవర్గంలో ఇల్లు లేని వారందరికీ ఇల్లు కట్టించి ఇవ్వడమే నా ముందున్న అతి పెద్ద లక్ష్యం. ప్రధాని మోదీ సహకారంతో కేంద్రం నుంచి 40 వేల ఇళ్లు మంజూరు చేయించుకొని, వాటిని నిర్మించి ఇస్తా. సొంత మేనిఫెస్టోలో పేర్కొన్న కార్యక్రమాలన్నీ ఏడాదిన్నరలో పూర్తి చేయాలని అనుకుంటున్న. ముందుగా రైతులు ఎదుర్కొంటున్న కల్లాల సమస్యను పరిష్కరించేందుకు నెల, రెండు నెలల్లో కార్యాచరణ మొదలుపెడతా. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా. -
ఇద్దరు సీఎంలను ఓడించిన వెంకటరమణారెడ్డికి కీలక బాధ్యతలు..?
సాక్షి, కామారెడ్డి: ఇద్దరు ముఖ్య నేతలను ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి అసెంబ్లీలో తొలిసారి అడుగుపెడుతున్నారు. ఆయనకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందన్న అభిప్రాయం బీజేపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. కామారెడ్డిలో ముఖ్యమంత్రిని, కాబోయే ముఖ్యమంత్రిని ఒకేసారి ఓడించడం ద్వారా చరిత్ర సృష్టించిన కేవీఆర్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు సామాజిక మాద్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కొందరు ఫోన్ చేసి జెయింట్ కిల్లర్ అంటూ అభినందించారు. కేవీఆర్ నామినేషన్ వేయక ముందు నిర్వహించిన బైక్‌ర్యాలీ, సభల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆయన ఫాలోయింగ్‌ను చూసి ఆశ్చర్యపోయారు. కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే కేవీఆర్‌ను మంత్రి వర్గంలోకి తీసుకునేలా ప్రయత్నిస్తానని ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మంది ఎమ్మెల్యేలు గెలవకపోవడంతో మంత్రిని చేసే అవకాశం లేకుండాపోయింది. అయితే బీజేపీ శాసనసభా పక్షంలో ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇద్దరు రాజకీయ ఉద్ధండులను ఓడించిన వెంకటరమణారెడ్డికి కీలకమైన పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. రాజకీయాల మీద, వ్యవస్థల మీద అవగాహన ఉన్న వెంకటరమణారెడ్డికి అవకాశం ఇస్తే ఆయన అసెంబ్లీలో ఆయా అంశాల మీద తన గళాన్ని గట్టిగా వినిపించగలరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న విషయమై శ్రేణుల్లో చర్చ సాగుతోంది. -
కాంగ్రెస్ ప్రభుత్వానికి కామారెడ్డి ఎమ్మెల్యే హెచ్చరిక
సాక్షి, కామారెడ్డి: ఏడాదికోసారి రేషన్, పింఛన్లను అప్డేట్ చేయాల్సిందేనని కాంగ్రెస్ ప్రభుత్వానికి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, కామారెడ్డిలో అవినీతి రహిత పాలన అందిస్తానని.. ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తానని తెలిపారు. కామారెడ్డిని అభివృద్ధి దిశగా తీసుకెళ్తా. విజయం అందించిన ప్రజలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు. కేసీఆర్, రేవంత్ ఇక్కడ పోటీ చేయడంతో కామారెడ్డికి గుర్తింపు వచ్చింది. నిజాయితీకి ఓటు వేయాలని కామారెడ్డి ప్రజలు నిర్ణయించుకుని నన్ను గెలిపించారు’’ అని వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. కాగా, కామారెడ్డి నియోజకవర్గంలో ఐదేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్న వెంకటరమణారెడ్డిని నాయకుడిగా నిలబెట్టింది. ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. అదే విశ్వాసం ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించింది. అది కూడా ఇద్దరు ఉద్ధండులను ఓడించి రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేంతగా.. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి(కేవీఆర్).. కేసీఆర్, రేవంత్‌రెడ్డిలను ఓడించి జాయింట్ కిల్లర్ అన్న పేరు సాధించారు. ఇదీ చదవండి: కేసీఆర్, రేవంత్‌ను ఓడించిన కమలయోధుడు.. -
జెయింట్ కిల్లర్!
సాక్షి, హైదరాబాద్/ కామారెడ్డి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పెను సంచలనం సృష్టించారు. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ (బీఆర్ఎస్), రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్)లను ఓడించి చరిత్ర లిఖించారు. ఒకేసారి ప్రస్తుత సీఎం కేసీఆర్‌ను, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అవుతారని భావిస్తున్న రేవంత్‌రెడ్డిలను వెంకటరమణారెడ్డి ఓడించడం విశేషం. అయితే ఆయన ప్రత్యర్థులిద్దరూ రెండుచోట్ల నుంచి పోటీచేయడం గమనార్హం. కామారెడ్డితో పాటు పోటీచేసిన గజ్వేల్‌లో కేసీఆర్ గెలుపొందారు. కామారెడ్డితో పాటు పోటీచేసిన కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఎన్నికల పోలింగ్ ముగిశాక కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో ఆయన మాట్లాడిన సందర్భంగా గెలుపుపై ధీమాను వ్యక్తం చేశారు. భారీ అంచనాల మధ్య కేసీఆర్, రేవంత్‌రెడ్డిలతో పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో చివరకు అదే విశ్వాసం ఆయనను గెలిపించింది. ప్రజల్లో ఆయనకున్న మంచిపేరే వెంకటరమణారెడ్డిని విజయ తీరానికి చేర్చింది. ప్రజలతో కలిసి ఉద్యమాలు... వెంకటరమణారెడ్డి 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడ్వాయి జెడ్పీటీసీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2008లో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఎన్నికై 2011 వరకు పనిచేశారు. 2018లో బీజేపీలో చేరిన ఆయన, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటినుంచి నియోజక వర్గంలో ప్రజలతో కలిసి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. ప్రజల్లో మంచి పట్టు సాధించడంతో ఈసారి బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలోనే వెంకటరమణారెడ్డి పేరు ప్రకటించారు. అయితే సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని తెలిసినా వెనక్కు తగ్గలేదు. సీఎం కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా పోటీకి సిద్ధపడ్డా ఇద్దరినీ ఓడించి తీరతానని శపథం చేశాడు. అన్నట్టే ఇద్దరూ ఆయన చేతిలో ఓడిపోయారు. వెంకటరమణారెడ్డికి 66,652 ఓట్లు రాగా, కేసీఆర్ కు 59,911 ఓట్లు, రేవంత్‌రెడ్డికి 54,916 ఓట్లు వచ్చాయి. కేసీఆర్ మీద 6,741 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అవినీతి రహిత పాలన అందించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. అక్రమాలపై ఎక్కుపెట్టిన ఫిరంగి.... వెంకటరమణారెడ్డి జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన కాలంలో మద్యం, ఇసుక మాఫియాపై యుద్ధం చేసి అప్పట్లో వార్తల్లో నిలిచారు. అధికార పారీ్టకి చెందిన జెడ్పీ చైర్మన్‌గా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వారించినా వెనక్కు తగ్గలేదు. ఒకసారి రాజీనామా పత్రాన్ని విసిరికొట్టి, గన్మెన్లు, కారును వదిలివెళ్లిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. అప్పట్లో ఉపాధ్యాయుల, ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించి అందరి మన్ననలు అందుకున్నారు. 2018లో కామారెడ్డి స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన తరువాత నియోజక వర్గంలో ప్రజాసమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ జనం నోట్లో నాలుకయ్యారు. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎంత ఖర్చు చేస్తున్నా, మద్యం ఎంత పంచుతున్నా వెంకటరమణారెడ్డి మాత్రం వాటికి దూరంగా ఉన్నారు. ఒక సందర్భంలో కార్యకర్తల నుంచి కూడా ఆయన ఇబ్బంది పడ్డారు. ఎన్నికలు దగ్గర పడిన సమయంలో మనం డబ్బులు ఇవ్వకుంటే, మద్యం పంచకుంటే ఇబ్బంది అవుతుందని అనుచరులు ఆయనతో గొడవ పడ్డారు. అయినా ఆయన వెనక్కు తగ్గలేదు. మద్యం పంచడం తనతో కాదని వారికి స్పష్టం చేశారు. దీంతో కార్యకర్తలు కొంత నిరాశ చెందినా, ఊళ్లకు వెళ్లి జనం కాళ్లు మొక్కుతూ ఓట్లు అభ్యర్థించడం విశేషం. -
కామారెడ్డి కింగ్ ఎవరో.?!
సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలోనే వీవీఐపీ సెగ్మెంట్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. కామారెడ్డి కింగ్ ఎవరవుతారన్న దానిపై తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనే చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి ఎన్నికల బరిలో నిలబడటంతో సీఎంను ఓడిస్తానంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీకి దిగారు. వీళ్లిద్దరికీ స్థానికుడైన జడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గట్టిపోటీ ఇచ్చారు. కేసీఆర్ గెలుపు ఖాయమని బీఆర్ఎస్ నేతలు, రేవంత్‌రెడ్డి గెలుస్తాడంటూ కాంగ్రెస్ నేతలు నమ్మకంతో ఉన్నారు. ముక్కోణపు పోటీలో ఎవరు గెలుస్తారన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. కేసీఆర్ తరఫున కేటీఆర్ ఎన్నికల బాధ్యతలు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గత నెల 9 న కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసి అదే రోజు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. కేసీఆర్ తరపున ఎన్నికల బాధ్యతలను మంత్రి కేటీఆర్ నిర్వహించారు. ఎన్నికల ప్రచార బాధ్యతలను ఎమ్మెల్సీ షేరి సుభాష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చేపట్టారు. అలాగే మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, నాయకులు కర్నె ప్రభాకర్, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బాలమల్లు, బాల్క సుమన్, అయాచితం శ్రీధర్ తదితరులు ప్రచారంలో ఉధృతంగా పాల్గొన్నారు. రేవంత్‌కి అండగా వచ్చిన రాహుల్, కర్ణాటక సీఎం గత నెల 10న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అదే రోజు ఇందిరాగాంధీ స్టేడియంలో బీసీ డిక్లరేషన్ సభ ఏర్పాటు చేశారు. రేవంత్‌రెడ్డితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సభలో పాల్గొన్నారు. 26న కామారెడ్డిలో నిర్వహించి బహిరంగ సభలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. కేవీఆర్ కోసం వచ్చిన ప్రధాని మోదీ ఇద్దరు వీఐపీల మధ్య స్థానిక నేతగా బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల హాజరయ్యారు. గత నెల 25న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. గత నెల 4న జిల్లా కేంద్రంలో జరిగిన బైక్‌ర్యాలీ, సభల్లో బీజేపీ రా్రష్్టర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఫలితంపై ఉత్కంఠ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికొద్ది గంటల్లో షురూ అయి, మధ్యాహ్నంలోపు ఫలితాలు వెలువడనున్నాయి. మూడు పార్టీల నేతల్లోనూ గెలుపు ధీమా కనిపిస్తోంది. పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఎవరిలెక్కలు వారు వేసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా తమ పార్టీకి వచ్చే ఓట్లపై కూడికలు, తీసివేతలు చేసి గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే విజయం ఎవరిని వరిస్తుందన్నది కాసేపట్లో తేలిపోనుంది. -
అందరి దృష్టి కామారెడ్డిపైనే..
ఎస్. వేణుగోపాలచారి: కామారెడ్డిలో ఏం జరుగుతుంది.. ఈ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టి అదే. తెలంగాణ తెచ్చిన నేతగా, ముచ్చటగా మూడోసారి సీఎం పీఠాన్ని అధిరోహించాలన్న పట్టుదలతో కేసీఆర్‌లో కామారెడ్డిలో బరిలోకి దిగగా, ఆయనపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోటీకి దిగడమే చర్చకు ప్రధాన కారణం. రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు జనం నాడి పట్టేందుకు సర్వేల మీద సర్వేలు చేస్తున్నాయి. కేసీఆర్, రేవంత్‌రెడ్డితోపాటు బీజేపీ నుంచి స్థానికంగా గట్టి పట్టు సంపాదించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయనకు నియోజకవర్గంలో బలమైన కేడర్ ఉంది. మూడ్ ఎలా ఉంటుందో.. సాధారణంగా వీవీఐపీలు పోటీ చేసే నియోజక వర్గాల్లో ప్రజల నాడి త్వరగా బయటపడుతుంది. కానీ ఇక్కడ రెండు పార్టీల కీలక నేతలు పోటీ చేస్తుండడం, వారికితోడు స్థానికుడైన బలమైన నాయకుడు బరిలో ఉండడంతో పోటీ ఎవరి మధ్యన ఉంటుందన్నదానిపై ఇప్పటికైతే క్లారిటీ రావడం లేదు. స్వయంగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారంటే అభివృద్ధి పరుగులు పెడుతుందన్న భావన కొన్ని సెక్షన్లలో ఉండడం సహజం. అధికార బీఆర్ఎస్పై ఉన్న ఒకింత వ్యతిరేకత ఓట్లను ప్రతిపక్ష పార్టీలు రెండూ పంచుకుంటే అధికార పార్టీకి లాభం జరుగుతుందనే అంచనాలు ఉంటాయి. పేగుబంధం సెంటిమెంట్‌తో కేసీఆర్ రెండు పర్యాయాలుగా గజ్వేల్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన సీఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్‌తో పాటు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. తాను పోటీ చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఐదారు నియోజక వర్గాలపై ప్రభావం చూపవచ్చనే ఉద్దేశంతో రెండు స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యారు. 44వ నంబరు జాతీయ రహదారి ద్వారా హైదరాబాద్‌కు కేవలం గంటన్నరలో చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ కామారెడ్డిని ఎంచుకున్నట్టు భావిస్తున్నారు. దీనికి తోడు కేసీఆర్ తల్లి పుట్టి పెరిగిన ఊరు కావడంతో ఈ ప్రాంతంతో ఆయనకు పేగుబంధం ఉన్నది. ఇక్కడ పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్ఛిన దరిమిలా కేసీఆర్ అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించారు. సర్వేల మీద సర్వేలు... ఇప్పుడు కామారెడ్డి సర్వే రాయుళ్లకు కేరాఫ్ నిలిచిందంటే అతిశయోక్తి కాదు. జనం నాడి పట్టేందుకు ఓ పక్క రాజకీయ పార్టీలు సొంతంగా సర్వేలు చేయించుకుంటుండగా, మరో పక్క నిఘా వర్గాలు, మీడియా సంస్థలు పోటాపోటీగా సర్వేలు చేస్తున్నాయి. కాటిపల్లి ’లోకల్’ బీజేపీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన జెడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గత నాలుగైదేళ్లుగా నియోజక వర్గంలో నిరంతరం ప్రజా సమస్యలపై అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. డ్వాక్రా మహిళలకు రావలసిన వడ్డీ రాయితీ డబ్బుల కోసం, మాస్టర్ ప్లాన్‌తో నష్టం జరుగుతోందని ఆందోళన చెందిన రైతుల కోసం ఈయన అండగా అండగా నిలిచి ఉద్యమానికి నాయకత్వం వహించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు కేటాయించాలని పెద్ద పోరాటమే చేశారు. ఇలా వరుస ఉద్యమాలతో జనంతో మమేకమైన వెంకటరమణారెడ్డి తనకు స్థానికులు ఓట్లు వేసి పట్టం కడతారని ఆశిస్తున్నారు. ఆ మేరకు రూ.150 కోట్లతో సొంత మేనిఫెస్టోను అమలు చేస్తానని ప్రకటించాడు. సీఎం పోటీ చేస్తున్నా.. వెరవకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. సవాల్ చేసి మరీ బరిలోకి దిగిన రేవంత్... అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్యన జరిగే మాటల యుద్ధంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సీఎంకు దమ్ముంటే కొడంగల్‌కు వచ్చి నిలబడమని లేదంటే, తానే కామారెడ్డికి వచ్చి పోటీ చేస్తానంటూ పలుమార్లు సవాళ్లు విసిరారు. సీఎం గానీ, ఆయన పార్టీ నేతల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. కానీ సవాల్ విసిరిన రేవంత్‌రెడ్డి కామారెడ్డి నుంచి బరిలోకి దిగారు. -
నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు
సీఎం కేసీఆర్‌తో కామారెడ్డి నియోజకవర్గంలో తలపడేందుకు రెడీ అయిన బీజేపీ నేత, జెడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి.. విభిన్నమైన ఆలోచనలు చేస్తున్నారు. రూ. 150 కోట్ల సొంత డబ్బుతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటూ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేశారు. శనివారం ఆయన కామారెడ్డిలో సొంత మేనిఫెస్టోను ప్రకటించారు. – సాక్షి, కామారెడ్డి మేనిఫెస్టో ఇలా.. ♦ కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో రెండెకరాల విస్తీర్ణంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించి అందులో ఆధునిక వైద్య సదుపాయాలు కల్పిస్తా. ఇందుకోసం రూ.8 కోట్లు అవుతాయి. ♦ రెండెకరాల్లో మోడల్ స్కూల్ నిర్మించి ఇంటర్ వరకు విద్య అందిస్తాం. పిల్లల కోసం రవాణా సౌకర్యం కూడా కల్పిస్తాం. దీనికి రూ.5.60 కోట్లు వెచ్చిస్తా. ♦ రూ.2 కోట్లతో రైతు సేవా కేంద్రం, రూ.కోటిన్నరతో క్రీడా ప్రాంగణం, రూ.కోటితో ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తా. ♦ రాజంపేట, పాల్వంచ, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, భిక్కనూరు మండల కేంద్రాల్లో రూ.8.25 కోట్ల చొప్పున వెచ్చించి జనరల్ ఆస్పత్రి, మోడల్ స్కూల్, క్రీడా శిక్షణ కేంద్రం, రైతు సేవా కేంద్రం, ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తా. ప్రజా ఉద్యమాలతో గుర్తింపు.. వెంకటరమణారెడ్డి నాలుగైదేళ్లుగా ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తున్నారు. ప్రధానంగా కామారెడ్డి మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ వల్ల ప్రజలు, రైతులకు జరిగే నష్టంపై ఆయన చేసిన పోరాటం సంచలనమై రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలకు వ్యాపించింది. ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్‌గా పైరవీలకు తావులేకుండా ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించి అందరి మన్ననలు పొందారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఆలయాలు, కమ్యూనిటీ హాళ్లు, ఫంక్షన్ హాళ్లకు ఇప్పటివరకు సుమారు రూ.50 కోట్ల వరకు విరాళం అందించారు. రాజకీయాల కోసం కాకుండా సేవ చేయాలన్న లక్ష్యంతో సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నానని, తన ఆస్తులు అమ్మి అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని వెంకటరమణారెడ్డి పేర్కొంటున్నారు. మహానేత డాక్టర్ వైఎస్సార్ స్ఫూర్తి.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎన్టీఆర్‌లు నాకు స్ఫూర్తి. పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అహర్నిశలు పాటుపడిన అరుదైన నాయకుడు వైఎస్సార్. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం, వారితో కలిసి ఫొటో దిగడం ద్వారా ఎంతో మందికి ఆయన చేరువయ్యారు. నేను గెలిచినా, ఓడినా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తా. – వెంకటరమణారెడ్డి, బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి -
బీజేపీ ‘చలో గజ్వేల్’ భగ్నం
సాక్షి, కామారెడ్డి: సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి పేరిట జరిగిన వనరుల విధ్వంసాన్ని ప్రజలకు చూపించడం కోసం బీజేపీ చేపట్టిన ‘చలో గజ్వేల్’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి వెంకటరమణారెడ్డిని ఒకరోజు ముందుగానే గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసి బిచ్కుంద పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం ఉదయం నుంచి భారీసంఖ్యలో బీజేపీ శ్రేణులు వెంకటరమణారెడ్డి ఇంటికి తరలిరాగా, వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తీసుకెళ్లారు. దీంతో జిల్లాకేంద్రంలో ఉద్రిక్త పరిస్థి తులు నెలకొన్నాయి. వెంకటరమణారెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ బిచ్కుంద పోలీస్‌స్టేషన్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార ఆధ్వర్యంలో కార్యకర్తలు, నేతలు ఆందోళన చేశారు. రామారెడ్డి పోలీస్ స్టేషన్లో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఆందోళన చేపట్టారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు కారులో హైదరాబాద్ నుంచి బిచ్కుంద పోలీసుస్టేషన్‌కు బయలుదేరగా పెద్దకొడప్గల్ మండలకేంద్రం శివారులో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన నడుచుకుంటూ పెద్దకొడప్ గల్‌కు చేరుకుని రెండుగంటలపాటు నిరీక్షించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు ఆయన ఫోన్ చేసి ఇక్కడి పరిస్థితిని వివరించారు. పోలీసులు సాయంత్రం వెంకట రమణా రెడ్డిని విడిచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడు తూ గజ్వేల్‌లో అక్రమాలు వెలుగులోకి వస్తాయని, సీఎం చెబుతున్న అభివృద్ధికి సంబంధించిన గుట్టు రట్టవుతుందన్న ఉద్దేశంతోనే తనను అడ్డుకున్నారని ఆరోపించారు. -
భూపాలపల్లి ఎమ్మెల్యేపై హెచ్చార్సిలో ఫిర్యాదు
నాంపల్లి: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వల్ల తమ ప్రాణాలకు హాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ బండారి కవిత, భర్త దేవేందర్‌తో కలిసి సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రామాభివృద్ధి విషయమై ఎమ్మెల్యేతో పలుమార్లు మాట్లాడే ప్రయత్నం చేయగా ఆయన పట్టించుకోకుండా తమను టార్గెట్ చేసినట్లు తెలిపారు. ఈ నెల 2న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల అభివృద్ధి గురించి పలువురు సర్పంచ్‌లు, ఇతర నాయకులు కలవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తన భర్త దేవేందర్ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు వెల్లడించారు. దీనికి ప్రతిగా ఎమ్మెల్యే నువ్వు బీసీ సంఘంలో పని చేసినంత కాలం మీ గ్రామానికి నిధులు ఇవ్వనని హెచ్చరించినట్లు తెలిపారు. అనంతరం అతని అనుచరులతో బెదిరిస్తున్నారని, ఎమ్మెల్యేతో తమకు ప్రాణహాని ఉందని కవిత వాపోయారు. ఈ విషయంలో విచారణ నిర్వహించి తమకు రక్షణ కల్పించాలని ఆమె హక్కుల కమిషన్‌ను కోరారు. -
ఆ మహిళ బ్లాక్ మెయిల్ చేస్తోంది
హైదరాబాద్: తనపై అసత్య ఆరోపణలు చేసిన మదర్ థెరిసా ఫౌండేషన్ ప్రతినిధి కొమురెల్లి విజయలక్ష్మీరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ చీఫ్ విప్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాను సదరు మహిళను లైంగికంగా వేధించానంటూ దుష్ప్రచారం చేసిందని, తన అపార్ట్మెంట్ వద్దకు వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత 8 నెలలుగా తప్పుడు ప్రచారం చేస్తూ తనను సమాజంలో కించపరిచేలా ప్రవర్తిస్తోందని, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోందని తెలిపారు. తన కుటుంబ సభ్యులపై అసత్య ప్రచారం చేస్తోందన్నారు. 2016లో తన సోదరుడికి ఉద్యోగం ఇప్పించాల ంటూ విజయలక్ష్మి తొలిసారిగా తనను కలిసిందని అవకాశం ఉంటే కల్పిస్తానని హామీ ఇచ్చానన్నారు. ఆ తర్వాత మదర్‌థెరిసా ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ పేరుతో తనను కలసి ఆర్థిక సాయం కోరిందన్నారు. తాను కొంత ఆర్థిక సహాయం సంస్థకు అందించానని, ఆ తర్వాత పలుమార్లు ఫోన్ చేసి తనను ఆఫీస్‌లో కలసిందని చెప్పారు. లైంగికంగా కలుద్దామంటూ పలుమార్లు తనపై ఒత్తిడి తేగా అందుకు తాను ఒప్పుకోలేదని అప్పటి నుంచి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టిందన్నారు. ఓ పత్రికలో ఇటీవల మాయలేడి పేరుతో ఓ కథనం రాగా అది ఈ మహిళ గురించేనని తెలుసుకున్నట్లు చెప్పారు. కొందరు నేతలు ఆమెకు అండగా నిలుస్తూ తనపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. డబ్బుల కోసమే ఆమె ఇదంతా చేస్తోందన్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్ 384, 506 కింద కేసు నమోదు చేశారు. -
'ఎమ్మెల్సీ' కోసం రూ. 2 కోట్లు డిపాజిట్ చేయించారు
నిజామాబాద్ : నిజామాబాద్ జెడ్పీ మాజీ ఛైర్మన్ వెంకటరమణారెడ్డి శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ టికెట్ కోసం జిల్లా కాంగ్రెస్ నేతలు తనతో రూ. 2 కోట్లు డిపాజిట్ చేయించారని ఆరోపించారు. సదరు నగదు డిపాజిట్ చేసిన తర్వాతే తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని విమర్శించారు. అయితే ఓటమి భయంతోనే తాను ఎమ్మెల్సీ పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. తాను డిపాజిట్ చేసిన నగదులో రూ. 30 వేలు చొప్పున పార్టీ నేతలు కొందరు కాంగ్రెస్ ఎంపీటీసీలకు పంచారని వివరించారు. ఇస్తే అన్నిపార్టీల జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఇవ్వాలని లేదా రూ. 2 కోట్లు తనకే తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా ఉపాధ్యక్షుడు రాహుల్‌కి ఫిర్యాదు చేస్తానని వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. -
‘రెవెన్యూ’లో బదిలీల చర్చ
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా రెవెన్యూ శాఖలో బదిలీల వ్యవహారంపై తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌లో సీసీఎల్ఏ కమిషనర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో తహసీల్దార్ల పోస్టులు ఖాళీగా ఉంటే అఫీషియేటింగ్ ద్వారా గానీ, ఇతర పరిపాలనా సౌలభ్యంగా గానీ వాటిని భర్తిచేసుకోమని సూచించారు. ఈ ప్రక్రియ నవంబర్ 3లోగా పూర్తిచేసుకోవాలని చెప్పారు. తదుపరి ఓటర్ల జాబితా రివిజన్ ఉంటుందని, జనవరి మొదటివారం వరకు బదిలీలకు అవకాశం ఉండదన్నారు. బదిలీల వ్యవహారం తెరపైకి రావడానికి ఈ అంశం కూడా కారణంగా కనిపిస్తోంది. ఇదిలావుంటే బదిలీలకు ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించడంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆశావహులు బదిలీ విషయంలో తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. బదిలీ బాటపట్టే వారిలో సుమారు డజను మంది అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. సాధారణంగా బదిలీలు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం జరిగితే వ్యవహారం సాధారణంగా సమసిపోతుంది. కానీ ప్రస్తుతం మాత్రం స్థానిక ఎమ్మెల్యేలు, ఉద్యోగ సంఘాల నేతల జోక్యం చర్చనీయాంశమవుతోంది. స్థానికంగా పనికాదనుకున్న కొదరు ఏకంగా రెవెన్యూ మంత్రితో కూడా ఓ మాట చెప్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరికొందరు తాము కోరుకున్న చోటుకు బదిలీచేయిస్తే కాస్తో కూస్తో ఖరుచ పెట్టేందుకు కూడా వెనకాడమంటూ చెపుతుండడం గమనార్హం. అయితే బదిలీ విషయం ముదుకుతెస్తే తేనెతుట్టెను కదిపినట్లవుతుందని ఉన్నతాధికారులు ఆసక్తిచూపడం లేదని తెలుస్తోంది. హన్మకొండ ప్రధాన అంశం ప్రస్తుతం బదిలీల చర్చలో హన్మకొండ మండలం ప్రధాన అంశంగా మారింది. హన్మకొండ మండలానికి వచ్చేందుకు గతంలో నర్సంపేట తహసీల్దార్‌గా ఉన్న హన్మంతరావు చివరిదాకా ప్రయత్నించారు. పనిలోపనిగా హసన్‌పర్తి ఇచ్చినా సరే అన్నట్లు ఆసక్తి చూపారు. కానీ అప్పటి బదిలీల సమయంలో జేసీగా ఉన్న ప్రద్యుమ్న నాటకీయ పరిణామాల మధ్య హన్మంతరావును వర్ధనన్నపేటకు బదిలీచేశారు. ప్రస్తుతం గెజిటెడ్ అధికారుల సంఘంలో నాయకునిగా ఉన్న హన్మంతరావును జిల్లా కేంద్రానికి గానీ, పక్కన ఉన్న మండలాలకుగానీ బదిలీ స్తే బాగుంటుందనే ప్రతిపాదనతో కొందరు సంఘం నాయకులు ప్రయత్నాలు మొదలెట్టారు. ప్రస్తుతం వర్ధన్నపేటలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వివిధ కారణాలతో మరికొందరు.. ఇక గత బదిలీల సమయంలో హన్మకొండ నుంచి నర్సంపేటకు బదిలీ అయి... ఆ వెంటనే మళ్లీ కొడకండ్లకు వెళ్లిన సంజీవ కూడా అక్కడికి అయిష్టంగానే వెళ్లారు. అనారోగ్యం కారణాలతో తనను సమీపంలోని మండలాలకు పంపాలని కోరినా అప్పట్లో అధికారులు వినలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఖాళీగా ఉన్న ధర్మసాగర్ గానీ... సమీప మండలాల్లో ఏదో ఒక చోటకు అవకాశం కోసం సంజీవ ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో స్థాకంగా నేతలతోనూ ఇబ్బందులు రాకుండా పనులు చక్కబెట్టుకునే పనిలో ఉన్నట్లు సమాచారం. వీరితోపాటు అప్పట్లో పూర్తిగా రాజకీయ ఒత్తిళ్లతో నర్సంపేట తహసీల్దార్‌గా విధుల్లో చేరిన రజిని వ్యవహారంలో జిల్లా అధికారులు అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల జేసీ పర్యటనలోనూ ఇదే విషయం స్పష్టమైంది. ఇక తహసీల్దార్‌ను బదిలీ చేయాలని అక్కడి ఆర్డీవో కూడా ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. దీంతో బదిలీగనుక జరిగితే నర్సంపేట తహసీల్దార్‌కు స్థానచలనం దాదాపు ఖాయమైంది. వీరితో పాటు ములుగుగణపురం తహసీల్దార్ విషయంలో ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీంతో బదిలీ విషయంలో ఇక్కడి తహసీల్దార్ పేరు కూడా రావచ్చనే ఊహాగానాలు వినవస్తున్నాయి. అధికారుల ఆగ్రహంతో కొన్ని... ఇక బదిలీ ప్రయత్నాలు ఇలా ఉంటే.. కొన్ని మండలాల విషయంలో స్వయంగా ఉన్నతాధికారులే తహసీల్దార్లకు స్థాన చలనం కల్పించాలని చూస్తున్నారు. ఇలా ఒకటి రెండింటికి అవకాశం ఉంది. సహజంగా తహసీల్దార్ల బదిలీల విషయంలో జిల్లా కలెక్టర్ సర్వాధికారి. కానీ ప్రస్తుతం జరగుతున్న పరిణామాలు ఉద్యోగవర్గాలు, ఉద్యోగ సంఘాల్లో సాగుతున్న చర్చనీయ అంశాలు మాత్రమే. అయితే కోరుకున్న స్థానాల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్న విషయం బదిలీల ప్రక్రియ జరిగితేనే తెలుస్తుంది. అసలు బదిలీలు జరిగేనా...? ఒక వైపు బదిలీ వ్యవహారంపై ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతుంటే మరోవైపు అసలు బదిలీలకు కలెక్టర్ ఆసక్తి చూపుతారా అన్నది కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎదుకంటే సాధారణ ఎన్నికలకు ముందే జిల్లా నుంచి తహసీల్దార్లందరూ ఇతర జిల్లాలకు వెళతారు. ఇందుకు అంతా మూడు..నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ మూడు నెలల కోసం అక్కడివారినిక్కడికి...ఇక్కడివారినక్కడికి మార్చడం ఎందుకని ఆలోచిస్తే బదిలీలు ఉండకపోవచ్చు. ప్రస్తుతం మాత్రం జనగామ డీఏవో పోస్టు, ఖానాపూర్, ధర్మసాగర్ తహసీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నెలాఖరులో దేవరుప్పుల ఖాళీ అవుతుంది. నాలుగైదు తహసీల్దార్ పోస్టులు నింపకుంటే పరిపాలనా పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం ఏం నిర్ణయం తీసుకుంటుందో అన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో ఆసక్తిగా సాగుతోంది. -
ఆ నలుగురు ఉన్నా... నైరాశ్యమే!
=చిలుకలగుట్ట ఫెన్సింగ్‌కు మొండిచేయి =నిధుల ఊసే లేని గిరిజన మ్యూజియం =నల్లారి మాటలు నీటిమూటలు ములుగు, న్యూస్‌లైన్ : జిల్లా నుంచి ఇద్దరు రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య... కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ ప్రాతి నిథ్యం వహిస్తున్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌గా గండ్ర వెంకటరమణారెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయినా... తెలంగాణ కుంభమేళాను తలపించే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరపై సీమాంధ్ర సర్కారు నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. పూర్తిస్థాయిలో నిధులను రాబట్టడంలో ఆ నలుగురు పూర్తిగా విఫలం కాగా... ఎప్పటిలానే గిరిజనుల ఆశలు ఆవిరయ్యూయి. మేడారంలో గిరిజన మ్యూజి యుం ఏర్పాటు చేస్తావుని... చిలుకలగుట్ట చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేస్తావున్న హామీలు ఉత్తుత్తి వూటలుగా మిగిలిపోయూయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న జాతర నేపథ్యంలో జిల్లా యంత్రాంగంలో కదలిక రాగా... పాలకులు ఇచ్చిన హామీలు ఈ సారైనా నెరవేరుతాయని గిరిజనులు ఆశించారు. కేంద్ర మంత్రిగా ఉన్న... ములుగు నియోజకవర్గానికే చెందిన బలరాం నాయక్ అయినా జాతరపై శ్రద్ధ కనబర్చుతాడనుకున్నారు. ఈ రెండు పనులకు ఒక్క పైసా కూడా కేటాయించకపోవడంతో గిరిజనులు భంగపాటుకు గురయ్యూరు. సీఎం కిరణ్ హామీలు బుట్టదాఖలు మేడారం చిలుకలగుట్ట చుట్టూ ఫెన్సింగ్ నిర్యించాలని... గిరిజన సంస్కృతిని చాటి చెప్పేలా జాతర పరిసరాల్లో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయాలని పదేళ్లుగా గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. తల్లి సమ్మక్క కొలువై ఉండే పవిత్రమైన గుట్ట చుట్టూ అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోందని, ఫెన్సింగ్ తప్పనిసరి అని అధికారుల వద్ద పూజారులు నిత్యం మొరపెట్టుకుంటూనే ఉన్నారు. తల్లులు కొలువై ఉండే ప్రాంతాలను శుద్ధిగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని పాలకులను అభ్యర్థిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో గిరిజన మ్యూజియం నిర్మాణానికి అప్పట్లో వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న కాలంలోనే హమీ లభించింది. ఆయన అకాల మరణం తర్వాత పాలకులు పట్టించుకోలేదు. 2010 జాతర సమయంలో ఈ సమస్యలను అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన సీఎం నల్లారి కిరణ్ దృష్టికి తీసుకువచ్చారు. వచ్చే జాతర నాటికి గుట్ట చుట్టూ ఫెన్సింగ్, గిరిజన మ్యూజియం ఏర్పాటుకు ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా అందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ జాతర వచ్చినా.. సదరు పనులకు పైసా మంజూరు కాకపోవడం గమనార్హం. ఇదిలాఉంటే గత జాతర నుంచి పట్టించుకోని గిరిజన సంక్షేమశాఖ అధికారులు హడావుడిగా రెండు నెలల క్రితం గిరిజన మ్యూజియం నిర్మాణానికి సుమారు మూడెకరాల స్థలం కావాలని తాడ్వాయి తహసీల్దార్‌కు నివేదించారు. ఆయన రెండు ప్రాంతాలను సూచించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మంత్రులపై విమర్శల వెల్లువ అటవీశాఖ అధికారులు మోకాలడ్డడంతోనే చిలుకల గుట్ట చుట్టూ ఫెన్సింగ్ నిర్మాణానికి నిధులు మంజూరుకాలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. గుట్ట చుట్టూ కిలోమీటరున్నర మేర ఫెన్సింగ్‌కు * కోటి కావాలని ప్రతిపాదనలు పంపినా... ఫలితం లేదంటున్నారు. కాగా.. జిల్లా యంత్రాంగం జాప్యంతో నిధులు మంజూ రు కాలేదని, అటవీశాఖ గండం నుంచి గట్టెక్కించాలంటే జిల్లాకు చెందిన మంత్రులకు ఓ లెక్కా... వారు పట్టించుకోకపోవడంతోనే ఏటా ఇలానే జరుగుతోందనే విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా వారు స్పందించి నిధులు మంజూరు చేయించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నేడు మేడారంలో కలెక్టర్ కిషన్ సమీక్ష మేడారం జాతర పనుల అంశంపై కలెక్టర్ జి.కిషన్ ఆదివారం మేడారంలోని ఐటీడీఏ గెస్ట్‌హౌస్‌లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించనున్నారు. ఆందోళనలు చేపడతాం పదేళ్ల నుంచి తల్లి సమ్మక్క ఉండే చిలుకల గుట్ట చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్‌గా ప్రభాకర్‌రెడ్డి ఉన్న కాలం నుంచి వినతులు సమర్పిస్తున్నాం. అధికారులు.. పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. గత జాతర సమయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా హామీ ఇచ్చినా ఫలితం లేకపోయింది. అధికారులు తలుచుకుంటే రెండు నెలల్లో ఫెన్సింగ్ చేయొచ్చు. ఇప్పటికైనా నిధులు విడుదల చేయాలి. లేకుంటే ఆందోళనలు చేపడుతాం. - సిద్దబోయిన జగ్గారావు, మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు -
నేటి నుంచి కాకతీయ ఉత్సవాలు
సాక్షి, హన్మకొండ : ఎట్టకేలకు కాకతీయ ఉత్సవాలు పునః ప్రారంభం కానున్నా యి. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు గణపురం మం డల కేంద్రంలోని గణపేశ్వరాలయం (కోట గుళ్లు)లో ఉత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 27న హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లోని నేరేళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానున్న ఉత్సవాలకు ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డితోపాటువరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కలెక్టర్ జి.కిషన్, ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్ హాజరుకానున్నారు. నాలుగు నెలల సుదీర్ఘ విరామం అనంతరం ఉత్సవాలు పునఃప్రారంభం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి స్థానిక కళాకారులకు పెద్దపీట కాకతీయ ఉత్సవాల్లో భాగంగా స్థానిక కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయించారు. కానీ, ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాల్లో స్థానికేతరులకే పెద్దపీట వేశారు. 2012 డిసెంబర్లో జరిగిన ప్రారంభోత్సవంలో రాధారాజారెడ్డి, ఎల్లా వెంకటేశ్వర్లు వంటి ప్రసిద్ధులు. ఆ తర్వాత ఏప్రిల్‌లో మరోసారి జరిగిన ఉత్సవాల్లో పద్మభూషణ్ స్వప్నసుందరి, పద్మశ్రీ ఆనందశంకర్ వంటి స్థానికేతరులైన జాతీయ స్థాయి కళాకారులకే ఎక్కువ ప్రాధాన్యం దక్కిం ది. అరుుతే ఈ సారి గతానికి భిన్నంగా స్థానిక కళాకారుల ప్రదర్శనలకు అవకాశం కల్పిం చారు. బుక్క సాంబయ్య, ఆజ్మీర గోవింద్‌నాయక్, పోరిక శ్యాం, నారగోని విశ్వనాథం, వెంకట్రాం నాయక్, గడ్డం సారయ్య వంటి జిల్లాకు చెందిన ప్రముఖ కళాకారులు తమ బృందాలతో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ మూడు రోజుల వేడుకల్లో జిల్లాకు చెందిన 300 మంది కళాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. వీరితోపాటు జిల్లాకు చెందిన ప్రముఖ కళాకారుడు చుక్కా సత్తయ్య బృందం.. శివసత్తుల ప్రదర్శన ఇవ్వనుంది. వీడని నిధుల గ్రహణం ఏప్రిల్‌లో కాకతీయ ఉత్సవాలు జరిగాయి. నాలుగు నెలల విరామం తర్వాత కాకతీయ ఉత్సవాలు పునఃప్రారంభమవుతున్నా... నిధులకు గ్రహణం వీడలేదు.కాకతీయ ఫెస్టివల్ నిర్వహణకు నిధుల కేటాయిస్తామన్న ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో 2012 డిసెంబర్ నుంచి 2013 ఏప్రిల్ వరకు ప్రతి నెలా ఉత్సవాల నిర్వహణ కష్టంగా మారింది. చివరకు కాకతీయ ఫెస్టివల్లో ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులకు పారితోషికం చెల్లించలేని స్థితి ఏర్పడింది. ఫలితంగా మే, జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన కార్యక్రమాలు కొన్ని వాయిదా పడగా.. మరి కొన్ని రద్దయ్యూరుు. ప్రస్తుతం రూ. 30 లక్షలు విడుదలైనప్పటికీ ఇందులో సగానికి పైగా నిధులు కళాకారుల పారితోషికాలకే సరిపోతాయి. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి నిధులు మంజూరు చేయించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. లేని పక్షంలో డిసెంబర్ వరకు నిరాటంకంగా ఉత్సవాల నిర్వహణ జిల్లా యంత్రాంగానికి తలకుమించిన భారంగా మారే అవకాశం ఉంది. కార్యక్రమ విశేషాలు కుప్ప పద్మజా బృందంలో మొత్తం 12 మంది సభ్యులున్నారు. డి ప్రవళిక, ఆర్.నిమిష, ఎల్.హర్షిణి, బి.శ్వేత, కె.కల్యాణి, ఎ.అనుశ్రీ, పి.చైతన్య, కె.ప్రణవ, పి.సౌందర్య, జి.వర్షిక, సహ్యూలతో కూడిన బృందంతో 45 నిమిషాల పాటు కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుంది. ఈ బృందంలోని సభ్యులందరూ వరంగల్ జిల్లాకు చెందిన వారే. కన్నా సాంబయ్య బృందం వీర బ్రహ్మేంద్రస్వామి జననం బుర్రకథ ఉంటుంది. కన్నా సాంబయ్యతోపాటు ఎం.సదానందం, ఆర్.అశోక్ ఉన్నారు. ఈ కళారూపం గంటపాటు ఉంటుంది. కోటగుళ్లలో ఏర్పాట్లు పూర్తి గణపురం : కాకతీయ ఉత్సవాల నిర్వహణకు గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లు ముస్తాబయ్యూరుు. ఏర్పాట్లు పూర్తికావచ్చాయి. ఉత్సవాలకు ఇన్చార్జ్గా ఉన్న ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్ రెండు పర్యాయాలు గణపేశ్వరాలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవీంద్రనాథ్, అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ప్రతిఒక్కరికి బాధ్యతలను అప్పగించారు. కార్యక్రమాలు నిర్వహించే వేదికతోపాటు సౌండ్స్, లైటింగ్, తాగునీటి వసతి, ఉత్సవాలకు వచ్చే కళాకారులు, అతిథులకు చేసే ఏర్పాటపై సోమవారం సాయంత్రం ఎంపీడీఓ గుళ్లపల్లి విద్యాసాగర్, తహసీల్దార్ రజితతో ఐటీడీఏ పీఓ మాట్లాడారు. అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యూయని అహ్మద్‌కు వారు తెలిపారు. కాగా, మూడు రోజులుగా వర్షాలు పడుతుండడంతో దేవాలయ ప్రాంగణంలో అక్కడక్కడ నీరు నిలిచింది. దీంతో తహసీల్దార్ రజిత పర్యవేక్షణలో సిబ్బంది 150 ట్రాక్టర్ల మొరం తెప్పించి బురద గుంటలను పూడ్చారు.మట్టి కోట చుట్టు ఉన్న పిచ్చి మొక్కలను తొలగించేందుకు మూడు రోజులుగా 300 మంది కూలీలతో పనులు చేయించారు. ఇదిలా ఉండగా, విద్యుత్ సౌకర్యం కోసం ట్రాన్స్‌కో అధికారులు రెండు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తలో భాగంగా మూడు జెనరేటర్లను అందుబాటులో ఉంచారు. ఉత్సవాలకు వచ్చే సందర్శకుల కోసం ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో రెండు ప్రాంతాల్లో 10 మరుగుదొడ్లను నిర్మించారు. కేటీపీపీ అధికారులు మూడు రోజులపాటు ప్రతి రోజు 20 వేల తాగునీటి ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. -
గెలుపోటములు సాధారణం
భూపాలపల్లి, న్యూస్‌లైన్ : క్రీడల్లో గెలుపోటములు సాధారణమని, ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహపడకుండా మరోసారి గెలుపునకు కృషిచేయాలని ప్రభుత్వ చీఫ్‌విప్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) ఆధ్వర్యంలో పరకాల జోన్ పాఠశాలల క్రీడోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. భూపాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ అధ్యక్షతన జరిగిన ఈ క్రీడోత్సవాలకు ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్యఅతిథిగా, పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చీఫ్‌విప్ గండ్ర మాట్లాడుతూ పరకాల ప్రాంతంలో అనేక మంది జాతీయస్థాయి క్రీడాకారులు ఉన్నారన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పన కు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది స్పోర్ట్స్ బడ్జెట్‌ను రూ. 200 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి మాట్లాడుతూ క్రీడలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని నిధులు కేటాయించలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిన అనంతరం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. అనంతరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులు, పీఈటీలుగా ఎంపికైన వారిని ఘనంగా సన్మానించారు. ఈ క్రీడల్లో పరకాల జోన్‌లోని భూపాలపల్లి, రేగొండ, శాయంపేట, చిట్యాల, మొగుళ్లపల్లి, పరకాల మండలాలకు చెందిన సుమారు 700 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్-14, 17 బాల, బాలికల విభాగాల్లో జరుగనున్న కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. కార్యక్రమంలో డీఎస్పీసంజీవరావు, డిప్యుటీ డీఈఓ క్రిష్ణమూర్తి, పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చెర్మైన్ యార మల్లారెడ్డి, భూపాలపల్లి నగర పంచాయతీ కమిషనర్ నోముల రవీందర్‌యాదవ్, ఎంఈఓ సాల్మన్, తహసీల్దార్ రాజమహేందర్‌రెడ్డి, ఎంపీడీఓ బ్రహ్మచారి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.విజయ్‌కుమార్, ప్రైవేటు కళాశాలల సంఘం మండలాధ్యక్షుడు బిల్ల రాజిరెడ్డి, భూపాలపల్లి క్రీడా కమిటీ నాయకులు జోగుల సమ్మయ్య, కె.రాజయ్య, సెగ్గెం సిద్ధు, సంజీవరావు, చిట్యాల, గణపురం ఎంఈఓలు జి.సారంగపాణి, కె.సురేందర్ పాల్గొన్నారు.