సాక్షి,హైదరాబాద్: కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మంగళవారం(డిసెంబర్10) ఐదు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. హైడ్రాతో పాటు రెరా,టీజీఐఐసీ,జీహెచ్‌ఎంసీ,హెచ్‌ఎండీఏల్లో కాటిపల్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం ఈ అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు.
‘ఐదు కంపెనీలు చెరువులను కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. దీనిపై రెండు నెలల క్రితమే నేను ప్రెస్ మీట్ పెట్టాను. సరిగా నేను మాట్లాడిన 10 రోజుల తర్వాత పర్మిషన్ ఇచ్చిన నిర్మాణాల జోలికి వెళ్లబోమని సీఎం, డిప్యూటీ సీఎం ప్రకటించారు. వీటికి పర్మిషన్ ఇచ్చిన వారు ఎవరు? పర్మిషన్ ఇచ్చిన వారిపై చర్యలేందుకు లేవు ? ఈ ఐదు కంపెనీల మీద హైడ్రా రంగనాథ్‌కు ఫిర్యాదు చేశా.
దీనిపై అసెంబ్లీలో మాట్లాడతాం.తప్పు చేసిన మంత్రులు అధికారులు ఎవరైనా శిక్షకు అర్హులే. ఈ ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తేవాలి.ఈ యాక్ట్‌తో కబ్జాల నివారణ వీలవుతుంది.దీనిపై అసెంబ్లీలో చర్చకు పట్టు పడతాం.ప్రభుత్వం స్పందించకుంటే కోర్టుకి వెళ్తాం. ల్యాండ్ గ్రాభింగ్ పై రిఫార్మ్స్ తీసుకురాకుంటే నాయకులను ప్రజలు తరిమి కొడతారు. రియల్ ఎస్టేట్ పడిపోతే నష్టం ఏమి లేదు’అని వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment