కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్ వద్ద రఘునందన్‌రావును అడ్డుకుంటున్న పోలీసులు
సాక్షి, కామారెడ్డి: సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి పేరిట జరిగిన వనరుల విధ్వంసాన్ని ప్రజలకు చూపించడం కోసం బీజేపీ చేపట్టిన ‘చలో గజ్వేల్’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి వెంకటరమణారెడ్డిని ఒకరోజు ముందుగానే గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసి బిచ్కుంద పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
శుక్రవారం ఉదయం నుంచి భారీసంఖ్యలో బీజేపీ శ్రేణులు వెంకటరమణారెడ్డి ఇంటికి తరలిరాగా, వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తీసుకెళ్లారు. దీంతో జిల్లాకేంద్రంలో ఉద్రిక్త పరిస్థి తులు నెలకొన్నాయి. వెంకటరమణారెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ బిచ్కుంద పోలీస్‌స్టేషన్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార ఆధ్వర్యంలో కార్యకర్తలు, నేతలు ఆందోళన చేశారు. రామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఆందోళన చేపట్టారు.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు కారులో హైదరాబాద్ నుంచి బిచ్కుంద పోలీసుస్టేషన్‌కు బయలుదేరగా పెద్దకొడప్‌గల్ మండలకేంద్రం శివారులో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన నడుచుకుంటూ పెద్దకొడప్ గల్‌కు చేరుకుని రెండుగంటలపాటు నిరీక్షించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు ఆయన ఫోన్ చేసి ఇక్కడి పరిస్థితిని వివరించారు. పోలీసులు సాయంత్రం వెంకట రమణా రెడ్డిని విడిచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడు తూ గజ్వేల్‌లో అక్రమాలు వెలుగులోకి వస్తాయని, సీఎం చెబుతున్న అభివృద్ధికి సంబంధించిన గుట్టు రట్టవుతుందన్న ఉద్దేశంతోనే తనను అడ్డుకున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment