కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం లింగంపల్లిలో ఎండిన పంటలను పరిశీలిస్తున్న హరీశ్‌రావు, పోచారం, గోవర్ధన్, సురేందర్ తదితరులు
అసలు ఆ పార్టీకి ఎందుకు ఓటెయ్యాలి?
ఇచ్చిన హామీలు అమలయ్యాయా?
మాజీమంత్రి హరీశ్‌రావు సూటి ప్రశ్నలు
కాంగ్రెస్‌కు ఓటేస్తే జిల్లాలు రద్దవుతాయని వ్యాఖ్య
సాక్షి, కామారెడ్డి: ‘‘ఎన్నికల హామీ లను విస్మరించిన కాంగ్రెస్ ప్రభు త్వంపై తక్కువ రోజుల్లోనే ప్రజ ల్లో వ్యతిరేకత మొదలైంది. దీంతో లీకులు, ఫేక్ న్యూస్‌లు ప్రచారం చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో గెల వాలని చూస్తున్నరు. పొరపాటున ఈసారి కూడా వాళ్లకు ఓటేస్తే మోసపోవుడే. రూ.2 లక్షలు రుణం మాఫీ చేయకున్నా, రూ.5 వందల బోనస్ ఇవ్వకున్నా, మహి ళలకు రూ. 2,500 జమ చేయకు న్నా తమకు ప్రజలు ఓట్లేశారని తప్పించుకునే ప్రమాదం ఉంది’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు వ్యా ఖ్యానించారు. ఆదివారం కామా రెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి, లింగంపేట మండల కేంద్రంలో ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావే శాలు నిర్వహించారు. ఆయా సమావేశాల్లో హరీశ్‌రావు మాట్లా డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీల్లో నాలుగు కూడా పూర్తి చేయని సీఎం రేవంత్‌రెడ్డికి ఓట్లు అడిగే హక్కులేదన్నారు.
కడియం, దానం రాజీనామా చేయాలి
బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, దానం నాగేందర్ తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని హరీశ్ డిమాండ్ చేశారు. నాయకులు పోయినంత మాత్రాన పార్టీకి నష్టం లేదని, కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు. నాలుగు రోజులైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్లలో వాళ్లు తన్నుకుంటారన్నారు.
సగం జిల్లాలు తగ్గిస్తడట
పరిపాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ కొత్త జిల్లాల ను ఏర్పాటు చేశారని, జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఇప్పు డు సీఎం రేవంత్‌రెడ్డి 17 జిల్లాలు సరిపోతాయని అంటుండని, ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే మీ జిల్లా రద్దవుతుందని ఆయన హెచ్చరించారు. కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసిన బీబీ పాటిల్‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాగా, లింగంపల్లిలో ఎండిపోయిన వరి పంటను హరీశ్‌రావు పరిశీలించారు. ఎండిపోయిన పంటలకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment