జహీరాబాద్‌పై అందరిలోనూ ఆశలు
ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో జోరుగా విశ్లేషణలు
రేపు తేలనున్న భవితవ్యం
సాక్షి, కామారెడ్డి: ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. పైకి గెలుపు ధీమాతో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఫలితం ఎలా ఉంటుందోనని లోలోన టెన్షన్ పడుతున్నా రు. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా జోరుగా చర్చలు నడుస్తున్నాయి.
జహీరాబాద్ లోక్‌సభ నియోజక వర్గం భిన్న సంస్కృతులకు నిలయం. ఇక్కడ ఒక పర్యాయం కాంగ్రెస్ విజయం సాధించగా, రెండుసార్లు బీఆర్‌ఎస్ గెలుపొందింది. నాలుగోసారి జరిగిన ఎన్నికలలో ఎవరు గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలవగా, రెండుచోట్ల బీఆర్‌ఎస్, ఒక్క స్థానంలో బీజేపీ విజయం సాధించాయి. రాష్ట్రంలో అధికారంలో ఉండడం, గ్యాంరటీ పథకాల అమలు తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ గెలుపు కోసం జోరుగా ప్రచారం చేశారు. అన్ని ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు శ్రమించాయి. దీంతో గెలుపుపై కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో ఉంది.
జహీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ వరుసగా రెండుసార్లు విజయం సాధించింది. అ సెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బలమైన క్యా డర్ ఉండడంతో పార్లమెంట్ ఎన్నికలలో గెలుస్తామ ని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో అమలు చేసిన ఆసరా పింఛన్లు, రైతుబంధు వంటి పథకాల ద్వారా లబి్ధపొందినవారు తమ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌కే ఓటేశారని, దీంతో జహీరాబాద్‌లో హ్యాట్రిక్ ఖాయమన్న ధీమాతో గులాబీ లీడర్లు ఉన్నారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణం అంశంతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చరిష్మాను నమ్ముకున్న బీజేపీ సైతం జహీరాబాద్ స్థానంపై ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక్క కామారెడ్డిలోనే ఆ పార్టీ విజయం సాధించింది. అయితే ఓటర్లు మూడోసారి మోదీ రావాలని బలంగా కోరుకున్నారని, దీంతో మారుమూల గ్రామాల్లో సైతం తమకు అనుకూల వాతావరణం ఏర్పడిందని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఈసారి జహీరాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండానే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. హ్యాట్రిక్ విజయంపై ఆ పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ నమ్మకంతో ఉన్నారు.
విభిన్నంగా ఎగ్జిట్ పోల్స్..
జహీరాబాద్ ఎంపీ స్థానంలో ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపై స్పష్టత కొరవడింది. ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ప్రకటించిన ఫలితాలు సైతం విభిన్నంగా ఉన్నాయి. కొన్ని సంస్థలు బీజేపీ గెలుస్తుందని చెప్పగా.. మరికొన్ని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. ఒకటిరెండు సంస్థలు బీఆర్‌ఎస్‌కూ విజయావకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఎగ్జిట్‌పోల్స్‌పై జోరుగా చర్చ జరుగుతోంది. ఎగ్జిట్ పో ల్స్ ఒక్కోటి ఒక్కో తీరుగా ఫలితాలు వెలువరించిన నేపథ్యంలో ఏది నమ్మాలో తెలియని పరిస్థితుల్లో ఆయా పారీ్టల నేతలు తమ క్యాడర్ ఇచ్చి న సమాచారం ప్రకారం తమదే గెలుపంటూ ధీమాతో ఉన్నారు. మంగళవారం ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.
ఇవి చదవండి: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు
Comments
Please login to add a commentAdd a comment