jaheerabad
-
పైకి ధీమా.. లోన టెన్షన్!
సాక్షి, కామారెడ్డి: ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. పైకి గెలుపు ధీమాతో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఫలితం ఎలా ఉంటుందోనని లోలోన టెన్షన్ పడుతున్నా రు. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా జోరుగా చర్చలు నడుస్తున్నాయి.జహీరాబాద్ లోక్‌సభ నియోజక వర్గం భిన్న సంస్కృతులకు నిలయం. ఇక్కడ ఒక పర్యాయం కాంగ్రెస్ విజయం సాధించగా, రెండుసార్లు బీఆర్ఎస్ గెలుపొందింది. నాలుగోసారి జరిగిన ఎన్నికలలో ఎవరు గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలవగా, రెండుచోట్ల బీఆర్ఎస్, ఒక్క స్థానంలో బీజేపీ విజయం సాధించాయి. రాష్ట్రంలో అధికారంలో ఉండడం, గ్యాంరటీ పథకాల అమలు తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ గెలుపు కోసం జోరుగా ప్రచారం చేశారు. అన్ని ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు శ్రమించాయి. దీంతో గెలుపుపై కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో ఉంది.జహీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వరుసగా రెండుసార్లు విజయం సాధించింది. అ సెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బలమైన క్యా డర్ ఉండడంతో పార్లమెంట్ ఎన్నికలలో గెలుస్తామ ని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో అమలు చేసిన ఆసరా పింఛన్లు, రైతుబంధు వంటి పథకాల ద్వారా లబి్ధపొందినవారు తమ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌కే ఓటేశారని, దీంతో జహీరాబాద్‌లో హ్యాట్రిక్ ఖాయమన్న ధీమాతో గులాబీ లీడర్లు ఉన్నారు.అయోధ్యలో రామాలయ నిర్మాణం అంశంతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చరిష్మాను నమ్ముకున్న బీజేపీ సైతం జహీరాబాద్ స్థానంపై ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక్క కామారెడ్డిలోనే ఆ పార్టీ విజయం సాధించింది. అయితే ఓటర్లు మూడోసారి మోదీ రావాలని బలంగా కోరుకున్నారని, దీంతో మారుమూల గ్రామాల్లో సైతం తమకు అనుకూల వాతావరణం ఏర్పడిందని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఈసారి జహీరాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండానే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. హ్యాట్రిక్ విజయంపై ఆ పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ నమ్మకంతో ఉన్నారు. విభిన్నంగా ఎగ్జిట్ పోల్స్..జహీరాబాద్ ఎంపీ స్థానంలో ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపై స్పష్టత కొరవడింది. ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ప్రకటించిన ఫలితాలు సైతం విభిన్నంగా ఉన్నాయి. కొన్ని సంస్థలు బీజేపీ గెలుస్తుందని చెప్పగా.. మరికొన్ని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. ఒకటిరెండు సంస్థలు బీఆర్ఎస్కూ విజయావకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఎగ్జిట్‌పోల్స్‌పై జోరుగా చర్చ జరుగుతోంది. ఎగ్జిట్ పో ల్స్ ఒక్కోటి ఒక్కో తీరుగా ఫలితాలు వెలువరించిన నేపథ్యంలో ఏది నమ్మాలో తెలియని పరిస్థితుల్లో ఆయా పారీ్టల నేతలు తమ క్యాడర్ ఇచ్చి న సమాచారం ప్రకారం తమదే గెలుపంటూ ధీమాతో ఉన్నారు. మంగళవారం ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.ఇవి చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు -
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
జహీరాబాద్: అమెరికాలోని చోర్లెట్ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. పృపృథ్వీరాజ్ ఎనిమిదేళ్ల క్రితం ఐటీ ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లాడు. ఏడాదిన్నర కిందట సిద్దిపేట ప్రాంతానికి చెందిన శ్రీప్రియతో వివాహం జరిగింది.భార్యాభర్తలు బయటకు వెళ్లి పని ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. రోడ్డుపై నిలిచి ఉన్న ఓ వాహనాన్ని పృథ్వీరాజ్ నడుపుతున్న కారు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారు బెలూన్లు తెరుచుకోవడంతో భార్యాభర్తలిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ప్రమాదం అనంతరం వారు రహదారికి మరోవైపు చేరుకున్నారు. కాగా, ప్రమాదం జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు పృథ్వీరాజ్ కారులో ఉండిపోయిన సెల్‌ఫోన్ కోసం వెళుతూ.. మళ్లీ రోడ్డు దాటుతున్న క్రమంలో అదే సమయంలో వేగంగా వచి్చన వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పృథ్వీ మృతదేహం శనివారం లేదా ఆదివారం ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని బంధువులు తెలిపారు. -
హలో.. నేను సీఎంను మాట్లాడుతున్నా
జహీరాబాద్: ‘హలో.. నేను సీఎంను మాట్లాడుతున్నాను..’అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఓ ఆలుగడ్డ రైతుకు ఫోన్ చేసి పంట గురించి ఆరా తీశారు. సం గారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామానికి చెందిన రైతు నల్లా నాగేశ్వర్‌రెడ్డికి శనివారం సీఎం ఫోన్ చేశారు. నాలుగున్నర నిమిషాలపాటు సంభాషించారు. సంభాషణ సాగిందిలా.. సీఎం: మీ ప్రాంతంలో ఈ ఏడాది ఆలుగడ్డ సాగు ఎలా ఉంది? రైతు: పంట సాగు ఆశాజనకంగా ఉంది సర్.. సాగు విస్తీర్ణమేమీ తగ్గలేదు. సీఎం: ఎలాంటి రకాన్ని సాగు చేస్తున్నారు? రైతు: జహీరాబాద్ ప్రాంతంలో 166 రకం సాగు చేస్తారు. దీన్ని కుఫ్రీగా పిలుస్తారు. జ్యోతి, ఖ్యాతి రకాల విత్తనాలు కూడా ఉన్నాయి. వాటిని ఈ ప్రాంతంలో సాగు చేయడం లేదు. సీఎం: ఒక మొక్క బాగుంటే ఎన్ని గడ్డలు ఉంటాయి? రైతు: 8 నుంచి 10 గడ్డల వరకు ఉంటాయి. సీఎం: ఇంతమేర గడ్డలుంటే పంట దిగుబడి బాగా వచ్చినట్లా? రైతు: అవును సార్ సీఎం: ఎంత బరువు తూగుతుంది? రైతు: కిలో మేర తూగుతుంది. సీఎం: ఎకరాకు ఎన్ని బస్తాల విత్తనం ఉపయోగిస్తారు? రైతు: 15 నుంచి 16 బస్తాలు వాడుతాం. పంటను బెడ్ విధానంలో వేశాం. పంట వేసి 45 రోజుల వరకు అయింది. సీఎం: నేను 25 ఎకరాల్లో ఆలుగడ్డ పంట వేశా. పంట బాగుంది. రైతు: ఎకరాకు 12 నుంచి 15 టన్నుల మేర దిగుబడి వస్తుంది. ఒక బస్తా విత్తనానికి 16 బస్తాల వరకు పంట దిగుబడి వస్తుంది. సీఎం: మార్కెట్లో ఆలుగడ్డ పంటకు ధర ఎలా ఉంది? రైతు: ప్రస్తుతం ధర తగ్గింది. క్వింటాలుకు రూ.1,700 నుంచి రూ.2,000 మేర ధర పలుకుతోంది. కోహీర్ ప్రాంతంలో ఎర్ర నేలలు ఉన్నందున పంట ఎరుపురంగులో వస్తుంది. దీనికి ధర తక్కువగా ఉంటుంది. రేగడి నేలల్లో వచ్చే పంట తెలుపు రంగులో ఉండటంతో ధర కొంత ఎక్కువ ఉంటుంది. సీఎం: ఎన్ని రోజుల్లో పంటను తీస్తారు? రైతు: 85 రోజుల్లో పంట చేతికొస్తుంది. పక్షం రోజుల ముందు నుంచే నీటి తడులు ఇవ్వడాన్ని నిలిపివేస్తాం. సీఎం: నేను ఇంకా పంట తీయలేదు. పంట తీసే సమయంలో పిలిపిస్తా. రైతు: సరే సార్.. నాలుగైదు మందిమి వస్తాం. సీఎం: థ్యాంక్యూ ఇదిలా ఉంటే, నాలుగు నెలల క్రితం రైతు నాగేశ్వర్‌రెడ్డితోపాటు మరో నలుగురు రైతులు సీఎం ఆహ్వానం మేరకు ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌కు వెళ్లారు. వారితో సీఎం సుమారు ఆరు గంటల పాటు పంటల సాగు గురించి చర్చించిన విషయం తెలిసిందే. -
మహిళపై లైంగికదాడి నిందితుడి అరెస్టు
జహీరాబాద్: జహీరాబాద్‌లో మహిళపై లైంగిక దాడి జరిపిన కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఇద్దరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వారు కారులో పరారయ్యారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ఉన్న మరో నిందితుడు మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాలను బుధవారం రాత్రి డీఎస్పీ గణపత్‌జాదవ్ వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం జహీరాబాద్‌లో మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు పవన్‌కుమార్ న్యాల్కల్ మండలం మెటల్‌కుంట ప్రాంతంలో ఉన్నాడని సమాచారం అందడంతో ఎస్ఐ వెంకటేష్ అక్కడికి వెళ్లి అతన్ని పట్టుకున్నారు. మిగతా ఇద్దరు నిందితులు కారులో వెళుతున్నట్లు పవన్‌కుమార్ చెప్పడంతో వారిని పట్టుకునేందుకు ఎస్ఐ ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు రాయికోడ్ మండలం మహబత్‌పూర్ గ్రామ శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న సోమాచారి అక్కడికక్కడే మృతిచెందాడు. అతని తమ్ముడు బ్రహ్మచారి గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. గతంలో బ్రహ్మచారిపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయని, దీనికి సంబంధించి పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామని డీఎస్పీ గణపత్ జాదవ్ పేర్కొన్నారు. మృతుడు సోమాచారి హైదరాబాద్‌లోని ఉప్పల్ వద్ద టీ స్టాల్‌ను నడుపుతున్నాడు. మహిళపై లైంగిక దాడికి పాల్పడిన గిద్దలూరు ప్రాంతానికి చెందిన పవన్‌కుమార్ సోమాచారి టీ స్టాల్లో పని చేస్తున్నాడు. -
బాలుడిగా వెళ్లి యువకుడిగా తిరిగొచ్చాడు
సాక్షి, హైదరాబాద్: ఆరేళ్ల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ బాలుడి ఆచూకీ కనిపెట్టిన సీఐడీ అధికారులు అతన్ని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. సీఐడీ పోలీసులు వివరాలిలా ఉన్నాయి. కల్లెం ఎల్లమ్మ, మానయ్య దంపతులు కూలీలు. వీరు జహీరాబాద్‌లోని శ్రీరామ్‌నగర్ కాలనీలో నివసిస్తున్నారు. వీరి కుమారుడు కల్లెం విజయ్ 2012లో ఓసారి ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా పారిపోయాడు. ఏడాదికాలం తర్వాత మళ్లీ తిరిగొచ్చి.. కొంతకాలానికే 2013లో మరోసారి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొడుకు తిరిగి వస్తాడనుకున్న ఎల్లమ్మ రెండేళ్లపాటు ఎదురుచూసింది. కానీ కుమారుడు రెండేళ్లయినా తిరిగి రాకపోవడంతో ఎల్లమ్మ 2015లో జూలై 13న జహీరాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. దర్యాప్తులో భాగంగా గతంలో విజయ్ పారిపోయి కేటరింగ్ పనిచేసినట్లు చెప్పాడని తల్లి పోలీసులకు చెప్పింది. ఈ క్లూ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు కేటరింగ్ నిర్వాహకుల వద్ద గాలించిన సీఐడీ పోలీసులు ఎట్టకేలకు జాన్సన్‌గా పేరుమార్చుకుని కేటరింగ్ పని చేస్తున్న విజయ్‌ని గుర్తించగలిగారు. ఈ కేసు లో విజయ్ ఆచూకీ కనిపెట్టడంలో కృషి చేసిన సీఐ జేమ్స్‌బాబు, ఎస్ఐ హరీశ్‌లను సీఐడీ అడిషనల్ డీజీ గోవింద్ సింగ్ అభినందించారు. -
పాడుబడ్డ బావిలో రెండు మృతదేహాలు
జహీరాబాద్ : ఈనెల 14వ తేదీన అదృశ్యమైన ఇద్దరు యువకులు అల్గోల్ క్రాస్‌రోడ్డు వద్ద ఓ పాడుబడిన బావిలో గురువారం శవాలై తేలిన ఘటన కలకలం రేపింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. మొగుడంపల్లి మండలంలోని మాడ్గికి చెందిన చాంద్‌పాష కుమారుడు మొయిజొద్దీన్(20), బిక్కు మియా కుమారుడు ఇస్మాయిల్ అలియాస్ సద్దాం(20) ఇద్దరు కలిసి 14వ తేదీన ఉదయం 11.30 గంటలకు మోటార్ సైకిల్‌పై జహీరాబాద్‌కు వచ్చారు. పాడైన టీవీని రిపేర్ నిమిత్తం స్థానికంగా ఓ మెకానిక్కు ఇచ్చి వెళ్లి పోయారు. ఆ రోజు రాత్రికి వీరు ఇంటికి రాక పోవడంతో కంగారు పడిన వారి కుటుంబ సభ్యులు మరుసటి రోజు జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీల్లో వీరు మూసానగర్కు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారో ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు అప్పటి నుంచి జహీరాబాద్ పట్టణం, పరిసర గ్రామాల్లో ఎంత గాలించినా ఎలాంటి వివరాలు తెలియలేదు. గురువారం 65వ జాతీయ రహదారి పక్కన ఉన్న పాడు పడిన వ్యవసాయ బావి నుంచి దుర్వాసన వస్తుండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న డీఎస్పీ నల్లమల రవి, సీఐ సైదేశ్వర్, ఎస్.ఐ ప్రభాకర్‌రావు మృతదేహాలను గుర్తించి క్రేన్ సహాయంతో బయటకు తీశారు. మృతులు మాడ్గి గ్రామానికి చెందిన మొయిజొద్దీన్, సద్దాంగా గుర్తించారు. ఈ మేరకు జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మిస్టరీగా మారిన యువకుల మృతి.. ఆరు రోజుల క్రితం అదృశ్యమైన యువకుల మరణం మిస్టరీగా మారింది. ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేసి శవాలను బావిలో వేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరి కుటుంబాలకు ఎవరితోనైనా పాత కక్షలు ఉన్నాయా, ఇంకేమైన తగాదాలు వచ్చాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరి వెళ్లిన మోటారు సైకిల్ అల్లీపూర్ శివారులో బుధవారం లభ్యం కావడం, గురువారం వీరి మృతదేహాలు బయటపడడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. సద్దాం మృతదేహానికి కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి ఉండడం వీటికి బలం చేకూరుస్తుంది. బంధువులు, కుటుంబ సభ్యులు హత్యచేసి బావిలో పడవేశారని అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు అనుమానాస్పద స్థితిలో మరణించిన యువకుల మృతిపై విచారణ చేపట్టినట్లు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆయన మృతదేహాలు లభించిన వ్యవసాయ బావిని సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆత్మహత్యలకు పాల్పడ్డారా లేక, ఎవరైనా హత్యచేసి బావిలో వేశారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. మాడ్గిలో విషాదం మొగుడంపల్లి మండలంలోని మాడ్గి గ్రామానికి చెందిన యువకులు మొయిజొద్దీన్, ఇస్మాయిల్‌లు అనుమాన స్పద స్థితిలో మరణించడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఈ నెల 14 వ తేదీన టీవీ రిపేర్ చేయించుకుని వస్తామని చెప్పి వెళ్లిన యువకులు నాలుగు రోజుల అనంతరం మృతదేహాలుగా దొరకంతో బంధువులు, కుటుంబ సభ్యులు సభ్యులు షాక్‌కు గురయ్యారు. చేతికి వచ్చిన కుమారులను కోల్పోయిన తల్లి దండ్రుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న మాడ్గి సర్పంచ్ ఆకాష్ జహీరాబాద్‌లోని సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతుల బంధువులను టీడీపీ జిల్లా అధ్యక్షుడు వై.నరోత్తం పరామర్శించి ఓదార్చారు. -
తెగబడ్డ దొంగలు
మెదక్‌రూరల్ : ఓ కుటుంబం దైవ దర్శనానికి వెళ్లి వచ్చే సరికి గుర్తు తెలియని దుండగులు ఇళ్లంతా గుళ్ల చేసిన ఘటన మెదక్ మండలం మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపన్నపేట మండలం కొత్తపల్లికి చెందిన గుడ్డెంగల్ కిషన్ మంబోజిపల్లిలోని ఎన్డీఎస్ఎల్ కార్మికుడిగా పనిచేస్తూ, అదే ఎన్డీఎస్ఎల్ కాలనీలోనే నివసిస్తున్నాడు. ఈ నెల 8న ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా దైవ దర్శనం కోసం తిరుపతికి వెళ్ళారు. గురువారం ఉదయం తిరిగి ఇంటికి వచ్చి తాళం తీసి లోపలి వెళ్లగా ఇంట్లో రెండు బీరువాలు తెరిచి ఉండడం, వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉండడం చూసి ఖంగు తిన్నారు. వెనక భాగంలో ఉన్న బాత్రూం పైభాగాన ఉన్న సిమెంట్ రేకులను పగులకొట్టి దొంగలు ఇంట్లోకి చొరబడ్డట్లు గుర్తించారు. బీరువాలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, అర తులం బంగారు రింగుతో పాటు రూ.4వేల నగదు అపహరణకు గురైనట్లు గుర్తిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెదక్‌రూరల్ ఎస్ఐ లింబాద్రి తెలిపారు. క్లూస్‌టీం ఘటనా స్థలంలో ఆధారలను సేకరించినట్లు తెలిపారు. రామాయంపేటలో పట్టపగలు చోరీ తొమ్మిది తులాల బంగారం, 20 తులాల వెండి, రూ. 10 వేలు ఎత్తుకెళ్లిన దొంగలు రామాయంపేట(మెదక్): రామాయంపేట పట్టణంలో పట్టపగలు తాళం వేసి ఉన్న ఇంటిలో దొంగలు జొరబడ్డారు. తొమ్మిది తులాల బంగారం, 20 తులాల వెండి, రూ. 10 వేలు ఎత్తుకెళ్లారు. పట్టణానికి చెందిన చిట్టిమల్లి శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి స్థానికంగా ఉన్న ఎస్వీఆర్ అపార్ట్మెంటులో నివాసం ఉంటున్నాడు. కిరాణా దుకాణం నడుపుతున్న శ్రీనివాస్ ఉదయమే దుకాణానానికి వచ్చాడు. అతని భార్య ఇంటికి తాళం వేసి కిరాణా దుకాణానికి రాగా, గుర్తు తెలియని దుండగులు ఇంటి తలుపుల గొళ్లెం ఊడదీసి చోరీకి పాల్పడ్డారు. సజ్జపై ఉంచిన బీరువా తాళాలు దొరికించుకున్న దుండగులు అందు లో ఉంచిన తొమ్మిది తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలు, రూ. పదివేల నగదును ఎత్తుకెళ్లారు. స్థానిక ఎస్ఐ మహేందర్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. జహీరాబాద్‌లో చోరీ రెండున్నర తులాల బంగారం, రూ.25వేల నగదు అపహరణ జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలోని ఆనంద్‌నగర్ కాలనీలో బుధవారం రాత్రి దొంగలు తెగబడ్డారు. స్థానికంగా నివాసం ఉంటున్న రాజ్‌కుమార్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఊరెళ్లాడు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటికి వేసి ఉన్న తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న రెండున్నర తులాల బంగారం, రూ.25వేల నగదు ఎత్తుకెళ్లారు. గమనించిన స్థానికులు దొంగతనం సమాచారాన్ని ఇంటి యజమానికి అందించారు. జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏటీఎంలో అగ్ని ప్రమాదం
జహీరాబాద్ టౌన్: మండలంలోని మల్చెల్మ సిండికేట్ బ్యాంక్ ఏటీఎంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. ఏటీఎంలోని ఏసీలు కాలిపోయాయి. మధ్యాహ్నాం సమయంలో ఏటీఎం నుంచి అకస్మత్తుగా పొగలు రావడాన్ని గుర్తించిన బ్యాంక్‌కు వచ్చిన రైతులు అధికారులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన బ్యాంక్ మేనేజర్ ఎం. మంజూషా సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఈ లోపు అగ్నిమాపక సిలిండర్ ద్వారా మంటలను ఆర్పారు. ఫైర్ ఇంజన్ వచ్చెలోపే మంటలు అదుపులోకి వచ్చాయి. షాట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారించారు. -
రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతి
జహీరాబాద్ టౌన్: మండలంలోని కొత్తూర్(బి) ట్రైడెంట్ చెక్కెర కర్మగారం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పిచరాగడికి చెందిన పాస్టర్ మృతి చెందినట్లు జహీరాబాద్ రూరల్ ఎస్ఐ. శ్రీకాంత్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..కోహీర్ మండలం పిచరాగడికి చెందిన పసుల రాజు(45) న్యాల్కల్ మండలంలోని గంగ్వార్ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం గంగ్వార్ నుంచి పిచరాగడికి మోటారు సైకిల్‌పై వెళ్తున్న క్రమంలో కొత్తూర్(బి) ట్రైడెంట్ కర్మాగారం గేటు ముందు కల్వర్ట వద్ద గుర్తు తెలియని వాహనం అతడి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన పాస్టర్ అక్కడిక్కడే మృతి చెందాడు. భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ. శ్రీకాంత్ తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్
మెదక్ (జహీరాబాద్ ) : భూవివాదంలో ఓ రైతు నుంచి లంచం తీసుకుంటున్న ఆర్ఐని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా జహీరాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న దత్తారెడ్డి లంచం తీసుకుంటూ మంగళవారం సాయంత్రం ఏసీబీ అధికారులకు చిక్కారు. ముఖ్తావలి బాబా దర్గాకు చెందిన భూవివాదంలో ఓ రైతు నుంచి నాలుగు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు అదనపు సమాచారాన్ని సేకరిస్తున్నారు. -
జహీరాబాద్‌పై ‘మజ్లిస్’ గురి
జహీరాబాద్, న్యూస్‌లైన్: స్థానిక మున్సిపాలిటీపై మజ్లిస్ పార్టీ గురిపెట్టింది. వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుపొంది చైర్మన్ పదవి విషయంలో కీలకంగా మారాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పట్టణంలో మొత్తం 24 వార్డులకు గా ను 11 వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న వార్డులపైనే ఆ పార్టీ నేతలు దృష్టిసారించారు. చైర్మన్ పదవికి ప్రత్యక్షంగా ఎన్నికలు జరిగిన సమయంలో మజ్లిస్ కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చింది. ప్రతి ఎన్నికల్లోనూ చైర్మన్ పదవిని స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోతూ వచ్చింది. చైర్మన్ పదవికి పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తుండడంతో మజ్లిస్‌కు కలిసి రావడం లేదు. గతంలో కౌన్సిల్లో ఆరుగురు కౌన్సిలర్లను గెలుపొందిన చరిత్ర మజ్లిస్‌కు ఉంది. ఈ ఎన్నికల్లో అప్పటి రికార్డులను బద్దలు కొట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం పార్టీ తరఫున 3వ, 6, 8, 9, 12, 17, 19, 20, 21, 22, 23వ వార్డుల్లో అభ్యర్థులను నిలిపింది. పార్టీ ఇన్చార్జి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎండీ లుక్మాన్ 9వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన పోటీ చేసిన వార్డు మహిళలకు రిజర్వు కావడంతో ఈ వార్డు నుంచి బరిలో నిలిచారు. ఈ పార్టీ అభ్యర్థులు దాదాపుగా అన్ని వా ర్డుల్లోనూ గట్టి పోటీ ఇవ్వనున్నారు. 12వ వార్డు ఎస్టీలకు, 19 వ వార్డు ఎస్సీలకు రిజర్వు కావడంతో ఆయా వార్డుల్లో ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉండడంతో అక్కడ కూడా అభ్యర్థులను పోటీకి దింపారు. మజ్లిస్ రంగ ప్రవేశం కా ంగ్రెస్, టీడీపీ నేతలకు గుబులు పుట్టిస్తోంది. మజ్లిస్ బలపడకుండా ఉండేందుకు గాను కాంగ్రెస్ నేతలు తమ వంతు వ్యూహరచన చేస్తున్నారు. అసదుద్దీన్ పర్యటనతో శ్రేణుల్లో ఉత్సాహం.. మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గత ఆదివారం జహీరాబాద్ మున్సిపాలిటీలో పర్యటించా రు. ఆయన రెండు వార్డుల్లో పర్యటించి బహిరంగ సభలో ప్రసంగించారు. మజ్లిస్ గెలుపుతోనే ముస్లిం మైనార్టీల ప్రగతి ముడిపడి ఉందని ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. మజ్లిస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సహకరించాలని ఆయన కోరారు. అధినేత పర్యటనతో పార్టీ కార్యకర్తలు, అభ్యర్థులు మరింత ఉత్సాహంగా కదులుతున్నారు. ఒవైసీ పర్యటన దరిమిలా ఆ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. -
వచ్చేది మూడో ప్రత్యామ్నాయమే..
జహీరాబాద్, న్యూస్‌లైన్: కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి అవతరించడం ఖాయమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్డీ కుమారస్వామి జోస్యం చెప్పారు. సోమవారం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు జహీరాబాద్ వచ్చిన సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారనటానికి ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని చెప్పారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి లభించిన ఆదరణతో యువత కొత్తదనాన్ని కోరుకుంటోందని వెల్లడైందని పేర్కొన్నారు. మూడో ప్రత్యామ్నాయం కోసం 14 ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలు ఇటీవల ఢిల్లీలో సమావేశమయ్యారని గుర్తుచేశారు. మూడో ప్రత్యామ్నాయ ఏర్పాటు కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, వామపక్ష పార్టీల నేతలు సుముఖంగా ఉన్నారని అన్నారు. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజలు విసిగిపోయారని తెలిపారు. ఆయన వెంట కర్ణాటక మాజీ మంత్రి కాశీంపూర్ బండెప్ప, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు నామ రవికిరణ్‌గుప్తా, జహీరాబాద్ పట్టణ ప్రముఖులు విశ్వనాథ్కోటా, విశ్వమోహన్, అశోక్చంద్రే, జి.సురేష్‌బాబు, జి.కిరణ్‌కుమార్, బెజుగం రాజేశ్వర్, బెజుగం వేణుగోపాల్, అశోక్ బెల్కేరి, బీదర్‌కు చెందిన అశోక్పాటిల్లు పాల్గొన్నారు.