నిజామాబాద్ : నిజామాబాద్ జెడ్పీ మాజీ ఛైర్మన్ వెంకటరమణారెడ్డి శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ టికెట్ కోసం జిల్లా కాంగ్రెస్ నేతలు తనతో రూ. 2 కోట్లు డిపాజిట్ చేయించారని ఆరోపించారు. సదరు నగదు డిపాజిట్ చేసిన తర్వాతే తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని విమర్శించారు. అయితే ఓటమి భయంతోనే తాను ఎమ్మెల్సీ పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు.
తాను డిపాజిట్ చేసిన నగదులో రూ. 30 వేలు చొప్పున పార్టీ నేతలు కొందరు కాంగ్రెస్ ఎంపీటీసీలకు పంచారని వివరించారు. ఇస్తే అన్నిపార్టీల జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఇవ్వాలని లేదా రూ. 2 కోట్లు తనకే తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా ఉపాధ్యక్షుడు రాహుల్కి ఫిర్యాదు చేస్తానని వెంకటరమణారెడ్డి హెచ్చరించారు.