=చిలుకలగుట్ట ఫెన్సింగ్‌కు మొండిచేయి
=నిధుల ఊసే లేని గిరిజన మ్యూజియం
=నల్లారి మాటలు నీటిమూటలు
ములుగు, న్యూస్‌లైన్ : జిల్లా నుంచి ఇద్దరు రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య... కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ ప్రాతి నిథ్యం వహిస్తున్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌గా గండ్ర వెంకటరమణారెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయినా... తెలంగాణ కుంభమేళాను తలపించే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరపై సీమాంధ్ర సర్కారు నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. పూర్తిస్థాయిలో నిధులను రాబట్టడంలో ఆ నలుగురు పూర్తిగా విఫలం కాగా... ఎప్పటిలానే గిరిజనుల ఆశలు ఆవిరయ్యూయి.
మేడారంలో గిరిజన మ్యూజి యుం ఏర్పాటు చేస్తావుని... చిలుకలగుట్ట చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేస్తావున్న హామీలు ఉత్తుత్తి వూటలుగా మిగిలిపోయూయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న జాతర నేపథ్యంలో జిల్లా యంత్రాంగంలో కదలిక రాగా... పాలకులు ఇచ్చిన హామీలు ఈ సారైనా నెరవేరుతాయని గిరిజనులు ఆశించారు. కేంద్ర మంత్రిగా ఉన్న... ములుగు నియోజకవర్గానికే చెందిన బలరాం నాయక్ అయినా జాతరపై శ్రద్ధ కనబర్చుతాడనుకున్నారు. ఈ రెండు పనులకు ఒక్క పైసా కూడా కేటాయించకపోవడంతో గిరిజనులు భంగపాటుకు గురయ్యూరు.
సీఎం కిరణ్ హామీలు బుట్టదాఖలు
మేడారం చిలుకలగుట్ట చుట్టూ ఫెన్సింగ్ నిర్యించాలని... గిరిజన సంస్కృతిని చాటి చెప్పేలా జాతర పరిసరాల్లో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయాలని పదేళ్లుగా గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. తల్లి సమ్మక్క కొలువై ఉండే పవిత్రమైన గుట్ట చుట్టూ అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోందని, ఫెన్సింగ్ తప్పనిసరి అని అధికారుల వద్ద పూజారులు నిత్యం మొరపెట్టుకుంటూనే ఉన్నారు. తల్లులు కొలువై ఉండే ప్రాంతాలను శుద్ధిగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని పాలకులను అభ్యర్థిస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలో గిరిజన మ్యూజియం నిర్మాణానికి అప్పట్లో వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న కాలంలోనే హమీ లభించింది. ఆయన అకాల మరణం తర్వాత పాలకులు పట్టించుకోలేదు. 2010 జాతర సమయంలో ఈ సమస్యలను అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన సీఎం నల్లారి కిరణ్ దృష్టికి తీసుకువచ్చారు. వచ్చే జాతర నాటికి గుట్ట చుట్టూ ఫెన్సింగ్, గిరిజన మ్యూజియం ఏర్పాటుకు ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా అందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు జారీ చేశారు.
మళ్లీ జాతర వచ్చినా.. సదరు పనులకు పైసా మంజూరు కాకపోవడం గమనార్హం. ఇదిలాఉంటే గత జాతర నుంచి పట్టించుకోని గిరిజన సంక్షేమశాఖ అధికారులు హడావుడిగా రెండు నెలల క్రితం గిరిజన మ్యూజియం నిర్మాణానికి సుమారు మూడెకరాల స్థలం కావాలని తాడ్వాయి తహసీల్దార్‌కు నివేదించారు. ఆయన రెండు ప్రాంతాలను సూచించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
మంత్రులపై విమర్శల వెల్లువ
అటవీశాఖ అధికారులు మోకాలడ్డడంతోనే చిలుకల గుట్ట చుట్టూ ఫెన్సింగ్ నిర్మాణానికి నిధులు మంజూరుకాలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. గుట్ట చుట్టూ కిలోమీటరున్నర మేర ఫెన్సింగ్‌కు * కోటి కావాలని ప్రతిపాదనలు పంపినా... ఫలితం లేదంటున్నారు. కాగా.. జిల్లా యంత్రాంగం జాప్యంతో నిధులు మంజూ రు కాలేదని, అటవీశాఖ గండం నుంచి గట్టెక్కించాలంటే జిల్లాకు చెందిన మంత్రులకు ఓ లెక్కా... వారు పట్టించుకోకపోవడంతోనే ఏటా ఇలానే జరుగుతోందనే విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా వారు స్పందించి నిధులు మంజూరు చేయించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
నేడు మేడారంలో కలెక్టర్ కిషన్ సమీక్ష
మేడారం జాతర పనుల అంశంపై కలెక్టర్ జి.కిషన్ ఆదివారం మేడారంలోని ఐటీడీఏ గెస్ట్‌హౌస్‌లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించనున్నారు.
ఆందోళనలు చేపడతాం
పదేళ్ల నుంచి తల్లి సమ్మక్క ఉండే చిలుకల గుట్ట చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్‌గా ప్రభాకర్‌రెడ్డి ఉన్న కాలం నుంచి వినతులు సమర్పిస్తున్నాం. అధికారులు.. పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. గత జాతర సమయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా హామీ ఇచ్చినా ఫలితం లేకపోయింది. అధికారులు తలుచుకుంటే రెండు నెలల్లో ఫెన్సింగ్ చేయొచ్చు. ఇప్పటికైనా నిధులు విడుదల చేయాలి. లేకుంటే ఆందోళనలు చేపడుతాం.
- సిద్దబోయిన జగ్గారావు, మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు