సాక్షి, హుస్నాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. చేవెళ్ల సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లను రద్దు చేస్తామని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు.
అయితే, అమిత్ షా రిజర్వేషన్ల తొలగింపు వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు సీరియస్ అవుతున్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఈ క్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అమిత్‌షా వ్యాఖ్యలు బాధ కలిగించాయి. దేశ హోంమంత్రి మతానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారు?. మత రాజకీయాలు చేస్తే దేశాన్ని ఎవరు కాపాడాలి?. అమిత్ షా వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ ఎందుకు ఖండించలేదు అని ప్రశ్నించారు.
ఇక, అమిత్ షా వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కౌంటర్ ఇచ్చారు. తాజాగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ రాజ్యాంగం నడుస్తోంది. ముస్లిం రిజర్వేషన్లను తొలగించడం అమిత్ షా తరం కాదు. అమిత్ షాపై రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment