Owaisi Responds To Amit Shah Over Scrap Muslim Quota Comments - Sakshi
Sakshi News home page

‘సార్‌.. ఒవైసీ అంటూ ఎంతకాలం ఏడుస్తారు?’ ముస్లిం రిజర్వేషన్ల రద్దు వ్యాఖ్యలపై షాకి చురకలు

Published Mon, Apr 24 2023 11:41 AM | Last Updated on Mon, Apr 24 2023 3:51 PM

Owaisi Responds to Amit Shah Scrap Muslim Quota Comments - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణలో అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ చేవెళ్ల సభ సాక్షిగా ప్రకటించారు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమన్న ఆయన.. వాటి ఫలాలను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంతేకాదు.. మజ్లిస్‌ పార్టీ స్టీరింగ్‌తో నడుస్తున్న కేసీఆర్‌ పాలనతో తెలంగాణ అభివృద్ధి జరగదంటూ విమర్శలు గుప్పించాయి. అయితే..

అయితే అమిత్‌ షా చేవెళ్ల ప్రసంగంపై ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. షా చేసింది ముస్లిం విద్వేష ప్రసంగమన్న ఒవైసీ.. బీజేపీకి తెలంగాణపై విజన్ లేదని విమర్శించారు. ‘‘ముస్లిం విద్వేష ప్రసంగం మాత్రమే కాదు.. బీజేపీకి తెలంగాణ పట్ల విజన్‌ లేదు. బూటకపు ఎన్‌కౌంటర్లు, హైదరాబాద్‌పై సర్జికల్ స్ట్రైక్స్, కర్ఫ్యూలు, నేరస్థులను విడుదల చేయడం, బుల్‌డోజర్‌లను మాత్రమే వాళ్లు అందించగలరు. అసలు తెలంగాణ ప్రజల్ని ఎందుకు అంతగా ద్వేషిస్తున్నారు? అని ఒవైసీ ట్విటర్‌వేదికగా అమిత్‌ షాపై కౌంటర్‌ విమర్శలు గుప్పించారు. 

రికార్డు స్థాయికి చేరిన ద్రవ్యోల్బణం గురించి, నిరుద్యోగం గురించి మాట్లాడాలంటూ ఆయన షాకు చురకలు అంటించారు. ఒవైసీ మీద పడి ఎంతకాలం ఏడుస్తారంటూ మండిపడ్డారాయన. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం చేయాలని అమిత్‌ షా నిజంగా భావిస్తే.. 50 శాతం కోటా పరిమితిని తొలగించడానికి రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టాలి. అనుభావిక డేటా ఆధారంగానే వెనుకబడిన ముస్లిం సమూహాలకు రిజర్వేషన్లు ఇవ్వబడ్డాయని ఆయన గుర్తించాలి అని ట్వీట్‌లో ఒవైసీ పేర్కొన్నారు. ఈ విషయంలో సుధీర్‌ కమిషన్‌ రిపోర్ట్‌ను ఆయన చదవాలని, లేదంటే చదివిన ఎవరినైనా అడిగి తెలుసుకోవాలని షాకు సూచించారు. సుప్రీం కోర్టు స్టే కింద ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని అమిత్‌ షాకు ఒవైసీ గుర్తు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement