విందులు కాదు...12% రిజర్వేషన్ కావాలి
హైదరాబాద్: . తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రంజాన్ కానుకలు ప్రకటించడంపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 100 మసీదుల్లో ఇఫ్తార్ విందు ఇస్తానని ప్రకటించడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాగా వేసే ఎత్తులో భాగంగానే ముస్లింలపై వరాల జల్లు కురిపించారని మండిపడ్డారు. అసలు ఇమామ్లకు గౌరవ వేతనాలు ప్రకటించే ముందు సీఎం కేసీఆర్ ముస్లిం మతపెద్దలతో చర్చించారా అని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ముస్లింలు 12 శాతం రిజర్వేషన్లు కోరుతున్నారు తప్ప ఇలాంటి చిన్న చిన్నఅంశాలు కాదని విమర్శించారు. ఇమామ్లకు వేతనాలు, పేదలకు వస్త్రాలు పంపిణీ చేయడమంటే ముస్లిం వర్గంలోని పేదలను అవమానించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలపై అంత ప్రేమ ఉంటే ఆలేరు ఎన్కౌంటర్పై సీబీఐ విచారణ జరిపించాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా దీనిపై ఎంఐఎం స్పందించాలని కోరారు.
కాగా ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ సందర్భంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 8న రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించినున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించాంరు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇమామ్లకు, మౌసమ్లకు నెలకు 1000 రూపాయల భృతిని అందించనున్నామని తెలిపారు.