want
-
'ఇంత భయంకరమైన జైలులో ఉండలేను..'
ఇస్లామాబాద్: తొషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్‌ను అతి దారుణమైన సెల్లో ఉంచారనే విషయాన్ని ఇటీవల ఆయన తరుపు లాయర్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. తనను ఆ జైలు నుంచి బయటకు తీసుకురావాలని ఇమ్రాన్ ఖాన్ కోరినట్లు ఆయన తరుపు న్యాయవ్యాది చెప్పారు. పగలు ఈగలు, రాత్రి కీటకాలు ఇబ్బంది పెడుతున్న భయంకరమైన జైలులో జీవితాంతం ఉండలేనని చెప్పినట్లు వెల్లడించారు. అవినీతి కేసులో ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు ఇమ్రాన్ ఖాన్ దోషిగా నిర్ధారించిన కొద్దిసేపటికే లాహోర్‌లోని అతని ఇంటి నుండి ఖాన్‌ను అరెస్టు చేశారు. అనంతరం రావల్పిండిలోని అడియాలా జైలుకు పంపాలని అధికారులను ఆదేశించినప్పటికీ, అతన్ని పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ నగరంలోని అటాక్ జైలుకు తరలించారు. కోర్టు తీర్పును సవాలు చేసేందుకు ఖాన్ తరపు న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తీర్పును సవాలు చేసే క్రమంలో ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఆయన తరపు న్యాయవాది నయీమ్ హైదర్ పంతోజీ ఇటీవల జైలుకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌తో ఆయన దాదాపు గంట పాటు మాట్లాడారు. తనకు జైల్లో కల్పిస్తున్న సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయని ఇమ్రాన్ చెప్పినట్లు న్యాయవాది మీడియాతో వెల్లడించారు. ఇదీ చదవండి: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు.. తాత్కాలిక ప్రధాని ఎవరు? -
జీతాలు నగదు రూపంలో చెల్లించండి!
పనాజి: పెద్ద నోట్ల రద్దు సంక్షోభంతో గోవాలోని ప్రభుత్వ ఉద్యోగులు ముందుగా మేల్కొన్నారు. బ్యాంకులు నుంచి డబ్బులు డ్రా చేసేందుకు ఉన్న నిబంధనలు, ఏటీఎం కేంద్రాల్లో చాంతాండ క్యూల నేపథ్యంలో వారు ఆసక్తికరమైన డిమాండ్ కు దిగారు. నవంబర్ నెల జీతాన్ని తమకు నగదు రూపంలో అందించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుత నెలలో తాము పడ్డ డబ్బు ఇబ్బందులతో బెంబేలెత్తిన గోవా గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (జీజీఈఏ) ప్రభుత్వాన్ని ఈ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జీజీఈఏ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ కు ఒక లేఖ రాశారు. రూ.500 ,రూ.1,000 నోట్ల రద్దును స్వాగతించిన జీజీఈఏ అధ్యక్షుడు జాన్ నజారేత్ ఈ ప్రగతిశీల అడుగులో ప్రభుత్వం విజయం సాధించాలని ఆకాంక్షించారు. అయితే ఈ ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలను పరిగణనలోకి తీసుకుని నవంబరు నెల జీతాన్ని ఈసీఎస్ పద్ధతిలో కాకుండా నగదు రూపంలో చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులుగా తాము ప్రజలకు సేవ చేయడానికి కార్యాలయాల్లో వెచ్చించే సమయాన్ని ఏటీఎం సెంటర్ల దగ్గర పడిగాపులు కాయడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఆఫీసుల్లో ఉద్యోగులు లేకపోతే.. అంతిమంగా ప్రజల ఆగ్రహానికి, విమర్శలకు తావిస్తుందని ఆయన జోడించారు. -
విందులు కాదు...12% రిజర్వేషన్ కావాలి
హైదరాబాద్: . తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రంజాన్ కానుకలు ప్రకటించడంపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 100 మసీదుల్లో ఇఫ్తార్ విందు ఇస్తానని ప్రకటించడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాగా వేసే ఎత్తులో భాగంగానే ముస్లింలపై వరాల జల్లు కురిపించారని మండిపడ్డారు. అసలు ఇమామ్‌లకు గౌరవ వేతనాలు ప్రకటించే ముందు సీఎం కేసీఆర్ ముస్లిం మతపెద్దలతో చర్చించారా అని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ముస్లింలు 12 శాతం రిజర్వేషన్లు కోరుతున్నారు తప్ప ఇలాంటి చిన్న చిన్నఅంశాలు కాదని విమర్శించారు. ఇమామ్‌లకు వేతనాలు, పేదలకు వస్త్రాలు పంపిణీ చేయడమంటే ముస్లిం వర్గంలోని పేదలను అవమానించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలపై అంత ప్రేమ ఉంటే ఆలేరు ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణ జరిపించాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా దీనిపై ఎంఐఎం స్పందించాలని కోరారు. కాగా ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ సందర్భంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 8న రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించినున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించాంరు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇమామ్‌లకు, మౌసమ్‌లకు నెలకు 1000 రూపాయల భృతిని అందించనున్నామని తెలిపారు. -
మహేష్ కావలంటున్న నార్త్ అందాలు