ఇస్లామాబాద్: తొషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్‌ను అతి దారుణమైన సెల్‌లో ఉంచారనే విషయాన్ని ఇటీవల ఆయన తరుపు లాయర్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. తనను ఆ జైలు నుంచి బయటకు తీసుకురావాలని ఇమ్రాన్ ఖాన్ కోరినట్లు ఆయన తరుపు న్యాయవ్యాది చెప్పారు. పగలు ఈగలు, రాత్రి కీటకాలు ఇబ్బంది పెడుతున్న భయంకరమైన జైలులో జీవితాంతం ఉండలేనని చెప్పినట్లు వెల్లడించారు.
అవినీతి కేసులో ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు ఇమ్రాన్ ఖాన్ దోషిగా నిర్ధారించిన కొద్దిసేపటికే లాహోర్‌లోని అతని ఇంటి నుండి ఖాన్‌ను అరెస్టు చేశారు. అనంతరం రావల్పిండిలోని అడియాలా జైలుకు పంపాలని అధికారులను ఆదేశించినప్పటికీ, అతన్ని పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ నగరంలోని అటాక్ జైలుకు తరలించారు. కోర్టు తీర్పును సవాలు చేసేందుకు ఖాన్ తరపు న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
తీర్పును సవాలు చేసే క్రమంలో ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఆయన తరపు న్యాయవాది నయీమ్ హైదర్ పంతోజీ ఇటీవల జైలుకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌తో ఆయన దాదాపు గంట పాటు మాట్లాడారు. తనకు జైల్లో కల్పిస్తున్న సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయని ఇమ్రాన్ చెప్పినట్లు న్యాయవాది మీడియాతో వెల్లడించారు.
ఇదీ చదవండి: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు.. తాత్కాలిక ప్రధాని ఎవరు?
Comments
Please login to add a commentAdd a comment