‘ప్రజలే నా బలగం’ | - | Sakshi
Sakshi News home page

‘ప్రజలే నా బలగం’

Published Sat, Jul 29 2023 1:26 AM | Last Updated on Sat, Jul 29 2023 11:41 AM

- - Sakshi

నిజామాబాద్‌: నియోజకవర్గ ప్రజలే తన బలగమని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు. శుక్రవారం భిక్కనూరులో ని ర్వహించిన కార్యక్రమంలో పలువురు యువకులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త తీవ్రంగా కృషిచేయాలని సూచించారు.

తాను ఎప్పటికీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానన్నారు. అధికారంలో లేనప్పటికి ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని, వారికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటున్నానని పేర్కొన్నారు. వానలతో ప్రజ లు ఇబ్బందులు పడుతున్నా సీ ఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌, ఫామ్‌హౌస్‌ వదిలి బయటకు రావడం లేదని విమర్శించారు.

అధికారంలో కి వస్తే అమలు చేసే కార్యక్రమాలను ఆయ న ప్రజలకు వివరించారు. సమవేశంలో కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మద్ది చంద్రకాంత్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బల్యా ల సుదర్శన్‌, సీనియర్‌ నేతలు దయాకర్‌రెడ్డి, గజ్జె సురేశ్‌, సిద్ధగౌడ్‌, నీల అంజయ్య, దుర్గయ్య, ద్యాగల కిరణ్‌, చేపూరి రాజు, కొట్లని స్వామి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement