TS Nizamabad Assembly Constituency: TS Election 2023: చంద్రబాబు అవినీతి చేసి జైలుకిళ్లాడు! : కేఏ పాల్‌

TS Election 2023: చంద్రబాబు అవినీతి చేసి జైలుకెళ్లాడు! : కేఏ పాల్‌

Sep 21 2023 12:36 AM | Updated on Sep 21 2023 1:01 PM

- - Sakshi

నిజామాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత అవినీతి పరుడు కాబట్టే జైలుకు వెళ్లాడని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ కేఏ పాల్‌ అన్నారు. బుధవారం నిజామాబాద్‌ నగరంలోని బైపాస్‌ రోడ్‌లో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి రూ.వేల కోట్లు చంద్రబాబు దోచుకున్నారన్నారు.

ఎన్‌టీఆర్‌కు వెన్నుపొటు పొడిచిన విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పటీకీ మర్చిపోరన్నారు. రూ.లక్షల కోట్లు మెక్కడంతోనే ఊచలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుందని, అంతే అవినీతి జరుగుతుందన్నారు. తెలంగాణ జరిగే ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీ బీ టీం అని, అందుకే కవితను అరెస్టు చేయడం లేదన్నారు. తనను ముఖ్యమంత్రి చేస్తే అవినీతి లేని పాలనతో అభివృద్ధి చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌, కాంగ్రెస్‌ కుటుంబ పాలన చేస్తున్నాయని, నరేంద్ర మోదీ తన మిత్రులకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. తన పార్టీలోకి ఎంపీ అర్శింద్‌, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, మాజీ ఎంపీ మధుయాష్కి రావాలని పాల్‌ కోరారు. తాను సీఎం అయితే విద్య, వైద్యం ఉచితంగా అందిస్తానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement