కాజీపేట: అన్ని ప్రభుత్వ పథకాలు.. సేవలకు.. ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి. ఈ ఆధార్ లేకుంటే అన్నింటికీ ఇబ్బందే.. మొబైల్ నంబర్‌కు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని లేకుంటే కనెక్షన్ తొలగిస్తామంటూ వినియోగదారులకు పలు మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలు ఇప్పటికే సందేశాలు పంపుతున్నాయి. ఈ నేపథ్యంలో మీరు వాడుతున్న మొబైల్ నంబర్ మీ ఆధార్ కార్డుకు అనుసంధానమైందో లేదో తెలుసుకోవాల్సి ఉంది. మీ ఆధార్‌కార్డుతో రిజిస్టరై ఉన్న మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ వంటి వ్యక్తిగత సమాచారం పరిశీలించుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..
మీ మొబైల్ నుంచే..
స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి యూఐడీఏఐ వెబ్‌సైట్ జ్టి్ట htt pr//uidai.gov.i n https-//uidai.gov.in లోకి వెళ్లాలి. హోమ్ పేజీలో తెలుగు భాషను ఎంచుకున్న తర్వాత స్క్రీన్‌పై ‘ఈ–మెయిల్, మొబైల్ నంబర్‌ను పరిశీలించుట’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఓ పేజీ ఓపెన్ అవుతుంది.
మీ మొబైల్ నంబర్ మాత్రమే అయితే..
ఈ–మెయిల్ / మొబైల్ నంబర్ పేజీలో మీ ఆధార్ సంఖ్యతో పాటు ఆధార్ నమోదు సమయంలో మీరిచ్చిన మొబైల్ నంబర్‌ను మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెక్యూరిటీ కోడ్‌ను కూడా ఎంటర్ చేసి కింద కనిపించే గెట్ వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మీరు పొందుపరిచిన వివరాలు, సరైనవైతే.. మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ కోడ్ వస్తుంది. ఆ ఓటీపీని అదే పేజీలో కుడిచేతి వైపు కనిపించే ఓటీపీ ఫీల్డ్‌లో ఎంటర్ చేయాలి. అలా చేసిన వెంటనే కంగ్రాట్యులేషన్స్ ది మొబైల్ నంబర్ మ్యాచెస్ విత్ అవర్ రికార్డ్స్ పేరుతో సిస్టంపై మెసేజ్ వస్తుంది.
మెయిల్ ఐడీని మాత్రమే వెరిఫై చేసుకోవాలంటే..
వెరిఫై ఈ–మెయిల్ / మొబైల్ నంబర్ పేజీలో మీ ఆధార్ నెంబర్‌తో పాటు ఆధార్ నమోదు సమయంలో మీరిచ్చిన ఈ–మెయిల్ ఐడీని మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెక్యూరిటీ కోడ్‌ను కూడా ఎంటర్ చేసి కింద కనిపించే గెట్ వన్ టైమ్ పాస్‌వర్డ్(ఓటీపీ)పై క్లిక్ చేయాలి. మీరు సబ్మిట్ చేసిన వివరాలు సరైనవైతే మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ కోడ్ అందుతుంది. ఆ ఓటీపీని అదే పేజీలో కుడి చేతి వైపు కనిపించే ఎంటర్ ఓటీపీ ఫీల్డ్‌లో నమోదు చేస్తే కంగ్రాట్యులేషన్ ది ఈ–మెయిల్ ఐడీ మ్యాచ్ విత్ ఆవర్ రికార్డ్స్ పేరుతో సిస్టంకు మెసేజ్ వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment