కిట్టు అందిస్తున్న డాక్టర్ సీవీరావు
నెల్లిమర్ల: మిమ్స్ ఆసుపత్రిలో అమలుచేస్తున్న కన్నతల్లి పథకం నిరుపేద మహిళలకు వరమని ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సీవీరావు అన్నారు. నెల్లిమర్ల పట్టణంలోనున్న మిమ్స్ వైద్య కళాశాలతో పాటు ఆసుపత్రిని బుధవారం ఆయన సందర్శించారు. ఆసుపత్రిలో అమలుచేస్తున్న పథకాలు, వైద్యసేవలు గురించి ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద గర్భిణులకు ఉచితంగా వైద్యసేవలు అందించాలనే ఉన్నత ఆశయంతో అమలుచేస్తున్న కన్నతల్లి పథకం తనకు ఎంతగానో నచ్చిందన్నారు.
అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం యాజమాన్యం ఉదారతకు నిదర్శనమని కొనియాడారు. ఈ సందర్భంగా కన్నతల్లి పథకంద్వారా చిన్నారులకు కిట్‌లు అందజేశారు. కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ అల్లూరి సత్యనారాయణరాజు, డీన్ టీఏవీ నారాయణరాజు, ప్రిన్సిపాల్ లక్ష్మీకుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘురామ్, సంక్షేమాధికారి గిరిబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment