cv rao
-
మిమ్స్ ‘కన్నతల్లి’ పథకం భేష్
నెల్లిమర్ల: మిమ్స్ ఆసుపత్రిలో అమలుచేస్తున్న కన్నతల్లి పథకం నిరుపేద మహిళలకు వరమని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సీవీరావు అన్నారు. నెల్లిమర్ల పట్టణంలోనున్న మిమ్స్ వైద్య కళాశాలతో పాటు ఆసుపత్రిని బుధవారం ఆయన సందర్శించారు. ఆసుపత్రిలో అమలుచేస్తున్న పథకాలు, వైద్యసేవలు గురించి ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద గర్భిణులకు ఉచితంగా వైద్యసేవలు అందించాలనే ఉన్నత ఆశయంతో అమలుచేస్తున్న కన్నతల్లి పథకం తనకు ఎంతగానో నచ్చిందన్నారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం యాజమాన్యం ఉదారతకు నిదర్శనమని కొనియాడారు. ఈ సందర్భంగా కన్నతల్లి పథకంద్వారా చిన్నారులకు కిట్లు అందజేశారు. కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ అల్లూరి సత్యనారాయణరాజు, డీన్ టీఏవీ నారాయణరాజు, ప్రిన్సిపాల్ లక్ష్మీకుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘురామ్, సంక్షేమాధికారి గిరిబాబు పాల్గొన్నారు. -
సాంస్కృతిక వివ్లవ యోధుడు
మార్క్స్, లెనిన్, మావో అందరూ నాస్తికులే, హేతువాదులే, గతితార్కిక భౌతిక వాదాన్ని జీవితంగా మలుచుకొన్నవారే. మరి మన జీవితాల్లోనూ హేతువాద జీవన విధానం ఎందుకు లేదు అని సి.వి. ప్రశ్నించేవారు. ఆవేదన వ్యక్తం చేసేవారు. ఆధునిక యుగ హేతువాద ఉద్యమ వైతాళికుడు, అలుపెరుగని కలం యోధుడు. ఆరు దశాబ్దాల పైగా అక్షర జ్వలనాలతో వెలిగిన జ్ఞాన సూర్యుడు సి.వి. (సి. వరహాలరావు) 88వ యేట విజయవాడలో తన నివాసంలో మంగళవారం రాత్రి చివరి శ్వాస విడిచారు. నలభై యేళ్ళ హేతువాద ఉద్యమం అనుబంధం మాది. భారతీయ తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసిన చార్వాక వాది సి.వి. హేతువాదిగా ప్రత్యామ్నాయ సాహితీ సృజ నను పుంఖానుపుంఖంగా చేసి, వేదాలు, ధర్మశాస్త్రాలు అధ్యయనం చేసి, అందులోని వైరుధ్యాలను బయటబెట్టిన సాహసి. మనుస్మృతి లోతులు చూసి, వర్ణ వ్యవస్ధ పునాదులను తవ్వి వేసి సమసమాజ భావనకు పతాకలెత్తిన హేతువాది సి.వి. కమ్యూనిస్టు ఉద్యమం నుంచి వచ్చిన సి.వి. కమ్యూనిస్టు సాంస్కృతిక, సాంఘిక, తాత్విక ఉద్యమాలను ఇంకా బలంగా నడపవలసి ఉందని ఆకాంక్షించారు. అస్పృశ్యతను, కులాన్ని పారదోలందే, మూఢాచారాల బూజును దులపనిదే వర్గపోరాటం కూడా విజయవంతం కాదని అంబేడ్కర్ ఆలోచనలను తన భాషలో పలికిన ఆధునిక వైతాళికుడాయన. మహాత్మాఫూలే, అంబేడ్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ల ఆలోచనలను తన రచనల్లో జ్వలితమైన భాషలో నినదించిన మహాకవి సి.వి. 1970 దశకం నుంచి 90వ దశకం వరకు తెలుగువాడిగా పెరియార్‌లా, మరో హోచ్మిన్లా ఉక్కునాలుకతో పలికిన ధైర్యశాలి. ఆయన రాసిన విషాద భారతం, దిగంబర కవిత్వానికి విప్లవ కవిత్వానికి మధ్య వారధి గట్టింది. ఆ తరువాత వర్ణం, కుల అభ్యుదయ విప్లవ జీవన విధానాల్లో కూడా దాగి వుందని గమనించి ‘వర్ణ వ్యవస్ధ’, ‘చార్వాక దర్శనం’, ‘సత్యకామ జాబాలి’, ‘మధ్యయుగాల్లో కులం’ వంటి లోతైన విమర్శనా గ్రంథాలు వ్రాశారు. సి.వి. కులనిర్మూలనా వాది, ఆయనొక గొప్పకవి, ఆయన వర్ణనా సామర్ధ్యం ‘పారిస్ కమ్యూన్’లో నరబలిలో మనకు అద్భుతంగా కనిపిస్తుంది. ఆయన అక్షరాలతో ఆయుధాలు తయారు చేస్తారు. అక్షరాల్లో సాయుధ సైనిక కవాతులు మనకు చూపిస్తారు. శ్రీశ్రీ కవిత్వంలోని పరుగు ఆయన కవిత్వంలో మనకు కనిపిస్తుంది. వేమన కవిత్వంలోని కులాధిపత్యంపై పోరు, కబీర్, చక్రధర్, నానక్, పోతులూరి వీరబ్రహ్మం భక్తి కవుల్లోని మానవతా వాదాన్ని ఆయన హేతువాద భావాల్లో చెప్పారు. భారతదేశ సామాజిక సాంస్కృతిక భారతాల్లోని వైరుధ్యాలను మన కళ్ళముందు సాక్షాత్కరింపజేశారు. నేను హేతువాదిని నాకు దేవుడు లేడు అని చాటుకున్న సి.వి. ఇటీవల ప్రజాశక్తి వారు ఆయన రచనలన్నీ ప్రచురించిన సభలో నన్ను ప్రేమతో కౌగిలించుకొన్న అనుభూతిని మరువలేను. ఆయన పురాణాల్లో అణగారిన పాత్రలకు జీవం పోశారు. సి.వి.ని నేను 1978లో మొదట చార్వాక ఆశ్రమం నిడమర్రులో చూశాను. నా మొదటి పుస్తకం ‘కులం పునాదులు’ ఆయన నేతృత్వంలో 1979లో అచ్చయింది. కొండవీటి వెంకటకవి, బి.రామకృష్ణ, సి.వి., ఈశ్వర ప్రభుగార్లు మా తరానికి ముందు హేతువాద భావజాల వ్యాప్తిలో మార్గాన్ని సుగమం చేశారు. ఎన్నో సదస్సుల్లో, సభల్లో సి.వి. నేను పాల్గొన్నాం. ఆయన నిరాడంబరత ఆదర్శనీయమైంది. ఆర్భాటాలు లేవు. స్నేహం, ఆత్మీయత, నిరంతర రచన, అధ్యయనం ఆయన దినచర్యలు. స్వాములు, యోగు లు, పరాన్న భుక్కులు మూఢాచారాలతో ప్రజలను దోచుకొంటున్న విధానాలను అధ్యయనం చేసేవారు. ఆయనది సాంఘిక సాంస్కృతిక పోరాటమే అయినా రాజకీయాల్లో వున్న ఫాసిజం మీద తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. ఆయన ఆవేదనంతా కమ్యూనిస్టు ఉద్యమం మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ భావజాలాన్ని ప్రచారం చేయడంలో వెనకబడుతోందనన్నదే. మతోన్మాద సంస్ధలను కేవలం రాజకీయాల ద్వారా ఎదిరించలేం.. తప్పకుండా సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమానికి పదును పెట్టాలనేదే ఆయన భావన. పుక్కిట పురాణాలకు ప్రత్యామ్నాయంగా శాస్త్ర జ్ఞానం కావాలని సి.వి. ప్రబోధించారు. మార్క్స్, లెనిన్ మావో అందరూ నాస్తికులే, హేతువాదులే, గతితార్కిక భౌతిక వాదాన్ని జీవితంగా మలుచుకొన్నవారే. మరి మన జీవితాల్లో కూడా హేతువాద జీవన విధానం ఎందుకు లేదు అని సి.వి. ప్రశ్నించారు. ఇప్పుడు ఈ అవసరాన్ని మరింతగా గుర్తించే ప్రజాశక్తి ప్రచురణలు సి.వి.గారి మొత్తం గ్రంథాలను ప్రచురించాయి. అవార్డులకు, సన్మానాలకు, పొగడ్తలకు, ధనకాంక్షకు, ఆశ్రిత పక్షపాతానికి లోబడకుండా జీవించిన సి.వి. ఈనాటి ఉద్యమకారులందరికి జీవితాచరణలో ఆదర్శప్రాయుడు. అధ్యయనం, రాత ప్రత్యామ్నాయ సంస్కృతీ నిర్మాణానికి సోపానాలని ఆయన ఆచరించి చూపాడు. ఈనాడు అంబేడ్కర్ వాదులు, మార్క్స్ వాదులు, హేతువాదులు కలిసి పని చేయడానికి కావలసిన పునాది కృషిని సి.వి. చేశారు. తెలుగువారి మరో మహాత్మాఫూలే అయిన ఆయన కోరినట్టే మార్క్స్, అంబేడ్కర్, హేతువాద, లౌకిక వాద శక్తులన్నీ ఐక్యంగా సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాన్ని ఆచరణాత్మకంగా నిర్మించడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అవుతుంది. చరిత్ర నిర్మాతలకు మరణం లేదు. సి.వి.కి మరణం లేదు. - డాక్టర్. కత్తి పద్మారావు వ్యాసకర్త సామాజిక కార్యకర్త, రచయిత మొబైల్ : 98497 41695 -
సమాజ అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు
భీమవరం : విద్యార్థులు సమాజ అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు చేయాలని, శాటిలైట్స్ రూపకల్పన చేసి విజయాన్ని సాధించాలని జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగం హెడ్ ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ సీవీ రావు సూచించారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే ట్రాన్స్–2017 జాతీయస్థాయి విద్యార్థి సింపోజియాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశ సాంకేతిక ప్రగతిని ప్రపంచానికి చాటడానికి ఇస్రో ఏకకాలంలో 104 శాటిలైట్లను ప్రయోగిస్తుందని, నూతనంగా ప్రయోగిస్తున్న ఉపగ్రహాల ద్వారా 60 సెంటీమీటర్ల రెజుల్యూషన్‌తో ఛాయా చిత్రాలు భూమికి అందిస్తుందన్నారు. ఆటోశాట్ టూ ఎస్ ఉపగ్రహం పట్టణాల అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ప్రణాళికలను సిద్ద్ధం చేస్తుందన్నారు. రిసోర్సెస్ ఉపగ్రహం వ్యవసాయ సమాచారం అందిస్తుందని, క్షామపరిస్థితులు ఎదురైనప్పుడు నీటి వనరులు ఎక్కడెక్కడున్నాయనే సమాచారాన్ని అందిస్తుందని సీవీ రావు చెప్పారు. ఓషన్‌శాట్ ఉపగ్రహం వల్ల సముద్ర ఉపరితలంపై మార్పులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయవచ్చని, తుపాను, సునామీల సమయంలో వాటి గమనాన్ని సమాచారం అందిస్తుందన్నారు. అనంతరం ట్రాన్స్ సింపోజియం సావనీర్‌ను ఆవిష్కరించారు. కళాశాల చైర్మన్ గోకరాజు మురళీరంగరాజు, డైరెక్టర్ సాగి విఠల్‌రంగరాజు, సీవీ రావును సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎస్ఎన్ రాజు, ఈసీఈ విభాగం హెడ్ డాక్టర్ పి.రామరాజు, ప్రొఫెసర్ ఎన్.వెంకటేశ్వరరావు, వై.రామలక్ష్మణ్, కేఎన్వీ సురేష్‌వర్మ, కేఎన్వీ సత్యనారాయణ పాల్గొన్నారు. -
గల్లంతైన వారిలో శంషాబాద్ వాసి
దుఃఖసాగరంలో మునిగిన కుటుంబం శంషాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లో గల్లంతైన వారిలో శంషాబాద్ వాసి కూడా ఉన్నారు. స్థానిక పట్టణంలో పాత పోలీస్‌స్టేషన్ సమీపంలో నివసించే వినోద్, శశిలతల కుమారుడు అరవింద్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో చదువుతున్నాడు. అతను కూడా గల్లంతు కావడంతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. అరవింద్‌తోపాటు అతడి కుటుంబసభ్యులు ముగ్గురు పిల్లల చదువుల కోసం నాలుగైదేళ్లుగా వనస్థలిపురంలో ఉంటున్నారు. అరవింద్ వీరికి మొదటి సంతానం. సెలవుల్లో ఇక్కడికి వచ్చి వెళ్లే వాళ్లని వారి బంధువులు తెలిపారు. అరవింద్ కుటుంబసభ్యులను ఓదార్చడానికి వారి బంధువులు కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అరవింద్ తల్లి శశిలతను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కొడుకు గల్లంతయ్యాడనే షాక్ నుంచి ఆ తల్లి తేరుకోలేకపోతోంది. మూడు రోజుల క్రితం ఫోన్ చేశాడు: వినోద్ , బంధువు నా కొడుకు అరవింద్ మూడు రోజుల కింద ఫోన్ చేసి బాగున్నామని చెప్పాడు. నిన్నరాత్రి 12 గంటలకు తెలిసింది.. గల్లంతైన వారిలో మా వాడు కూడా ఉన్నాడని. కాలేజీ నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు. హిమాచల్‌ప్రదేశ్‌కు నా బావమరిది వెళ్లాడు. ఇది ఘోరం: ప్రశాంత్, పరమేశ్వర్ సోదరుడు కళాశాల నిర్లక్ష్యంతోనే ఇంత ఘోరం జరిగింది. కాలేజీ వాళ్లు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. మా తమ్ముడు గల్లంతైన వారిలో ఉన్నాడు. మా బాధను చెప్పుకోలేని పరిస్థితి. ఉదయమే ఫ్లైట్ ఉందని చెప్పినా విమానాశ్రయంలో అలాంటి ఏర్పాట్లు ఏమీ లేవు. -
విషాదఛాయలు
జగద్గిరిగుట్ట (బాచుపల్లి): హిమాచల్‌ప్రదేశ్‌లోని లార్జీ హైడ్రో పవర్ డ్యామ్ దుర్ఘటన నేపథ్యంలో.. బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల వద్ద సోమవారం విషాదఛాయలు అలుముకున్నాయి. స్టడీటూర్‌కు వెళ్లిన విద్యార్థులు బీయాస్ నదిలో గల్లంతయ్యారన్న సమాచారంతో విద్యార్థుల తల్లిదండ్రులు, వారి బంధువులు, మిత్రులు, ఆత్మీయులు పెద్దసంఖ్యలో కళాశాలకు తరలివచ్చారు. వారి రోదనలతో కాలేజీ పరిసరాలంతా ఉద్విగ్నంగా మారాయి. ఏకకాలంలో 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారన్న షాక్ నుంచి పలువురు తేరుకోలేకపోయారు. కొంతమంది విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయని తెలుసుకుని విద్యార్థులు, కళాశాల సిబ్బంది హతాశులయ్యారు. పోలీసు అధికారులు, మీడియా హడావుడితో ఈ ప్రాంతం కిటకిటలాడింది. కుత్బుల్లాపూర్ మండల ఆర్ఐ ప్రభుదాసు కాలేజీని సందర్శించి విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీ సిబ్బందితో మాట్లాడి పూర్తి సమాచారం సేకరించారు. బాచుపల్లిలోని కాలేజీలో నెలకొన్న పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించారు. హిమాచల్‌ప్రదేశ్‌కు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులను హిమాచల్‌ప్రదేశ్‌కు విమానంలో రెండు విడతలుగా తరలించారు. కళాశాల ప్రిన్సిపాల్ సి.డి.నాయుడు ఆధ్వర్యంలో కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు బయలుదేరి వెళ్లారు. కొంతమంది దూరప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు బాచుపల్లిలోని కాలేజీ చేరుకుని సమాచారం కోసం విశ్వప్రయత్నం చేశారు. తమ పిల్లల వివరాలను వెల్లడించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం యాజమాన్యం నుంచి సరైన స్పందన లేదని రాంబాబు అనే విద్యార్థి తండ్రి శేఖర్ నాయక్ కాలేజీ భవనం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన కాలేజీ యాజమాన్యం ఆలస్యంగా చేరుకున్న వారిని మరో విమానంలో హిమాచల్‌ప్రదేశ్‌కు పంపింది. కళాశాల వద్ద పటిష్ట బందోబస్తు నదిలో కొట్టుకుపోయిన విద్యార్థులు కొంతమంది మృతి చెందడంతో కళాశాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాలానగర్ ఏసీపీ నాగరాజరెడ్డి నేతృత్వంలో దుండిగల్ పోలీసులతో పాటు బీఎస్ఎఫ్ దళాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలానగర్ డీసీపీ ఎ.ఆర్.శ్రీనివాస్, పేట్‌బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావులు ఘటనా స్థలానికి సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. కళ్లు తిరిగి పడిపోయిన సీఏఓ విద్యార్థులు గల్లంతై మృతి చెందిన విషయం తెలుసుకున్న కాలేజీ చీఫ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి (సీఏఓ) సి.వి.రావు షాక్‌కు గురై కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో సిబ్బంది హడావుడి కనిపించింది. హుటాహుటిన డాక్టర్‌ను పిలిపించి పరిస్థితిని అదుపు చేశారు. దురదృష్టకరం : సీఏఓ సీవీ రావు వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి విద్యార్థులు నదిలో కొట్టుకుపోవడం దురదృష్టకరమని, విద్యార్థుల తల్లిదండ్రులకు జరిగిన అన్యాయాన్ని ఎవరు పూడ్చలేనిదని అందుకు తాము ఎం తో బాధపడుతున్నామని కాలేజీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ సీవీ రావు అన్నారు. బాచుపల్లిలోని కళాశాలలో సోమవారం సాయంత్రం ఆయ న మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆదివారం సాయంత్రం తమకు సమాచారం తెలిసిన వెంటనే అప్రమత్తం అయ్యామన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు సమాచారం అందించమన్నారు. సిగ్నల్స్ అందకపోవడంతో కొంత ఇబ్బంది పడ్డామని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు తమకు ప్రభుత్వపరంగా ఎంతో సహాయం అందించారని ఆయన తెలిపారు. తమకు ప్రత్యేక విమానాలను సమకూర్చడంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. తమ విద్యార్థులను రక్షించుకోవడం కోసం ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నమన్నారు. ఆర్మీ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, హిమచల్‌ప్రదేశ్ ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్‌లో ఉన్నాయని ఆయన తెలియ జేశారు. విద్యార్థుల మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపుతాం నది ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల మృతదేహాలను వారి స్వస్థలాలకు ఎయిర్ పోర్ట్ నుంచి చేరవేస్తామని సీవీ రావు చెప్పారు. ఎప్పటికప్పుడు లభించిన మృతదేహాలను రాష్ట్రానికి తీసుకువచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని ఆయన తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు, బంధువులకు సమాచారం అందించేందుకు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశామన్నారు. షాక్‌కు గురయ్యాం ఆదివారం ఇండస్ట్రియల్ టూర్‌కు వెళ్లిన విద్యార్థులు నదిలో కొట్టుకుపోయారన్న సమాచారం రావడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాం. టూర్‌కు వెళ్లిన ఈఐఈ బ్రాంచ్ విద్యార్థులంతా సత్ప్రవర్తన కలిగిన పిల్లలే. ఇంత ఘోరం వీరికే జరగడం బాధాకరం. మృతి చెందిన వారిలో ఎంతో ప్రతిభ కలిగిన విద్యార్థులున్నారు. ఈ షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాం. గుండె బరువెక్కుతోంది భగవంతుడు మా విద్యార్థులకే ఇలాంటి కష్టాలు తేవాలా? ఎంతో మంచి తెలివితేటలు కలిగిన విద్యార్థులు లేరన్న సంగతి తల్చుకుంటేనే గుండె బరువెక్కుతోంది. ఇన్ని సంవత్సరాలు ఎంతో కష్టపడి చదివి జీవితంలో స్థిరపడే సమయంలోనే ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం. మాకే ఇంత బాధ ఉంటే ఇక విద్యార్థులను కని పెంచిన వారి తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో?