సాక్షి, కోవెలకుంట్ల: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో వైఎస్‌ఆర్ రైతు భరోసా అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తుంది. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికీ రూ.50 వేలు పెట్టుబడి నిధి కింద అందజేయనున్నారు. ఒక్కో ఏడాదికి రూ.12,500 చొప్పున రెండవ సంవత్సరం నుంచి నాలుగేళ్లపాటు ప్రతి ఏటా మే నెలలో రైతు కుటుంబాలకు పెట్టుబడి నిధి అందనుంది.
వైఎస్‌ఆర్ రైతు భరోసా రైతులకు చేయూతగా మారటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్‌లోని ఆరు మండలాల పరిధిలో 50 వేల మంది రైతులకు వైఎస్‌ఆర్ రైతు భరోసా ద్వారా లబ్ధి చేకూరనుంది.
పంట సాగుకు చాలా ఉపయోగం
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రైతు కుటుంబానికీ రూ. 50వేలు పెట్టుబడి నిధి కింద అందుతుంది. ఏటా రూ. 12,500 ఇవ్వడం వల్ల ఈ నిధులతో పంట సాగుకు విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
–ఉసేనయ్య, రైతు, బిజనవేముల
రుణ సమస్య తప్పుతుంది
వ్యవసాయంలో పెట్టుబడే ప్రధాన సమస్య. నవరత్నాల్లో వైఎస్‌ఆర్ రైతు భరోసా కింద మే నెలలోనే రూ. 12,500 ఇవ్వడం రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ముందే పెట్టుబడి సమకూరడం వల్ల రుణ సమస్య తప్పుతుంది.
–ప్రతాప్‌రెడ్డి, రైతు, కోవెలకుంట్ల
పెట్టుబడి సమస్య తీరుతుంది
ఖరీఫ్‌కు ముందే పెట్టుబడి నిధి కింద రూ.12,500 ప్రతి రైతు కుటుంబానికీ అందటం వల్ల ఆ ఏడాది పెట్టుబడి సమస్య తీరుతుంది. రైతులకు పంటల సాగుకు పెట్టుబడికి చేతులో డబ్బులు ఉండటంతో ప్రణాళికా బద్ధంగా వ్యవసాయానికి వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించేందుకు వీలుంటుంది.
–వెంకటరాముడు, రైతు, గుళ్లదూర్తి
Comments
Please login to add a commentAdd a comment