బీర్కూర్‌లో మాట్లాడుతున్న మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బాన్సువాడ: రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పథకాలను ప్రవేశపెట్టి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంద ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన స్వగృహంలో వర్ని మండలం ఘన్‌పూర్ గ్రామస్తులు సర్పంచ్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎకరాకు రూ. 4వేల చొప్పున ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదని, కర్ణాటక ప్రభుత్వం దీన్ని ఆదర్శంగా తీసుకొని అక్కడ ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు.
తమ ప్రభు త్వం గ్రామాల అభివృద్ధితో పాటు వ్యక్తిగతంగా ప్రతిఒక్కరికి సంక్షేమ ఫలాలను అందజేస్తోందని పేర్కొన్నారు. షాదీముబారక్, కల్యాణ లక్ష్మి, వృద్ధాప్య, వికలాంగ, ఒంటరి మహిళా పింఛన్లు అందిస్తోందన్నారు. ప్రతి ఒక్క గ్రామంలో మిషన్ కాకతీయ పేరుతో చెరువుల అభివృద్ధి, సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం, వైకుంఠధామం నిర్మాణం చేపట్టామన్నారు.
కాంగ్రెస్ సర్పంచ్ సహా 300 మంది చేరిక
వర్ని మండలం ఘన్‌పూర్ సర్పంచ్ చందర్‌నాయక్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది గ్రామస్తులు ఆదివారం మంత్రి పోచారం సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ నిర్మాణానికి రూ. 16లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. డ్రెయినేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. కాగా పార్టీలో చేరిన వారిలో సర్పంచ్ చందర్‌నాయక్, ఉపసర్పంచ్ సాయగొండ, మాజీ సర్పంచ్ నర్సయ్య ఉన్నారు. కార్యక్రమంలో దేశాయిపేట సొసైటీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, వర్ని ఏఎంసీ చైర్మన్ నారోజి గంగారాం, పార్టీ మండలాధ్యక్షుడు వీర్రాజు, సొసైటీ చైర్మన్ వీర్రాజు, ఎంపీపీ బజ్యానాయక్, నాయకులు బద్యానాయక్, కిషోర్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, మహ్మద్ ఎజాస్, అంజిరెడ్డి, పోతురెడ్డి పాల్గొన్నారు.
సమర్థమైన పాలన
బీర్కూర్: సమర్థ, సుస్థిర పాలన అందించడంలో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన బీర్కూర్ మండలంలో పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు తాము అందించనున్న పెట్టుబడి సాయం పథకం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సహా కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించిందన్నారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని ఆదర్శంగా మార్చడానికి ఎంతో కృషి చేస్తున్నాని పేర్కొన్నారు. అనంతరం మాజీ ఎంపీపీ విజయ్‌ప్రకాశ్, కాంగ్రెస్ నాయకులు సాహెబ్‌రావు, ఐదుగురు వార్డు సభ్యులు, కులసంఘాల నాయకులకు, వందలాది మంది కార్యకర్తలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
భారీ బైక్ ర్యాలీ
దామరంచ నుంచి బీర్కూర్ వరకు ఆదివారం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయులు సురేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దామరంచ, అన్నారం, చించోలి, కిష్టాపూర్, బీర్కూర్‌లో మంత్రి టీఆర్‌ఎస్ జెండాలను ఆవిష్కరించారు. బీర్కూర్‌లోని బారడిపోచమ్మ, కామప్ప, హనుమాన్ మందిరాల్లో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్లు పెర్కశ్రీనివాస్, నార్లసురేష్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్, నాయకులు బద్యానాయక్, మహ్మద్ ఎజాస్, ద్రోణవల్లి అశోక్, అప్పారావు, పల్లికొండ సాయిబాబా, రాజప్ప తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment