
ప్రజానాట్యమండలి వీధి నాటకోత్సవాల్లో గోరటి వెంకన్న ఆటాపాట
నల్లగొండటౌన్: మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టులతోనే టీఆర్‌ఎస్ గెలుపు సాధ్యమైందని ఎమ్మెల్సీ, కవి, గాయకుడు గోరటి వెంకన్న అన్నారు. నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో ప్రజానాట్యమండలి నిర్వహిస్తున్న వీధినాటకోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరంతరం ప్రజలను చైతన్యవంతులను చేయడంలో ప్రజా నాట్యమండలి కీలకపాత్ర పోషిస్తోందన్నారు.
ప్రజా సమస్యలపై కమ్యూనిస్టులు చేసిన పోరాటాలు గొప్పవని కొనియాడారు. తాను ఇక్కడికి ఒక కళాకారునిగా వచ్చానని, కళాకారునిగా ఉండడంలోనే సంతృప్తిని పొందుతానని తెలిపారు. నాజర్, సుద్దాల హనుమంతు వారసులుగా ప్రజానాట్య మండలి కళాకారులు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కళలు, సాహిత్యం ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. కమ్యూనిస్టు నాయకుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి స్పూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న ఆటాపాటలతో అలరించారు. కార్యమ్రంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, కె.శాంతారావు, వేల్పుల వెంకన్న, కట్ట నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment