బడుగు వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్‌రామ్‌ | Tributes To Babu Jagjeevan Ram | Sakshi
Sakshi News home page

బడుగు వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్‌రామ్‌

Published Sat, Apr 6 2019 8:48 AM | Last Updated on Sat, Apr 6 2019 8:49 AM

Tributes To Babu Jagjeevan Ram - Sakshi

సాక్షి, అనపర్తి: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి దివంగత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌రామ్‌ విశేష సేవలందించారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించేందుకు, కులమతాలకు అతీతంగా దేశాభివృద్ధే ధ్యేయంగా కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్‌రామ్‌ అన్నారు. జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దళితుల సామాజిక స్థితిగతుల మార్పునకు జగ్జీవన్‌రామ్‌ ఎనలేని కృషి చేశారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సత్తి రామకృష్ణారెడ్డి, పోతుల ప్రసాదరెడ్డి, వెలగల లక్ష్మీనారాయణరెడ్డి, పాదూరి డేవిడ్‌రాజు, కొండేటి భీమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


దొంతమూరులో...
దొంతమూరు (రంగంపేట): మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌  జయంతి వేడుకలు గ్రామంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎస్సీకాలనీలో ఉన్న జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి దుళ్ళపల్లి కొండ, మిరియాల దొరబాబు, కొండ్రి వీరన్న, రాయ వెంకన్న తదితరులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముత్యం వీరబాబు, మాసిపల్లి నాగేశ్వరరావు, దుప్పలపూడి చిట్టిబాబు, చెక్కపల్లి నాగేశ్వరరావు, చెక్కపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 


పెదరాయవరంలో...
పెదరాయవరం (రంగంపేట): గ్రామంలోని అరుంధతీపేటలో యూత్‌ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌రామ్‌ జయంతి ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మాదిగ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు ఉందుర్తి సుబ్బారావు, స్థానిక నాయకులు మాచిన గోవిందు, మోదుకూరి గోపాలకృష్ణ తదితరులు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో దళత నాయకులు బచ్చు చినబాబు, బొత్స యేసు, పైడిమళ్ళ మణికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


చింతపల్లిలో...
చింతపల్లి (పెదపూడి): దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన గొప్ప నాయకుడు దివంగత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌ అని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్‌ సంయుక్త కార్యదర్శి మోకా సూరిబాబు అన్నారు. గ్రామంలో జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు పార్టీ గ్రామ కన్వీనర్‌ కొల్లు పెద్దకాపు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పిల్లి భాస్కరరావు, పెంకే ఏకాశి, స్థానిక ఎస్సీలు పాల్గొన్నారు. 


పెద్దాడలో నేత్ర వైద్య శిబిరం 
గ్రామంలోని అరుంధతీ యూత్‌ సేవా సంఘం ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్‌ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో వైద్యులు 200 మందికి నేత్ర పరీక్షలు చేశారు. మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ఎస్సీసెల్‌ సంయుక్త కార్యదర్శి మోకా సూరిబాబు, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు యార్లగడ్డ సోమరాజు చౌదరి, బొడ్డు పరమేశ్వరరావు, అరుంధతీ యూత్‌ సేవా సంఘం అధ్యక్షుడు పైడిమళ్ల సత్యనారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.  


పెదపూడిలో...
గ్రామంలో జగ్జీవన్‌రామ్‌ జయంతి కార్యక్రమం జగ్జీవన్‌రామ్, ఎమ్మార్పీఎస్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన గ్రామ పెద్దలు యార్లగడ్డ అమ్మన్న చౌదరి, నల్లమిల్లి గంగిరెడ్డి తదితరులు జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి   పూలమాలలు  వేసి  నివాళులర్పించారు. అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ వేడుకలు   నిర్వహించారు.

ఘనంగా జగ్జీవన్‌రామ్‌ జయంతి
బిక్కవోలు: బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆదర్శనీయులని వైఎస్సార్‌ సీపీ నేత, ఏఎంసీ మాజీ చైర్మన్‌ జంగా వీరవెంకట సుబ్బారెడ్డి అన్నారు. రాజరావుపేటలో జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లడుతూ కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత పదవులు నిర్వహించిన మహా మేధావి జగ్గీవన్‌రామ్‌ అన్నారు. యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామశాఖ కన్వీనర్‌ తాళ్ల వీర్రాఘవరెడ్డి, మండల కన్వీనర్‌ పోతల ప్రసాద్‌రెడ్డి, జిల్లా నాయకులు వంగా రామ్‌గోపాలరెడ్డి, యామసాని రవీంద్రపాపారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఎస్టీయూ ఆధ్వర్యంలో
మాజీ ఉపప్రధాని, స్వాతంత్య్ర సమరయోధుడు బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి మండల ఎస్టీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వెలగల భామిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి జంగా శ్రీనివాసప్రసాద్, నేకూరి సత్యానందం, దొనేపూడి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement