తూర్పు గోదావరి (కొవ్వూరు) : ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఓ యువతి శనివారం ఆత్మహత్య చేసుకుంది. వివరాలివీ.. నందమూరుకు చెందిన చిట్టిబాబు కుమార్తె యంగల శ్రీదేదీప్య (22) ఏలూరులో ఎమ్మెస్సీ న్యూట్రీషియన్ చదివింది. విశాఖపట్నం సెవెన్‌హిల్స్ ఆసుపత్రిలో రెండు నెలల పాటు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి, శుక్రవారం సాయంత్రం స్వస్థలం వచ్చింది. ఆమెకు సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో ఉద్యోగం వచ్చింది.
తనకు ఆ జాబ్ చేయడం ఇష్టం లేదని పీజీ చేస్తానని తండ్రి చినబాబుకు శ్రీదేదీప్య చెప్పింది. ఆర్థిక పరిస్థితి బాగా లేనందున జాబ్‌లో చేరాలని తండ్రి సూచించారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున టాయిలెట్ కోసం లేచిన తండ్రికి శ్రీదేదీప్య నోటి వెంట నురగలతో అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమెను వెంటనే కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీదేదీప్య మృతి చెందింది. ఆమె ఇంట్లోని చీమల మందు తాగి ఉండవచ్చునని తండ్రి అభిప్రాయపడుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై జి.సతీష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment