east godavari dist
-
మెహందీ పెట్టడానికి వెళ్తూ మృత్యువాత
తూర్పు గోదావరి: ఓ శుభకార్యంలో మెహందీ పెట్టడానికి అమలాపురం వెళ్తున్న ఓ యువతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామానికి చెందిన ఎల్లే రత్నమాల (19), రాజమహేంద్రవరానికి చెందిన తమ్మనబోయి సుధారాణి స్నేహితులు. వీరు శుభకార్యాల్లో మేకప్, మెహందీ పెట్టడం చేస్తూంటారు. ఇదే క్రమంలో ఆలమూరు మండలం మోదుకూరుకు చెందిన మరో స్నేహితుడు కట్టుంగ కాశీతో కలిసి మోటార్ సైకిల్‌పై రాజమహేంద్రవరం నుంచి అమలాపురం మెహందీ పెట్టేందుకు శుక్రవారం బయలుదేరారు. కాశీ మోటార్ సైకిల్ నడుపుతూండగా.. ఇద్దరు యువతులూ వెనుక కూర్చున్నారు. జాతీయ రహదారిపై రావులపాలెం సీఐ కార్యాలయం వద్ద ఉన్న వంతెన మీదకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న లారీ వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో రత్నమాల కింద పడిపోయింది. తల పైనుంచి లారీ చక్రాలు దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సుధారాణి ఎడమ చేతికి గాయమైంది. కాశీ స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను కొత్తపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని రావులపాలెం ఎస్సై ఎం.వెంకట రమణ పరిశీలించారు. రత్నమాల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. దాని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన రత్నమాల పేరవరానికి చెందిన వీర్రాజు, నాగమణి దంపతుల కుమార్తె. వీర్రాజు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తెకు వివాహం అయ్యింది. వీర్రాజు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బతుకుతెరువు కోసం నాగమణి మూడు నెలల క్రితం దుబాయ్ వెళ్లింది. ఈ నేపథ్యంలో రెండో కుమార్తె రత్నమాల మెహందీ, మేకప్‌లు చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటోంది. ఆమె ఈ ప్రమాదంలో మరణించడంతో తండ్రి వీర్రాజు దుఃఖానికి అంతు లేకుండా పోయింది. -
అప్పులు ఇవ్వడమే అతడికి శాపమైందా? అందమైన కుటుంబం చివరికి ఇలా?
తూర్పు గోదావరి: కొంతమంది రూ.లక్షల్లో రుణాలు తీసుకుని చెల్లించకుండా ఎగ్గొట్టడంతో అదికాస్తా బ్యాంకు మేనేజర్ మెడకు చుట్టుకుని ఉరితాడయ్యింది.. హాయిగా సాగిపోతున్న పచ్చని కాపురంలో చిచ్చురేపింది. భార్య, ఇద్దరు కుమార్తెల భవితవ్యం అగమ్యగోచరమయ్యింది. యానాం పోలీసుల కథనం ప్రకారం పిఠాపురం మార్కెట్ ప్రాంతానికి చెందిన విస్పాప్రగడ సాయిరత్న శ్రీకాంత్(33) గతంలో మచిలీపట్టణంలో యూకో బ్యాంకు మేనేజర్‌గా పనిచేశారు. రొయ్యల చెరువుల సేద్యానికి అక్కడ కొంతమందికి లక్షలాది రూపాయలు రుణాలు ఇచ్చారు. తీసుకున్న రుణాలను సంబంధిత వ్యక్తులు చెల్లించకపోవడంతో యాజమాన్యం మేనేజర్ శ్రీకాంత్‌పై ఒత్తిడి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల కొంతమేర రుణాలను శ్రీకాంత్ వ్యక్తిగతంగా చెల్లించారు. ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితం శ్రీకాంత్ యానాం శాఖకు బదిలీ అయ్యారు. స్థానిక గోపాల్‌నగర్‌లో అద్దెకు ఉంటున్నారు. మంగళవారం ఉదయం 8.00 గంటలకు భార్య కావ్యను పిల్లల్ని స్కూల్ వద్ద దింపేసి రావాలని శ్రీకాంత్ చెప్పడంతో.. ఆమె మూడవ తరగతి చదువుతున్న స్వరాగ, ఎల్కేజీ చదువుతున్న స్వరి్ణతను స్కూల్‌కు తీసుకువెళ్లారు. ఆమె ఇంటికి వచ్చి తలుపులు కొట్టినా తెరవకపోవడంతో మరోమార్గంలో వెళ్లి చూడగా ఫ్యాన్‌కు శ్రీకాంత్ ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు. స్థానికులు, భార్య కలిసి యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. అయినవారు కన్నీరుమున్నీరు యానాం జీజీహెచ్‌లో కుమారుడి మృతదేహం వద్ద శ్రీకాంత్ భార్య, తల్లి బోరున విలపించారు. బ్యాంకుకు సంబంధించిన రుణాలు ఏదోలా తామే చెల్లిస్తామని చెబుతూ ఉన్నామని, అయిన్పప్పటికీ ఈ అఘాయిత్యానికి పాల్పడతాడని తాము ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సైతం ఒకసారి ఆత్మహత్యాయత్నానికి ఒడిగడితే తాము నివారించామని, కాని ప్రస్తుతం విధి కాటేసిందని శ్రీకాంత్ మావయ్య చెప్పారు. తమను భుజాలపై ఎక్కించుకుని ఆడించిన నాన్న తమను శాశ్వతంగా విడిచి అందనిలోకాలకు వెళ్లిపోయాడని తెలియని శ్రీకాంత్ కుమార్తెల అమాయక చూపులు అందరిని కలిచివేశాయి. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బడుగు కనకారావు తెలిపారు. -
జాబ్ ఇష్టం లేక యువతి ఆత్మహత్య
తూర్పు గోదావరి (కొవ్వూరు) : ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఓ యువతి శనివారం ఆత్మహత్య చేసుకుంది. వివరాలివీ.. నందమూరుకు చెందిన చిట్టిబాబు కుమార్తె యంగల శ్రీదేదీప్య (22) ఏలూరులో ఎమ్మెస్సీ న్యూట్రీషియన్ చదివింది. విశాఖపట్నం సెవెన్‌హిల్స్ ఆసుపత్రిలో రెండు నెలల పాటు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి, శుక్రవారం సాయంత్రం స్వస్థలం వచ్చింది. ఆమెకు సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో ఉద్యోగం వచ్చింది. తనకు ఆ జాబ్ చేయడం ఇష్టం లేదని పీజీ చేస్తానని తండ్రి చినబాబుకు శ్రీదేదీప్య చెప్పింది. ఆర్థిక పరిస్థితి బాగా లేనందున జాబ్‌లో చేరాలని తండ్రి సూచించారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున టాయిలెట్ కోసం లేచిన తండ్రికి శ్రీదేదీప్య నోటి వెంట నురగలతో అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమెను వెంటనే కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీదేదీప్య మృతి చెందింది. ఆమె ఇంట్లోని చీమల మందు తాగి ఉండవచ్చునని తండ్రి అభిప్రాయపడుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై జి.సతీష్ తెలిపారు. -
బుల్లెట్ బండి.. నోరూరేటట్టు తిండి!
తూర్పు గోదావరి (కొవ్వూరు) : ఈ యువకుడి పేరు పిల్లి శివరామకృష్ణ. ఊరు కొవ్వూరు. చదివింది బీటెక్. చైన్నె, ముంబయి వంటి ప్రాంతాల్లో బుల్లెట్ బండిపై మొబైల్ బార్భీక్యూ చికెన్ దుకాణాన్ని అతను చూశాడు. అనుకున్నదే తడవుగా బుల్లెట్ కొనుగోలు చేశాడు. రూ.3 లక్షలు వెచ్చించి బుల్లెట్‌కు బార్భీక్యూ అమర్చాడు. వివిధ రకాల చికెన్ ఐటెమ్స్ తయారు చేసి విక్రయిస్తున్నాడు. బుల్లెట్‌కు వివిధ రకాల లైట్లు అమర్చడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొవ్వూరు పట్టణంలో కొత్తరకంగా వ్యాపారం ప్రారంభించడంతో స్థానికులను సైతం ఆకట్టుకుంటున్నారు. కలర్స్, ఆయిల్స్, టెస్టింగ్ సాల్ట్, కార్న్ ఫ్లోర్, మైదా వంటివి వాడకుండానే వివిధ రకాల చికెన్ ఐటెమ్స్ తయారు చేయడంతో పట్టణ వాసులు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద దీనిని రోడ్డు మార్జిన్లో గురువారం ప్రారంభించారు. ఈ నోట ఆ నోట విని ఈ వెరైటీ ఫుడ్ తినడానికి మాంసాహార ప్రియులు క్యూ కడుతున్నారు. ఇలా బుల్లెట్‌కు అన్నీ అమర్చుకోవడం ద్వారా వ్యాపారానికి అనువుగా ఉన్న ప్రాంతాలకు మార్చుకోవచ్చని శివ అంటున్నారు. అంతేకాకుండా విందు భోజనాలకు సైతం వివిధ రకాల చికెన్ ఐటెమ్స్ తయారు చేసి సరఫరా చేస్తానని చెబుతున్నారు. తాను 2013లో బీటెక్ పూర్తి చేసిన అనంతరం హైదరాబాద్‌లో వింగ్స్ అండ్ ఫ్రైస్ రెస్టారెంట్లో మూడేళ్లు మేనేజర్‌గా పనిచేశానని చెప్పారు. డోమినో పిజ్జా రాజమహేంద్రవరం, హైదరాబాద్‌లో రెండేళ్ల పాటు పనిచేశానన్నారు. అనంతరం ప్రశాంత్ కిషోర్ టీములో కొన్నాళ్లు పనిచేశానని శివ చెబుతున్నారు. తనకు హోటల్ రంగంతో ఉన్న అనుబంధంలో ఈ వ్యాపారం ప్రారంభించినట్టు వివరించారు. -
కారులో డ్రైవర్ మృతదేహం.. ఎమ్మెల్సీ అనంతబాబు వివరణ
సాక్షి, తూర్పుగోదావరి: కారులో డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహం లభ్యమైన ఘటనపై ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌బాబు వివరణ ఇచ్చారు. సుబ్రహ్మణ్యం తన దగ్గర ఐదేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, అయితే.. రెండు నెలల నుంచి సరిగా పనిలోకి రావడం లేదని చెప్పారు. మద్యం అలవాటు ఉండటంతో ద్విచక్రవాహనంపై అనేకసార్లు ప్రమాదానికి గురైనట్లు ఎమ్మెల్సీ తెలిపారు. గత రాత్రి కూడా సుబ్రహ్మణ్యం యాక్సిడెంట్‌కు గురైనట్టు తెలియడంతో అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చానని పేర్కొన్నారు. చికిత్స కోసం కాకినాడ అమృత ఆసుపత్రికి తీసుకెళ్లామని, అతని తల్లిదండ్రులు కూడా ఆసుపత్రికి వచ్చారని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. సుబ్రమణ్యం మృతి చెందడంతో మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తీసుకువెళతామని చెప్పడంతో కారులో అపార్ట్మెంట్ వద్దకు పంపించినట్టు వెల్లడించారు. కాకినాడ ఎఎస్పీ శ్రీనివాస్ ఏమన్నారంటే? ‘నిన్న రాత్రి సుబ్రహ్మణ్యం తన స్నేహితుడు మణికంఠతో కలిసి బయటకు వెళ్ళాడు. రాత్రి 12 గంటల తరువాత సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదానికి గురై అమృత ఆసుపత్రిలో ఉన్నాడని ఎమ్మెల్సీ అనంతబాబు మృతుని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. సుబ్రహ్మణ్యం మృతి చెందాడని అమృత ఆసుపత్రి వైద్యులు నిర్ధారించాక బాడీని తల్లిదండ్రుల వద్ద వదిలి వెళ్ళారు. దీనిపై సర్పవరం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. చదవండి: బోడె... మామూలోడు కాదు.. ఆది నుంచీ అంతే! -
ఎందరికో ఆదర్శం ఈ పట్టభద్రుడు
ప్రత్తిపాడు (తూర్పు గోదావరి): కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు పెద్దలు. కష్టకాలం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఆలోచనతో పరిష్కార మార్గాలు అన్వేషిస్తే ఎటువంటి సమస్యనైనా సునాయాసంగా అధిగమించవచ్చని నిరూపించాడు ఓ రైతు. కోటనందూరు మండలం ఇండుగపల్లికి చెందిన కంఠంరెడ్డి సోమశేఖర్ ఎంఈడీ, ఎంఏలో తెలుగు, చరిత్ర, సైకాలజీ, ప్రభుత్వ పాలన శాస్త్రాల్లో పట్టభద్రుడు. ఈ అర్హతలతో ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. కరోనా కల్లోలంలో ప్రైవేట్ అధ్యాపకుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. చేసేదిలేక అత్తయ్య గ్రామమైన ధర్మవరంలో ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని పొలంబాట పట్టాడు. విద్యావంతుడు కావడంతో అధునిక పద్ధతుల్లో వరి పంటను సాగు చేసి అధిక దిగుబడులు సాధించి పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ప్రస్తుతం వరి సాగులో ఆశించిన ఫలితాలు దక్కని పరిస్థితి ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎకరాకు 35 బస్తాలు దిగుబడిని సాధించాడు. సోమశేఖర్ ప్రయోగాలను గుర్తించిన స్థానిక రైతులు ఆయన మార్గంలో ప్రకృతి సాగుకు మక్కువ చూపుతున్నారు. -
మూడు ఫుల్లు.. మూడు హాఫ్ టికెట్లు..
సామర్లకోట: ఇద్దరికే పరిమితం కావాల్సిన మోటార్ సైకిల్‌పై నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా ఆరుగురు ప్రయాణించడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. సామర్లకోట – పెద్దాపురం ఏడీబీ రోడ్డులో ఓ మోటార్ సైకిల్‌పై ఒక పురుషుడు, ఇద్దరు మహిళలతో పాటు మరో ముగ్గురు చిన్నారులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించారు. అసలే ఈ రోడ్డులో వాహనాల రద్దీ అధికం. ఏమాత్రం బ్రేక్ వేసినా వెనుక ఉన్న వారు జారి కింద పడే ప్రమాదం కూడా ఉంది. అయినప్పటికీ ఇలా బైక్‌పై వెళ్లడమేమిటని పలువురు వ్యాఖ్యానించారు. -
నకిలీ బంగారంతో లక్షల్లో బ్యాంకు రుణం తీసుకున్న మహిళ!
కంబాలచెరువు(తూర్పు గోదావరి): నకిలీ బంగారంతో బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న మహిళ, ఇద్దరు ఎప్రెంజర్లపై స్థానిక వన్ టౌన్, టు టౌన్ పోలీస్ స్టేషన్లలో శుక్రవారం కేసులు నమోదయ్యాయి. ఆయా బ్యాంకు శాఖల మేనేజర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. కొంతమూరుకు చెందిన శనివారపు అనుపమ స్థానిక సాయికృష్ణ థియేటర్ సమీపంలోని ఆర్యాపురం అర్బన్ బ్యాంకు తాడితోట శాఖలో దపధపాలుగా వన్‌గ్రామ్ గోల్డ్ తాకట్టు పెట్టి రూ.7.57 లక్షలు అప్పు తీసుకుంది. అలాగే అదే బ్యాంకుకు చెందిన దానవాయిపేట శాఖలోనూ ఈ ఏడాది ఆగష్టు 8న వన్ గ్రామ్ గోల్డ్ పెట్టి రూ.1.59 లక్షలు రుణం తీసుకుంది. కాగా.. బ్యాంకు ఎంప్రెజర్లతో కలసి అనుపమ నకిలీ బంగారం పెట్టి రుణం తీసుకుందంటూ ఆ బ్యాంకు శాఖల మేనేజర్లకు వాట్సాప్ సందేశాలు వచ్చాయి. దీంతో వారు వెంటనే అనుపమ తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసి పరీక్షించగా నకిలీదిగా తేలింది. దీంతో ఆ మేనేజర్లు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో మహిళ, ఎంప్రెజర్లతో పాటు బ్యాంకు సిబ్బంది చేతివాటం ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదిలా ఉండగా.. ఆ బ్యాంకులో సొమ్ములు లేవంటూ మాజీ చైర్మన్‌గా వ్యవహరించిన వ్యక్తి ఇటీవల ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి బాహాటంగా చెప్పిన విషయం విదితమే. -
భద్రాద్రి రాముడి తలంబ్రాలకు సీమంతం
సాక్షి, గోకవరం(తూర్పుగోదావరి): భద్రాచలం, ఒంటిమిట్టలలో జరిగే శ్రీరాముని కళ్యాణానికి వినియోగించే కోటి తలంబ్రాల పంటకు శుక్రవారం సీమంతం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో పండిస్తున్న ఈ కోటి తలంబ్రాల పంటకు కోరుకొండ శ్రీకృష్ణచైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో సీమంతం జరిపారు. పొట్టదశలో ఉన్న పంటకు గాజులు, రవిక, పండ్లు, పుష్పాలు సమర్పించారు. సీతారామ అష్టోత్తర సహస్రనామార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. ఈ సందర్భంగా కళ్యాణం అప్పారావు మాట్లాడుతూ.. శ్రీరామతత్వం ప్రచారం, కోటి తలంబ్రాల జ్ఞానయజ్ఞంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. 11వ సారి భద్రాచలంకు, 5వ సారి ఒంటిమిట్టకు కోటి తలంబ్రాలు పంపుతుండటం సంతోషంగా ఉందన్నారు. -
పాపికొండలకు చలోచలో
రంపచోడవరం: గోదావరి నదీ జలాల్లో పాపికొండల విహార యాత్రను రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 114 మంది పర్యాటకులతో రెండు బోట్లు ఆదివారం పాపికొండల విహారానికి వెళ్లాయి. ఈ యాత్రను తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మ గండి బోట్ పాయింట్ వద్ద పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి ప్రారంభించారు. మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ.. లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా వేసుకోవాలని పర్యాటకులకు సూచించారు. పర్యాటకుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు 9 కమాండ్ కంట్రోల్ రూముల పర్యవేక్షణలో రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, పర్యాటక శాఖల అనుసంధానంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని విహార యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. శాటిలైట్ సిస్టమ్ ద్వారా బోట్లపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. పర్యాటకుల బోట్లు బయలుదేరడానికి ముందు ఎస్కార్ట్ బోటు వెళ్తుందని చెప్పారు. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా.. వెనుక వచ్చే పర్యాటక బోట్లకు సమాచారమిస్తారని తెలిపారు. ఏపీ టూరిజం వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవాలని, దీనివల్ల పర్యాటక బోట్లలో ఎంతమంది వెళ్తున్నారనే లెక్క పక్కాగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం 11 బోట్లకు అనుమతులిచ్చామని, వీటిలో ఏపీ టూరిజం బోట్లు 2, ప్రైవేట్ బోట్లు 9 ఉన్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్, ఎంపీపీ కుంజం మురళి, జెడ్పీటీసీ సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. గోదావరిపై ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రారంభం రాజమహేంద్రవరం సిటీ: ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరంలో గోదావరి జలాలపై తేలియాడేలా తీర్చిదిద్దిన ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ను పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదివారం ప్రారంభించారు. రెండు స్టీల్ పంటులపై ఏర్పాటు చేసిన ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్లో 95 మంది ప్రయాణించవచ్చు. ఈ రెస్టారెంట్‌కు పద్మావతి ఘాట్ నుంచి వెళ్లవచ్చు. 15 రోజుల్లో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. వివాహ విందులు, పుట్టిన రోజు, కిట్టీ పార్టీల వంటివి నిర్వహించుకునేందుకు వీలుగా దీనిని అధికారులు సిద్ధం చేయనున్నారు. కార్యక్రమంలో ఏపీటీడీసీ చైర్మన్ ఎ.వరప్రసాద్‌రెడ్డి, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ తదితరులు పాల్గొన్నారు. -
కాలువలోకి దూసుకెళ్లిన కారు..
తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు సమీపంలో ఆదివారం కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం జరగ్గానే కారులో ప్రయాణిస్తున్న వారు వెంటనే తేరుకుని బయటకు వచ్చేశారు. ప్రయాణికులకు మాత్రం స్వల్పగాయాలు అయ్యాయి. కాలువలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు తెలిపారు. ఆ తర్వాత గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చదవండి: ‘ఉద్యోగులంతా తెలుగు అకాడమీలో అందుబాటులో ఉండాలి’ -
‘రాజమండ్రిలో పవన్ కల్యాణ్ ప్రవర్తన చూసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంది’
సాక్షి, తూర్పు గోదావరి: రాజమండ్రిలో పవన్ కల్యాణ్ ప్రవర్తన చూసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుందని వైఎస్సార్సీపీ నేత పండుల రవీంద్రబాబు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కులాల పై మాట్లాడే వారిని సభ్య సమాజంలో తిరగనీయకూడదన్నారు. దళితులపై ఆశలు మానుకోండని, కులాలపై రాజకీయాలు చేయడం ఆపండంటూ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్మమోహన్‌రెడ్డిని దళితులు నమ్మారు. అందుకే ఆయన వారికి పెద్ద పీఠ వేశారని తెలిపారు. రాష్ట్రంలో రోడ్డు సమస్యే మీకు కనిపించిందా? అంతకు ముందు రెండు సార్లు వచ్చిన కోవిడ్ సమస్య కనిపించలేదా? రోడ్ల గురించి ఇంతగా తపించిపోతున్న నువ్వు కోవిడ్‌తో చనిపోయినా ఏ ఒక్క కుటుంబాన్నైనా కనీసం పరామర్శించావా? అంటూ ప్రశ్నించారు. తల.. గెడ్డం పెంచుకోవడం వల్ల కార్ల్ మార్క్ అవ్వరని పవన్‌పై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఒంటరిగా పోటీ చేయాలి: బాలినేని -
East Godavari: టిక్‌టాక్ దంపతుల ఘరానా మోసం.. 44 లక్షలు వసూలు
తూర్పు గోదావరి: తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో టిక్‌టాక్‌తో ఫెమస్ అయిన ఘరానా దంపతుల ఉదంతం వెలుగులోకి వచ్చింది. కాగా, నిందితులు గోకవరానికి చెందిన గౌరిశంకర్ అనే వ్యక్తి కుమార్తెను విదేశాలకు ఉన్నత చదువుల కోసం పంపిస్తామని చెప్పి మామిడాల శ్రీధర్, చెరుకుమిల్లి గాయత్రీలు 44 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత ఏవో మాయమాటలు చెబుతూ మాటమార్చారు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కోరారు. దీంతో కేటుగాళ్లు ఇద్దరు తమ సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారు. కాగా, బాధితులు ఇద్దరు నిందితులపై గోకవరం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హజరుపర్చినట్లు తెలిపారు. కోర్టు నిందితులకు 15 రోజులపాటు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: భర్తకు నిప్పంటించి.. బండతో బాదిన భార్య.. కారణం ఏంటంటే.. -
వెంకటాపురంలో ఆమిర్ ఖాన్ సందడి
కొత్తపల్లి/తూర్పు గోదావరి: బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ మండలంలోని కొమరగిరి శివారు వెంకటరాయపురంలో శనివారం సందడి చేశారు. అమీర్‌ఖాన్ నటిస్తున్న లాల్‌సింగ్ చద్దా చిత్ర షూటింగ్ వెంకటరాయపురంలో జరుగుతోంది. రాధికాచౌదరితో కలిసి అమీర్‌ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అద్వైక్చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. అమీర్‌ఖాన్‌తో పాటు కరీనాకపూర్, తెలుగు హీరో అక్కినేని నాగచైతన్య కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. హీరో అమీర్‌ఖాన్‌ను చూసేందుకు ఆయన అభిమానులు ఎగబడ్డారు. ఆయనతో కలిసి సెల్ఫీలు దిగారు. -
అంతర్జాతీయ క్రీడా వేదికపై తూగో జిల్లా ఆదివాసి బిడ్డ
కూనవరం(తూగో జిల్లా): కృషి ఉంటే మనుషులు రుషులవుతారు..మహాపురుషులవుతారు..అడవిరాముడు చిత్రం కోసం వేటూరి రాసిన ఈ గీతం ఓ స్ఫూర్తి మంత్రం..నిజమే..కొండ కోనల్లో కట్టెలమ్ముకునే ఇంట పుట్టిన ఓ అడవిబిడ్డ ఎంతో కష్టపడింది. పరుగులో రాణించేందుకు అహరహం శ్రమించింది. ఇప్పుడు కెన్యాలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. పట్టుదల..కఠోర సాధనతో ఈ బాలిక విజయపథాన రివ్వున దూసుకెళుతోంది. కుటుంబ సభ్యులతో రజిత కుగ్రామం నుంచి.. కూనవరం మండలం పోచవరం పంచాయతీ పరిధిలోని ఆదివాసీ కుగ్రామం రామచంద్రాపురం. చుట్టూ దట్టమైన అడవి తప్ప మరేమీ కనిపించదు. 35 ఏళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్ నుంచి ఇక్కడికి వలసవచ్చింది మారయ్య కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని దయనీయ స్థితి. కుంజా మారయ్య..భద్రమ్మ దంపతులకు ముగ్గురు మగ పిల్లలు ..ఇద్దరు ఆడపిల్లలు. ఇందులో ఆఖరి బిడ్డ రజిత. భర్త చనిపోయాక భద్రమ్మ అడవికి వెళ్లి కట్టెలు సేకరించడం ద్వారా పిల్లల్ని పోషిస్తోంది. రజిత రోజూ చింతూరు మండలం కాటుకపల్లి వెళ్లి చదువుకునేది. 1 నుంచి 8వ తరగతి వరకు అక్కడ చదివింది. సెలవులు ఇచ్చినప్పుడు తల్లి వెంట కట్టెలు తెచ్చి చేదోడు వాదోడుగా నిలిచేది. పరుగులో తొలినుంచి ఈమెలో వేగాన్ని పెద్దన్న జోగయ్య గమనించాడు. చిన్నా చితకా పరుగుపందెం పోటీల్లో పాల్గొని ముందు నిలిచేది. ఆగని పరుగు.. నెల్లూరు ఆశ్రమ పాఠశాలలో సీటు రావడంతో రజిత 9, 10 తరగతులు చదివింది. అప్పుడే నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలో వంశీసాయి కిరణ్ ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ శిక్షణ పొందింది. మంగళగిరిలో ఇంటర్మీడియెట్ చదువుతూ గుంటూరులో శాప్ ద్వారా గురువులు కృష్ణమోహన్, మైకె రసూల్ వద్ద అథ్లెటిక్స్ శిక్షణ తీసుకుంది. 2019లో అసోంలో నిర్వహించిన జాతీయ ఖేలిండియా అథ్లెటిక్ పోటీల్లో 400 మీటర్లు పరుగు విభాగంలో విశేష ప్రతిభ కనబర్చింది. ఈ నెల 17న కెన్యాలోని నైరోబిలో జరిగే అండర్–20 జూనియర్ అథ్లెటిక్ పోటీలకు ఎంపికైంది. తగిన ప్రోత్సాహముంటే దేశ కీర్తిని చాటేలా ప్రతిభ నిరూపించుకుంటానని రజిత ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. -
హ్యాపీ బర్త్‌డే అన్నాడు.. నమ్మి వెళితే యువతికి నరకం చూపించాడు
సాక్షి,తూర్పుగోదావరి (కరప): కామంతో కన్నుమిన్ను కానని ఓ యువకుడు యువతిపై లైంగిక దాడికి యత్నం చేసి, విచక్షణారహితంగా గాయపరచిన ఘటన కరప మండలం వేళంగిలో చోటుచేసుకుంది. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కరప ఎస్సై డి.రమేష్‌బాబు, స్థానికుల కథనం ప్రకారం.. వేళంగికి చెందిన యువతి ఇంటర్మీడియెట్ చదివింది. తల్లిదండ్రులతో కలిసి ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తోంది. ఈ నెల 13 రాత్రి ఆమె ఇంటి పక్కనే ఉంటున్న విత్తనాల రమేష్ తన మొబైల్ ఫోన్ నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. దీనికి కృతజ్ఞతలు తెలిపిన ఆ యువతి.. కొద్దిసేపటికి రూ.2 వేలు అప్పుగా ఇస్తే, నాలుగు రోజుల్లో ఇచ్చేస్తానని అడిగింది. ఇదే అదునుగా నగదు ఇస్తానని నమ్మించిన రమేష్.. ఇంటి పక్కన ఉన్న సందులోకి ఆమెను రమ్మ న్నాడు. తెలిసిన వ్యక్తే కదా అని డబ్బుల కోసం అక్కడకు వెళ్లగా అతడు ఆ యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ప్రతిఘటించడంతో ఆగ్రహించిన రమేష్.. ఆ యువతి గొంతు పట్టుకుని గోడకు గుద్దించాడు. విచక్షణా రహితంగా కొట్టి గాయపర్చాడు. భయపడిన ఆ యువతి కేకలు వేయడంతో ఆమె గొంతు, ఎడమ చేతిని కొరికి గాయపరిచాడు. మెడ పట్టుకొని ముఖా న్ని గోడకు బలంగా కొట్టి పరారయ్యాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు, బంధువులకు బాధితురాలు తెలిపింది. ఆమెను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి కుడి కన్ను పూర్తిగా దెబ్బతింది. అపస్మారక స్థితిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై నిర్భయ చట్టం, ఇతర సెక్షన్లతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రమేష్‌బాబు వివరించారు. -
వదిలేశారా కన్నా! నీ కోసం మేమున్నాం
సాక్షి,ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ఆ కన్న తల్లికి ఏం కష్టమొచ్చిందో.. లేక ఇంకేదైనా కారణమో తెలీదు కానీ.. భూమిపై పడిన కాసేపటికే ఆ పసికందు కన్నవారికి దూరమై.. సజీవంగా.. ఓ అట్టపెట్టెలో.. శ్మశానవాటిక వద్ద కనిపించడం కలకలం రేపింది. ఏడో నెలలోనే పుట్టినప్పటికీ ఆయుర్దాయం గట్టిదేమో.. పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ఆ పసికందును అక్కున చేర్చుకున్నారు. ఆ చిన్నారి ఆయువును నిలిపేందుకు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు 108 నియోనేటల్ అంబులెన్స్ సిబ్బంది ఆదివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి... గుర్తు తెలియని ఓ గర్భిణి నాలుగు రోజుల క్రితం ఏడో నెలలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె తరఫు వారు ఆ బిడ్డ చనిపోయాడనుకున్నారో లేక మరేవైనా కారణాలతో వద్దనుకున్నారో కానీ.. రాజమహేంద్రవరం కోటిలింగాల రేవు శ్మశానవాటిక వద్ద బాక్స్‌లో పెట్టి వదిలేశారు. ఆ పెట్టెలోనే సజీవంగా ఉన్న ఆ పసికందు క్యార్క్యార్ మంటూ ఏడుస్తూండటం వినిపించి.. అక్కడే ఉన్న ఓ వ్యాన్ డ్రైవర్ శివ దగ్గరకు వెళ్లి చూశాడు. అట్టపెట్టెలో అనారోగ్యంతో ఉన్న పసికందును గమనించాడు. విషయం తెలియడంతో స్థానిక మల్లికార్జున నగర్‌కు చెందిన తుంపాటి వెంకటేష్, దేవి దంపతులు ఆ పసిబిడ్డను అక్కున చేర్చుకున్నారు. తమకు పిల్లలు లేకపోవడంతో దేవుడే ఆ బిడ్డను ఇచ్చాడని భావించారు. పసికందు అస్వస్థతకు గురవడంతో తొలుత ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో శనివారం సాయంత్రం వెంకటేష్ దంపతులు ఆ బిడ్డను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలోని ప్రత్యేక చిన్న పిల్లల సంరక్షణ యూనిట్‌కు తీసుకువచ్చారు. అయితే శిశువు ఆరోగ్యం బాగా లేకపోవడంతో కొవ్వూరులోని 108 నియోనేటల్ అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఆ అంబులెన్స్ ఈఎంటీ శాంతకుమార్, పైలట్ బుల్లిరాజు వెంటనే ఇక్కడకు చేరుకుని, ఆ పసికందుకు అత్యవసర వైద్యం చేశారు. మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు సురక్షితంగా తరలించారు. ఐసీడీఎస్ అధికారులకు, పశ్చిమ గోదావరి జిల్లా 108 జిల్లా మేనేజర్ కె.గణేష్‌కు దీనిపై సమాచారం అందించారు. ఏడో నెలలో పుట్టిన పసికందును నిర్దయగా బాక్సులో పెట్టి శ్మశానవాటిక వద్ద వదిలివేయడం చూపరులను కలచివేసింది. ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఉన్న ఆ పసికందును తన భార్య దేవి దగ్గరుండి చూసుకుంటోందని ఆమె భర్త వెంకటేష్ తెలిపారు. పసికందు ప్రాణాలతో ఉంటే తమకు అదే పదివేలని ఆయనన్నారు. -
ఎస్బీఐ బ్రాంచ్‌లో భారీ కుంభకోణం
సాక్షి, తూర్పుగోదావరి : సఖినేటిపల్లి ఎస్బీఐ బ్రాంచ్‌లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. బంగారం రుణాలపై సుమారు అయిదు కోట్ల వరకూ స్వాహా చేసినట్లు సమాచారం అందింది. అదే బ్యాంకులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఈ భారీ స్కాంకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇతనికి మరో ఉద్యోగి సహకరించినట్లు కూడా సమాచారం. అయితే ఖాతాదారులు బంగారం విడిపించుకునే క్రమంలో సదరు ఉద్యోగి జాప్యం చేయడంతో బండారం బయట పడింది. దీనిపై స్పందించిన బ్రాంచ్ మేనేజర్.. ముగ్గురు బ్యాంకు ఉద్యోగులపై చర్యలు తీసుకోనున్నట్లు, స్కాంపై విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. -
ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు
కాకినాడ రూరల్: తమ వద్ద రూ.2వేల నోట్లు ఉన్నాయని, రూ.500 నోట్లు ఇస్తే రూ.90 లక్షలకు రూ.కోటి ఇస్తామని నమ్మబలికి ఛీటింగ్‌కు ప్రయత్నించిన ముఠాను బాధితుడి ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. సర్పవరం సీఐ గోవిందరాజు ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. కాకినాడ రూరల్ వలసపాకల గ్రామంలోని గంగరాజునగర్ రోడ్డు నంబరు 7కు చెందిన చలగళ్ళ నాగప్రసాద్‌ను ఫోన్లో విశాఖపట్నానికి చెందిన నలుగురు, కాకినాడ కర్ణంగారి వీధికి చెందిన ఒకరు కలిపి చీటింగ్ చేసేందుకు ప్రయత్నించారు. తొలుత ఒక వీడియోలో రూ.2వేల నోట్లతో కూడిన అట్టపెట్టెలు భారీగా ఉన్నట్టు చూపించి, ఆ తరువాత ఫోన్ ద్వారా రూ.2వేల నోట్లు ఎక్కువగా ఉన్నాయని, రూ.500 నోట్లు తమకు కావాలని నమ్మబలికారు. ఇందుకుగాను రూ.90 లక్షల రూ.5 వందల నోట్లకు రూ.కోటి (2వేల నోట్లు) అందిస్తామని నమ్మించారు. సోమవారం సాయంత్రం నాగమల్లిజంక్షన్ వద్దకు రావాలని కోరడంతో అనుమానం వచ్చిన నాగప్రసాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన సమాచారం మేరకు మాటు వేసిన పోలీసులు విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీకి చెందిన భమిడిపాటి వెంకట సుధాకర్, విశాఖపట్నం పెద్దజాలరిపేటకు చెందిన తాటికాయల రాజా రవిశేఖర్, విశాఖపట్నం మల్కాపురానికి చెందిన కామాక నరసింగరావు, విశాఖపట్నానికి చెందిన కోడి కొండబాబు, కాకినాడ కర్ణంగారి జంక్షన్‌కు చెందిన నిడదవోలు సూర్య సుబ్రహ్మశర్మలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎస్సై ఎం.నాగేశ్వరరావు కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదం.. తర్వాత ముదిరిన వివాదం
సాక్షి, రాజమహేంద్రవరం: పోలీసులు తనను హింసించడమే కాకుండా గుండు గీయించారని ప్రసాద్ అనే యువకుడు ఆరోపించాడు. తనపై దౌర్జన్యం చేసిన ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశాడు. వివరాలు.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ముని కూడలిలో బైక్ వెళుతున్న ప్రసాద్‌ను ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాదంపై లారీ డ్రైవర్‌కు, ప్రసాద్‌కు మధ్య వాగ్వాదం చెలరేగింది. రాజీ చేసేందుకు మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి సైతం ప్రయత్నించగా వివాదం ఇంకాస్తా ముదిరింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ప్రసాద్‌పై సీతానగరం పోలీస్ స్టేషన్లో మాజీ సర్పంచ్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తనను తీవ్రంగా కొట్టి గుండు గీయించారని ప్రసాద్ ఆరోపిస్తున్నాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు ఎస్ఐ ఫిరోజ్‌తో పాటు కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
కోవిడ్ పరీక్షలు మరింత వేగంగా చేయనున్న ఏపీ
సాక్షి,తూర్పు గోదావరి: కాకినాడ హర్బర్ పేటలో ఆర్టీసీ సంజీవని కోవిడ్ మొబైల్ టెస్టింగ్ సేవలను బుధవారం ప్రారంభించారు. ఎంపీ వంగా గీతా,ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఈ సేవలను ప్రారంభించారు. దీని ద్వారా 200 మంది మత్స్యకారులకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఒకేసారి పది మందికి చొప్పున ముక్కు నుంచి శ్వాబ్‌ను సేకరిస్తున్నారు. వీటి ద్వారా ఫలితాలను అరగంటలో తెలుసుకునే అవకాశం ఉంది. ఈ మొబైల్ టెస్టింగ్ సెంటర్ల ద్వారా రోజుకు 500లకు పైగా పరీక్షలు చేయవచ్చు.ఈ రోజు మూడు సంజీవని కోవిడ్ మొబైల్ టెస్టింగ్ వాహనాలు జిల్లాకు చేరుకున్నాయి. రాజమండ్రి, కాకినాడ,అమలాపురం లో పరీక్షలు ప్రారంభమయ్యాయి. వీటితో పాటు త్వరలో మరో రెండు సంజీవని వాహనాలు జిల్లాకు చేరుకోనున్నాయి. చదవండి: ఆ ల్యాబ్‌లో నెగెటివ్.. ప్రభుత్వ టెస్ట్‌ల్లో పాజిటివ్ -
వారికి కూడా కాపునేస్తం తరహా పథకం
సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘వైఎస్ఆర్ కాపు నేస్తం’ ద్వారా కాపులకు ఆర్థిక సహయం అందజేయడం ఆనందకరమని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. బుధవారం ఆయన ఎంపీ వంగా గీతతో కలిసి కాకినాడలో మీడియాతో మాట్లాడారు. ‘కాపు సోదరీమణులు ఇళ్ళు దాటి బయట ఎటువంటి పనులకు వెళ్ళరు. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం . ప్రస్తుత పరిస్ధితుల వల్ల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఒక భరోసా ఇవ్వాలని సీఎం జగన్ ముందు చూపుతో చేసిన నిర్ణయానికి ధన్యవాదాలు. వచ్చే నెలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరీమణులకు కూడా ఇటువంటి పథకం అమలు అవుతుంది. ఇప్పటికే కేబినెట్ తీర్మానం కూడా అయిపోయింది. త్వరలోనే ఈ పథకం ప్రారంభించే తేది ఖరారు అవుతుంది. దేశంలోనే బడుగు, బలహీన, గిరిజన, మైనార్టీలకు సంబంధించిన ఒక గొప్ప పధకాన్ని సీఎం జగన్ అమలు చేయబోతున్నారు’ అని అన్నారు. (కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డ్ ) కాకినాడ ఎంపీ వంగా గీతా మాట్లాడుతూ...‘కాపు కుటుంబాల తరపున సీఎం జగన్‌కు ధన్యవాదాలు. ఆర్ధిక ఇబ్బందులు, కరోనా కష్టాలు ఉన్నప్పటికీ ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా సీఎం జగన్ అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వాలు అర్హత ఉన్న లబ్ధిదారులను తగ్గించేందుకు ప్రయత్నించేవి. కానీ సీఎం జగన్ పాలనలో అర్హులందరికి సంక్షేమ పథకాలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. కాపు, తెలగ, ఒంటరి కులాల్లో మహిళలకు మానిటరీ బెనిఫిట్ అందించడంతో పాటుగా అదనంగా అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, రైతు భరోసా పథకాల ద్వారా సహాయం చేస్తున్నారు. మహిళలకు అందించే ప్రతి రూపాయి కూడా తమ కుటుంబ సంక్షేమానికే ఖర్చు పెడతారు’ అని ఆమె అన్నారు. ('వైఎస్సార్ కాపు నేస్తం' ప్రారంభం) -
ఆ సమస్య పునరావృతం కాకూడదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా కాళ్లవాపు వ్యాధి ఘటనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో అధికారులను ఆరా తీశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కాళ్లవాపు వ్యాధి మళ్లీ విస్తరిస్తుండటంపై ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే బాధితులకు సరైన వైద్యచికిత్స అందించాలని, వారిని ఆదుకోవాలని సీఎం ఆదేశించారు. తక్షణమే ఉపముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల నానిని, అధికారులను బాధితులను పరామర్శించాలని సీఎం జగన్ ఆదేశించారు. అదేవిధంగా దీనిపై ఒక సమగ్రమైన ఆలోచన చేయాలని, మళ్లీ ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్న అంశంపై ప్రణాళిక తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వెంటనే వైద్య బృందాలను పంపి చికిత్స అందించాలని కూడా సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు. (‘సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు’) మరోవైపు న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్లను వారి కార్పస్ నిధికే అప్పంగించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ నిధుల నిర్వహణను వారికే అప్పగించాలని అధికారులకు స్పష్టం చేశారు. లా నేస్తం పేరిట ఇప్పటికే న్యాయవాదులను తమ ప్రభుత్వం ఆదుకుంటోందని, ఇప్పుడు బదిలీ చేసిన నిధి ద్వారా మరింత ప్రయోజనం పొందుతారని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. (నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఎంపీ సవాల్) -
పసలపూడిలో దర్శకుడు వంశీ సందడి..
రాయవరం: తన దర్శకత్వంలో త్వరలోనే సినిమా రూపుదిద్దుకోనున్నట్లు ప్రముఖ కథా రచయిత, సినీ దర్శకుడు వంశీ తెలిపారు. రాయవరం మండలం పసలపూడి స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫిబ్రవరిలో సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశముందన్నారు. ఫ్యామిలీలో జరిగే సస్పెన్స్ కథాంశంగా రూపుదిద్దుకోనుందని అన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందన్నారు. తన చుట్టూ జరిగిన సంఘటనలనే కథా వస్తువులుగా మలచుకుని ‘మా పసలపూడి కథలు’ రాశానన్నారు. అలాగే తాను చూసిన మనుషులను పాత్రలుగా మలిచానని, ఇటీవల సినిమా దర్శకత్వంలో విరామం వచ్చిన విషయం వాస్తవం అన్నారు. తొలిసినిమా మంచు పల్లకితో ప్రారంభించగా.. ఇప్పటి వరకు 26 సినిమాలకు దర్శకత్వం వహించానని, వేమూరి సత్యనారాయణ ప్రోత్సాహంతో 22వ ఏటనే సినిమా దర్శకుడిగా మారినట్టు తెలిపారు. అంతకు ముందు దర్శకుడు వి.మధుసూదనరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా మల్లెపూవు, జడ్జిగారి కోడలు, రాజారమేష్ సినిమాలకు పనిచేశానని అన్నారు. ఉల్లాసంగా గడిపిన వంశీ దర్శకుడు వంశీ పసలపూడిలో చిన్ననాటి మిత్రులతో కొద్దిసేపు గడిపారు. ఆయన చిన్నప్పుడు తిరిగిన ప్రాంతాలను సందర్శించి, వైఎస్సార్ పార్కు వద్ద మిత్రులతో పిచ్చాపాటీ మాట్లాడారు. చిన్ననాటి జ్ఞాపకాలను మిత్రులు, వంశీతో నెమరు వేసుకున్నారు. వైఎస్సార్ పార్కులో ఉన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ పోతంశెట్టి సాయిరామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వంశీని మిత్రులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆదర్శ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ప్రగతి రామారెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు చింతా సుబ్బారెడ్డి, కర్రి సుముద్రారెడ్డి, బొడబళ్ల అప్పలస్వామి, బాలు, కర్రి శ్రీనివాసరెడ్డి, నల్లమిల్లి సుబ్బారెడ్డి, కొవ్వూరి భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు నల్లమిల్లోరిపాలెం పుస్తకావిష్కరణ వంశీ ‘నల్లమిల్లోరిపాలెం’ కథలు పుస్తకావిష్కరణ ఆదివారం కాకినాడలో జరుగుతున్నట్లు మాజీ ఎంపీపీ, వంశీ మిత్రుడు పోతంశెట్టి సాయిరామ్మోహన్‌రెడ్డి తెలిపారు. కాకినాడ ఆదిత్య అకాడమీలో సాయంత్రం ఐదు గంటలకు పద్మాలయా గ్రూపు సంస్థ అధినేత నల్లమిల్లి బుచ్చిరెడ్డి అధ్యక్షతన పుస్తకావిష్కరణ చేపడుతున్నట్లు తెలిపారు. పుస్తకాన్ని ఆదిత్య సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డికి అంకితమిస్తున్నట్లు వంశీ తెలిపారు. -
2న ‘తూర్పు’లో సీఎం జగన్ పర్యటన
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్టోబర్ 2న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. కరపలో గ్రామ సచివాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు సీఎం తాడేపల్లి నుంచి బయలుదేరి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో కరప గ్రామానికి చేరుకుని పైలాన్ ఆవిష్కరించనున్నారు. అనంతరం హైస్కూల్ ప్రాంగణంలో వివిధ స్టాల్స్ సందర్శన అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. సభ అనంతరం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి విశాఖపట్నంలో జరిగే కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కుమారుడు క్రాంతికుమార్ వివాహానికి హాజరవుతారు. తిరిగి రాత్రికి తాడేపల్లి చేరుకోనున్నారు. -
జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం..
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: తుని వద్ద 16 వ నెంబర్ జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. వీఆర్ఎల్ పార్సిల్ సర్వీస్‌కు చెందిన లారీ అగ్నికి ఆహుతైంది. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. -
ఆ రాత్రి ఏం జరిగింది?
సాక్షి, దేవరపల్లి(తూర్పు గోదావరి) : రాజమహేంద్రవరానికి చెందిన పారిశ్రామిక వేత్త ఇరన్యాకుల వెంకటరమణ(56) దేవరపల్లి మండలం గౌరీపట్నం వద్ద అనుమానాస్పదంగా మృతిచెందారు. బుధవారం ఉదయం వీఆర్వో ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసుల కథకం ప్రకారం రాజమహేంద్రవరం ఇస్కాన్ టెంపుల్ ప్రాంతానికి చెందిన పారిశ్రామిక వేత్త ఇరన్యాకుల వెంకటరమణ దేవరపల్లి మండలం దుద్దుకూరు–గౌరీపట్నం గ్రామాల మధ్య సుమారు నాలుగేళ్ల క్రితం జై సంతోషిమాత పాలీప్యాక్(గ్లాసుల తయారీ) పరిశ్రమను నెలకొల్పారు. ప్రతిరోజూ రాజమహేంద్రవరం నుంచి వెంకటరమణకుమార్ ఇక్కడికి వచ్చి పనులు చూసుకుని రాత్రికి ఇంటికి వెళతారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఈయన ఇంటి నుంచి బయల్దేరి పరిశ్రమ వద్దకు వచ్చారు. కొద్దిసేపు పరిశ్రమ వద్ద ఉండి తిరిగి కారులో బయలుదేరారు. రాత్రి 12 గంటల సమయంలో దేవరపల్లి వైపు నుంచి కారులో వస్తూ దుద్దుకూరు వద్ద రోడ్డు పక్కన గల ఇంటి గోడను ఢీ కొట్టాడు. ఈ శబ్దానికి చుట్టుపక్కల వారు వచ్చి చూడగా వెంకటరమణ స్వల్పగాయాలతో ఉన్నాడు. పురుగు మందు తాగానని, వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని స్థానికులను ఆయన కోరారు. రాజమండ్రి వైపు వెళుతున్న ఓ కారును ఆపి వెంకటరమణను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లమని గ్రామస్తులు కోరారు. అప్పటికే ఆ కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వెంకటరమణను ఆ ముగ్గురు వ్యక్తులు వారి కారులో ఎక్కించుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆ ముగ్గురు తిరిగి దుద్దుకూరు వచ్చి ప్రమాదానికి గురైన కారును తెరిచారు. దీనిపై గ్రామస్తులు ముగ్గురు వ్యక్తులను ప్రశ్నించగా.. వెంకటరమణకుమార్‌ను కొవ్వూరు ఆసుపత్రిలో చేర్పించామని, ఆధార్ కార్డు కారులో ఉందని, తీసుకురమ్మన్నాడని చెప్పి వెళ్లిపోయారు. ఒంటిపై దుస్తులు లేకుండా.. బుధవారం ఉదయం గౌరీపట్నం సెంటర్లో రోడ్డు పక్కన దుస్తులు లేకుండా పురుషుడి మృతదేహం ఉన్నట్టు గ్రామస్తులు గుర్తించి వీఆర్వోకు ఫిర్యాదు చేశారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు ఎస్సై బి.వై.కిరణ్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి చేతికి మూడు బంగారు ఉంగరాలు, మెడలోని బంగారు గొలుసు కనిపించలేదని, అతడి బంధువులు తెలిపారు. మృతుడి భార్య సత్యవతి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. వెంకటరమణకుమార్ మృతిపై అనుమానాలు పారిశ్రామిక వేత్త వెంకటరమణ కుమార్ మృతిపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 11 గంటల సమయంలో రాజమండ్రి నుంచి దేవరపల్లి ఎందుకు వచ్చారు. వెంకటరమణకుమార్ పురుగు మందు తాగానని ఎందుకు చెప్పాడో తేలాల్సి ఉంది. దుద్దుకూరు వద్ద ప్రమాదానికి గురైన సమయంలో వెంకటరమణకుమార్‌ను కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లిన వ్యక్తులు ఎవరు? వారు ఎక్కడికి తీసుకెళ్లారు? రోడ్డు పక్కన దుస్తులు లేకుండా వెంకటరమణకుమార్ మృతదేహం ఎందుకుపడి ఉందో పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. -
నిధులు గాలికి.. నీళ్లు పాతాళానికి
సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి): ఒకవైపు సముద్రం, మరోవైపు గోదావరి... కానీ జిల్లాలో భూగర్బ జలాలు అడుగంటిపోతున్నాయి. సాధారణంగా చుట్టూ నీటి వనరులు ఉండటం వల్ల భూగర్భ జలాలు రీఛార్జ్ కావాలి. కానీ జిల్లాలో పరిస్థితి దయనీయంగా మారుతోంది. భూగర్భ జలాల సంరక్షణ పేరిట నానా హంగామా చేసి, రూ.కోట్లలో ఖర్చు చేసిన గత తెలుగుదేశం పాలకుల చిత్తశుద్ధి లేమితో ఈ పరిస్థితి దాపురించింది. జల సంరక్షణ పేరుతో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్భాటం చేసింది. వందల కోట్లు ఖర్చు పెట్టింది. అయితే, నీటి సంరక్షణ మాటేమో గాని నిధుల భక్షణ మాత్రం ఎక్కువే జరిగింది. ఈ పనులు టీడీపీ నేతలకు కాసులు కురిపించాయే తప్ప జిల్లాలో భూగర్భ జలాలు ఎక్కడా పెరగలేదు సరికదా సొమ్ములు ఖర్చు పెట్టిన కొద్దీ భూగర్భ జలాలు మరింత అడుగంటి పోయాయి. దోపిడీపై చూపించిన శ్రద్ధ భూగర్భ జలాల సంరక్షణపై ఏమాత్రం చూపలేదు. ‘మా జేబులు నిండుతున్నాయి. జల సంరక్షణ ఏమైపోతే మాకేంటి’ అనే ధోరణిలో గాలికొదిలేశారు. ఇప్పుడది ప్రమాదకరంగా తయారైంది. రూ.500 కోట్లకు పైగా ఖర్చు...ఆపై హడావుడి అభివృద్ధికి మూలం జలం అని చెప్పుకుని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జల సంరక్షణ కోసం ఐదేళ్ల కాలంలో రూ.500 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. అనేక రకాల పథకాలు, కార్యక్రమాల పేరుతో పెద్ద ఎత్తున హడావుడి చేశారు. పనులు చేసినట్టు రికార్డుల్లో కూడా చూపించారు. 1000కి పైగా చెరువులు అభివృద్ధి చేసినట్టు గొప్పగా చెప్పారు. కానీ జిల్లాలో భూగర్బ జలాలు ఇసుమంతైనా పెరగలేదు. ఏటా భారీగా తగ్గిపోతూ వస్తున్నాయి. దీంతో చేసిన ఖర్చు, జరిగిన పనులు అక్కరకు రాకుండా పోయాయి. జల సంరక్షణ పనులు చేశాక కూడా భూగర్బ జలాలు మరింత దిగజారిపోయాయి. 2016మే నాటికి 8.98 మీటర్ల లోతులో నీరు ఉండగా, 2017మే నాటికి 9.55మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి. 2018మే నాటికి 9.58మీటర్ల లోతుకు చేరాయి. 2019మే నాటికైతే 10.27మీటర్ల లోతుకు భూగర్బ జలాలు అడుగంటిపోయాయి. జిల్లాలో నీరు చెట్టు కింద చేసిన వ్యయం రూ.250 కోట్లు పంట సంజీవని కింద చేసిన ఖర్చు రూ.20 కోట్లు ఇంకుడు గుంతల కింద చేసిన ఖర్చు రూ.3.08 కోట్లు కాంటూరు ట్రెంచెస్ కింద చేసిన ఖర్చు రూ.30.67లక్షలు రాక్ ఫీల్డ్ డ్యామ్‌లు, చెక్ డ్యామ్‌లు, ఇతరత్రా చేసిన ఖర్చు రూ.200 కోట్ల నేతల ఆస్తులు పెరిగాయి...భూగర్భంలో నీళ్లు తగ్గాయి జల సంరక్షణ పేరుతో పనుల పందేరానికి తెర లేపారు. నామినేటేడ్ ముసుగులో నిధులు దోచి పెట్టారు. నేతలు సిండికేట్‌గా మారి పనులు చేపట్టారు. రికార్డుల్లో అంతా జరిగినట్టు చూపించారు. నిధులు ఎంచక్కా డ్రా చేసేసుకున్నారు. కానీ భూగర్భ జలాలు మాత్రం పెరగలేదు. జిల్లాలో నీరు చెట్టు అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అందరికీ తెలుసు. నేతల మేతకు బాగా పనిచేశాయి. చెరువుల తవ్వకాలు, రిటైనింగ్ వాల్, చెక్‌డ్యామ్‌లు, స్లూయిజ్...ఇలా రకరకాల కాంక్రీట్ పనుల రూపంలో పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేశారు. చెరువు పనుల్లో మట్టి అమ్మకాల ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించారు. ఇక, కాంక్రీటు పనుల విషయానికొస్తే కొన్ని పనులు నాసిరకంగా, మరికొన్ని అసంపూర్తిగా చేపట్టిన దాఖలాలు ఉన్నాయి. కొన్నిచోట్లైతే పనులు చేపట్టకుండానే నిధులు డ్రా చేసిన సందర్భాలు ఉన్నాయి. మరికొన్ని చోట్లైలైతే పాత పనులకే పైపై మెరుగులు దిద్ది బిల్లులు చేసేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇంకుడు గుంతలు, పంట సంజీవని, కాంటూరు ట్రెంచెస్, రాక్‌ఫీల్డ్ డ్యామ్‌లు...తదితర కార్యక్రమాల పేరుతో ఇరిగేషన్, డ్వామా, అటవీ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పనులు చేపట్టారు. వాటికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వీటిలో కూడా దాదాపు అక్రమాలు చోటు చేసుకున్నాయి. లోకాయుక్త, విజిలెన్స్ వరకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. చెప్పాలంటే జల సంరక్షణ పేరుతో నిధులు తినేశారు. దీంతో టీడీపీ నేతల ఆస్తులు గణనీయంగా పెరిగాయి. నీరు చెట్టు పనులు నేతల మేతకు పనికొచ్చాయే తప్ప నీటి మట్టాన్ని పెంచలేకపోయాయి. భవిష్యత్తు భయానకం జిల్లాలో దిగజారిపోతున్న భూగర్బ జలాలు చూస్తుంటే భవిష్యత్తు ఆందోళనకరంగా కన్పిస్తోంది. చిత్తశుద్ధి లేని నేతలు, అవినీతి అక్రమాలతో నిధులు భోంచేసిన పాలకులతో గత ఐదేళ్లుగా చేసిన ఖర్చు వృథా ప్రయాసగానే మిగిలిపోయింది. 2016, 2017కి చూస్తే భూగర్బ జలాల లోతు 0.6 మీటర్ల మేర పెరగగా, 2017, 2018కి చూస్తే 0.03 మీటర్ల లోతు పెరిగింది. 2018, 2019కి చూస్తే 0.69మీటర్ల భూగర్బ జలాలు మరింత అడుగంటిపోయాయి. ఇలా ఏటా భూగర్భ జలాలు లోతుకు వెళ్లిపోతున్నాయి. ఫలితంగా సాగునీరు సంగతి పక్కన పెడితే తాగడానికి గుక్కెడు నీళ్ల కోసం ఇబ్బంది పడే పరిస్థితిలో భవిష్యత్తులో దాపురిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం అప్రమత్తం కావల్సి ఉంది. పాలకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జల సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఆంధ్రా అన్నపూర్ణకు హాని జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఏటా తగ్గిపోతూ వస్తున్న భూగర్భ జలాలు మే 2016లో భూగర్బజలాల లోతు 8.98 మీ. మే 2017లో భూగర్బజలాల లోతు 9.55 మీ. మే 2018లో భూగర్బజలాల లోతు 9.58 మీ. మే 2019లో భూగర్బజలాల లోతు 10.27 మీ. -
‘మా నాన్నే.. నా స్నేహితుడు’
కొత్తపేట(తూర్పు గోదావరి) : భార్య మాట విని తండ్రిని వృద్ధాశ్రమంలో చేర్చకుండా ‘మా నాన్నే నా స్నేహితుడు’ అని అక్కున చేర్చుకున్న కొడుకు ఔన్నత్యంతో రూపొందించిన లఘు చిత్రాన్ని శుక్రవారం విడుదల చేశారు. ఆదివారం ‘ఫాదర్స్ డే’ను పురస్కరించుకుని కొత్తపేటకు చెందిన పెద్దింటి కృష్ణవంశీ తన స్నేహితులు గొర్రెల సాయిమణికంఠ, కుంచెనపల్లి ఆదిత్య, చోడపనీడి ఏసురత్నం తదితరులతో కలిసి ‘నాన్నే నా స్నేహితుడు’ టైటిల్‌తో లఘు చిత్రాన్ని చిత్రీకరించారు. తండ్రి తనను చిన్న వయసు నుంచీ ఎంతో అల్లారుముద్దుగా పెంచి, పెద్ద చేసి, విద్యాబుద్ధులు చెప్పించి, ఒక ఉద్యోగంలో చేర్చి, పెళ్లి చేస్తే.. వచ్చిన భార్య ‘నీ తండ్రి ఇంట్లో ఉంటే నేను మా పుట్టింటికి వెళ్లిపోతాన’ని చెప్పి వెళ్లిపోతుంది దానితో తండ్రి కోసం ఆ భార్యకు విడాకులిచ్చేందుకు సిద్ధపడతాడు. ఈ విషయం తెలిసిన ఆ కొడుకు స్నేహితులు ‘తండ్రి కోసం భార్యకు విడాకులు ఇవ్వడం ఏమిటి? మీ నాన్ననే వృద్ధాశ్రమంలో చేర్చవచ్చు కదా!’ అని సలహా ఇస్తారు. ‘ఈ సలహా ఇవ్వడానికా మీరు ఇక్కడికి వచ్చింది? పొండి మీరు నా స్నేహితులే కాదు. 20 ఏళ్ల మీ స్నేహం కన్నా, నా భార్యతో ఉన్న ఏడాది బంధం కన్నా 30 ఏళ్లు పెంచిన మా నాన్నే నాకు ముఖ్యం. ‘మా నాన్నే నా మొదటి స్నేహితుడు’’ అని చెబుతాడు. ఆ కొడుకు – స్నేహితుల సంభాషణ తెలుసుకున్న కోడలుకి జ్ఞానో దయం కలిగి, పశ్చాత్తాప పడి మామ గారిని తండ్రిగా చూసుకుంటానని కాపురానికి వస్తుంది. ఆ భార్యాభర్తలు ఇద్దరూ తండ్రిని అక్కున చేర్చుకున్న కథాంశంగా తీసుకుని ఈ లఘుచిత్రాన్ని తీసినట్టు దర్శకుడు కృష్ణవంశీ తెలిపారు. ఈ మార్పు ప్రతి కొడుకు, కోడలిలో రావాలన్న మా చిరు ప్రయత్నమే ఈ లఘు చిత్రమని ఆయన తెలిపారు. -
కష్టాలు భరించలేక భర్తను కడతేర్చిన భార్య
గంగవరం (తూర్పు గోదావరి) : మద్యం తాగి భార్యాబిడ్డలను వేధిస్తున్న భర్త హత్యకు గురైన సంఘటన గంగవరంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటన గురువారం సాయంత్రం జరగగా శుక్రవారం పోలీసులకు సమాచారం అందింది. సంఘటన వివరాలను రంపచోడవరం ఏఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ స్థానిక విలేకర్లకు శుక్రవారం సాయంత్రం వివరించారు. పాత గంగవరం గ్రామానికి చెందిన కంగల కృష్ణమూర్తి దొర (40)అనే వ్యక్తి రోజూ మద్యం సేవించి భార్యబిడ్డలను హింసిస్తున్నాడన్నారు. గురువారం సాయంత్రం ఐదుగంటల సమయంలో బాగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన కృష్ణమూర్తిదొర భార్య పిల్లలతో ఘర్షణకు దిగాడన్నారు. మద్యం మత్తులో ఉన్న కృష్ణమూర్తిదొర భార్య వరలక్ష్మి మధ్య తీవ్ర ఘర్షణకు దిగడంతో తోపులాట జరిగిందన్నారు. ఈ సమయంలో కృష్ణమూర్తిదొర మెడలో ఉన్న తువాళ్లను భార్య గట్టిగా తిప్పేయడంతో ఊపిరాడక కృష్ణమూర్తి మృతి చెందినట్టు ఏఎస్పీ వివరించారు. ప్రాథమిక సమాచారం మేరకు హత్య కేసుగా నమోదు చేశామని ఏఎస్పీ వివరించారు. హత్యా స్థలాన్ని ఏఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్, సీఐ గౌరీశంకర్ పరిశీలించి విచారణ చేశారు. అడ్డతీగల సీఐ గౌరీశంకర్ మాట్లాడుతూ గంగవరం వీఆర్వో ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేశామన్నారు. ఈ కేసును రంపచోడవరం ఏఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అడ్డతీగల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు సీఐ వివరించారు. ఈ సంఘటనతో కృష్ణమూర్తి దొర ఇద్దరు బిడ్డలు అనాథలుగా మిగిలారు. కంగల అరవింద్ టెన్త్ పాస్ కాగా, కుమార్తె కంగల అనూష 8వ తరగతి అభ్యసిస్తోంది. వీరిద్దరూ రంపచోడవరం గురుకుల పాఠశాలల్లోనే చదువుతున్నారు. ఈ ఘటనపై బంధువులు, గ్రామస్తులు ఎవ్వరూ నోరువిప్పడం లేదు. -
టీడీపీ కంచుకోటకు బీటలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉంటూ వస్తున్న జిల్లాలో పార్టీ ఈ స్థాయిలో పతనం చెందడానికి కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు తెలుగుదేశం నాయకులు. గత ఎన్నికల్లో మొత్తం స్థానాలను కట్టబెట్టిన జిల్లా ఈసారి రెండు స్థానాలకు పరిమితం చేసింది. 2014 ఎన్నికల్లో వచ్చిన ఘన విజయాన్ని సద్వినియోగం చేసుకోకుండా గెలిపించిన ప్రజలపైనే పెత్తనం చేశారు టీడీపీ నాయకులు. జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో వారు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. ప్రజాప్రతినిధులైతే ఇసుక, మట్టి, నీరు ఏదీ వదలలేదు. వందల కోట్లు దోచేశారు. ఉచిత ఇసుక పాలసీని అడ్డం పెట్టుకుని జి ల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు శతకోటీశ్వరులుగా మారారు. వీరందరికీ ప్రజలు గుణపాఠం చెప్పారు. భారీ మెజారి టీలతో ఓడించి ఇంట్లో కూర్చోపెట్టారు. పితాని.. ఇసుక దందా ఇసుక దందాకు ఆధ్యుడిగా ఉన్న పితాని సత్యనారాయణ ఆచంట నుంచి 2009, 2014లో గెలిచిన తర్వాత కూడా ఇసుక దందాను కొనసాగించారు. మంత్రిగా ఉంటూనే ఇసుక మాఫియాలో ప్రముఖపాత్ర పోషించారు. ఆయన కనుసన్నల్లోనే నియోజకవర్గంలో ఇసుక దోపిడీ జరిగింది. కులబలంతో రాజకీయం చేస్తూ వచ్చిన పితానికి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెక్ పెట్టారు. ఆయన కుల ఓట్లను గండికొట్టారు. 15 వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు. నిడదవోలుపై ‘శేష’ పడగ నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషరావు ఇసుకను అడ్డం పెట్టుకుని వందల కోట్లు సంపాదించారు. 2009లో తనకు అప్పులు ఉన్నాయని చూపించిన శేషారావు పదేళ్లు గడిచేటప్పటికి వెయ్యికోట్లకు పైగా సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీలో కూడా ఈ సీటు కోసం పోటీ పెరిగిపోయింది. అన్నింటిని తట్టుకుని సీటు సంపాదించుకున్నా 20 వేల పైచిలుకు తేడాతో జనం ఓడించి ఇంట్లో కూర్చోపెట్టారు. కొవ్వూరు.. అవినీతి ఏరు కొవ్వూరు విషయానికి వస్తే మంత్రి కేఎస్ జవహర్ సాధారణ టీచర్ నుంచి వందల కోట్లకు ఎదిగారు. ఆయన ఇసుక నుంచి పేకాట క్లబ్‌ల వరకూ దేనిని వదలలేదు. వందల కోట్లు సంపాదించడంతో సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆఖరికి ఆయనను జిల్లా నుంచి తప్పించి సొంత జిల్లాలోని తిరువూరు సీటును కేటాయించారు. అక్కడ కూడా భారీ తేడాతో జవహర్ ఓటమి చవిచూశారు. కొవ్వూరుకు విశాఖ జిల్లా నుంచి స్థానికేతరురాలు పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను తీసుకువచ్చి నిలబెట్టినా 25 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. పోలవరం.. సిండికేట్లపరం రిజర్వుడు నియోజకవర్గం అయిన పోలవరం నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన మొడియం శ్రీనివాస్ కూడా ఇసుక సిండికేట్లపై కోట్ల రూపాయలు ఆర్జించారు. పోలవరం భూసేకరణ, అర్ అండ్ ఆర్‌ను అడ్డం పెట్టుకుని కోట్లకు పడగలెత్తారు. ఇక్కడ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా పక్కన పెట్టినా అదే ఇసుక సిండికేట్లకు చెందిన బొరగం శ్రీని వాస్‌ను నిలబెట్టడంతో ప్రజలు 42 వేల ఓట్ల తేడాతో అతడిని చిత్తుగా ఓడించారు. దెందులూరులో రౌడీరాజ్యం తమ్మిలేరు ఇసుకతో పాటు పోలవరం కుడికాల్వ గట్టును అమ్మేసుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు కూడా ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇసుక అక్రమాలను అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిపై దాడికి దిగిన ప్రభాకర్‌ను చంద్రబాబునాయుడు వెనకేసుకురావడంతో అతని దోపిడీకి అంతులేకుండా పోయింది. పోలవరం కుడికాల్వ గట్టును పూర్తిగా కొల్లగొట్టారు. మరోవైపు కొల్లేరులో అక్రమ చెరువులు తవ్వించి వాటిని కూడా ఆక్రమించారు. దీంతో అతడిని ప్రజలు 17 వేలకు పైగా ఓట్ల తేడాతో ఇంటిబాట పట్టించారు. ఉంగుటూరు.. గన్నిని ఓడించారు తన నియోజకవర్గ పరిధిలో ఉన్న 21 కిలోమీటర్ల మేర ఉన్న పోలవరం కుడికాల్వ గట్టును తవ్వేసి, నీరు– చెట్టు పేరుతో చెరువుల్లో మట్టిని అమ్మేసుకుని, పే కాట దందాలకు కేరాఫ్‌గా నిలిచిన ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులును కూడా 32 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించి నియోజకవర్గ ప్రజలు ఇం టికి పంపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు అనడానికి ఈ ప్రజాప్రతినిధులే నిదర్శనంగా మారారు. -
చట్ట సభలకు.. తొలిసారి
అమలాపురం: సార్వత్రిక ఎన్నికల్లో ఎవరూ ఊహించని విదంగా తూర్పు ప్రజలు తీర్పునిచ్చారు. సంచలన రాజకీయాలకు కేంద్రబిందువైన తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయధుందుబి మోగించింది. అలాగే సంప్రదాయంగా వినూత్న తీర్పులతో ఆకట్టుకునే తూర్పు ఈసారి కూడా కొత్తవారికి అవకాశం కల్పించింది. తొలిసారి పోటీ పడినవారు, గత ఎన్నికల్లో ఓటమి చవిచూసినవారు ఈసారి విజయం సాధించి తొలిసారిగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహించనున్నారు. అలాగే పార్లమెంట్ సభ్యులుగా లోక్‌సభకు ఎన్నికైన నలుగురికి కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. జిల్లా నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైనవారిలో రాజానగరం నుంచి పోటీ చేసిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఒకరు. రాజా తన సమీప ప్రత్యర్థి టీడీపీకి చెందిన సిటింగ్ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించారు. రంపచోడవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన నాగులాపల్లి ధనలక్ష్మి సైతం టీడీపీ తరఫున పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిపై భారీ అధిక్యంతో విజేతగా నిలిచారు. అనపర్తి నుంచి పోటీ చేసిన డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై ఘన విజయం సాధించారు. జగ్గంపేట నియోజకవర్గానికి టీడీపీ నుంచి పోటీ చేసిన సీనియర్ నాయకుడు సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై జ్యోతుల చంటిబాబు సంచలన విజయం సాధించారు. ప్రత్తిపాడు నుంచి పోటీ చేసిన పర్వత పూర్ణచంద్రప్రసాద్ టీడీపీ నుంచి పోటీ చేసిన డీసీసీబీ చైర్మన్ వరపుల రాజాపై విజయం సాధించారు. అలాగే రామచంద్రపురం నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు టీడీపీ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులపై సంచలన విజయం సాధించారు. కోనసీమ పరిధిలో పి.గన్నవరం నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో ఓటమి చవిచూసినా, తిరిగి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో పోటీ చేసిన కొండేటి చిట్టిబాబు తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి నేలపూడి స్టాలిన్ బాబుపై భారీ మెజార్టీలో విజయం సాధించారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి రాజమహేంద్రవరం సిటీ నుంచి పోటీ చేసిన ఆదిరెడ్డి భవానీ సమీప వైఎస్సార్ సీపీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాశరావుపై విజయం సాధించి, తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. లోక్‌సభకూ కొత్తవారే జిల్లాలో నాలుగు పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేసి ఎన్నికైన వారు లోక్‌సభలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. ఈ నలుగురు వైఎస్సార్సీపీ వారే కావడం గమనార్హం. వీరిలో కాకినాడ నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి గెలిచిన వంగా గీతా విశ్వనాథ్ గతంలో రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే ఒకసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా, జెడ్పీ చైర్మన్‌గా పని చేశారు. రాజమహేంద్రవరం నుంచి పోటీ చేసిన మారాని భరత్, అమలాపురం నుంచి పోటీ చేసిన చింతా అనూరాధ, అరకు (రంపచోడవరం భాగంగా ఉంది) వైఎస్సార్ సీపీ తరఫున జి.మాధవికి ఇవే తొలి ఎన్నికలు. వీరిని గెలిపించడం ద్వారా తూర్పు ఓటర్లు మరోసారి తన విలక్షణతను చాటుకున్నారు. -
కట్టుదిట్టంగా కౌంటింగ్
కాకినాడ సిటీ: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు చేస్తోంది. భద్రతా చర్యలకు సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పటికే ఎన్నికల కమిషన్ జారీ చేసింది. అవాంఛనీయ సంఘటనలు, కౌంటింగ్‌కు అంతరాయం చోటు చేసుకోకుండా మూడంచెల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ హాలుకు వంద మీటర్ల చుట్టూ డీ మార్కింగ్ చేస్తారు. దీన్ని పెడెస్ట్రియన్ జోన్ అంటారు. కౌంటింగ్ హాలుకు వంద మీటర్ల ఆవలనే వాహనాలను ఆపివేస్తారు. ఈ పెడెస్ట్రియన్ జోన్ చుట్టూ బ్యారికేడ్లు నిర్మిస్తారు. ఒక ప్రవేశ ద్వారం ఉంటుంది. ఇక్కడ స్థానిక పోలీసులను నియమిస్తారు.కౌంటింగ్ ఆవరణలోకి వెళ్లే వారి గుర్తింపు పత్రాలను పోలీసులు పరిశీలిస్తారు. అధికారిక అనుమతి పత్రం, ఫొటో గుర్తింపు కార్డు లేకపోతే అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు తదితరులను ఎవరినీ అనుమతించరు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మీడియా పాస్ ఉంటేనే పాత్రికేయులకైనా అనుమతి ఉంటుంది. మెజిస్టీరియల్ అధికారాలు కలిగిన సీనియర్ రెవెన్యూ అధికారి ఎంట్రీ పాయింట్ వద్ద ఉంటారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాలు దూరంగా ఉన్నప్పుడు ఈవీఎంలు తీసుకెళ్లడానికి అసౌకర్యంగా ఉంటుంది. కౌంటింగ్ హాలు వరకు ప్రత్యేకంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు. బిల్డింగ్ ప్రవేశ ద్వారం నుంచి కౌంటింగ్ హాళ్ల వరకు ఉన్న ప్రదేశాన్ని రెండవ అంచెగా పరిగణిస్తారు. తగినంత మంది రాష్ట్ర ఆర్మ్డ్ పోలీసులు ఇక్కడ ఉంటారు. ∙ఆడియో, వీడియో రికార్డు చేయగల మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్లు, ల్యాప్టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను లోనికి అనుమతించరు. అగ్గిపెట్టె, ఇంకుపెన్నులు, బ్లేడ్లు, చాకులు, పిన్నులు, ఆయుధాలను కౌంటింగ్ హాలులోకి తీసుకువెళ్లేందుకు అనుమతించరు. పెన్సిల్, వైట్ పేపర్స్ తీసుకువెళ్లవచ్చు. ∙రాష్ట్ర పోలీసులు మాత్రమే ఇక్కడ తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. మహిళలను కేవలం మహిళా పోలీసులు లేదా మహిళా హోం గార్డులు మాత్రమే తనిఖీ చేయాలి. ∙కౌంటింగ్ హాలు బయట నిలబడి ఎవరూ ఫోన్లలో మాట్లాడటం వంటివి చేయకూడదు. మీడియా లేదా పబ్లిక్ కమ్యూనికేషన్ రూములో మాత్రమే ఫోన్లలో మాట్లాడుకోవచ్చు. ఫోన్లు డిపాజిట్ చేసే సౌకర్యం ఉంటుంది. డిపాజిట్ చేసినప్పుడు టోకెన్లు జారీ చేస్తారు. ∙కౌంటింగ్ కేంద్రంలోకి కంట్రోల్ యూనిట్లు తీసుకెళ్లే సిబ్బంది కదలికలు రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద నున్న టీవీలో కనిపించే విధంగా సీసీ కెమెరాల ఏర్పాటు ఉంటుంది. ∙కౌంటింగ్ కేంద్రం ద్వారం నుంచి మూడు అంచెల భద్రత ప్రారంభమవుతుంది. ఇక్కడ సీఏపీఎఫ్ సిబ్బంది ఉంటారు. రిటర్నింగ్ అధికారి పిలిస్తే తప్ప వీరు కౌంటింగ్ హాలులోకి ప్రవేశించరాదు. ∙కౌంటింగ్ హాలులోకి నిషేధిత వస్తువులు తీసుకువెళ్లకుండా ఇక్కడ కూడా తనిఖీలు ఉంటాయి. కౌంటింగ్ హాలులో ఫొటోలు, వీడియోలు తీసేందుకు మీడియాకు అనుమతి ఉండదు. ∙కౌంటింగ్ హాలులోకి ఫోన్లు తీసుకెళ్లడానికి కేవలం ఈసీఐ అబ్జర్వర్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది. కౌంటింగ్ ఏజెంట్లు, సిబ్బంది లోనికి వెళ్లేందుకు ప్రత్యేక ప్రవేశ ద్వారం ఏర్పాటు చేస్తారు. వీరికే లోనికి అనుమతి కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు, ఈసీఐ అనుమతి ఉన్న వ్యక్తులు, అబ్జర్వర్లు, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లనులోనికి అనుమతిస్తారు. అభ్యర్థులైతేనే మంత్రులకు కౌంటింగ్ హాలులోకి ప్రవేశం ఉంటుంది. మంత్రులు ఎన్నికల ఏజెంట్లుగా, కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండేందుకు అనుమతించరు. ఒక నియోజకవర్గానికి రెండు కంటే ఎక్కువ కౌంటింగ్ కేంద్రాలను వినియోగించాల్సి వస్తే ఆ విషయాన్ని అభ్యర్థులకు తెలపాలి. అలాగే ఏ కౌంటింగ్ హాలుకు ఏ పోలింగ్ కేంద్రాలను కేటాయించిందీ ముందుగానే వివరించాలి. కౌంటింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఎవరైనా ఏజెంట్ అనుచితంగా ప్రవర్తించినా, నిబంధనలు పాటించకపోయినా బయటికి పంపి వేసే అధికారం రిటర్నింగ్ అధికారికి ఉంటుంది. ఏజెంట్లు తమకు కేటాయించిన టేబుల్ వద్ద మాత్రమే కూర్చోవాలి. కౌంటింగ్ హాలు అంతా తిరిగేందుకు వారికి అనుమతి ఉండదు. -
జీజీహెచ్‌లో నరకం చూస్తున్న బాలింతలు
సాక్షి, కాకినాడ సిటీ: పాలకులు మారుతున్నా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు తొలగడం లేదు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గర్భిణులకు ప్రసూతి సేవలు అందించలేక చేతులెత్తేస్తున్నాయి. కాన్పు కోసం వచ్చే గర్భిణులను హైరిస్క్ కేసులంటూ ప్రైవేట్ ఆసుపత్రులకు తరిమేస్తున్నారు. అక్కడకు వెళ్లే స్తోమత లేని వారు ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వస్తున్నారు. ఇక్కడ తగినంత మంది ప్రసూతి వైద్యనిపుణులు లేకపోవడం ఒక సమస్యైతే.. ప్రసవం అనంతరం బాలింత సంరక్షణ సమస్యగా మారిందని పలువురు విమర్శిస్తున్నారు. ఈ ఆసుపత్రికి ఉభయ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన పేద, మధ్య తరగతికి చెందిన గర్భిణులు పెద్ద సంఖ్యలో కాకినాడ సామాన్య ఆసుపత్రికి రావడంతో ఆసుపత్రిలో పడకల సమస్య ఉత్పన్నమవుతోంది. ఈ ఆసుపత్రిలో నిత్యం దాదాపు 300 మందికి పైగా గర్భిణులు వస్తుంటే 80 మంది వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. వాటిలో దాదాపు 30 మంది వరకు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తుంటారు. దీంతో గైనిక్ విభాగంలోని పోస్టునేటల్ వార్డులో బాలింతలు ప్రత్యక్షనరకం చూస్తున్నారు. శుక్రవారం ఉదయం పరిస్థితి చూస్తే ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు ఉన్న దృశ్యాలు కన్పించాయి. ఏ తల్లిని కదిపినా ఒకటే ఆవేదన. తాను తొమ్మిది నెలలు గర్భిణులతో ఉన్నా ఎటువంటి ఇబ్బంది కన్పించలేదు, కానీ ఆసుపత్రిలో పురుడు పోసుకున్న తరువాత చిన్నారితో ఉండేందుకు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాకుండా ఉన్నాయంటూ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. బాలింత అంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నా, ఆ జాగ్రత్తలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కన్పించడం లేదని ఆందోళన చెందుతున్నారు. తల్లి చిన్నారుల పక్కన పడుకొని పాలు ఇవ్వాలంటే మరో చిన్నారి ముఖంపై కాళ్లు పెట్టుకునే పరిస్థితి కన్పిస్తోంది. ఎంత మంది జిల్లా అధికారులు సందర్శించినా ఈ పరిస్థితిలో మార్పురాకపోవడం శోచనీయం. కలెక్టర్ కార్తికేయ మిశ్రా పదేపదే ఆసుపత్రిని సందర్శిస్తున్నా గైనిక్ వార్డుల్లోని సమస్యలు పరిష్కరించిన దాఖలాలు కన్పించలేదు. గురువారం ఆసుపత్రిని సందర్శించిన జీజీహెచ్ అభివృద్ధి కమిటీ బృందం, అధికారుల బృందానికి ఒకే మంచంపై ఇద్దరు ముగ్గురు బాలింతలు ఉన్న దృశ్యం కన్పించకపోవడం శోచనీయం. చాలా మంది బాలింతలకు చెందిన బంధువులు ఒకే మంచంపై ఇద్దరు నుంచి ముగ్గురు ఉన్న విషయాన్ని కలెక్టర్, జీజీహెచ్ అభివృద్ధి కమిటీ దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదని పలువురు విమర్శిస్తున్నారు. బాలింత మంచంపై పడుకునేందుకు లేదని, ఇద్దరు, ముగ్గురు పిల్లల్ని మంచంపై పరుండబెడితే తల్లులు కింద కూర్చునే పరిస్థితి ఉందని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం గొప్పగా ఉన్నా సౌకర్యాలు లేకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నామన్నారు. గర్భిణులుగా ఉన్నప్పుడు తల్లి ఆలనపాలన చూసే కన్నా బాలింతగా ఉన్న సమయంలోనే తల్లి ఆరోగ్యం కోసం పరితపించాల్సిన అవసరం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలింత పడుకునేందుకు చోటు లేకపోవడంతో సహాయకులుగా ఉన్న వారే కొద్దిసేపు పిల్లలను ఎత్తుకొని తల్లిని మంచపై పడుకోబెడుతున్నామంటున్నారు. కొన్ని మంచాల వద్ద బాలింతలు రోజంతా నిద్రలేకుండానే గడుపుతున్నారని ఆవేదన చెందుతున్నారు. బాలింత ఉండేందుకు చోటు లేదు తాము జగ్గంపేట నుంచి వచ్చాం. తన భార్యకు పురుడు వచ్చింది. ఆసుపత్రిలో ఒక్కొక్క మంచానికి ఇద్దరు, ముగ్గురు చొప్పున వేస్తున్నారు. మంచాలు ఒకరికన్నా ఎక్కువ ఉండేందుకు సరిపోవడం లేదు. చేసేది లేక పిల్లను మంచంపై ఉంచి బాలింతను పక్కనే పీట మీద కూర్చోబెడుతున్నాం. బాలింతలు పరిస్థితి చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. – జి.రామకృష్ణ, జగ్గంపేట గర్భిణుల కన్నా బాలింతకే ఎక్కువ బాధ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు స్థోమత లేక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పురుడు పోయిస్తే గర్భిణులుగా ఉన్న సమయం కన్నా బాలింతగానే ఎక్కువగా బాధను అనుభవిస్తున్నాం. తల్లి పడుకునేందుకు చోటులేక తల్లి బిడ్డ కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అంతేకాకుండా వీరికి ఆసరాగా వచ్చిన మాలాంటి వారు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఒకే మంచానికి ముగ్గురు చొప్పున వేస్తుంటే తల్లీబిడ్డ పడుతున్న ఇబ్బందులు చూడలేకపోతున్నాం. – అమరావతి, బాలింత తల్లి, కాకినాడ -
పో‘స్డల్’ బ్యాలెట్
సాక్షి, కాకినాడ సిటీ: పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులకు అందించిన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతున్నా ఇంకా అనేక బ్యాలెట్లు తిరిగి సంబంధిత అధికారులకు అందలేదు. జిల్లాలో 61,927 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులు చేయగా అధికారులు 59,805 మందికి పోస్టల్ బ్యాలెటుపంపిణీ చేశారు. వీటిలో ఇప్పటి వరకు 36,178 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు ఇంకా సమయం ఉండడంతో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని చెబుతున్నారు. జిల్లాలోని మూడు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మొత్తం 28,748 మంది ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్‌ను పంపించారు. వీరి నుంచి తిరిగి మంగళవారం నాటికి 16,517 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ అధికారులకు బ్యాలెట్లు తిరిగి పంపించారు. ఇంకా 12,231 మంది పార్లమెంట్‌కు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లు అందాల్సి ఉంది. జిల్లాలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 31,057 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పత్రాలు పంపగా వీరిలో 19,661 మంది తమ ఓటు హక్కును వినియోగించుకొని తిరిగి పోస్టల్ బ్యాలెట్‌ను అధికారులకు తిప్పిపంపించారు. ఇంకా 11,396 మంది అభ్యర్థుల నుంచి రావల్సి ఉంది. చాలా మందికి పోస్టల్ బ్యాలెట్ అందలేదని, చెబుతుండగా తమకు దరఖాస్తులు అందించిన వారందరికీ పత్రాలను పంపించామంటున్నారు. ఆరు రోజుల్లో ఓట్ల లెక్కింపు జరుగుతున్నా, జారీ అయిన పోస్టల్ బ్యాలెట్‌ల్లో తిరిగి సగం కూడా ఆర్వోలకు చేరలేదు. ఇంకా సమయం ఉంది కదా కౌంటింగ్‌కు గంట ముందు చేరే విధంగా పంపవచ్చనే ఉద్దేశ్యంతో కొందరు ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. జిల్లాలో పలు ప్రాంతాల్లో... జిల్లా కేంద్రంలో పని చేసే ఉద్యోగులు, వివిధ ప్రాంతాల్లో ఎన్నికల విధులు నిర్వహించారు. వీరికి కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నుంచి 48 గంటల్లో పోస్టల్ బ్యాలెట్ జారీ కావాల్సి ఉంది. పోలింగ్ జరిగి నెల రోజులు కావస్తున్నా ఇంత వరకు అందకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పోస్టాఫీసుకు వెళ్లి ఆరా తీస్తున్నా ఫలితం లేకుండా పోతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీవే ఎక్కువ... జిల్లాలోని మూడు పార్లమెంట్, 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 59,805 మందికి పోస్టల్ బ్యాలెట్లు జారీ కాగా అసెంబ్లీకి సంబంధించి 16,517 ఓట్లు తిరిగి ఆర్వోలకు వచ్చాయి. పార్లమెంట్‌కు సంబంధించి తక్కువ బ్యాలెట్ ఓట్లు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 16,517 ఓట్ల మాత్రమే వచ్చాయి. ఇంకా ఆరు రోజులు సమయం ఉన్నా వేలాది మంది పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన బ్యాలెట్లను పక్కన పెట్టినట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా ఓటమి భయంతో టీడీపీ నేతలు, ఉద్యోగుల ఓట్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థులు స్వయంగా రంగంలోకి ఉద్యోగులను ప్రలోభ పెడుతున్నట్లు సమాచారం. టీడీపీ నేతలే స్వయంగా ప్రభుత్వ కార్యాలయాల్లో వివరాలను తీసుకొని, నేరుగా బ్యాలెట్ ఓట్లు తీసుకున్న అభ్యర్థుల వద్దకు వెళ్లి తమకే ఓట్లు వేయాలని చెబుతున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ నేతలు అడ్డు చక్రం వేయడం వల్లనే ఇప్పటికీ వేలాది మందికి పోస్టల్ బ్యాలెట్లు అందలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. జారీ చేసిన పోస్టల్ బ్యాలెట్లు 59,805 తిరిగి వచ్చినవి 36,178 పార్లమెంట్‌కు వచ్చినవి 16,517 అసెంబ్లీకి వచ్చినవి 19,661 ఇంకా రావల్సినవి 23,627 -
‘జనసేన’ వ్యాన్‌లో మద్యం సీజ్
సాక్షి, అంబాజీపేట (పి.గన్నవరం): మద్యం లోడుతో వెళుతున్న వ్యానులో ఉన్న భారీ మద్యం బాటిళ్లను శనివారం అర్ధరాత్రి నోడల్ ఆఫ్ కాండాక్టు స్వా్కడ్ సిబ్బంది, అమలాపురం రూరల్ సీఐ జి.సురేష్‌బాబు ఆధ్వర్యంలో ట్రైనీ ఎస్సై డి.సురేష్ స్వాధీనం చేసుకున్నారు. సీఐ కథనం ప్రకారం మాచవరం శివారు పోతాయిలంక నుంచి అంబాజీపేట వైపు వెళుతున్న బొలోరో వ్యాన్ పోలీసులు గస్తీ చేస్తుంటే, ఒక్కసారిగా వేగంతో దూసుకుపోయింది. అనుమానం వచ్చిన పోలీసులు ఆ వ్యానును నిలిపి తనిఖీ చేశారు. బిల్లులు లేకుండా రవాణా చేస్తున్న రూ.5.50 లక్షల విలువ జేసే 4,795 మద్యం సీసాలు, 624 చిన్న బీరు బాటిళ్ల స్వాధీనం చేస్తున్నారు. రాజోలు మండలం కడలికి చెందిన వ్యాన్ డ్రైవర్ బోణం సాయి నరసింహమూర్తి, అతనితో ఉన్న అంత్రి రాజేష్ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వ్యాన్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. ఈ వ్యాను ఎక్కడ నుంచి వస్తుందో తెలియదని, మామిడికుదురులో వ్యాన్‌ను తనకు అప్పగించారని వ్యాన్ డ్రైవర్ చెప్పాడని తెలిపారు. అంబాజీపేటలో ఎక్కడికి తీసుకువెళ్లాలో ఫోన్ ద్వారా తెలియజేస్తామని చెప్పాడని ట్రైనీ ఎస్సై తెలిపారు. బోడసుకుర్రు వచ్చిన తరువాత సెల్‌ఫోన్ కాన్ఫరెన్స్‌లో అంబాజీపేట వైపు రమ్మని చెప్పారన్నారు. వ్యాను ముందు బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వెళుతూ ఫోన్ కాన్ఫరెన్స్‌లోనే సంభాషించినట్టు తెలిపాడు. ఈ వ్యాన్‌పై జనసేన స్టిక్కర్ ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. -
బడుగు వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్‌రామ్
సాక్షి, అనపర్తి: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి దివంగత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌రామ్ విశేష సేవలందించారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించేందుకు, కులమతాలకు అతీతంగా దేశాభివృద్ధే ధ్యేయంగా కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్‌రామ్ అన్నారు. జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దళితుల సామాజిక స్థితిగతుల మార్పునకు జగ్జీవన్‌రామ్ ఎనలేని కృషి చేశారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సత్తి రామకృష్ణారెడ్డి, పోతుల ప్రసాదరెడ్డి, వెలగల లక్ష్మీనారాయణరెడ్డి, పాదూరి డేవిడ్‌రాజు, కొండేటి భీమేష్ తదితరులు పాల్గొన్నారు. దొంతమూరులో... దొంతమూరు (రంగంపేట): మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు గ్రామంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎస్సీకాలనీలో ఉన్న జగ్జీవన్‌రామ్ విగ్రహానికి దుళ్ళపల్లి కొండ, మిరియాల దొరబాబు, కొండ్రి వీరన్న, రాయ వెంకన్న తదితరులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముత్యం వీరబాబు, మాసిపల్లి నాగేశ్వరరావు, దుప్పలపూడి చిట్టిబాబు, చెక్కపల్లి నాగేశ్వరరావు, చెక్కపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పెదరాయవరంలో... పెదరాయవరం (రంగంపేట): గ్రామంలోని అరుంధతీపేటలో యూత్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌రామ్ జయంతి ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మాదిగ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు ఉందుర్తి సుబ్బారావు, స్థానిక నాయకులు మాచిన గోవిందు, మోదుకూరి గోపాలకృష్ణ తదితరులు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో దళత నాయకులు బచ్చు చినబాబు, బొత్స యేసు, పైడిమళ్ళ మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. చింతపల్లిలో... చింతపల్లి (పెదపూడి): దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన గొప్ప నాయకుడు దివంగత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్ సంయుక్త కార్యదర్శి మోకా సూరిబాబు అన్నారు. గ్రామంలో జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు పార్టీ గ్రామ కన్వీనర్ కొల్లు పెద్దకాపు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పిల్లి భాస్కరరావు, పెంకే ఏకాశి, స్థానిక ఎస్సీలు పాల్గొన్నారు. పెద్దాడలో నేత్ర వైద్య శిబిరం గ్రామంలోని అరుంధతీ యూత్ సేవా సంఘం ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో వైద్యులు 200 మందికి నేత్ర పరీక్షలు చేశారు. మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ సంయుక్త కార్యదర్శి మోకా సూరిబాబు, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు యార్లగడ్డ సోమరాజు చౌదరి, బొడ్డు పరమేశ్వరరావు, అరుంధతీ యూత్ సేవా సంఘం అధ్యక్షుడు పైడిమళ్ల సత్యనారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పెదపూడిలో... గ్రామంలో జగ్జీవన్‌రామ్ జయంతి కార్యక్రమం జగ్జీవన్‌రామ్, ఎమ్మార్పీఎస్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన గ్రామ పెద్దలు యార్లగడ్డ అమ్మన్న చౌదరి, నల్లమిల్లి గంగిరెడ్డి తదితరులు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ వేడుకలు నిర్వహించారు. ఘనంగా జగ్జీవన్‌రామ్ జయంతి బిక్కవోలు: బాబూ జగ్జీవన్‌రామ్ ఆదర్శనీయులని వైఎస్సార్ సీపీ నేత, ఏఎంసీ మాజీ చైర్మన్ జంగా వీరవెంకట సుబ్బారెడ్డి అన్నారు. రాజరావుపేటలో జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లడుతూ కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత పదవులు నిర్వహించిన మహా మేధావి జగ్గీవన్‌రామ్ అన్నారు. యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామశాఖ కన్వీనర్ తాళ్ల వీర్రాఘవరెడ్డి, మండల కన్వీనర్ పోతల ప్రసాద్‌రెడ్డి, జిల్లా నాయకులు వంగా రామ్‌గోపాలరెడ్డి, యామసాని రవీంద్రపాపారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్టీయూ ఆధ్వర్యంలో మాజీ ఉపప్రధాని, స్వాతంత్య్ర సమరయోధుడు బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి మండల ఎస్టీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వెలగల భామిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి జంగా శ్రీనివాసప్రసాద్, నేకూరి సత్యానందం, దొనేపూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.27 లక్షల గంజాయి పట్టివేత
సాక్షి, చింతూరు (రంపచోడవరం) : ఆంధ్రా నుంచి కర్నాటకకు అక్రమంగా తరలిస్తున్న 900 కిలోల గంజాయిని గురువారం చింతూరు పోలీసులు పట్టుకున్నారు.చింతూరు మండలం చట్టిలో ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్ పోస్టు వద్ద తనిఖీల్లో భాగంగా ఈ గంజాయి పట్టుబడింది. దీనిపై చింతూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్ మీడియాకు వివరాలు వెల్ల డించారు. లారీలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం మేరకు చింతూరు సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ శ్రీనివాస్‌కుమార్ చట్టిలో చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చింతూరు వైపు నుంచి భద్రాచలం వైపునకు వెళుతున్న మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన ఓ లారీని తనిఖీ చేయగా 25 కేజీల చొప్పున ప్యాక్ చేసి ఉన్న 36 ప్లాస్టిక్ సంచుల్లోని 900 కిలోల గంజాయి లభ్యమైందని డీఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా కర్నాటక రాష్ట్రం బీదర్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ మహ్మద్ రియాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా రాజు అనే వ్యక్తి వద్ద తాను డ్రైవర్‌గా పనిచేస్తున్నానని తెలిపాడు. తాను, రాజు కలసి విశాఖ జిల్లా దారకొండలో గంజాయిని కొనుగోలు చేసి జిప్సమ్ అడుగున లారీలో లోడ్ చేశామని తెలిపాడు. గంజాయి లోడు లారీని కర్నాటకకు తీసుకురావాలని చెప్పి తన ఓనర్ రాజు బస్సులో వస్తానని చెప్పాడని డ్రైవర్లో విచారణలో వెల్లడించాడని డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో రూ.27 లక్షలు ఉంటుందని, దానికి పంచనామా నిర్వహించి లారీని సీజ్ చేసి డ్రైవర్ రియాజ్‌ను అరెస్టు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ పోలినాయుడు, మోతుగూడెం రేంజర్ ఉషారాణి, చెక్‌పోస్టు ఇన్చార్జి భాస్కర్ పాల్గొన్నారు. -
‘అప్పు’ముప్పురంబు.. తిరగకపోతే టార్చర్ ఉండు..
రాజమహేంద్రవరం నగరంలో అప్పుల అప్పారావు అంటే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. ఎందుకంటే ఆయన అంతగా ఫేమస్.. ఇంతకీ ఆయన ఎవరనేగా మీ ఆత్రుత.. కంగారు పడకండి.. ఇంకెవరు మన స్థానిక ప్రజాప్రతినిధే. ఓ పార్టీలో గెలిచి మరో పార్టీ గూట్లోకి వెళ్లి పబ్బం గడుపుకుంటున్న ఆ నేత రాజమహేంద్రవాసులను ఎవరినడిగినా ఇట్టే చెప్పేస్తారు. ఒక్కసారి ఈయన వద్ద అప్పు తీసుకున్న ఏ రాజకీయనాయకుడైనా ఆయన చుట్టూ తిరగాల్సిందే. అదేంటీ? అప్పు తీసుకున్న వాడు తప్పించుకు తిరుగుతాడు గానీ, ఈయన చుట్టూ తిరగడమేంటనేగా మీ డౌటు.. ఆ సందేహం కూడా తీరుతుంది ముందు మీరు పూర్తిగా చదవండి... సాక్షి ప్రతినిధి, కాకినాడ : చోటా రాజకీయ నాయకులు అడిగిన వెంటనే అప్పు ఇచ్చే సామర్థ్యం ఆయనకు ఉంది. లక్షల్లో అప్పులు పొందే నాయకులను అప్పు కట్టాలని అడిగే ప్రయత్నం చేయడు ఆ అప్పుల అప్పారావు. ఇక్కడే తిరకాసు ఉంది. అప్పు తీసుకున్న ఏ చోటా నాయకుడైనా ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉండాల్సిందే. అప్పారావు పార్టీ మారితే అతడితో పాటు పార్టీ మారాల్సిందే. ఒకవేళ పార్టీ మారేందుకు ఇష్టం చూపనివారు, తనవెంట పార్టీ మారని వారికి వెంటనే మొదలవుతుంది టార్చర్. తన బాకీ అణాపైసలతో చెల్లించి నీ ఇష్టం వచ్చినట్లు వెళ్లిపోవచ్చని హుకుం జారీ చేస్తారు. ఈ బాధ భరించలేక అప్పులు తీర్చే సత్తా లేక.. చోటా నాయకులు ఆయన వెంట పార్టీ మారక తప్పదు. ఇలా మాజీ కార్పొరేటర్లు, పలు బ్యాంక్‌ల మాజీ డైరెక్టర్లు ఇష్టం లేకపోయినా పార్టీ మారి వెళ్లిన వాళ్లున్నారు. ఇప్పుడు ఆయన కోడలు ఎన్నికల బరిలో ఉన్నారు. అప్పులు తీసుకున్నోళ్లందరూ ఓటు వేయాలని పట్టుబడుతున్నారు. లేదంటే నయా పైసా వదలకుండా కట్టాలని హుకుం జారీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేస్తే అప్పు మాఫీ చేస్తానని కూడా అంటున్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. హాట్‌పోట్లు ఎదుర్కొని.. అమలాపురం: పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు ప్రచారం జోరును పెంచారు. మరింత ముమ్మరంగా ప్రచారం నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే వారి ప్రచారంపై భానుడు తీవ్ర ప్రతాపాన్ని చూపుతున్నాడు. నడినెత్తిన నిప్పులు కురిపిస్తుండడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు, ద్వితీయశ్రేణి నేతలు, వారి మద్దతుదారులు చెమటలు కక్కుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గడిచిన వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆది, సోమవారం ఎండతీవ్రత మరింత పెరిగింది. మిట్టమధ్యాహ్నం గరిష్ఠ ఉష్ణోగ్రతలతోపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. ఏజెన్సీలోని చింతూరులో జిల్లాలోనే అత్యధికంగా 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత, 25 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తరువాత రాజమహేంద్రవరం 39 డిగ్రీలు గరిష్ఠంగా, 24 కనిష్ఠంగాను, కాకినాడ గరిష్ఠంగా 37, కనిష్ఠంగా 25, అమలాపురం గరిష్ఠంగా 36, కనిష్ఠంగా 24, ఏజెన్సీ డివిజన్ కేంద్రమైన రంపచోడవరంలో గరిష్ఠంగా 32, కనిష్ఠంగా 23, చివరకు జిల్లాలో అత్యంత చల్లని ప్రాంతమైన మారేడుమిల్లిలో సైతం గరిష్ఠంగా 31, కనిష్ఠంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిట్టమధ్యాహ్నం పెరిగిన ఉష్ణోగ్రతలు ఎన్నికల ప్రచారానికి తీవ్ర అవాంతరాన్ని సృష్టిస్తోంది. ఎండవేడి తాళ్లలేని అభ్యర్థులు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రచారాన్ని నిలిపివేస్తున్నారు. ప్రచారానికి వస్తున్న పార్టీ కార్యకర్తలు, అద్దె కార్యకర్తలు సైతం ఇంటింటా తిరిగి ప్రచారం చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. -
కోడ్‌ను ఉల్లంఘిస్తున్నా.. కనిపింఛనే లేదా?
సాక్షి, అమలాపురం టౌన్: ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వచ్చిన ఏ అవకాశాన్నీ వదలడం లేదు తెలుగు తమ్ముళ్లు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పట్టించుకోకుండా పింఛను సొమ్ము, పసుపు కుంకుమ పథకాల సొమ్ములను పంపిణీలు వారి ఆధ్వర్యంలోనే చేపట్టడం విశేషం. ఇప్పటికే పసుపు–కుంకుమ పథకానికి సంబంధించి మూడో చెక్కును ఈ వారంలోనే అందించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేసింది. ఇక నెలనెలా పింఛన్ల పంపిణీ సొమ్మును కూడా అదేదో చంద్రబాబే తన జేబులోని సొమ్ములను ఇస్తున్నంత బిల్డప్‌తో టీడీపీ రంగు, రుచి, వాసనతో సామాజిక పింఛన్లను జిల్లా అంతటా సోమవారం నుంచి శ్రీకారం చుట్టింది. ఎన్నికల సంఘం ఆదేశాలను భేఖాతరు చేస్తూ అమలాపురం రూరల్ మండలం బండార్లంక గ్రామంలో సోమవారం సామాజిక పింఛన్ల పంపిణీ ఆర్భాటంగా సాగింది. పింఛన్లు తీసుకునే లబ్ధిదారులు తమ వెంట పింఛన్ల కార్డులు (చంద్రబాబు ఫొటో, టీడీపీ రంగు, పింఛన్ల పెంపు సమాచారంతో ఉన్న కార్డులు) తీసుకురావద్దని, కేవలం పింఛన్ పత్రం, పింఛన్ కార్డు నంబర్ తీసుకుని వస్తే పింఛన్ ఇస్తామని దండోరా నిర్వహించాల్సి ఉంది. కొన్ని మండలాల్లో దండోరా వేయించారు. ఈ సూచనను పింఛన్లు బట్వాడా చేసే సిబ్బంది పట్టించుకోలేదు. దీనిపై గ్రామంలో విజ్ఞులైన ఓటర్లు, టీడీపీయేతర పార్టీల నాయకులు, కార్యకర్తల్లో కొం దరు పింఛన్లు పంపిణీ చేస్తున్న సిబ్బందిని ప్రశ్నించగా దండోరా వేయమన్న ఆదేశాలు తమకు రాలేదని చెప్పారు. పరోక్ష ప్రలోభంలా ఉన్న ఈ పింఛన్ల పంపిణీని ఎన్నికల అధికారులు అడ్డుకోవాలని, దీనిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయనున్నట్టు స్థానిక యువకులు కొందరు చెప్పారు. జన్మభూమి కమిటీ సభ్యుల సమక్షంలో పింఛన్ల పంపిణీ తొండంగి (తుని): ఏం చేసైనా సరే మళ్లీ అధికారాన్ని పొందేందుకు టీడీపీ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎన్నికల నిబంధనలను అతిక్రమించి అధికారులు టీడీపీ నేతల సమక్షంలో పింఛనుదారులకు పింఛన్లు అందజేస్తున్నారు. తొండంగి మండలం పైడికొండ గ్రామంలో పంచాయతీ అధికారులు సోమవారం జన్మభూమి కమిటీ సభ్యుడైన నర్సే ఫకీరయ్య సమక్షంలో పింఛనుదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టకుండా అధికారులు ఎటువంటి రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం పథకాలను పంపిణీ చేయాల్సి ఉంది. అయితే అలా కాకుండా జన్మభూమి కమిటీ సభ్యులు వ్యవహరిస్తున్నారు. తమకే ఓటు వేయాలంటూ పింఛనుదారులనున ప్రలోభాలకు గురిచేస్తున్నారని గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. అధికారులు టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతూ వారి సమక్షంలోనే పింఛన్లు పంపిణీ చేయడం ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీ జరుగుతున్న ప్రాంతంలో టీడీపీ నేతలను నిలదీయడంతో వారంతా అక్కడి నుంచి జారుకున్నారు. పింఛన్ల పంపిణీ వ్యవహారంలో అధికారులు, టీడీపీ నేతల తీరుపై మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. అదే విధంగా ఇదే మండలంలోని బెండపూడిలో పింఛన్లు పంపిణీ అనంతరం లబ్ధిదారులకు టీడీపీ వర్గీయులు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం మండల కన్వీనర్ ఆరుమిల్లి ఏసుబాబు చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీడీపీనేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. -
పెద్దాపురం జగన్నినాదం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మండుటెండలో పెద్దాపురం జనసంద్రమైంది. జగన్నినాదం మిన్నంటింది. అభిమాన కెరటం ఎగసిపడింది. యువత ఉత్సాహం ఉరకలెత్తింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాక సందర్భంగా వెల్లువలా తరలివచ్చిన జనంతో పట్టణం కిటకిటలాడిపోయింది. తమ ప్రియనేతను చూసేందుకు మండుటెండను సహితం లెక్క చేయకుండా తరలివచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణులతో ఎక్కడ చూసినా సందడి నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దాపురం చేరుకున్న జగన్మోహన్రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. హెలిప్యాడ్ వద్దకు వేలాదిగా చేరుకున్న జనంతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. అక్కడి నుంచి బహిరంగ సభ వద్దకు ప్రజలు తమ అభిమాన నేతను తోడ్కొని తీసుకువెళ్లారు. ఆ సమయంలో ఆ ప్రాంతమంతా జగనిన్నాదాలతో, మోటార్ బైక్ ర్యాలీలతో హోరెత్తిపోయింది. నియోజకవర్గం నలుమూలల నుంచీ పార్టీ శ్రేణులు వేలాదిగా తరలిరావడంతో పెద్దాపురం పట్టణమంతా వైఎస్సార్ కాంగ్రెస్ జెండాలతో సందడిసందడిగా మారింది. ఓవైపు ఎండ తీవ్రత ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నా జగన్‌ను చూసేందుకు వృద్ధులు, మహిళలు, యువకులు ఎంతో ఆత్రంగా వేచి ఉన్నారు. జగన్ సభావేదిక వద్దకు చేరుకోగానే మరోసారి జగన్నినాదంతో ఆ ప్రాంగణం మార్మోగిపోయింది. ‘సీఎం సీఎం’ ప్రజలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వైఫల్యాలను ఎండగడుతూ జగన్ మాట్లాడిన తీరుకు ప్రజలు కరతాళధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. స్థానిక అంశాలను కూడా జగన్ ప్రస్తావించడం అక్కడి ప్రజలను ఆకట్టుకుంది. జగన్ మాట్లాడుతూ, టీవీల్లో చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని నమ్మితే.. నరమాంసం తినే అందమైన రాక్షసిని నమ్మినట్టేనని, ఆయన మాటలు నమ్మి మరోసారి మోసపోరాదని కోరారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టగా, చంద్రబాబు హయాంలో అవి నత్తనడకన సాగుతున్నాయన్నారు. ప్రాజెక్టును పూర్తిగా అవినీతిమయం చేసిన ఆయన, బినామీలు, సబ్ కాంట్రాక్టుల పేరుతో మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడికి అప్పగించి, కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని, ప్రాజెక్టు పూర్తి చేసిన దాఖలాలు లేవని అన్నారు. చంద్రబాబు హయాంలో ఇప్పటికే సుమారు 6 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని, ఆయనకు మరోసారి పొరపాటున ఓటు వేస్తే ప్రభుత్వ పాఠశాలలనేవే ఉండవని, వాటి స్థానంలో ‘నారాయణ’ పాఠశాలలు వస్తాయని చెప్పారు. ప్రస్తుతం ఎల్కేజీకి రూ.25 వేల ఫీజు వసూలు చేస్తున్నారని, మళ్లీ అధికారంలోకి వస్తే రూ.లక్ష వసూలు చేస్తారని అన్నారు. అన్నదాత కష్టాలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఒకవైపు ధాన్యం కనీస మద్దతు ధర రూ.1,750 అని చెబుతూ క్వింటాల్‌కు రూ.1,200 కూడా ఇవ్వడం లేదని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో టన్ను చెరకు గిట్టుబాటు ధర రూ.3,115 ఉంటే పెద్దాపురం నియోజకవర్గంలో రూ.2,600కు మించి ఇవ్వడం లేదని జగన్ అన్నారు. జగన్ రాకతో పెరిగిన జోష్ ఇప్పటికే మంచి ఉత్సాహంతో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జగన్ సభ మరింత జోష్‌ను నింపింది. నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ చేరిక, అనేకమంది టీడీపీ ప్రముఖులు, కౌన్సిలర్లు ఇప్పటికే తెలుగుదేశాన్ని వీడి వైఎస్సార్ సీపీలో చేరడంతో బలం పుంజుకున్న వైఎస్సార్ సీపీకి ఇప్పుడు జగన్ సభకు పోటెత్తిన జనప్రవాహం మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది. -
పచ్చ తమ్ముళ్ల అక్రమాలు..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపొనెంట్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లలో జిల్లాలోని ‘పచ్చ’తమ్ముళ్లు గత ఐదేళ్లలో రూ.150 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పనులకు వాడవాడలా ‘చంద్రన్న బాట’ పేరుతో ‘షో’ చేస్తూ ఈ అవినీతికి తెరదీశారు. అధికార పార్టీ నేతలు నామినేటెడ్ పద్ధతిలో పనులు దక్కించుకొని, నాసిరకంగా పనులు చేపట్టి, కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. దీంతో ఈ రోడ్లలో నాణ్యత నేతి బీరకాయలో నెయ్యి చందంగా తయారైందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జన్మభూమి కమిటీ అండదండలతో.. సీసీ రోడ్లు ‘పచ్చ’నేతలకు కాసులు కురిపించాయి. జన్మభూమి కమిటీల ముసుగులో వారు చెలరేగిపోయారు. సీసీ రోడ్ల పనులన్నీ నామినేటెడ్ పద్ధతిలో టీడీపీ నేతలకే కట్టబెట్టడంతో ఇష్టారీతిన దోచుకుతిన్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే సీసీ రోడ్ల నాసిరకం పనులపై లోకాయుక్తకు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు, పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్ విభాగానికి, కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్‌కు అనేక ఫిర్యాదులు వెళ్లాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు స్పందిస్తూ విచారణ జరిపాక నిధులు రికవరీ కూడా చేశారు. తమ పంటపొలాలకు, లే అవుట్లకు, ప్రభుత్వ నిధులతో సీసీరోడ్లను వేసి ఆ పరిసర ప్రాంత భూములకు ధరలు పెంచడానికే ఈ నాలుగేళ్లు కృషి చేశారన్న విమర్శలున్నాయి. బెర్ములు వేయకుండానే రూ.40 కోట్లు స్వాహా.. చంద్రన్న బాటలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వేసిన సీసీ రోడ్లకు బెర్ములు వేయడం లేదు. వాటి కోసం ఖర్చు పెట్టాల్సిన నిధుల్ని నామినేటెడ్ పద్ధతిలో పనులు చేపడుతున్న టీడీపీ నేతలు మింగేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో రోడ్ల పక్కన నిర్మించాల్సిన బెర్ముల విషయంలో అక్రమాలు జోరందుకున్నాయి. నిబంధనల ప్రకారం సీసీ రోడ్లకు ఇరువైపులా బెర్ములను ఏర్పాటు చేయాలి. దీనివల్ల ఎత్తు రోడ్డు నుంచి వాహనం సురక్షితంగా కిందకు దిగుతుంది. ఈ బెర్ములు పటిష్టంగా ఉండాలని విధిగా కంకరతో కూడిన గ్రావెల్‌తో రోడ్డుకు ఇరుపక్కలా నిర్మిస్తారు. కిలోమీటర్ మేర సీసీ రోడ్డుకు రెండుపక్కలా గ్రావెల్‌తో బెర్ములు వేయడానికయ్యే ఖర్చు అంచనా వ్యయంతో కలిపి ఉంటుంది. సరాసరి రహదారి అంచనా వ్యయంలో 10 శాతం బెర్ముల కింద ఖర్చు పెట్టాలి. బెర్ములు వేసిన తర్వాతే ఆ రోడ్లకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించాలి. కానీ, సీసీ రోడ్లు వేసిన తర్వాత బెర్ములు నిర్మించకుండా వదిలేస్తున్నారు. మరికొన్నిచోట్ల బురద కాలువల్లో పూడిక తీసిన మట్టి, భవనాలు తొలగించిన మట్టి వేసి చేతులు దులుపుకొంటున్నారు. ఎక్కువ శాతం బెర్ములు వేయకుండానే అడ్డగోలుగా బిల్లులు డ్రా చేసేస్తున్నారు. కాంట్రాక్టర్ల అవతారమెత్తిన టీడీపీ నేతలు గ్రామాల్లో కేవలం సిమెంటు రహదారులు నిర్మించి ఊరుకుంటున్నారు. ‘సొమ్మొకరిది.. సోకొకరిది’ అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉపాధి హామీ పథకం నిధుల్ని తన పేరు పెట్టుకుని చంద్రబాబు ఖర్చు పెట్టారు. జిల్లాలో రూ.400 కోట్లతో 1,500 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేశారు. ఈలెక్కన రూ.40 కోట్లతో బెర్ముల కింద ఖర్చు పెట్టాలి. కానీ, జిల్లాలో వేసిన సీసీ రోడ్లలో 20 శాతానికి మాత్రమే బెర్ములు వేసినట్టు తెలుస్తోంది. మిగతా వాటికి వేయకపోవడంతో వాటికోసం ఖర్చు పెట్టాల్సిన నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణలున్నాయి. బెర్ములు లేకపోవడంతో ప్రమాదాలు రహదారి నిర్మాణంతో పాటు వాటికిరువైపులా కంకర వేసి, షోలర్లు నిర్మించాలి. సిమెంట్ రోడ్లు ఎత్తుగా ఉండటంతో ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు పక్కకు వెళ్లాలంటే రోడ్డు దిగాల్సి ఉంటుంది. ఆ సందర్భంగా వాహనం సురక్షితంగా దిగడానికి వీలుగా ఇరువైపులా షోల్డర్ ఉండాలి. కానీ చంద్రన్నబాట కింద నిర్మిస్తున్న సిమెంటు రోడ్లకు మాత్రం ఇవేవీ ఉండటం లేదు. బెర్ములు లేని రహదారులు పలు గ్రామాల్లో ప్రమాదకరంగా తయారయ్యాయి. వాహనదారులు ఆయా రోడ్లలో రోజూ ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు. ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు, లారీలు ప్రయాణించే సమయంలో ఒకసారి సిమెంటు రోడ్డు దిగితే మళ్లీ ఎక్కించడం కష్టంగా మారుతోంది. ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు రోడ్డు దిగేందుకు సహితం వీలుపడటం లేదు. ఒక్కోసారి ‘నువ్వు వెనక్కి వెళ్లంటే.. నువ్వు వెనక్కి వెళ్లంటూ’ గొడవలు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు గురై పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. రాత్రిళ్లు ద్విచక్ర వాహనదారులు, ఆటోల వంటివి ప్రమాదాలకు గురవుతున్న సందర్భాలున్నాయి. జిల్లాలో జరిగిన ప్రమాదాలు ఇలా... వడ్లమూరు వెళ్లే సీసీ రహదారికి బెర్మ్ లేకపోవడంతో ద్విచక్ర వాహనంతో కిందికి దిగి పైకి ఎక్కుతుండగా లారీ కింద పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. పెద్దాపురం మండలం ఆర్బీ పట్నం రోడ్డులో ఎదురుగా ట్రాక్టర్ రావడంతో భార్య, పిల్లలతో కలిసి మోటార్ బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రమాదానికి గురయ్యారు. బెర్మ్ లేకపోవడంతో కిందికి దిగలేకపోతున్న సమయంలో నేరుగా ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో దొరబాబు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. -
ఓటు వేయాలంటే బోటు ఎక్కాల్సిందే..
ఆ గ్రామాలకు వెళ్లాలంటే రహదారి సౌకర్యాలు లేవు, ఎటు వెళ్లాలన్నా గోదావరిలోనే ప్రయాణించాలి.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా నాటు పడవలు, బోట్లలో పోలింగ్ కేంద్రానికి రావాలి. ఒడ్డుకు చేరుకున్న తర్వాత కాలినడకన పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటుహక్కు వినియోగించుకొని మళ్లీ తిప్పలు పడుతూ గమ్యస్థానానికి చేరాల్సి ఉంటుంది. పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని పోలవరం, రంపచోడవరం నియోజకవర్గాల పరిధిలోని పోలవరం, వేలేరుపాడు, వీఆర్‌పురం మండలాల్లో గోదావరీ పరీవాహక ప్రాంతంలో అనేక గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది. పడవలపై వచ్చి ఓటేయాల్సిందే గోదావరి ఒడ్డు గ్రామాల్లో 893 మంది ఓటర్లున్నారు. కొన్ని సందర్భాల్లో వీరు పోలింగ్ కేంద్రానికి రావడానికి దారిలేక ఓటుకు దూరంగా ఉంటున్నారు. వేలేరుపాడు మండలంలోని 407 మంది ఓటర్లు జలమార్గం గుండా వచ్చి ఓటు వేయాల్సి ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కాకిస్‌నూరు గ్రామంలో 169 మంది ఓటర్లున్నారు. వీరు ఓటువేయాలంటే 2 కిలోమీర్ల మేర కాలినడకన ప్రయాణించి, ఆ తర్వాత నీళ్లల్లో 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే కొయిదా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే గ్రామంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో దానిని కొయిదాకు మార్చారు. ప్రస్తుతం మళ్లీ కాకిస్‌నూరు గ్రామంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. వి.ఆర్.పురం మండలం కొల్లూరు, కొండేపూడి, గొందూరు, గ్రామాల్లో 460 మంది ఓటర్లుండగా పురుషులు 240, మహిళలు 220 మంది ఉన్నారు. వీరంతా తుమ్మిలేరు పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకోవాలి. కొల్లూరు నుండి తుమ్మిలేరు పోలింగ్ కేంద్రం పది కిలోమీటర్ల దూరంలో ఉండగా, కొండేపూడి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. వీరికి గోదావరి తప్ప వేరే దారి లేదు. గోదావరిలో దోనెలపై దాటి కాలినడకన ప్రయాణించాలి. పోలవరం మండలంలోని తెల్లదిబ్బలలో 26 మంది ఓటర్ల పరిస్ధితి కూడా ఇంతే. నిబంధనల ప్రకారం ఓటర్లను రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రానికి తరలించకూడదు. ఈ గ్రామాల ఓటర్ల కోసం అధికారులే బోట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అధికారులకూ అవే తిప్పలు దట్టమైన కీకారణ్యంలో కాకిస్‌నూరు గ్రామం ఉంది. మారుమూల అటవీ ప్రాంతానికి పోలింగ్ అధికారులు వెళ్లడం కూడా సాహసమే అని చెప్పాలి. పేరంటపల్లిలో ఉన్న 107 మంది ఓటర్లు, టేకుపల్లిలో 131 మంది ఓటర్లు, చినమంకోలు, పెదమంకోలు గ్రామాల్లోని ఓటర్లు కూడా నాటుపడవపై వచ్చి కాకిస్‌నూరులో ఓటు వేయాలి. అధికారులు కొయిదా నుంచి నదీ మార్గం గుండా బోట్‌పై వెళ్లి పోలింగ్ కేంద్రాన్ని చేరుకోవాలి. -
నిరుద్యోగులను వంచించిన బాబు సర్కార్
‘‘బాబు వస్తే జాబు వస్తుందన్నారు.ప్రభుత్వ ఉద్యోగాల జాతర అన్నారు. ఏడాదికో డీఎస్సీ అన్నారు. అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచారు. తీరా చూస్తే ఉద్యోగాల్లేవ్..ఇక రెండో రాగం నిరుద్యోగ భృతిని చంద్రబాబు నాలుగున్నరేళ్ల అనంతరం అందుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు ఆంక్షలతో కంటితుడుపుగా తెరపైకి తెచ్చారు. ఇలా మాయమాటలతో నిరుద్యోగులను నిలువునా ముంచిన ఘనత సీఎం చంద్రబాబుది." సాక్షి, కాకినాడ సిటీ: 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు అధికారంలోకి రాక ముందు ప్రకటించిన నిరుద్యోగ భృతి, అధికారం చేపట్టిన నాలుగున్నరేళ్ల తర్వాత కార్యాచరణలోకి వచ్చింది. అదీ కూడా ప్రకటించిన మేరకు రూ.రెండు వేలు కాకుండా రూ. వెయ్యికే కుదించారు. రాష్ట్రంలో కోట్లలో నిరుద్యోగులుంటే సవాలక్ష ఆంక్షలు విధించి కేవలం పది లక్షల మందికే దానిని పరిమితం చేశారు. అదీ ప్రజాసాధికార సర్వేలో నమోదైతేనే అంటూ మరో మెలిక పెట్టారు. అడ్డంకులు సృష్టించి నిరుద్యోగ యువతను నిలువునా ముంచేశాడు. ఇదంతా చూడబోతే రైతు, డ్వాక్రా రుణమాఫీలను మించిన మాయగా ఉందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువనేస్తం పేరుతో నిరుద్యోగ యువతకు రిక్తహస్తం చూపారంటున్నారు. రూ.వెయ్యి చొప్పున ఇచ్చే భృతికి సవాలక్ష ఆంక్షలు పెట్టి అర్హుల సంఖ్యను తగ్గించే చర్యలు చేపట్టారని మండిపడుతున్నారు. జిల్లాలో పరిస్థితి ఇలా.. జిల్లాలో ప్రజాసాధికార సర్వేలో నమోదైన నిరుద్యోగుల 3.79 లక్షల మంది ఉంటే కేవలం 17,085 మందికే నిరుద్యోగ భృతి ఇవ్వడంపై చంద్రబాబు ప్రభుత్వ తీరుపై యువత మండిపడుతోంది. నిరుద్యోగ యువత నిన్ను నమ్మంబాబూ అంటూ నినదిస్తుంది.. నాలుగేళ్లుగా నిరాశే టీడీపీ ప్రభుత్వంలో గత నాలుగేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి నిరాశ చెందాం. ఆ ఎదురు చూపులకు ఫలితం లేకుండా పోయింది. నిరుద్యోగ భృతి కూడా నిరుద్యోగులకు రాలేదు. దీనికి భిన్నంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ప్రకటించి దానికి అనుగుణంగా భర్తీ చేస్తామనడం అభినందనీయం. -అడ్డూరి అవ్యక్త, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు, జగన్నాథపురం కాకినాడ ఉద్యోగ విప్లవం రావాలి 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీ నమ్మి నిరుద్యోగులంతా మోసపోయాం. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఐదేళ్లుగా ఎదురు చూశాం. కానీ ఉద్యోగావకాశాలు కల్పించలేదు. ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఉద్యోగాల విప్లవం వైఎస్ జగన్‌తోనే సాధ్యం అని మేము నమ్ముతున్నాం. జె.రవితేజ, కాకినాడ నిలువునా ముంచిన ప్రభుత్వం నిరుద్యోగులను ప్రభుత్వం నిలువునా ముంచింది. 2014 ఎన్నికల్లో నిరుద్యోగులను అందలం ఎక్కిస్తాం అన్నట్టుగా ప్రచార ఆర్భాటాలు చేసి గెలిచిన తరువాత వారిని విస్మరించింది. కొందరికి మాత్రమే నిరుద్యోగ భృతి ఇచ్చి నిరుద్యోగులందరినీ ఆదుకున్నట్టు ప్రచారాలు చేస్తున్నారు. గీసాల వీరబాబు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు, కాకినాడ ఉద్యోగావకాశాలు కల్పించలేదు ఇంటికో ఉద్యోగం వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న మా లాంటి వారికి ఉద్యోగావకాశాలు కల్పించ లేదు. కనీసం నిరుద్యోగ భృతి కూడా మంజూరు చేయలేదు. నిరుద్యోగులకు ప్రభుత్వం చేసింది శూన్యం. కనీసం ఇప్పుడైనా యువతకు ఉపాధి అవకాశాలు చూపించే ప్రభుత్వం రావాలి. బి. లక్ష్మీప్రసన్న, కాకినాడ ఆశ నిరాశైంది నేను డిగ్రీ వరకు చదివాను. చదివిన చదువుకు బయట ఎలాంటి ఉద్యోగం రాలేదు. ఉద్యోగ ప్రయత్నాలు చేసి విసిగి పోయాను. దీంతో ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతి అందుతుందని ఆశలు పెట్టుకున్నా. కానీ ప్రభుత్వం పెట్టిన షరతుల కారణంగా భృతి అందలేదు. జే.పృథ్వీ, కాకినాడ బాబూ నిన్ను నమ్మం 2014 ఎన్నికల్లో రైతులను, డ్వాక్రా మహిళలను రుణమాఫీ పేరిట ఏమార్చిన చంద్రబాబు నిరుద్యోగ యువతను నిరుద్యోగ భృతి పేరిట నిలువునా ముంచారు. డిగ్రీలు పూర్తి చేసిన నిరుద్యోగులు ఎంతో మంది ఐదేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూశారు. వారందరికీ రిక్తహస్తమే చూపారు. దీనికి తోడు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. నిరుద్యోగులు ఇక బాబును నమ్మే ప్రసక్తే లేదు. – కొత్తపల్లి గిరీష్, కాకినాడ బురిడీ కొట్టించారు నిరుద్యోగ భృతి పేరిట చంద్రబాబు అందరినీ బురిడీ కొట్టించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీతో పాటు లక్షా యాభైవేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇది నిరుద్యోగులకు మేలు చేసే అంశం. – జువ్వల కర్నేష్, కరప ఎన్నికల కోసమే తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లుగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వక, మరోపక్క ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసింది. ఎన్నికలు వస్తుండడంతో ఆర్నెళ్ల నుంచి ఇస్తోంది. నిరుద్యోగ భృతికి సవాలక్ష నిబంధనలు పెట్టింది. ఎన్నో కొర్రీలు, మొదట రూ.1000 ఇచ్చి, ఇప్పుడు రూ.రెండు వేలు ఇస్తున్నారు. ఇదంతా ఎన్నికల కోసం చంద్రబాబు ఆడుతున్న డ్రామా. – కర్రి జగన్, కాకినాడ అంతా మోసం నేను బీటెక్ చదివాను. ఉద్యోగాలు కల్పిస్తానని చంద్రబాబు మాటిచ్చారు. ఒక వేళ ఉద్యోగం ఇవ్వకపోతే రూ.రెండు వేలు నిరుద్యోగ భృతి ఇస్తామంటే యువత అంతా చంద్రబాబుకు ఓటు వేశారు. కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికలొచ్చాయని నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. అదీ కూడా కొందరికే ఇస్తున్నారు. ఇంజనీర్లు, పీజీలు, డిగ్రీలు చేసిన వారంతా కూలి పనులు చేసుకుంటున్నారు. ఇక చంద్రబాబును మ్మరు. బి.విజయ్, కాకినాడ -
బయటోళ్లదే బలం!
సామర్లకోట (పెద్దాపురం): పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. 1952లో ఆవిర్భవించి రెండు మున్సిపాలిటీలు, రెండు మండలాలు ఉన్న ఏకైక నియోజకవర్గం ఇదే. ఇక్కడ మొదటి సారి ఎన్నికలు 1955లో జరిగాయి. 2019లో జరిగే ఎన్నికలో ఓటర్ల సంఖ్య గతంలో కంటే సుమారు పది వేల వరకు పెరిగింది. ప్రస్తుతం 1,98,369 మంది ఓటర్లు పోటీలో ఉండే వారి భవిష్యత్తును నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో సంపర నియోజకవర్గంలో ఉండే ఎనిమిది గ్రామాలు పెద్దాపురం నియోజకవర్గంలో కలిశాయి. ఈ నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. పెద్దాపురం నియోజవర్గంలో పాగా వేసింది వీరే.. 1955లో జరిగిన మొదటి ఎన్నికల్లో పెద్దాపురానికి చెందిన సీపీఐ అభ్యర్థి దుర్వాసుల వెంకట సుబ్బారావు కేఎల్పీ పార్టీ అభ్యర్థి చల్లా అప్పారావుపై 1,175 ఓట్లతో విజయం సాధించారు. 1962లో కిర్లంపూడికి చెందిన పంతం పద్మనాభం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ అభ్యర్థి దుర్వాసుల వెంకటసుబ్బారావుపై 23,427 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1967లో ఇద్దరు స్థానిక అభ్యర్థులు పోటీలో ఉండగా సీపీఐ నుంచి ఉండవిల్లి నారాయణమూర్తి కాంగ్రెస్ అభ్యర్థి కొండపల్లి కృష్ణమూర్తిపై 2,304 ఓట్ల మెజార్టీతో కమ్యూనిస్టు జెండాను తిరిగి ఎగురవేశారు.1972లో కొండపల్లి కృష్ణ మూర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఉండవిల్లి నారాయణమూర్తిపై 26,848 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1978లో వుండవిల్లి నారాయణమూర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోనికి దిగి సీపీఐ అభ్యర్థి ఏలేటి ధనయ్యపై 20,220 ఓట్ల మెజార్టీ సాధించారు. తెలుగుదేశం ఏర్పడిన తరువాత పరిస్థితులు మారి పోవడంతో కమ్యూనిస్టు పార్టీ కనుమరుగైపోయింది. 1983లో సామర్లకోటకు చెందిన బలుసు రామారావు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గోలి రామారావుపై 29,411 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తిరిగి 1985లో జరిగిన ఎన్నికల్లోనూ బలుసు రామారావు టీడీపీ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి దుర్వాసుల సత్యనారాయణ మూర్తిపై 20,375 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1989లో పంతం పద్మనాభం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బొడ్డు భాస్కరరామారావుపై 17,889 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1994లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన బొడ్డు భాస్కరామారావు కాంగ్రెస్ అభ్యర్థి పంతం పద్మనాభంపై 12,458 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకున్నారు. 1999లో బొడ్డు భాస్కరరామారావు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పంతం గాంధీమోహన్పై 5,306 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2004లో తోట గోపాలకృష్ణ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బొడ్డు భాస్కరరామారావుపై 10,584 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన పంతం గాంధీమోహన్ త్రిముఖ పోటీలో టీడీపీ అభ్యర్థి బొడ్డు భాస్కరరామారావుపై 3,056 ఓట్ల మెజార్టీతో విజయం సాధిÆ చారు. 2014లో జరిగిన ఎన్నికలలో అమలాపురం నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప వైఎస్సార్ సీపీ అభ్యర్థి తోట సుబ్బారావునాయుడుపై 10,583 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి ఉప ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా పదవులు దక్కించుకు న్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో దుర్వాసుల వెంకటసుబ్బారావు, వుండవిల్లి నారాయణమూర్తి, కొండపల్లి కృష్ణమూర్తి, బలుసురామారావులు మాత్రమే స్థానికులు మిగిలిన వారు స్థానికేతరులు. రెండు పర్యాయాలు విజయం సాధించింది వీరే.. స్థానికులైన బలుసు రామారావు రెండు పర్యాయాలు, వుండవిల్లి నారాయణమూర్తి రెండు పర్యాయాలు విజయం సాధించారు. స్థానికేతరులైన పంతం పద్మనాభం, బొడ్డు భాస్కరరామారావు రెండు పర్యాయాలు విజ యం సాధించారు. -
తొలి అడుగు..పడమర ఖండ్రికలోనే..
కపిలేశ్వరపురం (మండపేట): ఎన్నికల ప్రచారం వేడెక్కింది. పార్టీల తమ అభ్యర్థులను గెలిపించే పనిలో వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థులైతే గెలిచేందుకు కలిసి వచ్చే అంశాలపై దృష్టి సారిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ దశలో ఎవరికి ఓటేద్దామా అనే ఆలోచన చేస్తున్న క్రమంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనా తీరును ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన హయాంలో పలు సంక్షేమ పథకాలకు ఇందిరమ్మ పథకం అని పేరు పెట్టారు. ఆ రాష్ట్ర వ్యాప్త పథకానికి పునాది పడింది జిల్లాలోని కపిలేశ్వరపురం మండలం పడమర ఖండ్రికలోనే. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద 2006లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పథకం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పథకం అమలులో భాగంగా గ్రామంలోని దళిత కుటుంబమైన నేల సౌధామణి ఇంటి నిర్మాణ పనులకు వైఎస్సార్ కొబ్బరికాయ కొట్టారు. ఈ పర్యటనలో ఆయన ప్రజలతో మమేకమయ్యారు. ఆ చిరునవ్వు నేటికీ గ్రామంలో చెక్కు చెదరలేదు. ప్రజల గుండెలోతుల్లో ఇమిడిన ఆయన నడవడిక తీపి గుర్తులను ప్రజలు మననం చేసుకుంటున్నారు. పేదలకు ఎన్నటికీ సాధ్యం కావనుకున్న విద్య, వైద్య సదుపాయాలను కల్పిస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే చెల్లిందంటున్నారు. ఆయనే స్వయంగా కొబ్బరికాయ కొట్టారు వైస్ రాజశేఖర్‌రెడ్డిగారు పడమర ఖండ్రికలో ఇందిరమ్మ పథకాలను ప్రారంభించేందుకు వచ్చినప్పుడు గృహ నిర్మాణ పథకం పనులను మా ఇంటితోనే ప్రారంభించారు. ఆయన మీ వైఎస్సార్ ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించేందుకు మీ ఇంటికి వస్తారమ్మా అన్నప్పుడు పెద్దొళ్లు మనింటికేం వస్తారులే అనుకున్నాను. ఆ రోజు ఆయన ఎంతో ఆప్యాయతగా వచ్చి కొబ్బరికాయ కొట్టారు. నేను మా పిల్లలు ఆశ్చర్యపోయాం. నవ్వుతూ ఎంతో ఆప్యాయతతో పలకరించారు. ఆయన పుణ్యమా అని ఇల్లు కట్టుకోగలిగాం. నాలాంటి వాళ్లెందరికో మేలు చేసిన గొప్పాయన ఆయన. – నేల సౌదామణి, పడమర ఖండ్రిక -
పొత్తిళ్ల వేళే..మృత్యుఘోష
‘ఆకాశాన్నంటుతాయా’ అన్నంత ఎత్తున ఉండే మహావృక్షాల నుంచి.. అంగుళానికి మించని గడ్డిమొక్కల వరకూ లెక్కలేనన్ని వృక్షజాతులకు పురుడుపోస్తుంది అడవితల్లి. అలాంటి వనసీమలోనే పురిటికందులపై మృత్యుచ్ఛాయ పరుచుకుంటోంది. ‘అకాల’ యుముడి వికటాట్టహాసంతో ఎందరో పసిబిడ్డల కిలకిలలు మూగబోతున్నాయి. వారిని కన్నతల్లుల్నీ ప్రాణగండం వెన్నాడుతోంది. అయినా.. ఈ అరణ్యరోదన ఈ పాలకుల చెవిని సోకడం లేదు.’ సాక్షి, రంపచోడవరం: నవమాసాలు మోసి, పురిటి నొప్పులు పడి బిడ్డలను ఈ లోకంలోకి తీసుకువచ్చిన వనసీమలో గర్భశోకమే మిగులుతోంది. ఆదివాసీల ఆరోగ్యంపై సర్కారు అలసత్వంతో పొత్తిళ్లలోనే ఎందరో శిశువులు మృత్యువాత పడుతున్నారు. గత అయిదేళ్లుగా ఏటా తూర్పు మన్యంలో వందల సంఖ్యలో శిశు మరణాలు సంభవిస్తున్నాయి. పురిటి నొప్పులతో వచ్చే గర్భిణులకు సకాలంలో వైద్యం అందదు. బాలారిష్టాలతోనే, పౌష్టికాహార లోపంతోనే జన్మించిన శిశువుల ప్రాణదీపాలను నిలిపే ఆధునిక సదుపాయాల సంగతి వేరే చెప్పనక్కర లేదు. అనారోగ్యంతో పుట్టిన బిడ్డకు తక్షణం వైద్యం చేసే దిక్కు లేక మృత్యువాత పడుతున్నారు. ఏజెన్సీలో ఉన్న ఎన్నో కొండవాగులు ఎండాకాలంలో ఇగిరిపోతుంటాయి. అయితే శిశువులు, బాలింతల మరణాల వల్ల ఆ కుటుంబాల చెక్కిళ్లపై అన్ని రుతువుల్లోనూ కన్నీటివాగులు జలజలా పారుతూనే ఉంటున్నాయి. ఏజెన్సీలో శిశు మరణాలను ఆరికట్టే చర్యలు తీసుకోవడంలో అధికార యత్రాంగం విఫలమైంది. పౌష్టికాహార లోపం పెనుశాపం ఏజెన్సీలో గర్భిణులకు సరైన వైద్యం, పౌష్టికాహారం అందకపోవడం వారి పాలిట శాపంగా మారుతోంది. వారికి సరైన సమయంలో వైద్యుల పర్యవేక్షణ లభించదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో ఇచ్చే మందులు సక్రమంగా వాడకపోవడంతో వాటి ప్రభావం పుట్టే పిల్లలపై పడుతుంది. ఎందరో శిశువులు తక్కువ బరువుతో, వ్యాధులతో జన్మించి రోజుల వ్యవధిలోనే ఊపిరి విడుస్తున్నారు. రక్తహీనతతో బాధ పడుతున్న గర్భిణులకు మందులు, పౌష్టికాహారం ద్వారా ఆ లోపాన్ని చక్కదిద్దడం లేదు. ఐటీడీఏ అధికారులు ప్రతి గ్రామంలో గర్భిణులను గుర్తించి కాన్పుకు కొద్ది రోజుల ముందే రంపచోడవరం ఏరియా ఆసుపత్రి తరలించాలని నిర్ణయించారు. అయితే క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదు. అనేక మంది గర్భిణులు ఇంటి వద్దే పురుడు పోసుకుంటున్నారు. గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఏరియా ఆసుపత్రిలో 296 ప్రసవాలు మాత్రమే జరిగాయ. ఆసుపత్రుల్లో ప్రసవం సురక్షితమని ప్రచారం చేయడంలో, గర్భిణులు ప్రసవానికి ఆసుపత్రులకు వచ్చేలా చైతన్యం చేయడం చేయడంలో ఐటీడీఏ, వైద్య, ఆరోగ్యశాఖలు విఫలమవుతున్నాయి. నిరుపయోగంగా ‘న్యూ బోర్న్ కేర్’ యూనిట్ రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో 2013లో స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. అయితే యూనిట్లో వివిధ రుగ్మతలతో చేర్చిన పిల్లల ఆరోగ్య సంరక్షణ, పర్యవేక్షణలకు చిన్న పిల్లలు వైద్య నిపుణులు (పిడియాట్రిక్) ఉండాలి. అయితే ఎంతో కాలంగా ఆ పోస్టును భర్తీ చేయడం లేదు. ఫలితంగా లక్షల రూపాయల ఖర్చుతో యూనిట్ ఏర్పాటు చేసిన లక్ష్యం నెరవేరడం లేదు. కేవలం ఇద్దరు ఎంబీబీఎస్ వైద్యులు, నర్సులు మాత్రమే ఈ యూనిట్లో పనిచేస్తున్నారు. గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 66 మంది పిల్లలను ఈ యూనిట్ నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి, కాకినాడ జీజీహెచ్‌లకు రిఫర్ చేశారు. అంటే అత్యవసర వైద్యం అందడం లేదని అర్థమవుతుంది. దారిలోనే గాలిలో కలుస్తున్న ఊపిరి రంపచోడవరం నుంచి రాజమహేంద్రవరం, కాకినాడ తరలిస్తుండగానే ఎందరో శిశువుల ఊపిరి గాలిలో కలిసిపోతోంది. ఏజెన్సీలోని పీహెచ్‌సీల్లో అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో అనారోగ్యంతో ఉన్న పిల్లలను మెరుగైన చికిత్సకు ఇతర ఆసుపత్రులకు తరలించే అవకాశం ఉండడం లేదు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 18 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఇవన్నీ 24 గంటలూవైద్య సేవలు అందించాలి. ఏ సమయంలో రోగి వచ్చినా వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, అవసరమైతే వేరే ఆసుపత్రులకు రిఫర్ చేయాలి. అనేక సందర్భాల్లో పసిపిల్లలను అత్యవసర వైద్యం కోసం పీహెచ్‌సీలకు తీసుకువచ్చినా వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. పీహెచ్‌సీల్లో వైద్యులు నివాసం ఉండేందుకు క్వార్టర్స్ లేకపోవడం ఇందుకు ఒక కారణం. వైద్యులు లేని తల్లీపిల్లల ఆసుపత్రి రాజవొమ్మంగి మండలంలో మాతాశిశు మరణాలు ఎక్కువగా సంభవించాయి. ఇక్కడ తల్లీపిల్లల ఆసుపత్రి ఉన్నా పిడియాట్రిక్, గైనిక్ వైద్యనిపుణులను నియమించకపోవడంతో ఉపయోగం లేకుండా పోయింది. ఎంబీబీఎస్ వైద్యురాలితోనే ఆసుపత్రిని నడిపిస్తున్నారు. పేరుకు మాత్రమే 24 గంటల ఆసుపత్రిగా ఉంది. జడ్డంగి ప్రాంతంలోనూ మాతా శిశు మరణాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. అయినా ఆ పీహెచ్‌సీకి నేటికీ అంబులెన్స్ సదుపాయం కల్పించలేదు. రాజవొమ్మంగి అంబులెన్స్ వస్తేనే అత్యవసర వైద్యం కోసం కాకినాడ తరలించే అవకాశం ఉంటుంది. ఏజెన్సీ ప్రధాన కేంద్రమైన రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో కూడా పిడియాట్రిక్ వైద్య నిపుణులు లేరు. పీహెచ్‌సీల నుంచి అత్యవసర వైద్యం కోసం వచ్చే కేసులను రాజమహేంద్రవరం పంపిస్తున్నారు. కొనసాగుతూనే ఉన్న కన్నీటికథలు అడవిబిడ్డలపై మృత్యువు నీడ పరుచుకునే ఉందనడానికి మంగళవారం జరిగిన మరో శిశుమరణమే సాక్ష్యం. పెద్ద గెద్దాడకు చెందిన నెరం కుమారి రెండు వారాల క్రితం పురిటి నొప్పులతో స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేరింది. ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి పంపగా సాధారణ ప్రసవం అయింది. పుట్టిన శిశువును బాక్స్‌లో పెట్టాలని, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి పంపారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. తల్లిదండ్రులు మృత శిశువును ఆర్టీసీ బస్సులో గెద్దాడకు తీసుకువచ్చారు. అయిదేళ్లుగా అంతులేని అలసత్వం గత అయిదేళ్లలో ఏజెన్సీలో ఎన్నో మాతాశిశు మరణాలు సంభవిస్తున్నా అరికట్టేందుకు ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు. ఆదివాసీలు పౌష్టికార లోపంతో, రక్తహీనతతో బాధపడుతున్నా పట్టించుకోలేదు. మాతాశిశు సంరక్షణ శాఖ ద్వారా ఏజెన్సీలో శిశు మరణాలకు గల కారణాలపై సర్వే చేయించారు. సకాలంలో వైద్యం అందకపోవడం, పౌష్టికాహార లోపం గిరిజనులను పట్టిపీడిస్తున్నట్లు గుర్తించారు. పౌష్టికాహారం అందించాలన్న నిర్ణయం కొండెక్కింది. ఇంత కాలం పౌష్టికాహారం, రక్తహీనత గురించి పట్టించుకోని సర్కారు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక పౌష్టికాహార కిట్లను పంపిణీ నిమిత్తం జీసీసీ డిపోలకు పంపింది. కన్నీరు తుడిచిన జననేత గిరిజన ప్రాంతంలో మృత్యు తాండవాన్ని చూసి చలించిపోయిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఏడాది రంపచోడవరంలో శిశువులను కోల్పోయి, కంటికి కడివెడుగా విలపిస్తున్న కుటుంబాలను పరామర్శించారు. పార్టీ తరఫున వారికి ఆర్థిక సాయంఅందించారు. ఏజెన్సీలో వైద్య సేవలను మెరుగు పరిచి, గిరిజనుల బతుకుల్లో వెలుగు నింపుతామని హామీ ఇచ్చారు. గత ఐదేళ్లలో ఇదీ మృత్యుహేల.. సం. పుట్టిన శిశువులు మరణించిన వారు 2014 4604 233 2015 4481 239 2016 3854 239 2017 3367 103 2018 4286 43 -
హ్యాండ్ ఇచ్చిన బాబు.. అవాక్కైన హర్షకుమార్!
సీఎం చంద్రబాబు కాళ్లు పట్టుకొని మాజీ ఎంపీ హర్షకుమార్ అభ్యర్థించడం ఆయన అభిమానులను హతాశులను చేసింది. వ్యక్తిత్వాన్ని నిలుపుకొంటూ తనకంటూ ఓ ఒరవడిని ఏర్పరుచుకున్న ఈయన అలా సాగిలబడడమేమిటంటూ ఆయన అభిమానులు మనస్తాపానికి గురయ్యారు. వ్రతం చెడ్డా ఫలం దక్కకపోవడంతో తలపట్టుకుంటున్నారు హర్షకుమార్. ‘మొగుడు కొట్టాడని కాదు ... తోటికోడలు నవ్విందని’ వెనుకటికో కోడలు తెగ బాధపడిపోయినట్టుగా ... సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు జోరందుకోవడంతో మరింత అవమానానికి గురవుతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : గత పది రోజులుగా జిల్లాలో టీడీపీకి చెందిన కీలక నేతలు చేసిన వ్యాఖ్యలు జిల్లాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. నమ్మించి మోసగించడంలో చంద్రబాబు ఘనపాఠీ అని చెప్పకనే చెప్పారు. వెన్నుపోటు పొడవటంలో సిద్ధహస్తుడని ఆ పార్టీ నేతలకే స్పష్టమయింది. కానీ...రాజకీయాల్లో అపారమైన అనుభవం, సీనియర్ నాయకుడిగా, రెండు పర్యాయాలు ఎంపీగా పనిచేసిన హర్షకుమార్కు చంద్రబాబు నైజం తెలియకపోవడమేమిటని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తనకు టిక్కెట్ ఇస్తారని ఏ విధంగా అనుకున్నారని, వాడుకుని వదిలేసే నైజం గల చంద్రబాబు ఉన్న పళంగా అందలమెక్కిస్తారని ఎలా ఊహించారని, కష్టపడ్డ వారికే గుర్తింపు లేనప్పుడు రెండు రోజుల ముందు పార్టీలో చేరిన వ్యక్తికి పట్టం ఎలా కడతారని భావించారని బాబు వైఖరి తెలిసిన రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్దీ అదే దుస్థితి... మాజీ ఎంపీ హర్షకుమార్కు కూడా సీఎం చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. ఆయన కౌగిలి ధృతరాష్ట్రుడి కౌగిలనే అనుభవాలున్నా ఇంకా మోసపోతున్నవారి జాబితా పెరుగుతూనే ఉంది. టిక్కెట్ వస్తుందన్న ఆశతో... కాదు కాదు మధ్యవర్తుల రాయ‘బేరం’తో టీడీపీలో చేరిన హర్షకుమార్కు తీవ్ర నిరాశ ఎదురైంది. తొలుత ఎంపీ సీటు ఇస్తారని లీకులు ఇచ్చారు. తర్వాత అమలాపురం ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారని ప్రచారం చేశారు. ఆ తర్వాత పార్టీలో చేరబోతున్న హర్షకుమార్కు అమలాపురం ఎంపీ ఖాయమైందని నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో హర్షకుమార్కు టిక్కెట్ ఖరారైందని, అందుకే పార్టీలో చేరుతున్నారని అంతా భావించారు. కానీ ‘డామిట్ కథ అడ్డం తిరిగి’నట్టుగా పార్టీలోకి చేరిన తర్వాత చంద్రబాబు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. అమలాపురం ఎంపీ అభ్యర్థిగా గంటి హరీష్‌కు, అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితాబత్తుల ఆనందరావుకు ఖరారు చేసి హర్షకుమార్కు మొండిచేయి చూపించారు. ఈ టిక్కెట్ వస్తుందనే ఆశతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా హర్షకుమార్ నోరుపారేసుకున్నారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు కాలు పట్టుకోవడంపై తీవ్ర అసహనం కాకినాడలో రెండు రోజుల కిందట పార్టీలో చేరినప్పుడు చంద్రబాబు కాలు పట్టుకోవడంపై మాజీ ఎంపీ హర్షకుమార్ అభిమానులు, దళితులు, ప్రజా సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. సీటు కోసం ఇంతగా దిగజారాలా అని పెదవి విరిచారు. నెటిజన్లయితే హర్షకుమార్ తీరుపై పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. ఆయన సీనియారిటీని, స్థాయిని దిగజార్చుకుని వ్యవహరించడం సరికాదని ఆయన్ని అభిమానించేవారే పెదవి విరుస్తున్నారు. చంద్రబాబు నమ్మక ద్రోహి. వెన్నుపోటు పొడిచాడు. టిక్కెట్ ఇస్తానని నమ్మించి మోసగించాడు. గెలిపించిన పార్టీని వదిలి టీడీపీలో చేరి తప్పు చేశాను. పశ్చాత్తాపం చెందుతున్నాను. – ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వ్యాఖ్యలివీ... చంద్రబాబు అన్యాయం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ ఎంపీ నరసింహంను అణగదొక్కేందుకు యత్నించారు. టిక్కెట్ ఇవ్వకుండా పార్టీ మోసం చేసింది. టిక్కెట్ సంగతి పక్కన పెడితే కనీసం నా భర్త ఆరోగ్యం ఎలా ఉందో ఆరాతీసే పరిస్థితి కూడా లేదు. – ఎంపీ నరసింహం భార్య తోట వాణి ఆవేదనిదీ.. టీడీపీలో బ్రోకర్లదే పైచేయి. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లేదు. చంద్రబాబు నన్ను నమ్మించి మోసం చేశాడు. కాళ్లరిగేలా తిప్పుకుని మోసగించారు. కనీస గౌరవం ఇవ్వలేదు. – పులపర్తి నారాయణమూర్తి, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రోదనిదీ... -
టిక్కెట్ వచ్చిన ఆనందమేదీ..?
సాక్షి, అమలాపురం: ఆయన నిన్నటి వరకు రాజకీయ జీవితాన్నిచ్చిన గురువు. ఈయన గురువు అడుగుజాడల్లో నడిచే శిష్యుడు. కానీ రాజకీయాల్లో ఇటువంటివి తాత్కాలికమే కానీ...శాశ్వతం కాదని మరోసారి రుజువయింది. దీంతో శిష్యునికి టిక్కెట్ రాకుండా గురువు ప్రయత్నిస్తే..గురువును కాదని టిక్కెట్ తెచ్చుకున్న శిష్యుడు. ఇటువంటప్పుడు సర్వసాధారణంగా జరిగేది గురువు వైపు కొందరు..శిష్యుడు వైపు మరికొందరుగా గ్రూపులుగా ఏర్పడడం. ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకోవాలని చూడడం సర్వసాధారణం. ఇలా గురు, శిష్యుల పోరుతో అమలాపురం అసెంబ్లీ రాజకీయం రసవత్తరంగా మారింది. తెలుగుదేశం పార్టీని పుట్టి్టముంచనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ గురువు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అయితే.. శిష్యుడు అయితాబత్తుల ఆనందరావు. ఎమ్మెల్యే ఆనందరావుపై నియోజకవర్గంలో ఆ పార్టీలోనే అసంతృప్తి ఉంది. అల్లవరానికి చెందిన కొంతమంది కీలక నేతలు ఆనందరావుకు టిక్కెట్ ఇవ్వవద్దని అధిష్టానానికి ఫిర్యాదు చేసిన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అమలాపురం అసెంబ్లీ నుంచి కొత్తవ్యక్తిని పోటీ చేయించాలని ఉప ముఖ్య మంత్రి చినరాజప్ప గట్టి ప్రయత్నాలే చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆనందరావు స్థానంలో ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన బాలయోగి తనయుడు గంటి హరీష్ మాధుర్‌కు అవకాశం కల్పించాలని, లేదంటే పార్టీలోనే మరొకరికి అవకాశం ఇవ్వాలని అనుకున్నారు. అందుకు తగినట్టుగా వూహ్యాలు రచించారు. ఎన్నికల ముందు జరిగిన కొన్ని పరిణామాలు వీరిద్దరి మధ్య దూరాన్ని పెంచింది. మరీ ముఖ్యంగా తన తమ్ముడు జగ్గయ్యనాయుడుపై మీడియాలో వచ్చిన కథనాల వెనుక ఆనందరావు హస్తం ఉందని రాజప్ప ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు. ఇదే ఇద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచిందని అనుకుంటున్నారు. వీరిద్దరి మధ్య స్థాయిలో విభేదాలు చోటుచేసుకోవడంతో ఎట్టి పరిస్థితుల్లోను ఆనందరావుకు అవకాశం రాదని టీడీపీ క్యాడర్ భావించింది. కానీ నియోజకవర్గ సమన్వయ కమిటీ పార్టీ ఆధిష్టానంపై ఒత్తిడి చేసి ఆనందరావును తమ అభ్యర్థిగా చేసుకుంది. ముఖ్యంగా పట్టణానికి చెందిన మెట్ల రమణబాబు అతని వర్గీయులు పట్టుబట్టి ఆనందరావుకు టిక్కెట్ వచ్చేలా చేశారు. తద్వారా నియోజకవర్గంలో పట్టు సాధించారు. ఇదే సమయంలో అమలాపురంలో తనను కాదని పార్టీ ఆనందరావుకు టిక్కెట్ ఇవ్వదని భావించిన రాజప్పకు ఇది షాక్ అనే చెప్పాలి. తన మాట జవదాటని సమన్వయ కమిటీలో మెజార్టీ సభ్యులు ఆనందరావు వెనుక నిలబడడం, తీవ్ర జాప్యం తరువాత అధిష్టానం ఆనందరావును అభ్యర్థిగా ఎంపిక చేయడం రాజప్ప నియోజకవర్గంపై పట్టుకోల్పోయారనే ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాలు రాజప్ప వర్గీయులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ఆనందరావుకు టిక్కెట్ వచ్చినందుకు జరిగిన సంబరాల్లో రాజప్ప పేరు మచ్చుకైనా వినిపించలేదు. అతని సోదరుడు జగ్గయ్యనాయుడు, అతని వర్గీయులు ఈ సంబరాలకు దూరంగానే ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే అమలాపురం అసెంబ్లీ పరిధిలోని టీడీపీలో అసమ్మతి చాపకింద నీరులా మారింది. పరిణామాలన్నీ చూస్తుంటే ఈ ఎన్నికల్లో రాజప్ప వర్గీయులు అభ్యర్థి ఆనందరావుకు ఎన్నికల్లో సంపూర్ణ సహకారం అందిస్తారనే నమ్మకం కలగడం లేదు. దీనిని గుర్తించిన ఆనందరావు నష్ట నివారణ చర్యలకు దిగారు. రాజప్ప, అతని సోదరుడు జగ్గయ్యనాయుడుతో మంతనాలు చేపట్టారు. మంగళవారం రాత్రి పెద్దాపురం వెళ్లిన ఆనందరావు రాజప్పను కలిసి గతంలో జరిగిన పరిణామాల్లో తన ప్రమేయం లేదని వివరణ ఇవ్వడంతోపాటు తనను ఆశీర్వదించాలని కోరినా పెద్దగా ఫలితం లేదని తెలిసింది. ‘అధిష్టాన నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. నిన్ను గెలిపించాలని పార్టీ నాయకులకు చెబుతాను. నేను ఇక్కడ అభ్యర్థిని కాబట్టి నీ వెంట నేను ప్రచారానికి రాలేను’ అని చినరాజప్ప తేల్చిచెప్పేశారు. అన్నయ్యతోపాటు పెద్దాపురంలో ఉంటాను, నీ వెంట ఉండలేనని జగ్గయ్యనాయుడు కూడా కుండబద్దలు కొట్టడంతో నిరాశగానే వెనుతిరగాల్సి వచ్చింది. మరోవైపు ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురంలో ఆనందరావుపై అసంతృప్తితో ఉన్న కొంతమంది ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు టీడీపీని వీడే యోచనలో ఉన్నారు. ఇది పార్టీకి మరింత తలనొప్పిగా మారనుంది. జరుగుతున్న ఈ పరిణామాలతో పోరాడి టిక్కెట్ తెచ్చుకున్నాననే ఆనందం అభ్యర్థి ఆనందరావుకు లేకుండాపోయింది. పార్టీ పెద్దలు కలగజేసుకుని సర్ధిచెప్పినా ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. -
‘బోస్ గెలిస్తే మండపేటకు మంత్రి పదవి’
సాక్షి, మండపేట: వైఎస్సార్ సీపీ అభ్యర్థి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను అఖండ విజయంతో గెలిపించి పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇద్దామని, తద్వారా మండపేటకు మంత్రి పదవిని తెచ్చుకుందామని పార్టీ శ్రేణులకు నేతలు సూచించారు. సమయం తక్కువగా ఉన్నందున ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని బోస్ పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం స్థానిక అరవింద రైస్‌మిల్లు ఆవరణలో జరిగింది. నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పార్టీ అభ్యర్థి బోస్, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి చింతా అనురాధ, మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన, మున్సిపల్ ప్రతిపక్షనేత రెడ్డి రాధాకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, దూలం వెంకన్నబాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చింతా అనూరాధ మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థిగా తాను, తన నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించుకుని అధినేతకు కానుకగా అందజేస్తానన్నారు. మాజీ ఎంపీ రవీంద్రబాబు మాట్లాడుతూ పార్టీ అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి మాట్లాడుతూ వైఎస్ స్వర్ణయుగం పాలన తనయుడు జగన్మోహన్రెడ్డికే సాధ్యమన్నారు. మున్సిపల్ ప్రతిపక్షనేత రాజుబాబు మాట్లాడుతూ మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన బోస్ రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి ఆరోపణ లేకపోవడం ఆయన నిజాయితీకి నిదర్శనమన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు మాట్లాడుతూ బోస్ విజయంతో మండపేట నియోజకవర్గానికి మంత్రి పదవి రానుందన్నారు. రాష్ట్ర కార్యదర్శి వెంకన్నబాబు మాట్లాడుతూ పార్టీ శ్రేణులు శక్తివంచన లేకుండా బోస్ విజయానికి కృషి చేయాలన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు చిన్నం అపర్ణపుల్లేష్, సొసైటీ అధ్యక్షులు నల్లమిల్లి చినకాపు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు నల్లమిల్లి వీర్రెడ్డి, పెంకే వెంకట్రావు, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ సిరిపురపు శ్రీనివాసరావు, పార్టీ నాయకులు ఆకుమర్తి చిన్న, పోతంశెట్టి ప్రసాద్, సత్యకృష్ణ, గంగుమళ్ల రాంబాబు, పిల్లా వీరబాబు, సాధనాల శివ, దంతులూరి శ్రీరామవర్మ, వల్లూరి రామకృష్ణ, బోణి కుమారి, నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బోస్ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా : పట్టాభి సమావేశంలో మాట్లాడుతున్న పట్టాభి నియోజకవర్గంలో బోస్ విజయానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని పార్టీ నేత పట్టాభిరామయ్య చౌదరి తెలిపారు. ఎల్లప్పుడు బోస్ వెంటే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పట్టాభి సూచించారు. బోస్ విజయాన్ని జగన్‌కు కానుకగా అందజేస్తామన్నారు. అలాగే ఎంపీ అభ్యర్థి చింతా అనురాధకు నియోజకవర్గంలో భారీ ఆధిక్యత వచ్చేందుకు పాటుపడతానని పట్టాభిరామయ్య చౌదరి పేర్కొన్నారు. -
‘గెలిపించండి.. మీ రుణం తీర్చుకుంటా’
సాక్షి, జగ్గంపేట: ‘‘ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించండి మీ రుణం తీర్చుకుంటాను’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతుల చంటిబాబు అన్నారు. జగ్గంపేటలో మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. రావులమ్మతల్లి గుడి వద్ద భార్య వేణితో కలిసి పూజలు అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పాదయాత్రకు వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం వేలాది మందిని ఉద్దేశించి చంటిబాబు మాట్లాడారు. ‘‘రెండు సార్లు పోటీ చేశాను.. మరోసారి మీ ముందుకు వస్తున్నాను. నన్ను గెలిపించండి’’ అని కోరారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రానుందని ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుస్తామన్నారు. చంటిబాబుతో పాటు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిని వంగా గీతా పాల్గొని ప్రసంగించారు. అత్తులూరి నాగబాబు, బండారు రాజా, ఒమ్మి రఘురామ్, బుర్రి చక్రబాబు, వరుపుల రంగనాయకులు, మండపాక చిన్న, రాయి సాయి, పెద్దాడ రాజబాబు, రావుల రాజా, ఎంపీటీసీ అబ్బు, బూసాల బాబూరావు, సర్వసిద్ధి లక్ష్మణ్, ఇళ్ల అప్పారావు, తులా రాము, చిట్టిమాని సత్యనారాయణ, గండపల్లి మండలానికి చెందిన చలగళ్ల దొరబాబు, ఒబిణ్ణి సత్యనారాయణ, రామకృష్ణ, ఉప్పలపాటి సాయి, అడబాల ఆంజనేయులు, రామకుర్తి మూర్తి, పరిమి వెంకటేశ్వరరావు, పాపారావు చౌదరి, గోకవరం మండలానికి చెందిన సుంకర రమణ, సూరారెడ్డి, వరసాల ప్రసాద్, జనపరెడ్డి సుబ్బారావు, దాసరి రమేష్, సతీష్, రఫీ, అల్లు విజయ్‌కుమార్, తోట రవి, అయ్యన్న, పలికల గంగరాజు, చదలాడ బాబీ, దోమాల గంగాధర్, సూది శ్రీను, పాఠంశెట్టి విశ్వనాథం, గోపి, పాల్గొన్నారు. చంటిబాబు నామినేషన్‌కు తరలివెళ్లిన కార్యకర్తలు కిర్లంపూడి: వైఎస్సార్ సీపీ జగ్గంపేట నియోజకవర్గ అభ్యర్థి జ్యోతుల చంటిబాబు నామినేషన్ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి జగ్గంపేటకు భారీగా తరలివెళ్లారు. పలు గ్రామాల నుంచి వైఎస్సార్ సీపీ నాయకుల ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీగా జగ్గంపేట వెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతు జగ్గంపేట నియోజకవర్గం నుంచి జ్యోతుల చంటిబాబును అఖండ మెజార్టీతో గెలిపించడమే తమ లక్ష్యమన్నారు. కిర్లంపూడి, ముక్కొలు, గోనేడ, బూరుగుపూడి, గెద్దనాపల్లి, సింహాద్రిపురం, వీరవరం, తామరాడ, తదితర గ్రామాల నుంచి తరలివెళ్లి జ్యోతుల నామినేషన్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో చదలవాడ బాబి, అల్లు విజయకుమార్, విశ్వనాథం చక్రరరావు, దోమాల గంగాధర్, వెంకటజాన్బాబు, పెనగంటి రాజేష్, ఎం రాంబాబు, వి.సాంబశివ, డి అప్పలరాజు, ఎస్.శివకుమార్, ఎ.గంగబాబు, బి వెంకటరమణ, పి శ్రీను, వై పాము, మల్లేష్, పి రాజుగోపాల్, సూరిబాబు, గోపి, తదితరులు పాల్గొన్నారు. చంటిబాబు నామినేషన్‌కు తరలిన జనసందోహం గండేపల్లి: జ్యోతుల చంటిబాబు నామినేషన్ కార్యక్రమం మంగళవారం నిర్వహించడంతో గండేపల్లి మండలంలోని పలు గ్రామాల నుంచి జగ్గంపేటకు భారీగా తరలివెళ్లారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలపై భారీగా జగ్గంపేట చేరుకున్నారు. దీంతో జాతీయ రహదారి జనసందోహంగా మారింది. -
అడవి దున్న హల్చల్
సాక్షి, గండేపల్లి: మండలంలోని సింగరంపాలెం పరిధి పొలాల్లో మగ అడవి దున్న హల్చల్ చేస్తోంది. స్థానికులు, పొలాలకు వెళ్లే రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పామాయిల్ తోటలో దున్న సంచారాన్ని గమనించిన స్థానికులు మంగళవారం ఫారెస్ట్ అధికారి నూకాసాహెబ్కు సమాచారం అందజేశారు. దున్న నోటికి గాయమై ఏమీ తినలేక నీరసించి ఉందని అటవీ శాఖ అధికారి తెలిపారు. దున్నను బంధించి బోను సహాయంతో విశాఖ జూకు లేదా మారేడుమిల్లికి గానీ తరలిస్తామని ఆ అధికారి చెప్పారు. విశాఖ నుంచి మత్తుమందు ఇచ్చే వైద్యులు రావాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా గతంలో కె.గోపాలపురం అడవికి సమీపంలో ఒక దున్న మృత్యువాతకు గురైన విషయాన్ని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టి దున్నను సంరక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు. -
‘నిర్భయంగా ఓటు వేయండి’
సాక్షి, జగ్గంపేట: జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ విశాల్ గున్నీ అన్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మంగళవారం ఓటర్ల అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన కాట్రావులపల్లి గ్రామంలో మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 11న జరగనున్న ఎన్నికల్లో ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎన్నికలను పకడ్బందీగా ఎదుర్కొనేందుకు పాత కేసులు, నాన్ బైయిలబుల్ వారెంట్లు ఉన్న నిందితులు ఐదు వేల మందిని బైండోవరు చేశామన్నారు. 22 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని ఇప్పటి వరకు రూ.కోటి స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లా సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు వచ్చాయని, అదనంగా మరో ఆరు వేల ఫోర్సును కోరామన్నారు. ఏజన్సీలో 372 పోలింగ్ కేంద్రాల్లో సజావుగా ఎన్నికలు జరిగేలా చూస్తున్నామన్నారు. చత్తీస్ఘడ్, ఒడిశా సరిహద్దులో నిఘా ఉంచామన్నారు. మోడల్ కోడ్ ఉల్లంఘన, అసాంఘిక కార్యక్రమాలను ఎక్కడైనా జరిగితే వెంటనే ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సీ విజల్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయాలని కేసు నమోదు చేసి తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ రామారావు, సీఐ రాంబాబు, ఎస్సై రామకృష్ణ పాల్గొన్నారు. -
బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడు
సాక్షి, తూర్పు గోదావరి : తుని మండలం తేటగుంటలో దారుణం చోటుచేసుకుంది. పదకొండేళ్ళ బాలిక పై తుట్టా శివ(40) అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. బాలిక తల్లితో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. సెల్ ఫోన్లో నీలిచిత్రాలు చూపిస్తూ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తుని రూరల్ పోలీసులను ఆశ్రయించి ఆ బాలిక తల్లి.. కామాంధుడిపై ఫిర్యాదు చేసింది. -
వైఎస్ స్వర్ణయుగం జగన్‌తోనే సాధ్యం
కాకినాడ: వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనా కాలంలోని స్వర్ణయుగం రావాలంటే ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ, జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ ఆదివారం ఐదు నియోజకవర్గాలలో రావాలి జగన్– కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఆయా నియోజకవర్గ కో ఆర్డినేటర్ల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని వారికి నవరత్న పథకాల గురించి వివరించారు. ప్రత్తిపాడులో: ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఆధ్వర్యంలో రౌతులపూడి మండలంలోని ఐదు గిరిజన గ్రామాల్లో రావాలి జగన్–కావాలి జగన్ నిర్వహించారు. గిరిజనుల సమస్యలను పూర్ణచంద్రప్రసాద్ అడిగి తెలుసుకొన్నారు. పి.గన్నవరంలో: నియోజకవర్గంలోని అంబాజీపేట మండలం తొండవరం, పి.గన్నవరం మండలం బెల్లంపూడి గ్రామాల్లో కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో రావాలి జగన్– కావాలి జగన్ కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి నవరత్న పథకాలను ప్రజలకు వివరించారు. రాజానగరంలో : కో ఆర్డినేటర్ జక్కంపూడి విజయలక్ష్మి ఆ«ధ్వర్యంలో రాజానగరం మండలం సూర్యారావుపేటలో రావాలి జగన్–కావాలి జగన్‌లో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై వచ్చే ఎన్నికల్లో జగన్ నాయకత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా పాల్గొన్నారు. రంపచోడవరంలో: గంగవరం మండలం పిడతమామిడిలో కో ఆర్డినేటర్ నాగులాపల్లి ధనలక్ష్మి ఆధ్వర్యంలో రావాలి జగన్–కావాలి జగన్ నిర్వహించారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్ళి పార్టీ విధానాలు ప్రచారం చేశారు. రాజమహేంద్రవరం రూరల్‌లో : రాజమహేంద్రవరం రూరల్ 26వ డివిజన్లో ఆదివారం కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి నవరత్న పథకాలను ప్రచారం చేస్తూ జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
232వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, పత్తిపాడు : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 232వ రోజు ప్రారంభమైంది. రాజన్న తనయుడు వైఎస్ జగన్ బుధవారం ఉదయం బి.బి.పట్నం క్రాస్ నుంచి తన పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి గిడిజాం, ఎస్ అగ్రహారం మీదుగా డీజే పురం వరకూ పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. వైఎస్ జగన్ పాదయాత్రకు తూర్పు గోదావరి జిల్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతిపక్షనేతకు మద్దతుగా ప్రజలు పాదయాత్రలో పాల్గొని వారి సమస్యలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొస్తున్నారు. వారికి భరోసా కల్పిస్తూ రాజన్న తనయుడు ముందుకు సాగుతున్నారు. కాగా, మంగళవారం నాటికి ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ మొత్తం 2,677.9 కిలోమీటర్లు నడిచారు. -
220వ రోజు పాదయాత్ర షెడ్యూల్
-
వైఎస్ జగన్ 220వ రోజు పాదయాత్ర షెడ్యూల్
సాక్షి, పెద్దాపురం (తూర్పుగోదావరి జిల్లా) : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 220వ రోజు షెడ్యూల్ ఖరారైంది. వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత బుధవారం ఉదయం సామర్లకోట శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పెద్దాపురం టౌన్‌లోని బ్యాంక్ కాలనీ, మున్సిపల్ సెంటర్, పాత బస్టాండ్ సెంటర్ మీదుగా మరిడమ్మ తల్లి గుడి వరకు పాదయాత్ర సాగుతుంది. అనంతరం లంచ్ విరామం తీసుకుంటారు. తిరిగి లంచ్ క్యాంప్ నుంచి మధ్యాహ్నాం 2.45 గంటలకు పాదయాత్ర చేపడతారు. పెద్దాపురం వెములవారి సెంటర్ మీదుగా దర్గా సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహిస్తారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. -
ఆ కుటుంబాలకు 10లక్షలు చెల్లిస్తాం : వైఎస్ జగన్
సాక్షి, అచ్చంపేట : ‘ఎన్నికలు వస్తున్నాయనగానే చంద్రబాబుకు ప్రజలు గుర్తొస్తారు. మళ్లీ అందరినీ మోసం చేయడానికి ఒక్కో కులానికి మేనిఫెస్టోలో ఒక్కో పేజీ కేటాయిస్తారు. కానీ మత్స్యకారులకు ఇచ్చిన ఓ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. నాలుగున్నరేళ్లుగా ఒక్కసారైనా డీజిల్ ధరలపై సబ్సిడీ పెంచారా?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. 217వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం అచ్చంపేట జంక్షన్లో మత్స్యకారులతో వైఎస్ జగన్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు ప్రమాదవశాత్తూ చనిపోతే వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఏప్రిల్ 15నుంచి జూన్ 15 వరకు ఫిషింగ్ హాలిడేలో మత్స్యకారులకు అందించే ఆర్థికసాయం వందలో కేవలం 10మందికి మాత్రమే వస్తుంది. చంద్రబాబు ప్రభుత్వంలో మత్స్యకారులకు పెన్షన్ రాదు. మత్స్యకార కుటుంబాలకు చంద్రబాబు 130 కోట్ల రూపాయలు బకాయి పడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే నవరత్నాలను అమలుచేస్తామన్నారు. ఫిషింగ్ హాలిడే సమయంలో నెలకు మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 వేల చొప్పున చెల్లించి ఆర్థికసాయం అందిస్తామన్నారు. రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లను టీడీపీ సర్కార్ మూసేయాలని చూస్తుందన్నారు. జూలై ముగుస్తున్నా స్కూలు పిల్లలకు పుస్తకాలు, యూనిఫాం ఇవ్వడం లేదు. ఎందుకంటే.. పిల్లల తల్లిదండ్రులు వారిని ప్రభుత్వ స్కూళ్లు మాన్పించేసి నారాయణ, చైతన్య ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తారు. ఆ స్కూళ్లు చంద్రబాబు నాయుడు బినామీ, ఏపీ మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థలు కనుక టీడీపీ సర్కార్ అలాంటి చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. నూరు శాతం అక్షరాస్యత పేదల పిల్లలు ఉన్నత చదువులు చదివితేనే ఆ కుటుంబాలు బాగు పడతాయి. ఇవాళ ఇంజినీరింగ్ చదవాలంటే ఫీజులు లక్ష రూపాయలు దాటుతోంది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.30 వేలే ఫీజులుగా చెల్లిస్తోంది. మిగిలిన డబ్బుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అధికారంలోకి రావడం కోసం మాత్రమే చంద్రబాబు బీసీలపై ప్రేమ అంటారు. ఆపై వారికి ఏం చేయరు. పేదలు, బీసీలపై ప్రేమ చూపించి, వారి అభివృద్ధి కోసం కృషి చేసిన ఏకైక వ్యక్తి వైఎస్సార్ అని కొనియాడారు. పేదల కోసం తండ్రి వైఎస్సార్ ఒకడుగు ముందుకేస్తే ఆయన కొడుకుగా తాను రెండడుగులు ముందుకేస్తానని చెప్పారు. పిల్లలను చదివించండి. ఎన్ని లక్షలు ఖర్చయినా చదివిస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. చదువుకునేటప్పుడు పిల్లలు హాస్టల్లో ఉంటే.. మెస్ ఛార్జీల కోసం ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. మీ పిల్లలను బడికి పంపించండి. చిన్న పిల్లలను స్కూళ్లకు పంపిన తల్లులకు ఏడాదికి 15 వేల రూపాయలు అందిస్తాం. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 32 శాతం మందికి చదువు రాదు. అధికారంలోకి వచ్చాక నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధిస్తాం. 45 ఏళ్లకే పెన్షన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తాం. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15వరకు ఫిషింగ్ హాలిడేలో భాగంగా మత్స్యకారులకు నెలకు రూ.10 వేలు ఆర్థికసాయం. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి గ్రామానికి చెందిన చదువుకున్న వారికి 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. స్థానికులు ఉండటంతో సులువుగా పెన్షన్, రేషన కార్డులు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్లను 72 గంటల్లో మంజూరు చేస్తాం. మత్స్యకారులకు డీజిల్ మీద సబ్సిడీ పెంచుతాం. మత్స్యకారులకు డీజిల్ పోసుకున్నప్పుడు సబ్సిడీ వచ్చేలా చూస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారులకు కొర్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. బిల్లు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ఆస్పత్రి బిల్లు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. కుటుంబ పెద్ద ఆపరేషన్ చేయించుకున్న తర్వాత విశ్రాంతి అవసరమైతే ఆ సమయంలో పేషెంట్‌కు ఆర్థిక సాయం చేస్తాం. దీర్ఘకాలిక వ్యాదులతో బాధ పడుతున్నవారికి నెలకు రూ.10 వేల పింఛన్ అందిస్తాం. అవ్వాతాతల పెన్షన్ వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించి వారికి రూ.2 వేల పెన్షన్ ఇస్తాం. డీప్ పోర్టు కార్మికులకు భరోసా డీప్ పోర్టులో పనిచేసే మత్స్య కార్మికులకు జీతాలను పెంచుతాం. కాకినాడ డీప్ పోర్టులో పనిచేస్తూ మృతిచెందిన కార్మికులకు కూడా రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. అధికారంలోకి రాగానే మెరైన్ వర్సిటీని ఏర్పాటు చేస్తాం. ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళలకు ఉన్న అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో నేరుగా చెల్లిస్తాం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే సున్నా వడ్డీకే రుణాలను పునరుద్ధరిస్తామని భరోసా కల్పించారు. అధికారంలోకి రాగానే పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చట్టాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు. మత్స్య సంపద పెరగాలి మత్స్యకారులు అభివృద్ధి చెందాలంటే మత్స్య సంపద పెరగాలి. అయితే మన ప్రాంతంలో మత్స్య సంపద తగ్గిపోతుంది. కాకినాడలో వైఎస్సార్ పేరు మీదుగా మెరైన్ యూనివర్సిటీ స్థాపించాలని స్థానికుడు కోరారు. కచ్చితంగా ఓ వర్సిటీ ఏర్పాటుచేసి మత్స్య సంపద అభివృద్ధి కోసం కృషి చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. మత్స్య సంపదను సరిగా నిల్వచేసే సదుపాయాలు, కోల్డ్ స్టోరేజ్‌లు, మోడల్ మార్కెట్లు లేవని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని మరో వ్యక్తి కోరగా.. అధికారంలోకొచ్చాక అన్ని ఏర్పాటు చేస్తామన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోగా.. మా బ్యాంకుల్లో ఉన్న డబ్బు లాగేసుకున్నారు. మళ్లీ లక్ష రూపాయలు రుణాలు ఇస్తాం, 10వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు దొంగ హామీలు ఇస్తున్నారు. ఎవ్వరూ చంద్రబాబు హామీలను నమ్మోద్దని చెప్పారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం వల్ల తన భర్తకు ఆపరేషన్ చేపించి బతికించుకున్నట్లు చెప్పిన ఆ మహిళ వైఎస్ జగన్ సీఎం అయ్యి వైఎస్సార్‌లా మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కుమారి, కాకినాడ -
మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం
-
217వ రోజు ప్రారంభమైన వైఎస్ జగన్ పాదయాత్ర
సాక్షి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ శనివారం ఉదయం కాకినాడ జేన్టీయూ సెంటర్ నుంచి అశేష ప్రజానీకం మధ్య 217 రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి నాగమల్లి తోట జంక్షన్, సర్పవరం జంక్షన్ మీదుగా ఏపీఐఐసీ కాలనీకు పాదయాత్ర చేరుకుంటుంది. అనంతరం జననేత మధ్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర తిరిగి 2.45కు ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి అచ్చంపేట జంక్షన్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత స్థానిక మత్స్యకారుల సమస్యలు అడిగి వైఎస్ జగన్ తెలుసుకుంటారు. రాజన్న బిడ్డ రాత్రికి అక్కడే బస చేస్తారు. ప్రజా సమస్యలు వింటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. -
వైఎస్ జగన్ 216వ రోజు పాదయాత్ర షెడ్యూల్
సాక్షి, కాకినాడ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 216వ రోజు షెడ్యూల్ ఖరారైంది. వైఎస్ జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత గురువారం ఉదయం మండపేట నియోజకవర్గంలోని రాయవరం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మాధవనగర్, రంగరాయ మెడికల్ కాలేజీ మీదుగా జేఎన్టీయూ సెంటర్ వరకు కొనసాగుతుంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ జననేత పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. రాజన్న బిడ్డకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. ముగిసన పాదయాత్ర వైఎస్ జగన్ 215వ రోజు పాదయాత్రను ముగించారు. నేడు ఆయన పాదయాత్రను కొవ్వాడ శివారు నంచి చీడిగ, ఇంద్రపాలెం, ఎస్ఆర్కే సెంటర్, సంతచెరువు, కల్పన సెంటర్, కోకిల సెంటర్ మీదుగా ఆదిత్య కళాశాల సెంటర్ వరకు పాదయాత్ర కొనసాగించారు. ఇవాళ రాజన్నబిడ్డ 9 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ 2,559.9 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. -
గాలింపు కోసం మరో 17 బోట్లు
సాక్షి, రాజమహేంద్రవరం : ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద వృద్ధ గౌతమి పాయలో శనివారం జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైనవారి కోసం సహాయక బృందాల గాలింపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకూ మూడు మృతదేహాలు లభ్యం కాగా మరో నలుగురి కోసం గాలింపు చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. మత్స్యకారుల సహయంతో గాలింపు బృందాలు నిరంతరం అన్వేషిణ కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 17 బోట్లతో సముద్రపు మొగలో గాలింపు చేపట్టినట్లు తెలిపారు. రామచంద్రాపురం డివిజన్లతో పాటు అవసరమైన చోట్ల పంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వెయ్యికిపైగా లైఫ్ జాకెట్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. స్కూలు పిల్లలతో పాటు ప్రజలు నది దాటేటప్పుడు లైఫ్ జాకెట్లు ఖచ్చితంగా ధరించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. -
యానాంలో కొనసాగుతున్న గాలింపు చర్యలు
-
213వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, అనపర్తి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 213వ రోజు ప్రారంభమైంది. ఆదివారం వర్షం కారణంగా రద్దైన పాదయాత్ర నేడు కొనసాగనుంది. సోమవారం ఉదయం వైఎస్ జగన్ పెద్దపూడి మండలం మామిడాల శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి పెద్దడ, కికవోలు, పెద్దపూడి, దొమ్మాడ మీదుగా కరుకుడురు వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఆదివారం రోజు వర్షం పడుతున్నా రాజన్న బిడ్డను చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలకు క్యాంపుకు వద్దకు చేరుకున్నారు. జోరు వానలోను జననేత తనకోసం వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. కష్టం వస్తే నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఇక పాదయాత్రలో రాజన్న బిడ్డకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. -
పడవ ప్రమాదం.. మహిళ మృతదేహాం లభ్యం..
సాక్షి, తూర్పుగోదావరి : గోదావరిలో నదిలో గల్లంతైన వారిలో ఓ మహిళ మృతదేహాం లభ్యమైంది. కొమ్మలపల్లి వద్ద గల్లా నాగమణి మృతదేహాన్ని గాలింపు చర్యలో సిబ్బంది గుర్తించారు. గల్లంతైన ఆరుగురి విద్యార్ధుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సలాదివారిపాలెం లంక నుంచి పశువలలంకకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హెలికాఫ్టర్‌తో సెర్చ్ చేసినా స్పష్టత లేదు..! గోదావరి నదిలో గల్లంతైన విద్యార్థినుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. యానం బీచ్ నుంచి కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్ గున్ని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏకధాటిగా వర్షం కురుస్తున్నా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రోజులో 45 నిమిషాలు మినహా వర్షం కురుస్తూనే ఉంది. అంతేకాక విద్యార్థినుల కోసం హెలికాప్టర్‌తో సెర్చ్ చేసినా స్పష్టత రావడం లేదని కలెక్టర్ చెప్పారు. రాత్రంతా గాలింపు చర్యలు కొనసాగిస్తామన్నారు. మూడు డ్రోన్లు కూడా వినియోగిస్తామని తెలిపారు. రేపు కూడా ఆపరేషన్ కొనసాగుతుందని తెలియజేశారు. గల్లంతైన విద్యార్ధుల వివరాలు.. తిరుకోటి ప్రియ(14), 8వ తరగతి, వలసలతిప్ప, ముమ్మిడివరం మండలం సుంకర శ్రీజ(15), 10వ తరగతి, సలాదివారి పాలెం పోలిశెట్టి వీర మనీషా(15), 10వ తరగతి పోలిశెట్టి అనూష(13), 9వ తరగతి, సలాదివారి పాలెం పోలిశెట్టి సుచిత్ర (11), 6 వ తరగతి, సలాది వారి పాలెం కొండేపూడి రమ్య(14), 9వ తరగతి, శేరిలంక -
గోదావరిలో పడవ ప్రమాదం.. ఓ మహిళ మృతదేహాం లభ్యం
-
‘పడవ ప్రమాదం.. అక్కడి ఎమ్మెల్యేదే బాధ్యత’
సాక్షి, తూర్పుగోదావరి : గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంపై కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి స్పందించారు. మలాపురంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వనం-మనం కార్యక్రమంలో పాల్గొనడం కారణంగానే పిల్లలు గల్లంతయ్యారని పురంధేశ్వరి పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి అక్కడి ఎమ్మెల్యే బాధ్యత వహించాలని ఆమె సూచించారు. పోలవరం బిల్లులు ఏవీ పెండింగ్ లేవు అని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ నేత పురంధేశ్వరి తెలిపారు. కన్నీరే.. గోదారై.. -
మామిడాలలో వర్షం : ప్రజాసంకల్పయాత్రకు అంతరాయం
సాక్షి, అనపర్తి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. మామిడాలలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షం కారణంగా జననేత పాదయాత్ర ప్రారంభం కాలేదు. జోరుగా వాన కురుస్తున్నా రాజన్న బిడ్డను చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. తనను చూడటానికి వచ్చిన వారిని ఆయన వర్షంలోను మాట్లాడుతూ సమస్యలను తెలుసుకుంటున్నారు. ఆదివారం ఉదయం పెద్దపూడి మండలం మామిడాల నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. వర్షం నుంచి ఉపశమనం లభించిన అనంతరం పాదయాత్ర ప్రారంభం అవుతుందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రాఘురాం ఒక ప్రకటనలో తెలిపారు. -
211వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, అనపర్తి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 211వ రోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం నైట్‌క్యాంప్ శివారు నుంచి జననేత పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి ఉలపల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. బుధవారం మండపేట నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి చేసుకొన్న జననేత, అనపర్తి నియోజక వర్గంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నియోకవర్గ ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న జననేతకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. -
210వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, మండపేట : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 210వ రోజు ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజక వర్గంలో వియవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం మండపేట నియోజకవర్గం రాయవరం నుంచి జననేత పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలోని కొమరిపాలెం, తొస్సిపుడి క్రాస్ మీదుగా పండలపాక, ఉలపల్లి వరకు పాదయాత్ర కొనసాగనుంది. -
206వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, ద్రాక్షారామం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 206వ రోజు అశేష ప్రజానీకం మధ్య ప్రారంభమైంది. ప్రజా సమస్యలపై పోరాడుతూ జననేత చేపట్టిన పాదాయత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు, పార్టీ నేతలు తరలి రాగా, ప్రజల ఆనందోత్సాహల మధ్య గురువారం పాదయాత్ర ప్రారంభమైంది. ద్రాక్షారామం నుంచి రాజన్న బిడ్డ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అక్కడ నుంచి వెలంపాలెం మీదుగా జగన్నాయపాలెం వరకూ వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. రాజన్నబిడ్డను కలవడానికి, తమ సమస్యలను చెప్పుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. -
పెట్రోలియం వనరులు పుష్కలం అయినా.. : వైఎస్ జగన్
సాక్షి, ముమ్మిడివరం : ఈ ప్రాంతంలో పెట్రోలియం వనరులు పుష్కలంగా ఉన్నా ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించడం లేదని, చమురు, గ్యాస్ తీసుకుంటున్నారు.. కానీ ఇక్కడి ప్రజలను మాత్రం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్ర 201వ రోజు పాదయాత్రలో భాగంగా ముమ్మిడివరం హైస్కూల్ సెంటర్ వద్దనిర్వహించిన బహిరంగ సభలో ఆయన స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చుట్టూ గోదావరి కానీ.. తాగడానికి చుక్క నీరులేదు.. ‘జీవనది గోదావరి ప్రవహించే నేల కోనసీమ.. అయినా తాగునీరు ఉండదు. పెట్రోలియం వనరులు పుష్కలం. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలుండవు. అందరూ గల్ఫ్ వెళ్లాల్సిందే. కోనసీమ ముఖ చిత్రం ఇలా ఉంటే .. బాబుగారి దోపిడీ మాత్రం గేదల లంకే వరకు విస్తరించింది. అదే గ్రామంలో ఈ దోపిడి అడ్డుకున్న మహిళలు, యువకులపై అనేక కేసులు పెట్టారని బాధితులు నాతో చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నా.. ఈ జిల్లా నుంచి 19స్థానాలకు 14 స్థానాలు టీడిపీకి ఇచ్చాం. ఇవి సరిపోవని వైసీపీ ఎమ్మెల్యేలను పశువల సంతాలా కొన్నాడన్నా.. మొత్తం 17 మంది ఎమ్మెల్యేలున్నారన్నా కానీ చేసిందేమి లేదన్నా అని ఇక్కడి ప్రజలు నాతో ఆవేదన చెందుతున్నారు. ఈ మీటింగ్‌లో నీళ్లు చూపించడన్నా.. అని బాటిల్ చూపిస్తూ.. ఇది చెరుకు రసం కాదయ్యా బాబు ఇవి వారు తాగే మంచీ నీరు అని చెప్పమన్నారు. ఇది కోనసీమ పరిస్థితి. వ్యవసాయం పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. ఇక్కడి రైతులకు మేలు జరగాలని దివంగత నేత, నాన్నగారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెల్టా అభివృద్దికి కాలువల నిర్మాణాలతో కృషి చేశారు. కానీ ప్రస్తుతం పోలవరం పనులు నత్తనడకగా సాగుతున్నాయి. డెల్టా కాలువ పనులు ఆగిపోయాయి. ఏ పని కూడా ఒక్క అడగు కూడ ముందుకు వెళ్లని పరిస్థితుల్లో ఈ జిల్లా ఉంది. రైతులంతా గతంలో క్రాప్ హాలిడే డిక్లేర్ చేశారు. ఆరోజుల్లో లేవనెత్తిన సమస్యలు.. నాతో చెప్పినవి.. నవంబర్ వచ్చే సరికి ఈ ప్రాంతంలో వరుసగా తుఫానులు వస్తాయన్నా. వాటి తుఫానులతో చేతికొచ్చిన పంట నీటిమయమమ్యే అవకాశం ఉందని, జూన్ తొలి మాసంలోనే నీళ్లందించాలని, క్రాప్ హాలిడేను డిక్లేర్ చేశారు. ఆరోజు నేను వచ్చా.. చంద్రబాబు సైతం పిట్టల దొరలా వచ్చాడు. జూన్ తొలి వారంలోనే నీళ్లు అందిస్తానని హామీ ఇచ్చాడు. ఈ నాలుగేళ్లలో ఒక్కసారైనా నీళ్లు అందయా అని అడుగుతున్నా..(ప్రజల నుంచి లేదు.. లేదు.. అని సమాధానం) జూన్ మాసం దేవుడేరుగు.. మళ్లీ నవంబర్ వస్తుంది... నారుమళ్లు వేస్తున్న రైతన్నా మళ్లీ భయపడుతున్నాడు. చుట్టూ కొబ్బరి పంట.. ఆ పంట రైతులు నుంచి వస్తున్న మాట.. ఇదే రైతన్నా నా దగ్గరికి వచ్చి చెప్పింది.. వరికి మధ్దతు ధర రూ. 1500 అంటారన్నా.. కానీ మార్కెట్ తీసుకెళ్తే రూ.1130 కూడా అడుగుతలేరన్నాఅని ఆవేదన వ్యక్తం చేశాడు. చుట్టూ కొబ్బరి పంట.. ఆ పంట రైతులు నుంచి వస్తున్న మాట .. బాబు ముఖ్యమంత్రి అయిండు మా కర్మ ధర అమాంతం పడిపోయిందన్నా అని నాతో బాధపడ్డారు. దీనికి కారణం దళారీలకు నాయకుడు, గంజదొంగలకు నాయకుడు ఈ పెద్దమనిషే. హెరిటేజ్ ఫ్రెష్ అని షాప్ పెట్టాడు.. రైతుల నుంచి కొనుగోలు చేసి వాటినే ప్యాక్ చేసి అధిక ధరలకు అమ్ముకుంటాడు. దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయాల్సిన ముఖ్యమంత్రే ఓదళారీలా ప్రవర్తిస్తున్నాడు. ఎన్నికల సమయంలో కొబ్బరి పరిశ్రమ పెడతానని ఊదర గొట్టాడు. ఇప్పుడేక్కడైన అది కనిపిస్తుందా అని అడుగుతున్నా. ఉద్యోగాలు రావాలంటే ఇలాంటి పరిశ్రమలు నెలకొల్పాలనే సోయి కూడా మన సీఎంగారికి లేదు. నీటి పంటకు సైతం.. అన్నా ఈ నియోజకవర్గంలో 16 వేల ఎకరాల్లో రొయ్యలు, చేపలు పెంచుతాం. నేల మీద పండే పంటలకే కాదన్నా నీటిలో పండే పంటలకు కూడా మద్దతు ధరల్లేవన్నా అని డ్వాక్రా రైతులు నాతో ఆవేదన వ్యక్తం చేశారు. దళారులంతా కుమ్మక్కై ధర పడిపోయేలా చేస్తున్నారన్నా అని బాధపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆక్వా రంగాన్ని, వాళ్ల ఆవేదన చూసి, దేవుడి దయ వల్ల మనందరి ప్రభుత్వం వస్తే యూనిట్ రూ.1.50 కరెంట్ ఇస్తానని పాదయాత్రలో చెప్పా. వెంటనే జిత్తులమారి ఈ పెద్దమనిషి రెండు రూపాయలకు ఇస్తానని చెప్పాడు. గత ఒక నెల నుంచి బాబు పాంప్లెట్ పేపర్లు రోజుకో స్కీమ్.. అంటూ ఎన్నికలు ముందు రోజుకో సినిమా చూపిస్తున్నాయి. తాగు నీటికి ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ అంతా ఉప్పు నీరు అయిన పరిస్థితి. గోదావరి నీళ్లంతా ఈ ప్రాంతాలకు వచ్చే సరికి కలుషితమవుతున్నాయి. రక్షిత మంచినీళ్లు దొరకక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ నీళ్లు చూపించడమే కాకుండా ఇంకో విషయం అడుగమన్నారు. గత ఎన్నికల ముందు రెండు రూపాయలకే 20 లీటర్ల నీళ్లిస్తానన్న హామీ ఎమైందనీ నిలదీయమన్నారు. ఈ నియోజక వర్గంలో నాన్నగారు చేసిన పనిని గుర్తుచేసుకుంటున్నారు. 18 కోట్లతో పోలమ్మ చెరువులో మంచి నీటి ప్రాజెక్టుచేపట్టాడని, కానీ ప్రస్తుతం దాన్ని పట్టించుకునే నాదుడే లేడని చెబుతున్నారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో మంచినీళ్లు లేవు. చెబితే పట్టించుకునే నాదుడు లేడు. కాట్రేని కోట మండలం, మూలపులంలో నాన్నగారు 2009లో బ్రిడ్జి మంజూరు చేశాడని, అప్పుడు 30 శాతం పనులు కూడా అయ్యాయని, కానీ ప్రస్తుతం దాన్ని పట్టించుకునే నాదుడు లేడన్నా అని అక్కడి ప్రజలంతా నాతో బాధపడుతు తెలిపారు. కొత్త ఉద్యోగాలేమో.. ఉన్న ఉద్యోగాలు.. గుత్తేనదీవి నుంచి గోదావరి పాయవరకు 10 కోట్లతో గ్రామాలకు అనుసంధానం చేయాలని ప్రతిపాదనలు చేస్తే ఆ తరువాత పట్టించుకోక పోవడంతో లంక గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా పోయింది. గుజరాత్ పెట్రోలియం శాఖ చేపట్టిన పైపు లైను తవ్వకాల ద్వారా మత్స్యకారులు నష్టపోతారని, అప్పడు ఆ కుటుంబాలకు 17 నెలల పాటు 6,500 రూపాయలు ఇచ్చేలా తీర్మానం చేశారనీ, కానీ, 6 నెలలే ఇచ్చారని ఆ కుటుంబాలంతా నాతో ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ పెట్రోలియం శాఖ వారు స్థానికంగా 2000 మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చారు. ఆ కంపెనీ కాస్త ఓఎన్జీసీలో విలీనం కావడంతో ఆ ఉద్యోగాలు సైతం తీసేస్తుంటే పట్టించుకునే నాదుడే లేడన్నా అని వాపోతున్నారు. చంద్రబాబు విశాఖలో మీటింగ్‌లో పెట్టి ఏపీకి 20లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయంటాడు.. కొత్త ఉద్యోగాలు వచ్చాయంటాడు.. కొత్త ఉద్యోగాలేమో కానీ, మా ఉన్న ఉద్యోగాలు పోతున్నయన్నా అని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాంతంలో 20 వేల ఇళ్లు కట్టించారన్నా. బాబు ఒక్కటంటే ఒక్క ఇళ్లు కూడా కట్టించలేదన్నా అని ఇక్కడి ప్రజలు బాధపడుతున్నారు. ఇప్పడు గాడిదలు కాస్తున్నారా.? ఎన్నికలకు ముందు హోదా సంజీవిని అన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్యాకేజీ అడిగారు. అప్పుడు విభజన చట్టంలోని హామీలు ఏమిగుర్తుకు రాలేదు. కానీ ఈ మధ్యలో ధర్మపోరాటం అని, కాకినాడలో ఆశ్చర్యం కలిగించే మాటలు చెప్పాడు. ఇంతకు బాబుగారు విభజన చట్టం చూశారా? అని మీ ద్వారా నేను అడుగుతున్నా.. ప్రత్యేక హోదాను పార్లెమెంట్ సాక్షిగా ఇస్తామని చెప్పారు. ఆరు నెల్లలో ఇచ్చిన హామీలన్నీ కార్యచరణలోకి తీసుకొస్తామన్నారు. ఆ హామీల్లో కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వేజోన్, దుగ్గరాజు పట్నం తొలి దశ పూర్తి అని హామీలున్నాయి. బీజేపీతో కలిసున్నన్ని రోజులు మాట్లాడని చంద్రబాబు కొత్తగా 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తారట. 25 మందిలో 20 మంది ఎంపీలు బాబుదగ్గరే ఉన్నారు.. ఇంత మంది ఎంపీలతో నాలుగేళ్లుగా ఆయన గాడిదలు కాస్తున్నారా.?’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘మరో ఆరునెలల్లో ఎన్నికలొస్తాయని అంటున్నారు ఈ పరిస్థితిల్లో ఒక్కసారి ఆలోచించండి. అబద్దాలు చెప్పేవారు మీకు నాయకుడుగా కావాలా? మోసాలు చేసే వాడు కావాలా అని అడుగుతున్నా? (ప్రజలనుంచి వద్దవద్దు..అనే సమాధానం), అధికారంలోకి రాగానే నవరత్నాలతో అందరి జీవితాల్లో సంతోషం నింపుతాం. ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలకు పునర్వైభవం తీసుకోస్తాం. ప్రజల కోసం ఆ దివంగత నేత వైఎస్ఆర్ ఒకడుగు వేస్తే.. ఆయన కొడుకుగా నేను రెండడుగులు ముందుకేస్తా’ అని వైఎస్ జగన్ తెలిపారు. -
201వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, అమలాపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నానంటూ భరోసానిస్తూ జననేత వైఎస్ జగన్ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజన్న బిడ్డ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 201వ రోజుకు చేరుకుంది. శనివారం ఉదయం భీమనపల్లి శివారు నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి సింగాయపాలెం, అనంతవరం, మహిపాల చెరువు చేరుకుని అక్కడ జననేత భోజన విరామం తీసుకుంటారు. అనంతవరం శివారు వద్ద వైఎస్ జగన్ పాదయాత్ర ముమ్మిడివరం నియోజకవర్గంలోకి ప్రవేశించినుంది. విరామం అనంతరం పాదయాత్ర తిరిగి 2.45కు ప్రారంభమౌతుంది. బొండయకొడు, కొండలమ్మచింత మీదుగా ముమ్మిడివరం వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం ముమ్మిడివరం హైస్కూల్ సెంటర్ వద్ద జరిగే బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొని స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఇదివరకే 200 రోజులతో పాటు 2,400 కిలోమీటర్ల పాదయాత్రను దిగ్విజయంగా పూర్తిచేసుకుంది. -
200వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, అమలాపురం : ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారం 200వ రోజు మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా జననేత సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పాదయాత్ర ప్రారంభించి నేటికి రెండు వందల రోజుల మైలు రాయి చేరుకోవడం అమలాపురంలో పండుగ వాతావరణం ఏర్పడింది. పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అశేష ప్రజానీకం మధ్య, జననేత తన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కామనగరువు, అప్పన్నపేట, విలాసవిల్లిల, వాసంశెట్టివారి పాలెం మీదుగా భీమనపల్లి వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారంతో 200 రోజులు పూర్తి చేసుకోనుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అరాచక పాలనను ఎండగడుతూ, ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయ నుంచి గతేడాది నవంబర్ 6న వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. 200 రోజుల పాటు 2400 కిలోమీటర్లలకుపైగా పాదయాత్రను రాజన్న బిడ్డ పూర్తి చేసుకున్నారు. ప్రజల కష్టాలు వింటూ, వారి కన్నీళ్లను తుడుస్తూ, ఆత్మీయంగా స్పృశిస్తూ, పలకరిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. -
మేమంతామీ వెంటే.. వైఎస్ జగన్‌కు జనం భరోసా
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : పాదయాత్రలో జగన్ వేస్తున్న ఒక్కో అడుగుపై జనం ఆశలు పెంచుకుంటున్నారు. తమను కష్టాల ఊబి నుంచి గట్టెక్కించే తీరం వైపు ఆ అడుగులు సాగుతున్నాయని వారు బలంగా నమ్ముతున్నారు. అందుకే రాజన్న బిడ్డకు ఎదురేగి మరీ స్వాగతం పలుకుతున్నారు. మరోవైపు ఏఎన్ఎంలు, విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు, రైతులు, నిరుద్యోగులు.. ఇలా వివిధ వర్గాల వారు జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో పూర్తయిన పాదయాత్ర ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో సాగుతోంది. ఈ జిల్లాల్లో అడుగడుగునా జనాభిమానం వెల్లువెత్తింది. ఇసుక వేస్తే రాలనంతగా బహిరంగ సభలు కిటకిటలాడాయి. ఈ సభల్లో జగన్ ప్రసంగం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. ఒక జిల్లాతో మరో జిల్లా పోటీపడుతోందా అన్నట్లు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో పాదయాత్ర పాలకుల్లో గుబులు రేపింది. రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయేలా ఊరూరా జనకెరటం ఎగిసిపడింది. విజయవాడలో దుర్గమ్మ వారధి, ఉభయ గోదావరి జిల్లాల మధ్య ఉన్న గోదావరి వంతెన ప్రకంపించేలా జగన్ వెంట జనం అడుగులో అడుగు వేసి మరో చరిత్ర సృష్టించారు. కదిలిస్తే చాలు కన్నీళ్లే.. పింఛన్లు రావడం లేదని, ఇళ్లు లేవని, రేషన్‌కార్డులు లేవని, ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, పంటలకు గిట్టుబాటు ధర లేదని, రుణమాఫీ కాలేదని, ఇన్పుట్ సబ్సిడీ రాలేదని, నకిలీ విత్తనాలు వస్తున్నాయని వివిధ వర్గాల వారు, రైతులు జననేతకు నివేదించారు. తమ రుణాలు మాఫీ కాలేదని, బ్యాంకులు అప్పులు కట్టాలని ఒత్తిళ్లు తెస్తున్నాయని డ్వాక్రా మహిళలు వాపోయారు. అర్ధంతరంగా ఆగిన సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని రైతులు విన్నవించారు. అన్నా.. ఈ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగమూరాలేదని నిరుద్యోగులు.. మమ్మల్ని నానా ఇక్కట్లకు గురి చేస్తున్నారని ఉద్యోగులు.. వారి బాధను వెళ్లగక్కారు. తమ పరిస్థితి దీనంగా మారిందని పొగాకు, ఆక్వా రైతులు, కిడ్నీ బాధితులు, మత్స్యకారులు, చేనేతలు గోడువెళ్లబోసుకున్నారు. పండుటాకులపై ఇసుమంతైనా కనికరం లేకుండా జన్మభూమి కమిటీలు ఉన్న పింఛన్లను కూడా పీకేశాయని వృద్ధులు కన్నీటిపర్యంతమయ్యారు. జగన్ అందరి కష్టాలూ ఓపిగ్గా విన్నారు. వారి కన్నీళ్లు తుడిచారు. మనందరి ప్రభుత్వం వచ్చాక అందరి కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు. ప్రధానంగా నవరత్నాల పథకాలతో ఆదుకుంటామని భరోసా ఇవ్వడం పేదలందరికీ ఊరట కలిగించింది. ఉద్యోగులకు ఇబ్బందిగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సీపీసీని) రద్దు చేస్తానని స్పష్టీకరించడం వారిలో భరోసా కలిగించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామీ ఇవ్వడం లక్షలాది కుటుంబాలకు ఊరట కలిగించింది. తాడిత, పీడిత జనానికి కొండంత అండ వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర దగాపడ్డ బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు మనో బలాన్నిచ్చింది. తాను అధికారంలోకి రాగానే ఎవరికి ఏం చేసేది జగన్ స్పష్టంగా చెప్పారు. బీసీల అధ్యయనానికి ఓ కమిటీ వేస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తానని ప్రకటించారు. పేద రైతులకు భూపంపిణీతో పాటు ఉచితంగా బోర్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. దళితుల భూములు లాక్కోకుండా చట్టం తెస్తామన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏ విధంగా ప్రయోజనం కలిగిందో అంతకన్నా రెండడుగులు ముందుకేసి అండగా ఉంటానన్నారు. అన్ని కులాలకు ప్రత్యేక కార్పొరేషన్, చట్ట సభల్లో అవకాశం కల్పిస్తామన్నారు. జగన్ భరోసా దళితుల్లో ఆశాకాంతులు నింపింది. బాధాతప్త గుండెలకు భరోసానిచ్చింది. ఆసరాలేని అవ్వాతాతలకు బతుకు తీపి పంచింది. యువత, నిరుద్యోగుల్లో కొత్త భవిష్యత్‌పై ఆశలు రేకెత్తించింది. చదువుకునే విద్యార్థుల్లో మనోధైర్యం తీసుకొచ్చింది. కన్నీటి పర్యంతమవుతున్న రైతన్నను వెన్నుతట్టి ప్రోత్సహించింది. గుండె చెదిరిన ప్రతి వ్యక్తికీ భవిష్యత్ బాగుంటుందనే నమ్మకం కలిగించింది. దీంతో అన్ని సామాజిక వర్గాలు ఆత్మీయ సదస్సులతో అభిమాన నేతను వెన్నంటాయి. మీరు అధికారంలోకి వస్తేనే కష్టాలన్నీ తీరతాయని ఆకాంక్షించారు. పార్టీ శ్రేణుల్లో కదనోత్సాహం జగన్ పాదయాత్ర వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అది ఎంతగా అంటే ఇప్పడు ఎన్నికలు జరిగితే క్లీన్ స్వీప్ చేస్తామనేంత. ఊరూరా జనం ఎదురేగి.. తాము మరోసారి మోసపోమని, మీ వెంటే ఉంటామని జననేతకు భరోసా ఇస్తుండటం ఇందుకు నిదర్శనం. బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాలకు స్వచ్ఛందంగా హాజరైన జనం, దారిపొడవునా అన్ని వర్గాల వారు కలిసి గోడు వెళ్లబోసుకోవడం, చంద్రబాబు పాలనలో నాలుగేళ్లుగా ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, ఆయన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అందరినీ మోసం చేశారని జనమే జగన్‌కు చెబుతుండటం చూస్తుంటే ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తోంది. దీనికి తోడు మాజీ ఎమ్మెల్యేలు యలమంచిలి రవి (విజయవాడ), బీవీ రమణమూర్తి రాజు (కన్నబాబు–విశాఖ), కాటసాని రాంభూపాల్‌రెడ్డి (కర్నూలు), మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు(కృష్ణా), ఆయన కుమారుడు కృష్ణ ప్రసాద్‌లతో పాటు వందలాది మంది నేతలు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు ఇక్బాల్, లక్ష్మిరెడ్డి, పలువురు ఇతర అధికారులు పార్టీలో చేరారు. జిల్లాల్లో అధికార పార్టీ నుంచి వలసలు ఊపందుకున్నాయి. జగన్ పాదయాత్ర తమలో ఉత్సాహాన్ని నాలుగింతలు చేసిందని, వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి మరింత గట్టిగా కృషి చేస్తామని ఆ పార్టీ నేతలు విశ్వాసంతో చెబుతున్నారు. ప్రజా సంకల్ప యాత్ర వేదికగా ప్రత్యేక హోదా వాణిని జగన్ బలంగా వినిపించడంతో పాటు, హోదా రాకుండా అడ్డుపడిన చంద్రబాబు.. యూటర్న్ తీసుకుని ప్రజలను మరోమారు మోసం చేయడానికి పన్నిన కుట్రను జగన్ ఎక్కడికక్కడ ఎండగడుతుండటంతో పరిస్థితి వైఎస్సార్సీపీకి అనుకూలంగా మారిందంటున్నారు. -
అద్గది.. అలా అడగండన్నా..
ఈ బాటిల్లో ఉన్నది చెరుకు రసం కాదన్నా.. మేం తాగే నీరు.. ఇది చంద్రబాబుకు వినిపించేలా చెప్పండన్నా.. – పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో వైఎస్ జగన్‌కు నీళ్ల బాటిల్ అందిస్తూ మహిళలు వెలిబుచ్చిన ఆవేదన. పంట రుణాలన్నీ తీరిపోయి ఆనందంతో గంతులేస్తున్నామట.. అప్పులోళ్లు వెంటపడితే ఉన్న రెండెకరాలు అమ్మేసి, ఇదిగో ఇలా కూలీపని చేస్తున్నాం.. ఆ చంద్రబాబుకు ఈ విషయం అర్థమయ్యేలా చెప్పన్నా.. – భీమవరం వద్ద కూలీగా మారిన ఓ రైతన్న ఆక్రోశం. బ్యాంకులో పెట్టిన బంగారం మీ ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలి అన్నారు. బాబొచ్చారు.. కానీ బంగారం రాలేదు సరికదా.. వేలం వేస్తామని బ్యాంకు నుంచి నోటీసొచ్చిందన్నా.. – నెల్లూరు నగరానికి సమీపంలో డ్వాక్రా అక్కా చెల్లెమ్మల కన్నీటి గాధ. ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ఒకరా.. ఇద్దరా.. వందలు.. వేల మందిది ఇదే గోడు. అడుగడుగునా నిట్టూర్పులే. ఆద్యంతం గుండెను పిండేసే ఆర్తనాదాలే. వైఎస్ జగన్ పాదయాత్రలో కనిపించిన దృశ్యాలివి. ప్రజా సంకల్ప యాత్రలో అర్జీ ఇస్తే చాలు.. భవిష్యత్‌లో న్యాయం జరుగుతుందనే నమ్మకం వాళ్లల్లో కనిపించింది. చంద్రబాబు చేసిన మోసాన్ని ఎండగట్టాలన్న కసి కనిపించింది. రగులుతున్న కసిని జననేత జగన్ చెవిలో వేస్తే చాలు.. ఆయనే చూసుకుంటాడనే నమ్మకమూ కనిపించింది. ఇన్నిన్ని మోసాలు చేసి లక్షలాది మందిని కష్టాలపాలు చేసిన బాబును జగనన్న నిలదీస్తుంటే చూడాలన్న ఆరాటం వారిలో కనిపించింది. ఈ ప్రభుత్వ హయాంలో ఏ పనీ జరిగే అవకాశమే లేదని, అధికారులూ ఆదుకోలేకపోతున్నారని.. అందుకే ఏమీ చేయలేక, నిస్సహాయంగా ఉన్న తరుణంలో వైఎస్ జగన్ కొండంత అండగా నిలిచారంటున్నారు. పులకరించే పలకరింపు..: ‘అసలు సిసలైన నాయకుడిని చూస్తున్నాం.. గుండె లోతుల్లోంచి పలకరించే నైజాన్ని పరిశీలిస్తున్నాం. అభిమానంతో పిలుస్తున్నాడు. ఆత్మీయత పంచుతున్నాడు’ అని పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం దగ్గర రిటైర్డ్ హెడ్మాస్టర్ పురుషోత్తమరావు ఆనందంతో చెప్పారు. జగన్ వద్దకొస్తున్న ప్రతీ సమస్యలోనూ ఆర్ధ్రత ఉంది. ఆవేదన ఉంది. దాన్ని అంతే లోతుగా ఆయన తెలుసుకుంటున్నాడు. అర్జీ ఇవ్వగానే చూస్తాం.. చేస్తాం.. అని తప్పించుకోవడం లేదు. వివరాలు అడిగి మరీ తెలుసుకుంటున్నారని విశ్లేషించారు. ఈ ప్రాంతంలో జరిగిన పాదయాత్రలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ‘పెన్షన్లు, నివాస గృహాలు, అనారోగ్య సమస్యలు, ఉపాధి, ఉద్యోగం.. ఇలా ప్రతి ఒక్కరిదీ ఒక్కో సమస్య. వీరందరూ ఈ ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం కోల్పోయినవాళ్లే. నాలుగేళ్లు బాధలు పడ్డాం. మరో ఏడాదిలో మంచి రోజులొస్తాయి. జగన్ సీఎం అవుతాడనే నమ్మకం వాళ్లల్లో స్పష్టంగా కన్పిస్తోంది’ అని చెప్పారు. సీఎం కాగానే ఏం చేయాలి? ఎవరి బాధను ఎలా పరిష్కరించాలనే ముందు చూపు జగన్‌లో చూస్తున్నామని కర్నూలుకు చెందిన వెంకటయ్య, మదనపల్లికి చెందిన రాములు, నెల్లూరుకు చెందిన యానాదయ్య, గుంటూరుకు చెందిన పుష్ప, విజయవాడకు చెందిన నరసింహులు, రాజమండ్రికి చెందిన సురేష్ తదితరులు అభిప్రాయపడ్డారు. తానే సొంతమై.. కష్టమే తనదై..: నరసాపురం వద్ద 70 ఏళ్ల అవ్వ ఏదో చెప్పాలని వచ్చింది. జనాన్ని దాటుకుని జగన్ దగ్గరకెళ్లడానికి విఫలయత్నం చేసింది. ఈ పరిస్థితిని గమనించి జగన్ నేరుగా అవ్వ దగ్గరకే వెళ్లారు. గుండెలకు హత్తుకున్నారు. అవ్వ గుక్కపెట్టి ఏడ్చింది. కష్టం చెప్పుకుంది. అవ్వకు జగన్ ఇచ్చిన భరోసా ధైర్యాన్నిచ్చింది. జననేత మాట.. పేదవాడి పొలికేక : పాదయాత్ర సాగిన ప్రతి రోజు పేదవాడి బాధల్లోంచి వచ్చే ఓ ప్రధాన సమస్యకు జగన్ కనెక్ట్ అవుతున్నారు. అది పేదవాడి ఆరోగ్యమే కావచ్చు. నిరుద్యోగి పోరాటమే అవ్వొచ్చు. ఆ సమస్యను ఆయన ప్రపంచం వినేలా ఫోకస్ చేస్తున్నారు. ‘మా బడి పక్కే మద్యం షాపు పెట్టారంకుల్’ అని పదేళ్ల చిన్నారి పొదలకూరులో జగన్ దగ్గరకొచ్చి ధైర్యంగా చెప్పింది. చంద్రబాబును, ఆయన ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించాలని జనం కోరుతున్నారు. అవినీతిని నిగ్గదీయమని జగన్‌ను మరీ మరీ ప్రోత్సహిస్తున్నారు. -
ప్రజాసంకల్పయాత్ర.. కీలక ఘట్టాలు
జూన్ 27, 2018 200 రోజుల మైలురాయిని చేరిన.. జననేత జగన్ పాదయాత్ర వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి నవంబరు 6, 2017న ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర జూన్ 27, 2018(బుధవారం) నాటికి 200 రోజులు పూర్తి చేసుకుని సుమారు 2430 కి.మీలకు చేరుకుంది. ఇప్పటివరకూ 10 జిల్లాల్లోని (1. వైఎస్ఆర్ కడప 2. కర్నూలు 3. అనంతపురం 4. చిత్తూరు 5. నెల్లూరు 6. ప్రకాశం 7. గుంటూరు 8. కష్ణా 9. పశ్చిమ గోదావరి 10. తూర్పు గోదావరి) 93 నియోజకవర్గాలు, 156 మండలాలు, 1267 గ్రామాలు, 34 మునిసిపాలిటీలు, 5 నగర పాలక సంస్థల్లో పర్యటించిన వైఎస్ జగన్ 87 బహిరంగ సభలతో పాటు, 37 ఆత్మీయ సమ్మేళన సమావేశాల్లో పాల్గొన్న వైఎస్ జగన్ పాదయాత్రలో మైలురాళ్ళు:- ‘100’ కి.మీ.ల ప్రస్థానం 100 కి.మీ: (నవంబరు 14, 2017)న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని గొడిగనూరు వద్ద 100 కి.మీ.. పాదయాత్ర 8వ రోజు పూరైంది. 200 కి.మీ: (నవంబరు 22, 2017)న డోన్ నియోజకవర్గం ముద్దనూరులో 200 కి.మీ.. 15వ రోజున పూరైంది. 300 కి.మీ: 21వ రోజు (నవంబరు 29, 2017)న ఎమ్మిగనూరు నియోజకవర్గం కారుమంచిలో 300 కి.మీ మైలురాయిని జననేత దాటారు. 400 కి.మీ: డిసెంబరు 4న అనంతపురం జిల్లాలోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్, యాత్ర 29వ రోజు (డిసెంబరు 7, 2017)న శింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లిలో 400 కి.మీ.. పూర్తి చేసుకున్నారు. 500 కి.మీ: (డిసెంబరు 16, 2017న) 36వ రోజు – ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు వద్ద 500 కి.మీ. పూర్తి చేసుకున్నారు. 600 కి.మీ: 43వ రోజు (డిసెంబరు 24, 2017)న కదిరి నియోజకవర్గం కటారుపల్లి వద్ద 600 కి.మీ మైలురాయి దాటారు. 700 కి.మీ: 50వ రోజు (జనవరి 2, 2018)న చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని జమ్ములవారిపల్లి వద్ద 700 కి.మీ.. దాటారు. 800 కి.మీ: 58వ రోజు (జనవరి 10, 2018)న అదే జిల్లా వెదురుకుప్పం మండంలోని నల్ల వెంగనపల్లి వద్ద 800 కి.మీ.. దాటారు. 900 కి.మీ: 67వ రోజు (జనవరి 21, 2018)న శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చెర్లోపల్లి వద్ద 900 కి.మీ పాదయాత్రను జననేత పూర్తి చేశారు. 1000 కి.మీ ప్రస్థానం ప్రజా సంకల్ప యాత్ర 74వ రోజు (జనవరి 29, 2018)న నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం వద్ద వైఎస్ జగన్ తన పాదయాత్రలో 1000 కి.మీ మైలురాయి దాటారు. ఈ సందర్భంగా అక్కడ ఒక పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు. 1100 కి.మీ: యాత్ర 82వ రోజు (ఫిబ్రవరి 7, 2018)న అదే జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం, కొలిమెర్ల క్రాస్ రోడ్స్ వద్ద 1100 కి.మీ.. దాటారు. 1200 కి.మీ: 89వ రోజు (ఫిబ్రవరి 16, 2018)న ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని రామకష్ణాపురం వద్ద 1200 కి.మీ పూర్తి చేశారు. 1300 కి.మీ: యాత్ర 97వ రోజు (ఫిబ్రవరి 25, 2018)న కనిగిరి నియోజకవర్గంలోని నందనమారెళ్ల వద్ద 1300 కి.మీ.లకు చేరింది. 1400 కి.మీ: పాదయాత్ర 104వ రోజు (మార్చి 5, 2018)న అద్దంకి నియోజకవర్గం నాగులపాడు వద్ద 1400 కి.మీ.. దాటారు. 1500 కి.మీ: 112వ రోజు (మార్చి 14, 2018)న గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం, ములుకుదురు 1500 కి.మీ మైలురాయి దాటారు. 1600 కి.మీ: గుంటూరు జిల్లాలో యాత్ర 121వ రోజు (మార్చి 27, 2018)న సత్తెనపల్లి నియోజకవర్గం, పలుదేవర్లపాడు వద్ద 1600 కి.మీ దాటారు. 1700 కి.మీ: 130వ రోజు (ఏప్రిల్ 7, 2018)న తెనాలి నియోజకవర్గం, అదే మండలంలోని సుల్తానాబాద్ వద్ద 1700 కి.మీ పూర్తి చేశారు. 1800 కి.మీ: 139వ రోజు (ఏప్రిల్ 18, 2018)న కష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం, గణపవరం వద్ద 1800 కి.మీ.. దాటారు. 1900 కి.మీ: 148వ రోజు (ఏప్రిల్ 29, 2018)న పామర్రు నియోజకవర్గం, తాడంకి వద్ద 1900 కి.మీ.. దాటారు. 2000 కి.మీ: 161వ రోజు (మే 14, 2018)న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం, ఏలూరు రూరల్ మండలంలోని వెంకటాపురం 2000 కి.మీ ప్రస్థానాన్ని జననేత పూర్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన 40 అడుగుల స్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు. 2100 కి.మీ: 168వ రోజు (మే 22, 2018)న ఉంగుటూరు నియోజకవర్గం, అదే మండలంలోని పిప్పర వద్ద 2100 కి.మీ పూర్తి చేసుకున్నారు. 2200 కి.మీ: 176వ రోజు (మే 30, 2018)న నరసాపురంలోని రైల్వే గేటు వద్ద 2200 మైలు రాయిని దాటారు. 2300 కి.మీ: 186వ రోజు (జూన్ 11, 2018)న కొవ్వూరు నియోజకవర్గంలోని నందమూరు క్రాస్ వద్ద 2300 కి.మీ..దాటారు. 2400 కి.మీ: 195వ రోజు (జూన్ 21, 2018)న తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం, లక్కవరం క్రాస్ వద్ద 2400 కి.మీ ప్రస్థానాన్ని వైఎస్ జగన్ పూర్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలంలోని వెంకటాపురం 2000 కి.మీ మైలు రాయిని దాటిన సందర్భంగా పైలాన్ ఆవిష్కరణ నేటికి 200 రోజులు నేటితో ప్రజాసంకల్పయాత్ర 200 రోజులకు చేరుకుంది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని అమలాపురం మండలంలో పాదయాత్ర కొనసాగుతోంది. మంగళవారంతో 199 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్న జననేత నేడు (బుధవారం) 200వ రోజు మైలురాయిని చేరుకున్నారు. రాజన్న బిడ్డ పాదయాత్ర నేడు అమలాపురం నియోజకవర్గంలోనే పాదయాత్ర కొనసాగుతుంది. ఏ రోజు ఎక్కడ?.. ప్రజా సంకల్ప యాత్ర.. 2017, నవంబరు 6న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభం అయింది. 25వ రోజు యాత్ర గత డిసెంబరు 3న కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం, తుగ్గలి మండలం మదనాంతపురంలో మొదలై చెరువు తండా వరకు కొనసాగింది. 50వ రోజు యాత్ర ఈ ఏడాది జనవరి 2న చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గంలోని ‘చిన్న తిప్ప సముద్రం’ (సీటీఎం) నుంచి మొదలై పీలేరు నియోజకవర్గంలోని జమ్ములవారిపల్లి వరకు సాగింది. 75వ రోజు యాత్ర జనవరి 30న నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం శివారు నుంచి కలిచేడు వరకు సాగింది. 100వ రోజు యాత్ర ఫిబ్రవరి 28న ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం, పొదిలి మండలంలోని ఉప్పలపాడు నుంచి మొదలై సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి వరకు సాగింది. 125వ రోజు యాత్ర మార్చి 31న గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం సరిపూడి నుంచి మొదలై వెలవర్తిపాడు, మేడికొండూరు, గుండ్లపాలెం క్రాస్ రోడ్స్ మీదుగా పేరేచర్ల వరకు సాగింది. 150వ రోజు యాత్ర మే 1వ తేదీన కష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని పర్ణశాల శివారు శిబిరం నుంచి ప్రారంభమై చిట్టిగూడూరు, గూడూరు, రామరాజుపాలెం క్రాస్, సుల్తానగరం మీదుగా మచిలీపట్నం వరకు కొనసాగింది. 175వ రోజు యాత్ర మే 29వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం శివారు నుంచి ప్రారంభమై తలతాడితిప్ప, మెంతేపూడిక్రాస్, బొప్పనపల్లి, మత్స్యపురి, సీతారామపురం క్రాస్ మీదుగా కొప్పర్రు వరకు కొనసాగింది. 200వ రోజు యాత్ర బుధవారం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం శివారు నుంచి ప్రారంభమైంది. దేశ చరిత్రలో ఎప్పుడూ, ఎవరూ కనీవినీ ఎరగని విధంగా.. నాలుగు పదుల వయసున్న ఓ యువ నాయకుడు ఎండనకా.. వాననకా.. అలుపూసలుపూ లేకుండా.. 200 రోజులపాటు 2400 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేస్తూ.. ప్రజల కష్టాలు వింటూ, వారి కన్నీళ్ళు తుడుస్తూ, ఆత్మీయంగా స్పశిస్తూ, పలకరిస్తూ.. ముందుకు సాగుతున్న ఏకైక నేత, పోరాట యోధుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. ఏ నాయకుడూ, ఎప్పుడూ వెళ్లని మారుమూల గ్రామాల్లో, మార్గాల్లో సైతం జననేత అడుగులు వేస్తున్నారు. కొండలు, కోనలు, చిట్టడువుల మీదుగా ఆయన యాత్ర కొనసాగుతోంది. ఎంత కష్టం వచ్చినా, ఆరోగ్యం ఎలా ఉన్నా, ఆయన తన యాత్ర ఆపడం లేదు. రాష్ట్రం కోసం, రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం ఒక మహాయజ్ఞంలా ప్రజాసంకల్పయాత్రలో ముందుకు కదులుతున్నారు. నిత్యం ప్రజలతో మమేకం అవుతూ, వారి బాధలు వింటూ, వారికి ఒక భరోసా ఇస్తూ.. వారిలో ఒకరిలా, ఒక చెల్లికి అన్నగా, ఒక అక్కకు తమ్ముడిగా, ఒక తల్లికి బిడ్డగా, ఒక అవ్వకు మనవడిగా, ప్రతీ నిరుపేద కుటుంబానికి ఒక అన్నగా, ఒక పెద్ద కొడుకుగా నేనున్నానంటూ.. జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. జగన్ అడుగులకు సంఘీభావంగా రాష్ట్రం జన ఉప్పెనై కదులుతోంది. కష్ణా జిల్లా ముఖ ద్వారమైన ప్రకాశం బ్యారేజీ మీదకు జననేత చేరుకునే సందర్భంలో జన ప్రకంపనలతో బ్యారేజీ దద్దరిల్లింది. అలానే తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రజా సంకల్ప యాత్ర ప్రవేశిస్తున్న సందర్భంలో గోదావరి బ్రిడ్జి జన గోదావరిని తలపింపజేసింది. మహానేత రాజశేఖర రెడ్డి ప్రజా ప్రస్థానం.. షర్మిలమ్మ మరో ప్రజా ప్రస్థానం.. ఇప్పుడు జననేత జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పం... ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ కుటుంబం అండ... వైఎస్ కుటుంబానికి ప్రజలే అండా, దండా.. ఈ బంధాన్ని ఎవరూ విడదీయలేరు. -
191వరోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, రాజమహేంద్రవరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 191వ రోజు ప్రారంభమైంది. ఆదివారం ఉదయం వెదిరేశ్వరం ఎంపీపీ స్కూల్ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని, వైఎస్ జగన్ శనివారం పాదయాత్రకు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. స్వల్ప విరామం అనంతరం వైఎస్ జగన్ పాదయాత్రను పునఃప్రారంభించారు. కేతరాజుపల్లి, దేవరపల్లి, ఈతకోట, పలివెలక్రాస్, గంటిపల్లిపాలెం క్రాస్ మీదుగా గంటి వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. జననేతకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. -
భార్య కాళ్లు చేతులు నరికి భర్తని కిడ్నాప్
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని పిఠాపురంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం అర్థరాత్రి పిఠాపురం గోపాలబాబ ఆశ్రమం వద్ద కొంతమంది దుండగులు దంపతులపై దాడి చేశారు. ముమ్మడి సుబ్రమణ్యం అనే వ్యక్తి అతని భార్య సుబ్బలక్ష్మి నిద్రిస్తున్న సమయంలో దుండగులు నేరుగా ఇంట్లోకి వెళ్లి వారిపై స్ప్రే కొట్టారు. అనంతరం దుండగులు సుబ్బలక్ష్మి కాళ్లు, చేతులు అతి కిరాతకంగా నరికి, సుబ్రమణ్యంని కిడ్నాప్ చేశారు. మత్తులో ఉన్న సబ్బలక్ష్మికి స్పృహలోకి వచ్చిన తరువాత ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు బాధితురాలిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుబ్రమణ్యం బిలాస్పూర్లో రైల్వే ఉద్యోగం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘చంద్రబాబు విష బీజాలు నాటుతున్నారు’
సాక్షి, విజయవాడ: తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన పడవ ప్రమాదం దురదృష్టకరమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చిన సాయంత్రమే ప్రమాదం జరగటం సీఎం చంద్రబాబు నాయుడు పనితీరుకు నిదర్శనమని చెప్పారు. బజారులో అక్రమ సంబంధాలు అంటగట్టి 2019లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నాలుగేళ్లలో 85 శాతం పూర్తి చేశామని, మిగతా 15 శాతం హామీలను మాత్రమే అమలు చేయాల్సి ఉందన్నారు. కానీ రాష్ట్ర ప్రజల్లో చంద్రబాబు విష బీజాలు నాటుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. అనంతపురానికి సెంట్రల్ యూనివర్సిటీని కేంద్ర ఆమోదించిందని చెప్పారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి ఏం చేయట్లేదని చెప్పడం అన్యాయమన్నారు. కన్నా లక్ష్మీనారాయణ బుధవారం ఇక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో తరచుగా పడవ ప్రమాదాలు జరుగుతున్నాయని, అలా జరిగినప్పుడల్లా చంద్రబాబు మరోసారి జరగనివ్వనని చెబుతూనే ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండటం దురదృష్టకరం. ప్రభుత్వం వాగ్దానాలు ఇచ్చి, మరిచిపోవడం నిన్న జరిగిన ఘటనే ఉదాహరణగా నిలిచిందన్నారు. ప్రజల ప్రాణాల మీద ప్రభుత్వానికి లెక్క లేకుండా పోయిందన్నారు. కాగా, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించినందుకు సంతోషంగా ఉన్నాను. నాకు పదవి రావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఏపీలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అంతకుముందు న్యూఢిల్లీ నుంచి విమానంలో గన్నవరం విమనాశ్రయానికి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ శ్రేణులు స్వాగతం పలికాయి. గన్నవరం నుంచి ర్యాలీగా విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న ఆయన అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కృష్ణంరాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కావూరి సాంబశివరావు, ఎంపీ గోకరాజు గంగరాజు, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. కన్నాను ప్రశంసించిన సోము వీర్రాజు ఏపీలో బీజేపీని ముందుకు నడిపించడానికి ఒక శంఖారావాన్ని కన్నా లక్ష్మీ నారాయణ పూర్తి చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కొనియాడారు. దేశంలో పలు రాష్ట్రాలలో బీజేపీ విజయాలతో దూసుకుపోతోంది. ఏపీ తెలంగాణలలో కూడా సత్తా చాటుతాం. ఏపీలో బీజేపీ నిర్మాణం పటిష్టం చేయాలని సంకల్పించామని సోము వీర్రాజు వెల్లడించారు. -
ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు : పవన్
సాక్షి, అమరావతి : గోదావరి నదిలో లాంచీ ప్రమాద ఘటనతో తన గుండె బరువెక్కిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రోజు వారీ అవసరాలకి ఇతర ప్రాంతాలకి వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఉన్న గిరిజనులు జల సమాధి కావడం తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ఈ దుర్ఘటనకి సంబధించిన వివరాలు తెలియగానే బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని, సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని జనసేన కార్యకర్తలకు సూచించినట్లు వెల్లడించారు. ప్రమాదంలో ప్రభుత్వ శాఖలు, ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రమాదానికి గురైన లాంచీకి సరైన అనుమతులు లేవని, లోపం ఎవరిదని ప్రశ్నించారు. జవాబుదారీతనం లేని పాలన కారణంగానే అమాయకులు జలసమాధి అయ్యారని పవన్ మండిపడ్డారు. దుర్ఘటన జరగగానే హడావిడి చేసే పాలకులు.. సమస్యలకి శాశ్వత పరిష్కారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ప్రతి చిన్న అవసరానికి గిరిజనులు నదిలోనే ప్రయాణిస్తూ సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వ శాఖలు గిరిజన గూడేలపై శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. బాధిత కుటుంబాలకు తగిన పరిహారం ఇచ్చి, అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పాలకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి గిరిజనులకు ఇప్పటికైనా మౌళిక సదుపాయలు కల్పించాలని డిమాండ్ చేశారు. నదుల్లో అనుమతులు లేని బోట్లు తిరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. -
తప్పిపోయిన చిన్నారి చైల్డ్ ప్రొటెక్షన్‌కు అప్పగింత
ఏలూరు టౌన్ : ఏలూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న ఒక బాలుడిని ఒక వ్యక్తి చేరదీసి బంధువుల కోసం ఆరా తీశాడు. ప్రయోజనం లేకపోవటంతో ఆ బాలుడిని ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించాడు. బంధువుల సమాచారం తెలియకపోవటంతో బాలుడిని శిశు గృహకు తరలించారు. ఏలూరు పాత బస్టాండ్‌లో మంగళవారం రాత్రి 10గంటల సమయంలో నాలుగేళ్ల బాలుడు ఏడుస్తూ ఒంటరిగా కనిపించాడు. ఏలూరు మరడాని రంగారావు కాలనీకి చెందిన కాటూరి వెంకన్న ఆ బాలుడిని గమనించి తన ఇంటికి తీసుకువెళ్లాడు. బుధవారం ఉదయం మళ్లీ పాతబస్టాండ్‌కు తీసుకు వచ్చి వివరాలు ఏమైనా తెలుస్తాయని ఆశించాడు. రాత్రి వరకూ చూసినా ఎవరూ రాకపోవటంతో ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వెళ్లి సీఐ జి.మధుబాబుకు అప్పగించారు. వెంటనే ఆయన ఐసీడీఎస్ పీడీకి సమాచారం అందించి ఆయన ఆదేశాల మేరకు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆర్.రాజేష్ పోలీస్‌స్టేషన్‌కు రాగా, ఆ బాలుడిని సీఐ మధుబాబు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు అప్పగించారు. బాలుడి చిరునామా తెలిసిన వారు ఏలూరు టూటౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ మధుబాబు కోరారు. -
అదుపు తప్పి.. మదపుటేనుగులా..
రాజోలు : డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపు తప్పిన కళాశాల బస్సు.. మదపుటేనుగులా విద్యార్థులతో పాటు రోడ్డుపై వెళుతున్న వారిని భీతావహులను చేసింది. 5గురు విద్యార్థులు సహా 8 మందిని తీవ్రంగా గాయపరిచింది. శనివారం ఉదయం 8.30 గంటలకు తాటిపాక నుంచి ఓడలరేవు వెళ్తున్న బీవీసీ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మొదట ట్రాక్టర్‌ను, మోటార్ సైకిల్‌ను, సైకిల్‌ను, తర్వాత రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. స్తంభం ముక్కలై బస్సు మీద పడడంతో విద్యార్థులు ప్రాణభయంతో హాహాకారాలు చేశారు. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కర్రి సత్యనారాయణ, మోటార్‌సైకిల్‌పై కుమారుడిని పదవ తరగతి పరీక్షకు తీసుకు వెళ్తున్న దీపాటి జగదీష్, సైకిలిస్ట్ రుద్రా సత్యనారాయణ, విద్యార్థులు పుచ్చకాయల దుర్గాప్రసాద్, దొడ్డా జ్యోతి శిరీష, మల్లిపూడి రాజేష్, కానూరి నరేష్, ప్రభుతేజ తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. బస్సు డ్రైవర్ పరారయ్యాడు. గాయపడ్డ వారిలో కొందరిని స్థానిక ఎంఎస్ ఆస్పత్రికి , కొందరిని అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఆర్డీవో పి.వి.రమణ, సీఐ క్రిష్టోఫర్, ఎస్సై లక్ష్మణరావు పరిశీలించారు. ఆస్పత్రిలో క్షతగాత్రులకు అందిస్తున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. ఘటన సమయంలో విద్యుత్ నిలిచిపోవడంతో 30 మంది విద్యార్థులకు పెను ముప్పు తప్పిందని స్థానికులు తెలిపారు. సఖినేటిపల్లి నుంచి ఓడలరేవు బయలుదేరిన బస్సును ప్రారంభం నుంచి డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపాడని, సోంపల్లి, పొదలాడ సమీపంలోనే కొద్దిలో ప్రమాదం తప్పిందని విద్యార్థులు చెప్పారు. రాజోలు, పి.గన్నవరం వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్లు బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. -
గిట్టబలంతో..‘పట్టు’దలతో..
కడియం (రాజమహేంద్రవరం రూరల్) : మండలంలోని వీరవరం–దుళ్ళ రోడ్డుకు అనుబంధంగా ఉన్న పుంతదారిలో ఆదివారం ఎన్నడూ లేనంతగా దుమ్ము రేగింది. నందుల దమ్ము ఎంతో తేల్చే ఎడ్ల పట్టు ప్రదర్శనకు ఆ దారి వేదిక కావడమే అందుకు కారణం. వీరవరం–దుళ్ళ రోడ్‌లోని నందన్నబాబు గుడి వద్ద తీర్థ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా ఉగాది నాడు ఎడ్ల పట్టు ప్రదర్శన నిర్వహిస్తుంటారు. ఆ ఆనవాయితీ ప్రకారమే ఆదివారం ఏర్పాటు చేసిన ఎడ్ల పట్టు ప్రదర్శన హోరాహోరీగా సాగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం పన్నెండుజతల ఎడ్లు పోటీల్లో పాల్గొన్నాయి. నిర్ణీత దూరాన్ని 39.10 సెకన్లలో చేరుకున్న చింతలనామవరానికి చెందిన బొల్లి అనంతలక్ష్మీనారాయణ ఎడ్లు ప్రథమ స్థానంలో; 41.8 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్న రాజవరానికి చెందిన గ్రామ రాము ఎడ్లు ద్వితీయ స్థానంలో; 44.66 సెకన్లలో చేరుకున్న ఏడిదసావరానికి చెందిన టేకిమూడి సత్యనారాయణ ఎడ్లు తృతీయస్థానంలో నిలిచాయి. కడియపుసావరానికి చెందిన ఆర్.రజనికి సాకుతున్న పుంగనూరు గిత్త ప్రత్యేకాకర్షణగా నిలిచింది. విజేతలకు ఆలయ కమిటీ, మురమండ గ్రామ పెద్దలు నగదు బహుమతులు, మెమెంటోలు అందజేశారు. ఏటా పోటీల నిర్వహణ చేపడుతున్న మొగలపు చిన్నను పలువురు అభినందించారు. కడియం మండలంలోని గ్రామాల నుంచే కాక ఆలమూరు మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున యువకులు నందన్నబాబు ఆలయం వద్దకు చేరుకుని ఉత్కంఠభరితంగా సాగిన పోటీలను తిలకించారు. -
భూరాబంధులు
రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో వందల కోట్ల రూపాయల విలువైన ఈనాం, వక్ఫ్, దేవాదాయ శాఖ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. రాజకీయ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, పలుకుబడి ఉన్నవారు దొంగ సర్వే నంబర్లతో నకిలీ పత్రాలు సృష్టించి దర్జాగా ఆక్రమిస్తున్నారు. ఇదేవిధంగా నగరం నడిబొడ్డున ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న విలువైన భూములపై భూ రాబందులు స్వైరవిహారం చేస్తున్నాయి. నకిలీ దస్తావేజులతో కోట్లాది రూపాయల విలువైన భూములను హస్తగతం చేసుకున్నాయి. దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందిస్తున్న దాఖలాలు కానరావడంలేదు. సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం రూరల్ మండలం పిడింగొయ్యి పంచాయతీ పరిధిలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఆవ భూములు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చదరపు గజం ధర ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ ఉంది. ఇక్కడే వెంకటేశ్వర హోల్‌సేల్ మార్కెట్ కూడా ఉంది. దీంతో ఈ ప్రాంతంలో భూమి బంగారంతో సమానం. దీంతో కొంతమంది బడాబాబుల కన్ను ఈ భూములపై పడింది. అంతే.. సర్వే నంబర్ 327గా ఉన్న ఈ భూములకు అనుబంధంగా 612, 613, 614, 617, 618 సర్వే నంబర్లతో నకిలీ దస్తావేజులు సృష్టించి ఈ భూములను ఆక్రమించారు. వీరిలో ఓ మాజీ శాసనసభ్యుడు, నగరంలోని ప్రముఖ ఎముకల డాక్టర్, రాజకీయ నేతలు, కాంట్రాక్టర్లు, ఇతర ‘పెద్దలు’ ఉన్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 87.87 ఎకరాల భూములున్నాయి. వీటి విలువ వందల కోట్లు ఉంటుంది. వీటిల్లో అత్యధిక భాగం ఆక్రమణలకు గురైనట్టు తెలుస్తోంది. వెంకటేశ్వర జనరల్ మార్కెట్ వెనక ఆక్రమణలో ఉన్న భూములు ఆ భూముల కథ ఇదీ.. బ్రిటిషు వారి హయాంలో సర్వే నంబర్ 327, 330, 332, 465తో పాటు ఇంకా అనేక సర్వే నంబర్లలోని భూములను దేవాదాయ, ఈనాం కింద పలువురికి కేటాయించారు. ఈ సర్వే నంబర్లలో దాదాపు 22 ఎకరాలను షాహీ ఈనాం కింద ప్రథమ ఈనాందారు ఖాజా జహురుల్లా కుమారుడు దబీర్ మహ్మద్ గాలబ్, ఆయన కుమారులకు శాశ్వత వంశపారంపర్యంగా వచ్చింది. 1902 వరకూ రెవెన్యూ పత్రాల్లో వారి పేర్లున్నాయి. గోదావరికి పలుమార్లు వచ్చిన వరదల వల్ల ఆ భూములు మునిగిపోయాయి. బీఎస్ నంబర్లు 315, 316, 317, 318, 319, 332ఏ, 334, 342లలోని టైటిల్ డీడ్ భూములు, బీఎస్ నంబరు 333బి జిరాయితీ డ్రై, 317ఏ కాలువ, 315 కుంట, 333ఎ, బి ఆవ వెరసి.. 87.87 ఎకరాల భూమిలో దుబ్బు పెరిగిపోయింది. దీంతో వాటిని కొలవడానికి వీలులేదని విలేజ్ నంబర్ 66 డైగ్లాడ్(పాత రికార్డు)లో స్పష్టంగా పేర్కొన్నారు. అందుచేత ఈ సర్వే నంబర్లలోని 87.87 ఎకరాల భూమిని సర్వే నంబర్ 327గా నమోదు చేసినట్లు చూపారు. ఇదే ఆక్రమణదారులకు అవకాశంగా మారింది. ఆ భూములకు తప్పుడు రికార్డులు సృష్టించి, రకరకాల డివిజన్లు సృష్టించి, ఆ భూములను యథేచ్ఛగా ఆక్రమించారు. సర్వే నెంబర్ 327/11లో 2.2 ఎకరాల భూమి తమవని హెచ్చరిక బోర్డు పెట్టిన ఆక్రమణదారులు కల్లుగీత సొసైటీ భూముల కబ్జా సర్వే నంబర్ 327లో సుమారు 16 ఎకరాల వ్యవసాయ భూమిని గతంలో కల్లుగీత కార్మికుల సొసైటీకి కేటాయించారు. వాటిపై దాదాపు 20 కుటుంబాలు ఆధారపడి జీవించేవి. అయితే ఈ భూములను ఓ మాజీ శాసనసభ్యుడు ఆక్రమించాడు. ఆయా భూములను క్రమబద్ధీకరించుకునేందుకు వివిధ కోర్టుల్లో దావాలు వేయగా అవన్నీ సదరు మాజీ శాసనసభ్యుడికి వ్యతిరేకంగా వచ్చాయి. దీంతో సొసైటీ వారు, వారి వారసులు తమకు కేటాయించిన 16 ఎకరాలూ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. కొంతమంది అధికారులు ఆ మాజీ శాసనసభ్యుడికి వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలున్నాయి. దీనిపై సొసైటీ సభ్యులు, ఈనాం భూముల వారసుదారులు కలిసి ఉన్నతాధికారులకు, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా అతీగతీ లేదు. తమకే ఇవ్వాలంటున్న బాధితులు 1902 రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 327లో 8.88 ఎకరాలు దబీర్ ఇమామ్ మొహిద్దీన్, కాశిమ్ సాహెబ్, ఫకీర్ సాహెబ్, మరో ముగ్గురికి కేటాయించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ భూములను సర్వే చేసి తమకు అప్పగిచాలని 1998లో వారి వారసులు జన్మభూమిలో దరఖాస్తు చేసుకున్నారు. అదే సంవత్సరం సెప్టెంబర్ ఏడున ముఖ్యమంత్రికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి, ప్రస్తుత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా దీనిపై సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 2000 సంవత్సరంలో చలనా కూడా తీశారు. వారసుల వద్ద పత్రాలు తీసుకున్న అధికారులు ఆ తర్వాత పట్టించుకోలేదు. 2015లో ‘మీ ఇంటికి – మీ భూమి’లో దరఖాస్తు చేసుకున్నా.. ఇప్పటివరకూ ఎలాంటి పురోగతీ లేదు. ఆక్రమణదారుల నుంచి ఈనాం, దేవాదాయ భూములను కాపాడాలని, తమ భూములను తమకు కేటాయించాలని హక్కుదారులు విజ్జప్తి చేస్తున్నారు. భూ రికార్డులు గందరగోళం ఆవలో మొత్తం విస్తీర్ణం 87.87 ఎకరాలు. ఆ భూమిలో నీరు చేరి ఉండడం వల్ల కొలవడానికి వీలు లేకుండా ఉందంటూ రికార్డుల్లో ఉంది. అక్కడ అనేక వివాదాలున్నాయి. సర్వే నంబర్లు సబ్ డివిజన్ అయ్యాయి. సర్వే నంబర్ 327లో 19.20 ఎకరాలు వెబ్లాండ్ రికార్డు ప్రకారం ఇళ్లస్థలాలుగా కనిపిస్తోంది. 87.87 ఎకరాలపై పూర్తిస్థాయిలో సర్వే చేస్తేనే కానీ ఎవరి భూమి ఎవరిదో చెప్పలేం. అక్కడ ఒక్కో సర్వే నంబర్లోని భూమిపై నాలుగైదు యాజమాన్య హక్కు పత్రాలున్నాయి. – కె.పోశయ్య, తహసీల్దార్, రాజమహేంద్రవరం రూరల్ -
సీఎం చిత్తశుద్ధిపై సందేహం వస్తోంది: ముద్రగడ
తూర్పుగోదావరి జిల్లా : ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం గురువారం లేఖ రాశారు. లేఖ సారాంశం.. పత్రికలలో వస్తున్న కథనాలతో కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు నాయుడి చిత్తశుద్దిపై సందేహం వస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్లను గవర్నర్ సంతకంతో రాష్ర్ట పరిధిలో అమలు చేయవచ్చని న్యాయకోవిదులు చెబుతున్నారని, అయితే తమరు రాష్ర్ట పరిధిలో అమలు చేయకుండా రాష్ర్టపతి అనుమతికి పంపించడంతో మీ(చంద్రబాబు) చిత్తశుద్ధిని, నిబద్ధతను అనుమానించే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలను నివృత్తి చేయాల్సిన పూర్తి బాధ్యత చంద్రబాబుదేనన్నారు. కాపు జాతిని మోసపుచ్చి మరింత నష్టపెట్టే చర్యలు చేపట్టవద్దని సీఎంను కోరారు. తమరు ప్రకటించిన రిజర్వేషన్లు తక్షణం అమలు చేయకుండా మమ్మల్ని మోసపుచ్చాలని చూస్తే తాము కూడా అదే విధంగా మోసం చేయడానికి వెనకాడమని హెచ్చరించారు. -
ఎమ్మెల్యే తీరుపై రగిలిపోతున్న పార్టీ కేడర్
సాక్షి, కాకినాడ: జన్మభూమి సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వర్గాల మధ్య నెలకొన్న వివాదం చిలికిచిలికి గాలివానగా మారి ఆ పార్టీలో అసమ్మతికి తెరలేపింది. ఇప్పటికే ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న టీడీపీ కేడర్ ఇప్పుడు బాహాటంగానే తమ అసంతృప్తిని వెళ్ల్లగక్కుతుండడం పార్టీ వర్గాల్లో కలవరం మొదలైంది. ఇది కాస్తా పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో పాటు ఆయన తనయుడు లోకేష్‌కు ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది. ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడలతో ఇప్పటికే అనపర్తి జెడ్పీటీసీ సభ్యుడు కర్రి ధర్మారెడ్డి (దొరబాబు) పార్టీ కార్యకలాపాలకు చాలాకాలంగా దూరమయ్యారు. ఇటీవల జరిగిన జన్మభూమి సభలకూ ఆయన గైర్హాజరయ్యారు. వారిరువురి మధ్యా ఎమ్మెల్యే తండ్రి మూలారెడ్డి కుదిర్చిన సయోధ్య ఎంతోకాలం నిలువలేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పైగా ఎమ్మెల్యేపై అలకబూనిన జెడ్పీటీసీ సభ్యుడితో పాటు మరికొందరు నేతలు, కార్యకర్తలు ఇటీవల రహస్యంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించి, అదే విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. ఓ వైపు వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఎమ్మెల్యే అవినీతిపై పోరాటం చేస్తున్న నేపథ్యంలో తాజాగా నెలకొన్న అంతర్గత వివాదం ఆ పార్టీ నేతలకు మింగుడుపడడంలేదు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాకుండా ఆయన బంధువర్గం నుంచి కూడా ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయని టీడీపీ వర్గాల సమాచారం. ప్రస్తుతం జిల్లా స్థాయి పదవిలో ఉన్న బంధువు ప్రస్తుతంగా అంతర్గతంగా నెలకొన్న వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పావులుకదుపుతున్నారంటున్నారు. ఈ వ్యవహారం అనపర్తి నియోజకవర్గంతోపాటు జిల్లా టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం ఎలా ముగుస్తుందోనన్న ఆసక్తి ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. -
తిరుగు ప్రయాణంలో..తీవ్ర విషాదం
రాజా నగరం: ఖమ్మం నగరంలోని కొత్తగూడెంకు చెందిన ఓ కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరం సమీప రాజానగరం వద్ద రోడ్డు ప్రమాదానికి గురికావడంతో..ఆ ఇంట తీవ్ర విషాదం మిగిలింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొత్తగూడేనికి చెందిన నల్లమోలు శివాజీ హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సంక్రాంతి పండగకు..తన భార్య లక్ష్మీతులసి(28), ఇద్దరు చిన్నారులు, తమ వద్దే ఉంటున్న బావమరిది గుర్రెల శివాజీ(26)తో కలిసి దేవీపట్నం మండలం ఇందుకూరిపేటకు స్నేహితుడి కారు తీసుకుని వెళ్లారు. నాలుగు రోజులు సరదాగా గడిపి..భార్య, పిల్లలు, బావమరిదితో కలిసి బుధవారం అర్ధరాత్రి దాటాక కారులోనే తిరుగు ప్రయాణమయ్యారు. కొంతమూరు వద్ద జాతీయ రహదారిపైకి ఎక్కిన కొద్దిసేపటికే కారు టైరు పంక్చర్ కావడంతో..రోడ్డు పక్కన ఆపి మంచుకురుస్తుండగానే అంతా కలిసి చక్రాన్ని మార్చారు. అనంతరం సామగ్రిని తిరిగి డిక్కీలో వేస్తుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం వారిని ఢీ కొట్టింది. కారుతో సహా ఈ ముగ్గురూ కొద్దిదూరం ఎగిరిపడ్డారు. దీంతో లక్ష్మీతులసి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన ఆమె తమ్ముడు గుర్రెల శివాజీ ఆస్పత్రిలో మరణించాడు. నల్లమోలు శివాజీకి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. ప్రమాద సమయంలో కారు వెనుక సీటులో నిద్రపోతున్న ఎనిమిది, నాలుగు సంవత్సరాల చిన్నారులు తనుశ్రీ, నిహాల్‌లకు స్వల్పగాయాలయ్యాయి. రాజానగరం ఇన్చార్జ్ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై జగన్మోహన్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని, కేసు దర్యాప్తు చేపట్టారు. -
కొత్తపేటలో ఘనంగా ప్రభల తీర్థం
-
ఎన్ఐఏ ఎస్సైనంటూ సెటిల్మెంట్లు
ఎటపాక: ఎస్సైనంటూ కొంతకాలంగా సెటిల్మెంట్లు చేస్తున్న వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర నిఘా సంస్థ అయిన ఎన్ఐఏ ఎస్సైనని చెబుతూ బోయిన సురేష్ అనే వ్యక్తి తూర్పుగోదావరి జిల్లాలోని విలీన మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రాంతాల్లో కొంతకాలంగా సెటిల్మెంట్లు చేసి లక్షల్లో ఆర్జిస్తున్నాడు. ఇతను నకిలీ ఎస్సైగా తేలడంతో ఎటపాక పోలీసులు వలపన్ని బుధవారం అతడిని అరెస్టు చేశారు. కాగా, ఈ నకిలీ ఎస్సైకు సహకరించిన ఎటపాక ఎస్సై నాగరాజును వీఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. -
హాస్య నటుడిగా స్థిరపడాలన్నదే లక్ష్యం
మామిడికుదురు (పి.గన్నవరం): తెలుగు చిత్రసీమలో హాస్య నటుడిగా గుర్తింపు పొందాలన్నదే తన లక్ష్యమని వర్ధమాన హాస్యనటుడు మహేష్ ఆచంట పేర్కొన్నారు. సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు పెదపట్నంలంక వచ్చిన మహేష్ మంగళవారం స్థానిక విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు. రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’,.. వీవీ వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్‌తేజ్ నటిస్తున్న చిత్రంతో పాటు.. అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ‘ఒక్క క్షణం’ , ‘మహానటి సావిత్రి’ చిత్రాల్లో ప్రస్తుతం తాను నటిస్తున్నాని చెప్పారు. మలికిపురం మండలంలోని శంకరగుప్తం తమ స్వగ్రామమని తెలిపారు. మలికిపురంలో ఇంటర్ పూర్తిచేసి హైదరాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశానని మహేష్ పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తితో ఎంబీఏ చేస్తూనే సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించానన్నారు. ఆ ప్రయత్నంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నానని చెప్పారు. ఇంత వరకూ 65 సినిమాల్లో నటించానని, 80కి పైగా టీవీ ఎపిసోడ్స్‌లో నటించానని చెప్పారు. ‘ఖైదీ నెంబర్–150’, ‘శతమానం భవతి’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రాలు తనకు మంచి గుర్తింపును తీసుకు వచ్చాయని మహేష్ పేర్కొన్నారు. చిన్నాన్న బోనం అంజి, సోదరుడు రేకపల్లి బాబీ తనను ఎంతో ప్రోత్సహించారన్నారు. -
విస్తరణ పేరుతో ఇళ్లు కూల్చివేత
-
అడ్డగోలుగా.. అత్యంత సులువుగా..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అడ్డగోలుగా.. అత్యంత సులువుగా.. ఎదుటివారి నెత్తిన టోపీ పెట్టి.. ఎలాగోలా డబ్బు సంపాదించడమే ధ్యేయంగా.. అమాయకులకు వల వేసి.. మోసగిస్తున్న మాయగాళ్లు జిల్లాలో ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నారు. భారీ జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని.. వ్యాపారాలు చేసుకొనేందుకు రుణాలు ఇప్పిస్తామని.. అనతికాలంలోనే నగదు రెట్టింపు చేస్తామని.. ఇలా రకరకాలుగా ఆశ చూపి జనానికి టోకరా వేస్తున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. నిరుద్యోగం కారణంగా ఏదో ఒక ఉపాధి వెతుక్కోవాలన్న ప్రయత్నంలో పలువురు ఈ మాయగాళ్ల చేతిలో చిక్కి మోసపోతున్నారు. అంతా అయిపోయాక వారి అసలు రూపం తెలియడంతో అమాయక ప్రజలు లబోదిబోమంటున్నారు. తెలిసో తెలియకో ప్రజలు మోసపోతుంటే.. నిందితులను పట్టుకోవల్సిన నిఘా వ్యవస్థ నిద్రావస్థలో జోగుతోంది. ఎక్కడేం జరుగుతోందో పసిగట్టే పరిస్థితి కనిపించడం లేదు. వైఫల్యమెవరిదైనా అమాయక ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఎన్నో సంఘటనలు ► విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు ఇప్పిస్తామంటూ ఆమధ్య కొందరు పెద్ద ఎత్తున వసూళ్లు చేశారు. రాజకీయ నాయకుల అండదండలున్న వ్యక్తులే ఈ వసూళ్లకు బరితెగించారు. ఉద్యోగం వస్తే తమవల్లనే వచ్చిందని.. రాకపోతే మిస్సయిందని చెప్పి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ► జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టుల కోసం రూ.లక్షలు గుంజుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఒక్కో పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేశారన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. ► సహకార శాఖ పరిధిలోకి వచ్చే పోస్టులు ఇప్పిస్తామని కూడా కొందరు బయలుదేరారు. లక్షల్లో వసూళ్లకు తెగబడ్డారు. పత్రికల్లో వార్తలు వచ్చాక అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ► పశు సంవర్ధక శాఖలో ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి గతంలో కొందరు బేరం పెట్టారు. అప్పట్లో పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారాయన్న ఆరోపణలు వచ్చాయి. ► ఇటీవల హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అనంతపురం జిల్లా కాసాపురానికి చెందిన మాజీ హోంగార్డు హరిజన గోవర్ధన్ జిల్లాకు చెందిన ముగ్గురు నిరుద్యోగుల నుంచి రూ.3.43 లక్షలు వసూలు చేసి మోసగించాడు. ► రాజశేఖర్‌నాయుడు, పడాల రాజేశ్‌నాయుడు అనే ఇద్దరు కలిసి రాజమహేంద్రవరం ఏవీ అప్పారావు రోడ్డులో అప్లూయన్స్ సొల్యూషన్స్ అనే కన్సల్టెన్సీ ఏర్పాటు చేశారు. డబ్బులిస్తే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతామని, కమిషన్‌తో పాటు అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. ఇలా రూ.56 లక్షల వరకూ వసూలు చేసి కార్యాలయం మూసేశారు. ఇంద్రపాలెంలో భార్యాభర్తల మాయాజాలం ఏడాది క్రితం ఇంద్రపాలెం శ్రీనివాసనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్న భార్యాభర్తలు నల్లా ప్రసాద్, నల్లా శైలజలు.. తాము జేఎన్టీయూ ఉద్యోగులమని, అందులో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రూ.కోటి వరకూ గుంజి టోకరా వేశారు. తమ జీతం రూ.80 వేలు అని, రిజిస్ట్రార్ తమకు బాగా కావల్సిన వ్యక్తి అని చెప్పగానే పలువురు నిరుద్యోగులు ట్రాప్‌లో పడిపోయారు. కనీసం వాకబు కూడా చేయకుండానే ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో అడిగినంతా సమర్పించుకున్నారు. అక్కడితో ఆగని ఆ వంచక దంపతులు రుణాలిప్పిస్తామని కూడా నమ్మబలికారు. బ్యాంకు అధికారులు, మత్స్యశాఖ అధికారులు బాగా తెలుసని, వేటకు వెళ్లే బోట్ల నిర్మాణానికి వీలుగా రూ.1.30 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల వరకూ రుణం ఇస్తారని చెప్పగానే.. పలువురు వారి చేతిలో లక్షలాది రూపాయలు పెట్టేశారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో ఆరా తీయకుండానే అప్పోసొప్పో చేసి పెద్ద ఎత్తున డబ్బులిచ్చేశారు. జేఎన్టీయూలో ఉద్యోగం వస్తుందన్న ఆశతో కరపకు చెందిన యువకుడు నాగేంద్ర రూ.1.60 లక్షలు, జి.కృష్ణదీపక్ రూ.17 లక్షలు, ఎం.ప్రభాకర్ రూ.1.50 లక్షలు, కె.రాజేష్ రూ.1.50 లక్షలు, ఎ.సంజీవ్ రూ.70 వేలు, కె.సురేష్‌కుమార్ రూ.1.50 లక్షలు, పి.నాగేంద్రకుమార్ రూ.80 వేలు, శివదుర్గ రూ.80 వేలు.. ఇలా అనేకమంది అడిగినంతా ఇచ్చి మోసపోయారు. దురాశతో దుఃఖం నిబంధనల ప్రకారం ఉద్యోగాలో, ఉపాధో పొందడం వేరు. అలాకాకుండా కొంతమంది ఏదో ఒకవిధంగా అడ్డదారిలో ఉద్యోగాలు, సొమ్ములు సంపాదించాలన్న దురాశతో ఇటువంటి మాయగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలుకుతున్న వ్యక్తులకు అంత సీన్ ఉందా, ప్రభుత్వ ఉద్యోగాలిప్పించే హోదా, పలుకుడి ఉన్నాయా, రుణాలు ఇప్పించే స్థాయి ఉందా అనే అంశాలను పరిశీలించకుండానే నాలుగు మాయమాటలు చెప్పగానే నమ్మి రూ.లక్షలు ముట్టజెబుతున్నారు. నియామకాల ప్రకటనలు లేకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారనే కనీస ఆలోచన కూడా చేయకుండా పెద్ద ఎత్తున సొమ్ములిచ్చి మోసపోతున్నారు. పోలీసు నిఘా వ్యవస్థ సక్రమంగా పనిచేసి ఉంటే ఆదిలోనే ఇటువంటి మోసగాళ్ల భరతం పట్టడం సాధ్యమై ఉండేది. ఆవిధంగా జరగకపోవడంతో అమాయకులు బలైపోతున్నారు. కొడుక్కి ఉద్యోగం అంటే ఆశ పడ్డాను అతను రోజుకో కారులో తిరుగుతూ యువకులను తిప్పుకొనేవాడు. అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తున్నానని చెప్పాడు. నా కొడుక్కి ఉద్యోగం ఇప్పిస్తానంటే ఆశ పడ్డాను. మా శ్రీనివాసనగర్లోనే చాలామంది ఇచ్చారని తెలిసి, ఉద్యోగం ఇప్పిస్తానంటే రూ.90 వేలు అప్పు చేసి ఇచ్చాను. ఇప్పుడేం చేయాలో తెలియడంలేదు. – పెండ్యాల నూకరాజు, శ్రీనివాసనగర్, ఇంద్రపాలెం రూ.1.30 కోట్ల రుణం అన్నాడు బోటు కొనుగోలుకు రూ.1.30 కోట్ల బ్యాంకు రుణం ఇప్పిస్తానని నల్లా ప్రసాద్ అనే వ్యక్తి చెప్పాడు. బ్యాంకు అధికారులకు రూ.3 లక్షలు ఇవ్వాలన్నాడు. మోసం చేస్తున్నాడని తెలియక వస్తువులు, భూమి తనఖా పెట్టి రూ.3 లక్షలు ఇచ్చాను. రాత్రికి రాత్రే జెండా ఎత్తేశాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియడంలేదు. – సూరంపూడి లోవరాజు, శ్రీనివాసనగర్, ఇంద్రపాలెం -
తూ.గో.జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
కోనసీమ వెంకన్న సన్నిధిలో సౌకర్యాల లేమి
-
తూ.గో.జిల్లాలో ఘరానా మోసం
-
తండ్రి పాడె మోస్తూ కుప్పకూలిన కొడుకు
సాక్షి, తూర్పుగోదావరి: ప్రాణం కంటే మిన్నగా చూసుకున్నాడు... పెంచి పెద్దవాడిని చేసి ఒక ఇంటివాడిని చేశాడు.. అలాంటి ప్రేమానురాగాలతో చూసుకున్న తండ్రి కన్నుమూయడాన్ని ఆ కొడుకు తట్టుకోలేకపోయాడు.. ఆయన అంతిమయాత్రలోనే తానూ తనువు చాలించాడు.. చివరకు తండ్రి చితి పక్కనే ఆ తనయుడికి అంత్యక్రియాలు చేయాల్సి వచ్చింది. ఈ విషాద సంఘటన తూర్పుగోదావరిజిల్లా పిఠాపురంలో చోటుచేసుకుంది. పిఠాపురం వస్తాదు వీధికి చెందిన జాగు అశోక్‌బాబుకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆస్పిత్రికి తరలించారు. ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ మరణించాడు. అంతిమ సంస్కారాల కోసం ఆయన భౌతిక కాయాన్ని శ్మశానవాటికకు తరలించేందుకు బంధువులు ఏర్పాట్లు చేశారు. రెండవ కుమారుడు శివప్రసాద్ తండ్రి పాడెను మోస్తూ కొంత దూరం వెళ్లగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే పాడె మోస్తూన్నవాడు ఒక్కసారిగా కిందపడిపోయాడు. దీంతో అంతిమ యాత్రను అక్కడే ఆపి అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రికి తరలించగా ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో తండ్రి అశోక్, కొడుకు శివప్రసాద్‌లకు ఒకేసారి అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చింది. శివప్రసాద్ తండ్రి పట్ల ఎక్కువ ప్రేమానురాగాలతో ఉండేవాడని, ఆయన మృతిని తట్టుకోలేక తండ్రి చనిపోయిన దగ్గర నుంచి ఏమీ తినకుండా ఉండిపోయి తీవ్రంగా కుమిలిపోయాడని బంధువులు తెలిపారు. ఒకేసారి తండ్రీకొడుకుల మృతితో వారి బంధువులు గుండెలవిసేలా రోదిస్తుంటే వారిని ఆపడం ఎవరితరం కాలేదు.. శివప్రసాద్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. -
తూర్పు మన్యంలో చిన్నారుల మృత్యుఘోష
-
30 కాసుల బంగారు నగలు, స్కూటీ చోరీ
వృద్ధురాలికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చిన అగంతకుడు కాకినాడ : పి. గన్నవరం మండలం మానేపల్లి గ్రామంలో ఇంట్లో ఉన్న ఒక వృద్ధురాలికి గుర్తు తెలియని యువకుడు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి, 30 కాసుల బంగారు నగలు, స్కూటీని తస్కరించిన సంఘటన మంగళవారం జరిగింది. దీనికి సంబంధించి పి.గన్నవరం ఎస్ఐ జి.హరీష్‌కుమార్ బుధవారం రాత్రి విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మానేపల్లి గ్రామంలోని సత్తెమ్మతల్లి గుడివీధిలో కాలిశెట్టి పార్వతి అనే వద్ధురాలు, ఆమె కోడలు పద్మమాల కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. భర్త రోడ్డు ప్రమాదంలో మరణించడంతో పద్మమాల గ్రామంలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. కోడలు ఇంట్లోలేని సమయంలో ఒక యువకుడు గతంలో పలుమార్లు ఇంటికివచ్చి అత్త పార్వతితో మాట్లాడేవాడు. ఈనేపధ్యంలో మంగళవారం ఉదయం కోడలు అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళింది. అనంతరం ఆమె ఇంటికి వచ్చిన యువకుడిని గత పరిచయంతో అత్త కూర్చొమంది. ఆ యువకుడు సమీపంలో ఉన్న కూల్‌డ్రింక్ షాపునకు వెళ్ళి రెండు డ్రింక్ బాటిల్స్ తీసుకువచ్చి, ఒకటి వద్ధురాలికి ఇచ్చాడు. సగం డ్రింక్ తాగేటప్పటికి ఆమె నిద్రలోని జారుకొంది. దీంతో ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతో పాటు, బీరువాలోని నగలు మొత్తం 30 కాసుల బంగారం చోరీ చేసాడు. అత్త సెల్‌ఫోన్‌ను, ఇంటి ఆవరణలో ఉన్న కోడలి హీరో ప్రెజర్ స్కూటీని కూడా తస్కరించాడు. సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి వచ్చిన కోడలు నిద్రపోతున్న అత్తను లేపింది. ఆమె మాట్లాడక పోవడంతో, కంగారుపడి స్ధానికులను పిలిచింది. దీంతో స్ధానికులు అత్త మొహంపై నీళ్ళు చల్లగా యువకుడు కూల్‌డ్రింక్ ఇచ్చిన విషయం చెప్పింది. అత్త మెడలో ఉండాల్సిన నగలు కనిపించకపోవడంతో కోడలు బీరువాను వెతికింది. గుర్తు తెలియని ఆ యువకుడు మొత్తం నగలను దోచుకపోవడంతో కోడలు పద్మమాల పోలీసులకు పిర్యాదు చేసింది. వృద్ధురాలైన పార్వతి ఇంకా కోలుకోలేదు. అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్య, రావులపాలెం సీఐ పీవీ రమణ చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. కాకినాడకు చెందిన క్లూస్ టీమ్ సభ్యులు వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ హరీష్‌కుమార్ తెలిపారు.