
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం
తూర్పుగోదావరి జిల్లా : ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం గురువారం లేఖ రాశారు. లేఖ సారాంశం.. పత్రికలలో వస్తున్న కథనాలతో కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు నాయుడి చిత్తశుద్దిపై సందేహం వస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్లను గవర్నర్ సంతకంతో రాష్ర్ట పరిధిలో అమలు చేయవచ్చని న్యాయకోవిదులు చెబుతున్నారని, అయితే తమరు రాష్ర్ట పరిధిలో అమలు చేయకుండా రాష్ర్టపతి అనుమతికి పంపించడంతో మీ(చంద్రబాబు) చిత్తశుద్ధిని, నిబద్ధతను అనుమానించే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలను నివృత్తి చేయాల్సిన పూర్తి బాధ్యత చంద్రబాబుదేనన్నారు. కాపు జాతిని మోసపుచ్చి మరింత నష్టపెట్టే చర్యలు చేపట్టవద్దని సీఎంను కోరారు. తమరు ప్రకటించిన రిజర్వేషన్లు తక్షణం అమలు చేయకుండా మమ్మల్ని మోసపుచ్చాలని చూస్తే తాము కూడా అదే విధంగా మోసం చేయడానికి వెనకాడమని హెచ్చరించారు.