
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం
సాక్షి, కాకినాడ : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. కాపులకు తక్షణమే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ చంద్రబాబుకు శనివారం లేఖ రాశారాయన. లేఖలో.. గవర్నర్ ఆమోదంతో బీసీ రిజర్వేషన్లు అమలు చేయోచ్చని మేథావులు, న్యాయవాదులు సలహా ఇస్తున్నారని పేర్కొన్నారు. బిల్లు కేంద్రానికి పంపేశాను.. నా పని అయిపోయిందని తప్పుకోవద్దని సూచించారు. చంద్రబాబు ఆలోచన బస్సు, రైలు వెళ్లిపోయాక స్టేషన్‌కు వచ్చినట్లుందని ఎద్దేవాచేశారు. అలా ఆలోచించకూడదని ముద్రగడ పద్మనాభం అన్నారు.