సాక్షి, అమలాపురం : ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారం 200వ రోజు మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా జననేత సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పాదయాత్ర ప్రారంభించి నేటికి రెండు వందల రోజుల మైలు రాయి చేరుకోవడం అమలాపురంలో పండుగ వాతావరణం ఏర్పడింది. పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అశేష ప్రజానీకం మధ్య, జననేత తన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కామనగరువు, అప్పన్నపేట, విలాసవిల్లిల, వాసంశెట్టివారి పాలెం మీదుగా భీమనపల్లి వరకూ పాదయాత్ర కొనసాగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారంతో 200 రోజులు పూర్తి చేసుకోనుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అరాచక పాలనను ఎండగడుతూ, ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయ నుంచి గతేడాది నవంబర్ 6న వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. 200 రోజుల పాటు 2400 కిలోమీటర్లలకుపైగా పాదయాత్రను రాజన్న బిడ్డ పూర్తి చేసుకున్నారు. ప్రజల కష్టాలు వింటూ, వారి కన్నీళ్లను తుడుస్తూ, ఆత్మీయంగా స్పృశిస్తూ, పలకరిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment