
సాక్షి, పెద్దాపురం (తూర్పుగోదావరి జిల్లా) : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 220వ రోజు షెడ్యూల్ ఖరారైంది. వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత బుధవారం ఉదయం సామర్లకోట శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పెద్దాపురం టౌన్‌లోని బ్యాంక్ కాలనీ, మున్సిపల్ సెంటర్, పాత బస్టాండ్ సెంటర్ మీదుగా మరిడమ్మ తల్లి గుడి వరకు పాదయాత్ర సాగుతుంది.
అనంతరం లంచ్ విరామం తీసుకుంటారు. తిరిగి లంచ్ క్యాంప్ నుంచి మధ్యాహ్నాం 2.45 గంటలకు పాదయాత్ర చేపడతారు. పెద్దాపురం వెములవారి సెంటర్ మీదుగా దర్గా సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహిస్తారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.