ప్రజాసంకల్పయాత్ర.. కీలక ఘట్టాలు | YS Jagan Mohan Reddy Reached To 200 Day PrajaSankalpaYatra | Sakshi
Sakshi News home page

200 రోజుల మైలురాయిని చేరిన వైఎస్‌ జగన్‌ పాదయాత్ర

Published Wed, Jun 27 2018 7:48 AM | Last Updated on Fri, Jul 6 2018 2:54 PM

YS Jagan Mohan Reddy Reached To 200 Day PrajaSankalpaYatra - Sakshi

జూన్‌ 27, 2018
200 రోజుల మైలురాయిని చేరిన.. జననేత జగన్‌ పాదయాత్ర
వైఎస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి నవంబరు 6, 2017న ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర జూన్‌ 27, 2018(బుధవారం) నాటికి 200 రోజులు పూర్తి చేసుకుని సుమారు 2430 కి.మీలకు చేరుకుంది.

  • ఇప్పటివరకూ 10 జిల్లాల్లోని (1. వైఎస్‌ఆర్‌ కడప 2. కర్నూలు 3. అనంతపురం 4. చిత్తూరు 5. నెల్లూరు 6. ప్రకాశం 7. గుంటూరు 8. కష్ణా 9. పశ్చిమ గోదావరి 10. తూర్పు గోదావరి) 93 నియోజకవర్గాలు, 156 మండలాలు, 1267 గ్రామాలు, 34 మునిసిపాలిటీలు, 5 నగర పాలక సంస్థల్లో పర్యటించిన వైఎస్‌ జగన్‌
  • 87 బహిరంగ సభలతో పాటు, 37 ఆత్మీయ సమ్మేళన సమావేశాల్లో పాల్గొన్న వైఎస్‌ జగన్‌

పాదయాత్రలో మైలురాళ్ళు:-

‘100’ కి.మీ.ల ప్రస్థానం

  • 100 కి.మీ: (నవంబరు 14, 2017)న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని గొడిగనూరు వద్ద 100 కి.మీ.. పాదయాత్ర 8వ రోజు పూరైంది.
  • 200 కి.మీ: (నవంబరు 22, 2017)న డోన్‌ నియోజకవర్గం ముద్దనూరులో 200 కి.మీ.. 15వ రోజున పూరైంది.
  • 300 కి.మీ: 21వ రోజు (నవంబరు 29, 2017)న ఎమ్మిగనూరు నియోజకవర్గం కారుమంచిలో 300 కి.మీ మైలురాయిని జననేత దాటారు.
  • 400 కి.మీ: డిసెంబరు 4న అనంతపురం జిల్లాలోకి అడుగు పెట్టిన వైఎస్‌ జగన్, యాత్ర 29వ రోజు (డిసెంబరు 7, 2017)న శింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లిలో 400 కి.మీ.. పూర్తి చేసుకున్నారు.
  • 500 కి.మీ: (డిసెంబరు 16, 2017న) 36వ రోజు – ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు వద్ద 500 కి.మీ. పూర్తి చేసుకున్నారు.
  • 600 కి.మీ: 43వ రోజు (డిసెంబరు 24, 2017)న కదిరి నియోజకవర్గం కటారుపల్లి వద్ద 600 కి.మీ మైలురాయి దాటారు.
  • 700 కి.మీ: 50వ రోజు (జనవరి 2, 2018)న చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని జమ్ములవారిపల్లి వద్ద 700 కి.మీ.. దాటారు.
  • 800 కి.మీ: 58వ రోజు (జనవరి 10, 2018)న అదే జిల్లా వెదురుకుప్పం మండంలోని నల్ల వెంగనపల్లి వద్ద 800 కి.మీ.. దాటారు.
  • 900 కి.మీ: 67వ రోజు (జనవరి 21, 2018)న శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చెర్లోపల్లి వద్ద 900 కి.మీ పాదయాత్రను జననేత పూర్తి చేశారు.

1000 కి.మీ ప్రస్థానం
ప్రజా సంకల్ప యాత్ర 74వ రోజు (జనవరి 29, 2018)న నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం వద్ద వైఎస్‌ జగన్‌ తన పాదయాత్రలో 1000 కి.మీ మైలురాయి దాటారు. ఈ సందర్భంగా అక్కడ ఒక పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు.

  • 1100 కి.మీ: యాత్ర 82వ రోజు (ఫిబ్రవరి 7, 2018)న అదే జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం, కొలిమెర్ల క్రాస్‌ రోడ్స్‌ వద్ద 1100 కి.మీ.. దాటారు.
  • 1200 కి.మీ: 89వ రోజు (ఫిబ్రవరి 16, 2018)న ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని రామకష్ణాపురం వద్ద 1200 కి.మీ పూర్తి చేశారు.
  • 1300 కి.మీ: యాత్ర 97వ రోజు (ఫిబ్రవరి 25, 2018)న కనిగిరి నియోజకవర్గంలోని నందనమారెళ్ల వద్ద 1300 కి.మీ.లకు చేరింది.
  • 1400 కి.మీ: పాదయాత్ర 104వ రోజు (మార్చి 5, 2018)న అద్దంకి నియోజకవర్గం నాగులపాడు వద్ద 1400 కి.మీ.. దాటారు.
  • 1500 కి.మీ: 112వ రోజు (మార్చి 14, 2018)న గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం, ములుకుదురు 1500 కి.మీ మైలురాయి దాటారు.
  • 1600 కి.మీ: గుంటూరు జిల్లాలో యాత్ర 121వ రోజు (మార్చి 27, 2018)న సత్తెనపల్లి నియోజకవర్గం, పలుదేవర్లపాడు వద్ద 1600 కి.మీ దాటారు.
  • 1700 కి.మీ: 130వ రోజు (ఏప్రిల్‌ 7, 2018)న తెనాలి నియోజకవర్గం, అదే మండలంలోని సుల్తానాబాద్‌ వద్ద 1700 కి.మీ పూర్తి చేశారు.
  • 1800 కి.మీ: 139వ రోజు (ఏప్రిల్‌ 18, 2018)న కష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం, గణపవరం వద్ద 1800 కి.మీ.. దాటారు.
  • 1900 కి.మీ: 148వ రోజు (ఏప్రిల్‌ 29, 2018)న పామర్రు నియోజకవర్గం, తాడంకి వద్ద 1900 కి.మీ.. దాటారు.
  • 2000 కి.మీ: 161వ రోజు (మే 14, 2018)న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం, ఏలూరు రూరల్‌ మండలంలోని వెంకటాపురం 2000 కి.మీ ప్రస్థానాన్ని జననేత పూర్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన 40 అడుగుల స్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు.
  • 2100 కి.మీ: 168వ రోజు (మే 22, 2018)న ఉంగుటూరు నియోజకవర్గం, అదే మండలంలోని పిప్పర వద్ద 2100 కి.మీ పూర్తి చేసుకున్నారు.
  • 2200 కి.మీ: 176వ రోజు (మే 30, 2018)న నరసాపురంలోని రైల్వే గేటు వద్ద 2200 మైలు రాయిని దాటారు.
  • 2300 కి.మీ: 186వ రోజు (జూన్‌ 11, 2018)న కొవ్వూరు నియోజకవర్గంలోని నందమూరు క్రాస్‌ వద్ద 2300 కి.మీ..దాటారు.
  • 2400 కి.మీ: 195వ రోజు (జూన్‌ 21, 2018)న తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం, లక్కవరం క్రాస్‌ వద్ద 2400 కి.మీ ప్రస్థానాన్ని వైఎస్‌ జగన్‌ పూర్తి చేశారు.


    పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్‌ మండలంలోని వెంకటాపురం 2000 కి.మీ మైలు రాయిని దాటిన సందర్భంగా పైలాన్‌ ఆవిష్కరణ


నేటికి 200 రోజులు
నేటితో ప్రజాసంకల్పయాత్ర 200 రోజులకు చేరుకుంది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని అమలాపురం మండలంలో పాదయాత్ర కొనసాగుతోంది. మంగళవారంతో 199 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్న జననేత నేడు (బుధవారం) 200వ రోజు మైలురాయిని చేరుకున్నారు. రాజన్న బిడ్డ పాదయాత్ర నేడు అమలాపురం నియోజకవర్గంలోనే పాదయాత్ర కొనసాగుతుంది.

ఏ రోజు ఎక్కడ?..

  • ప్రజా సంకల్ప యాత్ర.. 2017, నవంబరు 6న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభం అయింది.
  • 25వ రోజు యాత్ర గత డిసెంబరు 3న కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం, తుగ్గలి మండలం మదనాంతపురంలో మొదలై చెరువు తండా వరకు కొనసాగింది.
  • 50వ రోజు యాత్ర ఈ ఏడాది జనవరి 2న చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గంలోని ‘చిన్న తిప్ప సముద్రం’ (సీటీఎం) నుంచి మొదలై పీలేరు నియోజకవర్గంలోని జమ్ములవారిపల్లి వరకు సాగింది.
  • 75వ రోజు యాత్ర జనవరి 30న నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం శివారు నుంచి కలిచేడు వరకు సాగింది.
  • 100వ రోజు యాత్ర ఫిబ్రవరి 28న ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం, పొదిలి మండలంలోని ఉప్పలపాడు నుంచి మొదలై సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి వరకు సాగింది.
  • 125వ రోజు యాత్ర మార్చి 31న గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం సరిపూడి నుంచి మొదలై వెలవర్తిపాడు, మేడికొండూరు, గుండ్లపాలెం క్రాస్‌ రోడ్స్‌ మీదుగా పేరేచర్ల వరకు సాగింది.
  • 150వ రోజు యాత్ర మే 1వ తేదీన కష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని పర్ణశాల శివారు శిబిరం నుంచి ప్రారంభమై చిట్టిగూడూరు, గూడూరు, రామరాజుపాలెం క్రాస్, సుల్తానగరం మీదుగా మచిలీపట్నం వరకు కొనసాగింది.
  • 175వ రోజు యాత్ర మే 29వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం శివారు నుంచి ప్రారంభమై తలతాడితిప్ప, మెంతేపూడిక్రాస్, బొప్పనపల్లి, మత్స్యపురి, సీతారామపురం క్రాస్‌ మీదుగా కొప్పర్రు వరకు కొనసాగింది.
  • 200వ రోజు యాత్ర బుధవారం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం శివారు నుంచి ప్రారంభమైంది.

దేశ చరిత్రలో ఎప్పుడూ, ఎవరూ కనీవినీ ఎరగని విధంగా.. నాలుగు పదుల వయసున్న ఓ యువ నాయకుడు ఎండనకా.. వాననకా.. అలుపూసలుపూ లేకుండా.. 200 రోజులపాటు 2400 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేస్తూ.. ప్రజల కష్టాలు వింటూ, వారి కన్నీళ్ళు తుడుస్తూ, ఆత్మీయంగా స్పశిస్తూ, పలకరిస్తూ.. ముందుకు సాగుతున్న ఏకైక నేత, పోరాట యోధుడు, జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రమే.

ఏ నాయకుడూ, ఎప్పుడూ వెళ్లని మారుమూల గ్రామాల్లో, మార్గాల్లో సైతం జననేత అడుగులు వేస్తున్నారు. కొండలు, కోనలు, చిట్టడువుల మీదుగా ఆయన యాత్ర కొనసాగుతోంది. ఎంత కష్టం వచ్చినా, ఆరోగ్యం ఎలా ఉన్నా, ఆయన తన యాత్ర ఆపడం లేదు. రాష్ట్రం కోసం, రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం ఒక మహాయజ్ఞంలా ప్రజాసంకల్పయాత్రలో ముందుకు కదులుతున్నారు. నిత్యం ప్రజలతో మమేకం అవుతూ, వారి బాధలు వింటూ, వారికి ఒక భరోసా ఇస్తూ.. వారిలో ఒకరిలా, ఒక చెల్లికి అన్నగా, ఒక అక్కకు తమ్ముడిగా, ఒక తల్లికి బిడ్డగా, ఒక అవ్వకు మనవడిగా, ప్రతీ నిరుపేద కుటుంబానికి ఒక అన్నగా, ఒక పెద్ద కొడుకుగా నేనున్నానంటూ.. జగన్‌ మోహన్‌ రెడ్డి అడుగులు వేస్తున్నారు.

జగన్‌ అడుగులకు సంఘీభావంగా రాష్ట్రం జన ఉప్పెనై కదులుతోంది. కష్ణా జిల్లా ముఖ ద్వారమైన ప్రకాశం బ్యారేజీ మీదకు జననేత చేరుకునే సందర్భంలో జన ప్రకంపనలతో బ్యారేజీ దద్దరిల్లింది. అలానే తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రజా సంకల్ప యాత్ర ప్రవేశిస్తున్న సందర్భంలో గోదావరి బ్రిడ్జి జన గోదావరిని తలపింపజేసింది.

మహానేత రాజశేఖర రెడ్డి ప్రజా ప్రస్థానం.. 
షర్మిలమ్మ మరో ప్రజా ప్రస్థానం..
ఇప్పుడు జననేత జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్పం...
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వైఎస్‌ కుటుంబం అండ...
వైఎస్‌ కుటుంబానికి ప్రజలే అండా, దండా..
ఈ బంధాన్ని ఎవరూ విడదీయలేరు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement