సామర్లకోట: ఇద్దరికే పరిమితం కావాల్సిన మోటార్ సైకిల్‌పై నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా ఆరుగురు ప్రయాణించడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. సామర్లకోట – పెద్దాపురం ఏడీబీ రోడ్డులో ఓ మోటార్ సైకిల్‌పై ఒక పురుషుడు, ఇద్దరు మహిళలతో పాటు మరో ముగ్గురు చిన్నారులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించారు.
అసలే ఈ రోడ్డులో వాహనాల రద్దీ అధికం. ఏమాత్రం బ్రేక్ వేసినా వెనుక ఉన్న వారు జారి కింద పడే ప్రమాదం కూడా ఉంది. అయినప్పటికీ ఇలా బైక్‌పై వెళ్లడమేమిటని పలువురు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment