motor cycle
-
నెలలో 11 శాతం పెరిగిన విక్రయాలు
మోటార్‌సైకిల్ తయారీదారు రాయల్ ఎన్ఫీల్డ్ సెప్టెంబర్‌లో విక్రయాలు పెరిగినట్లు కంపెనీ సీఈఓ బి.గోవిందరాజన్ తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది విక్రయాలు 11 శాతం పెరిగి 86,978 యూనిట్లకు చేరినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా గోవిందరాజన్ మాట్లాడుతూ..‘కంపెనీ మోటార్ సైకిల్ విభాగంలో విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. 2023 సెప్టెంబర్‌లో 78,580 యూనిట్ల విక్రయం జరిగింది. ఈసారి అదే సమయంలో 11 శాతం విక్రయాలు పెరిగి 86,978కు చేరాయి. 2024 ప్రారంభంలో క్లాసిక్ 350 మోడల్‌ను లాంచ్ చేయడం సంస్థ విక్రయాలు పెరిగేందుకు తోడ్పడింది. గతేడాది సెప్టెంబర్‌లో ఎగుమతులు 4,319 యూనిట్లుగా ఉండేది. అది గత నెలలో 7,652 యూనిట్లకు పెరిగింది’ అన్నారు.ఇదీ చదవండి: పాలసీను సరెండర్ చేస్తే ఎంత వస్తుందంటే..? -
ఆ మోటర్ సైకిల్‌కి నాటి పాక్ అధ్యక్షుడు ఇప్పటికీ డబ్బు చెల్లించలేదు!
రెండు దేశాల సైనిక నాయకుల మధ్య జరిగిన ఆసక్తికర ఘటన. ఇది భారతదేశాన్ని బ్రిటీష్ వాళ్లు పాలిస్తున్నప్పుడు చోటు చేసుకున్న రసవత్తర ఘటన. బ్రిటీష్ పాలనా కాలంలో భారత్‌కి చెందిన సామ్ మానెక్షా, పాక్‌కి చెందిన యాహ్యా ఖాన్ మధ్య చోటు చేసుకుంది ఈ ఘటన. నిజానికి ఈ ఇద్దరూ ఆంగ్లేయుల పాలన కాలంలో మిలటరీ లీడర్లుగా పనిచేయడంతో వీరి మధ్య కొద్దిపాటి స్నేహం ఏర్పడింది. ఆ టైంలో మానెక్షా లెఫ్టినెంట్ కల్నల్ పనిచేయగా, యాహ్యా ఖాన్ మేజర్. అయితే యహ్యా ఖాన్‌కి మానెక్షా వద్ద ఉండే ఎరుపు రంగు మోటార్ సైకిల్‌పై ఆశ ఉండేది. దీంతో ఒకరోజు యహ్యా ఖాన్ మానెక్షాని నాకు ఆ సైకిల్ ఇవ్వు నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను అన్నాడు. మానెక్ష ఆ వెయ్యి రూపాయాలకు ఆశపడి తన వద్ద ఉన్న ఎరుపు రంగు మోటార్ సైకిల్ని ఇచ్చేయడం జరిగింది. ఈలోగా బ్రిటీష్ వాళ్ల మనదేశాన్ని విడిచిపెట్టిపోవడం వెళ్తూ పాక్‌ని అంటగట్టడం జరిగింది. అదికాస్త 1947లో మన భారత్ నుంచి వేరుగా దేశంగా ఏర్పడటం అన్నీ చకచక జరిగిపోయాయి. దీంతో యహ్యా ఖాన్ ఆ సైకిల్ని తీసుకుని పాక్‌కి వెళ్లిపోవడం కూడా జరిగిపోయింది. అయితే పాపం మన భారత ఆర్మీ నాయకుడు సామ్ మానెక్షాకి మాత్రం యహ్యా ఖాన్ డబ్బు చెల్లించ లేదు. ఆంగ్లేయులు వెళ్లిపోయిన అనంతరం మానెక్షా మన భారత ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే అనుకోకుండా 1971లో భారత్‌కి పాక్‌కి మధ్య భయానక యుద్ధం జరిగింది. ఆ టైంలో మన మానెక్ష భారత ఆర్మీ ఛీప్‌గా సైన్యాని నిర్వహిస్తుండగా, యహ్యా ఖాన్ పాక్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అయితే ఆ యుద్ధంలో మన మానెక్ష సారథ్యంలో భారత ఆర్మీ పాక్ సైన్యాన్ని మట్టికరిపించి విజయకేతనం ఎగురవేసింది. ఈ యుద్ధం కారణంగానే బంగ్లాదేశ్ ఒక దేశంగా ఏర్పడటం కూడా జరిగింది. ఈ మేరకు ఓ పత్రిక ఇంటర్వ్యూలో మానెక్షా ఈ ఘటన గురించి చెబతూ తాను 24 ఏళ్లుగా తమన మోటర్ సైకిల్ డబ్బులు వెయ్యి రూపాయాలు ఎప్పుడు వస్తాయా? అని 24 ఏళ్లుగా ఎదురు చూసినట్లు తెలిపారు. అయితే యహ్యా ఖాన్ ఇప్పుడూ తన దేశ ఓటమితో తనకు మూల్యం చెల్లించాడంటూ చమత్కరించారు మానెక్షా. అలాగే తాను యహ్యా ఖాన్ని ఎప్పుడూ ఆ వెయ్యి రూపాయల్ని వడ్డితో సహా చెల్లించమని అడగను కూడా అడలేదని చెప్పుకొచ్చారు. దీని గురించి 2008లో ఆంగ్ల పత్రికా కాలమిస్ట్ రాసుకొచ్చాడు. ఐతే ఇంటర్వ్యూలో మానెక్ష ఆ ఘటనను ఎన్నడూ మర్చిపోలేనని అన్నాడు. ఇద్దరూ వారి దేశాలకు సంబంధించిన అత్యున్నత హోదాలో సాగినా..స్నేహితులుగా ఉన్నప్పుడూ జరిగిన ఘటన మానెక్షని ఎన్నటికీ మర్చిపోనివ్ల లేదు. ఆ ఘటన మానెక్షా మనుసులో మర్చిపోలేని ఘటనగా ఉండిపోయింది. స్నేహం పేరుతో ఓ వ్యక్తి చేసిన మోసం భవిష్యత్తులో కాలం ఎలా బదులు తీర్చుతుంది అనేందుకు ఉదాహరణే ఈ గాథ. అదీగాక తనను మోసం చేసి తన వస్తువుని స్నేహితుడి పట్టుకుపోతే ఆ వ్యక్తి పట్ల సదరు స్నేహితుడి మనుసులో ఎలాంటి ముద్రపడుతుందనేందుకు ఈ ఘటనే నిలువెత్తు సాక్ష్యం. ఇక యుద్ధం గెలిచినప్పటికీ దీనివవల్ల మానవ నష్టం ఎంత ఉంటుందో గుర్తించాడు జనరల్ మానేక్షా. ఇక యహ్యాఖాన్ తర్వాత క్రమక్రమంగా రాజీకయ పతనాన్ని చవిచూశాడు. కాగా ఈ ఘట్టం 2003లో బాలీవుడ్లో తీసిన శ్యామ్ బహుదూర్ సినిమాలో కూడా ఉంది. ఇందులో విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషించారు. (చదవండి: ఈజిప్ట్ అమ్మాయి నోట మన దేశభక్తి గీతం..మోదీ ప్రశంసల జల్లు!) -
బీర్‌తో నడిచే బైక్: మతిపోయే స్పీడ్, కావాలంటే వీడియో చూడండి!
సాక్షి, ముంబై: బీర్‌తో నడిచే బైక్ ఎపుడైనా చూశారా? అవును బీర్ బైకే.. అది కూడా గంటకు 240 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుందట. ప్రస్తుతం ఈ బీర్ బైక్ ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. అమెరికాకు చెందిన మైఖేల్సన్ బీర్ బైక్ సృష్టికర్త. గతంలో రాకెట్‌తో నడిచే టాయిలెట్, జెట్‌తో నడిచే కాఫీపాట్ను కనుగొన్న మైఖేల్సన్ తాజా బీర్బైక్ను రూపొందించడం విశేషం. దీనికి సంబంధించిన వివరాలను ఫాక్స్9తో షేర్ చేసిన అతగాడు బైక్‌లో అమర్చిన హీటింగ్ కాయిల్ బీర్‌ను 300 డిగ్రీల వరకూ మండిస్తుందని, దీంతో నాజిల్స్‌లో ఆవిరి జనరేట్ అవ్వడం ద్వారా బైక్ పని చేస్తుందని మైఖేల్సన్ తెలిపారు. బీరుతో నడిచే మోటార్‌సైకిల్ బ్లూమింగ్టన్లోని అతని గ్యారేజీలో నిర్మించారట. ఈ బైక్ గంటకు 240 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుందని చెప్పాడు మైఖేల్సన్. గ్యాస్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ఇదొక వినూత్న ఆవిష్కరణ అని వెల్లడించాడు. అంతేకాదు రెడ్ బుల్, కారిబౌ కాఫీతో సహా ఏదైనా ద్రవం కూడా తన బైక్ ఇంధనంగా మార్చుకోవచ్చని కూడా పేర్కొన్నాడు. తాను డ్రింక్ చేయనని, అందుకే దీన్ని ఇంధనంగా మలచి మెరుగ్గా వాడుకోవాలని ఆలోచించానని చెప్పుకొచ్చాడు. రాకెట్మ్యాన్గా పేరొందిన మైఖేల్సన్ బీర్ బైక్ స్ధానిక కార్ షోస్‌లో టాప్ ప్లేస్ స్ధానంలో నిలవడం విశేషం. కొన్ని ప్రదర్శనల అనంతరం తన ఇంటిలోని మ్యూజియంలో ఈ బైక్‌ను ఉంచుతానని మైఖేల్సన్ తెలిపాడు. 9 నెలల క్రితం తన యూట్యూబ్ ఛానెల్లో ఈ వీడియోను షేర్ చేశాడు. అతని కుమారుడు దీని గురించి సవివరమైన సమాచారం ఇచ్చాడు. -
షాకింగ్ వీడియో: ఒకే బైక్‌పై ఏడుగురు ప్రయాణం
ద్విచక్రవాహనంపై ఇద్దరు వెళ్లేందుకే అనుమతి ఉంటుంది. కానీ, కొన్నిసార్లు ముగ్గురు వెళ్తారు. బైక్ ముగ్గురు కూర్చుంటేనే కష్టంగా ఉంటుంది.. ఏకంగా ఏడుగురు ప్రయాణిస్తే..! ఆలోచిస్తే.. అసాధ్యం అనుంకుటున్నారు కదా? అయితే ఒకే బైక్‌పై ఓ కుటుంబానికి చెందిన ఏడుగురు(నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి) వెళ్లిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మాటల్లేవ్.. అంటూ ట్యాగ్‌లైన్ ఇచ్చారు. వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన బైక్‌పై ముందు ఇద్దరు పిల్లలను కూర్చోబెట్టుకోగా.. వెనకాల ఇద్దరు మహిళలు కూర్చున్నారు. వారి ఒడిలో ఇద్దరు పిల్లలను పట్టుకున్నారు. కుటుంబం మొత్తాన్ని ఒకే బైక్‌పై తీసుకెళ్లి ఔరా అనిపించాడు ఆ వ్యక్తి. అయితే, బైక్‌పై ఉన్న ఏ ఒక్కరికీ హెల్మెట్ లేకపోవటం గమనార్హం. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.2 మిలయన్ల మంది చూశారు. ఈ విధంగా ప్రయాణించి వారి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని కొందరు వాదిస్తుంటే.. మరికొందరు సరైన రవాణా సౌకర్యం లేకపోవటంతోనే ఇలా చేయాల్సి వచ్చిందేమోనని మద్దతు తెలుపుతున్నారు. ఏడుగురిని ఒకే బైక్‌పై తీసుకెళ్లిన వ్యక్తిని అరెస్ట్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. Speechless 😶 pic.twitter.com/O86UZTn4at — Supriya Sahu IAS (@supriyasahuias) August 30, 2022 ఇదీ చదవండి: Ajith: బైక్‌పై విశాఖపట్నం నుంచి ఏకంగా హిమాలయాలకు.. -
మూడు ఫుల్లు.. మూడు హాఫ్ టికెట్లు..
సామర్లకోట: ఇద్దరికే పరిమితం కావాల్సిన మోటార్ సైకిల్‌పై నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా ఆరుగురు ప్రయాణించడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. సామర్లకోట – పెద్దాపురం ఏడీబీ రోడ్డులో ఓ మోటార్ సైకిల్‌పై ఒక పురుషుడు, ఇద్దరు మహిళలతో పాటు మరో ముగ్గురు చిన్నారులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించారు. అసలే ఈ రోడ్డులో వాహనాల రద్దీ అధికం. ఏమాత్రం బ్రేక్ వేసినా వెనుక ఉన్న వారు జారి కింద పడే ప్రమాదం కూడా ఉంది. అయినప్పటికీ ఇలా బైక్‌పై వెళ్లడమేమిటని పలువురు వ్యాఖ్యానించారు. -
వ్యాపారం అచ్చిరావట్లేదని.. ఇంటర్నెట్లో చూసి బైక్‌లను..
సాక్షి, కరీంనగర్: వృత్తి, వ్యాపారం అచ్చిరాక పోవడంతో అప్పులు పెరిగి ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉంటున్న ఓ వ్యక్తి ఇంటర్నెట్ చూశాడు.. ఒక ఛానల్లో తాళం వేసి ఉన్న బైక్‌లను ఎలా తీయాలో నేర్చుకున్నాడు. కరీంనగర్ కమిషనరేట్‌లో పలు ప్రాంతాల్లో 12 బైక్‌లను దొంగతనం చేసి, చివరికి పోలీసులకు చిక్కాడు. కరీంనగర్ అడిషనల్ డీసీపీ టౌన్ డివిజన్ డాక్టర్ పి.అశోక్ తన కార్యాలయంలో మంగళవారం వివరాలు వెల్లడించారు. రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన మద్ది శ్రీనివాస్(33) అలియాస్ జల్సా ఆటోడ్రైవర్‌గా పని చేసేవాడు. 2010లో మోతెకు చెందిన అమ్మాయిని కర్నూల్లో వివాహం చేసుకొని, 2012 వరకు అక్కడే ఉన్నాడు. తర్వాత గుండి ప్రాంతంలో బ్లేడ్ ట్రాక్టర్, కారు, వివిధ వాహనాలు నడిపాడు. 2020 జనవరిలో గోపాల్రావుపేటలో ఆటోస్టోర్ పెట్టుకున్నాడు. లాక్డౌన్ వల్ల నష్టం రావడంతో షాపు తీసేసి, కూలీ పనికి వెళ్లాడు. 2021 మార్చి నుంచి కరీంనగర్ మంకమ్మతోటలో భార్య, కుమారుడు, కూతురుతో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఉపాధి లేక అప్పులు పెరగడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంటర్నెట్లో తాళం వేసి ఉన్న బైక్‌లను ఏ విధంగా తీయాలో నేర్చుకొని, కరీంనగర్ టూటౌన్ పరిధిలో 9, కొడిమ్యాల, రామడుగు, పెగడపల్లి నామాపూర్‌లలో 3 బైక్‌లు దొంగిలించాడు. నంబర్ ప్లేట్లు తీసేసి, తన స్నేహితుల వద్ద ఉంచాడు. కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు శ్రీనివాస్‌ను మంగళవారం పద్మనగర్ బైపాస్‌రోడ్డులో అరెస్టు చేశారు. అతడు, అతని స్నేహితుల వద్ద ఉన్న 12 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. దొంగను పట్టుకున్న టూటౌన్ సీఐ లక్ష్మీబాబు, ఎస్సై టి.మహేష్, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్, పీసీలు జ్ఞానేశ్వర్, శ్రీకాంత్‌రెడ్డి, పవన్‌లను సీపీ కమలాసన్‌రెడ్డి అభినందించి, రివార్డులు ప్రకటించారు. -
ఇంజన్లో ఇరుక్కున్న బైక్, ఆగిన రైలు
నెక్కొండ: గూడ్స్ రైలు ఇంజన్లో టూ వీలర్ వాహనం ఇరుక్కోవడంతో రైలు అర గంటపాటు నిలిచిపోయింది. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలంలోని గేటుపల్లిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. మండలం లోని గొల్లపల్లికి చెందిన ఓ రైతు తన ద్విచక్ర వాహనాన్ని గేటుపల్లి వద్ద రైలు పట్టాలను దాటిస్తున్నాడు. ఈ క్రమంలో వరం గల్ నుంచి విజయవాడ వెళ్తున్న గూడ్స్ రైలు దగ్గరకు రావడం తో గమనించిన రైతు తన వాహనాన్ని విడిచి వెళ్లిపోయాడు. అప్పటికే అప్రమత్తమైన డ్రైవర్ రైలు వేగాన్ని తగ్గించినప్పటికీ ఇంజన్‌లోకి బైక్ ఇరుక్కుపోయింది. అరగంటపాటు శ్రమించి టూవీలర్‌ను తొలగించాక రైలు తిరిగి బయలుదేరింది. చదవండి: టీచర్ మందలించాడని.. ఆత్మహత్య చేసుకున్న పదోతరగతి విద్యార్థి -
తన ఇంటి ముందు బైక్‌పై వెళుతున్నాడని..
సాక్షి, భోపాల్ : మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. దళిత యువకుడు తమ ఇంటి ముందు బైక్‌పై వెళుతుండటాన్ని తట్టుకోలేని గ్రామ సర్పంచ్ మరో నలుగురు కలిసి అతడిని తీవ్రంగా గాయపరిచారు. తికంఘర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈనెల 21న తాను బైక్‌పై వెళుతుండగా గ్రామ సర్పంచ్ హేమంత్ కుర్మీ, అతని సోదరులు, ఇతరులు తనను అడ్డుకుని బైక్‌పై నుంచి తోసివేశారని, తనను దారుణంగా కొట్టారని దయారాం అహిర్వార్ (30) పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులు హేమంత్ కుర్మీ, ఆయన సోదరులు వినోద్ కుర్మీ, మున్ను కుర్మీ, అనిరుధ్ కుర్మీ, మరో నిందితుడు దినేష్ యాదవ్‌లను అరెస్ట్ చేశామని స్థానిక ఏఎస్ఐ రామ్‌సేవక్ ఝా తెలిపారు. తమ ఇంటి ముందున్న రోడ్డుపై బైక్‌పై వెళ్లవద్దని నిందితుడు తనను హెచ్చరించాడని అహిర్వార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంటి ముందు బైక్‌పై వెళ్లకుండా తోసుకుంటూ వెళ్లాలని సలహా ఇచ్చాడని చెప్పారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
మెటార్‌సైకిల్ బాంబు పేలి ముగ్గురు మృతి
బ్యాంకాక్: మోటార్ సైకిల్ బాంబు పేలి ముగ్గురు పౌరులు మృతిచెందారు. మరో 19మంది గాయపడ్డారు. థాయ్‌లాండ్‌కు దక్షిణాన ఉన్న తిరుగుబాటుదారుల ప్రాంతమైన యాలా పట్టణంలో సోమవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు డౌన్‌టౌన్‌లోని పంది మాంసం అమ్మే ఓ దుకాణం ముందు మోటార్ సైకిల్‌ను పార్కు చేసి ఉంచారని, అందులోని బాంబులు పేలడంతో ముగ్గురు మృతిచెందారని పోలీసులు తెలిపారు. కొన్ని నెలల కిందట ఇలాంటి సంఘటనే మొదటగా మెజారిటీ ముస్లింలు నివసించే ప్రాంతంలో జరిగింది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. -
మోటార్ సైకిల్ ఉన్నా అనర్హులే!
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో మోటార్ సైకిల్, ల్యాండ్‌లైన్ ఫోన్ ఉన్నా, 16–59 ఏళ్ల మధ్య వయసు గల కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నా ప్రధాన మంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన (సౌభాగ్య) పథకం కింద ఉచిత విద్యుత్ కనెక్షన్ పొందేందుకు అనర్హులని కేంద్రం ప్రకటించింది. విద్యుత్ సదుపాయాన్ని నోచుకోని పేదల గృహాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ల జారీకి ఇటీవల కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2019 మార్చి 31 లోగా దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ విద్యుత్ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. సామాజిక ఆర్థిక కుల గణన (సీఈసీసీ) సమాచారం ఆధారంగా సౌభాగ్య పథకం కింద లబ్ధిదారుల ఎంపిక జరపాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు పథకం అమలుకు సంబంధించిన కేంద్ర విద్యుత్ శాఖ సోమవారం మార్గదర్శకాలను ప్రకటించింది. వీటి ప్రకారం ఇంట్లో మోటార్ సైకిల్ ఉన్నా ఈ పథకానికి అనర్హులు. సీఈసీసీ సర్వేలో కుటుంబాలను మూడు స్థాయి (స్టేజ్)లుగా విభజించగా, ప్రథమ స్థాయిలోని కుటుంబాలు ‘సౌభాగ్య’ఉచిత విద్యుత్ కనెక్షన్లకు అనర్హులని కేంద్రం తెలిపింది. రెండో స్థాయి కుటుంబాలు ఆటోమేటిక్‌గా అర్హులవుతాయని, మూడో స్థాయిలోని కుటుంబాలను నిర్ణీత అర్హత ప్రమాణాల ఆధారంగా ఎంపిక జరపాలని సూచించింది. ఒక్కో విద్యుత్ కనెక్షన్ జారీకి డిస్కంలకు కేంద్రం రూ.500 చెల్లించనుంది. ఈ విద్యుత్ కనెక్షన్ల జారీకి అవసరయ్యే వ్యయంపై అంచనాలు పంపాలని రాష్ట్రాలను కోరింది. ఇవి ఉంటే అనర్హులు (ప్రథమ స్థాయి) ♦ 2/3/4 చక్రాల వాహనాలు/ చేపలు పట్టే బోటు ♦ 3–4 చక్రాల వ్యవసాయ యంత్రాలు ♦ రూ.50 వేలకు పైగా రుణ పరిమితి గల కిసాన్ క్రెడిట్ కార్డు ♦ ప్రభుత్వ ఉద్యోగి ♦ వ్యవసాయేతర వ్యాపారాలను ప్రభుత్వం వద్ద నమోదు చేసుకున్న గృహాలు ♦ కుటుంబ సభ్యుడు నెలకు రూ.10 వేలకు పైగా సంపాదిస్తే.. ♦ ఆదాయ పన్ను చెల్లింపుదారులు ♦ వృత్తి పన్ను చెల్లింపుదారులు ♦ మూడు లేదా అంతకు మించి గదులు కలిగిన పక్కా గృహాలు ♦ రిఫ్రిజిరేటర్ ♦ ల్యాండ్‌లైన్ ఫోన్ ♦ 2.5 ఎకరాలకు పైగా ఆరుతడి భూమితో పాటు ఒక ఇరిగేషన్ యంత్రం కలిగి ఉన్నవారు ♦ 5 ఎకరాలు ఆపై ఆరుతడి భూమి కలిగి ఉన్నవారు ♦ 7.5 ఎకరాలు, ఆపై భూమి కలిగి ఉండటంతో పాటు ఒక సాగునీటి పరికరాన్ని కలిగి ఉన్న వారు వీరు నేరుగా అర్హులు (రెండో స్థాయి) ♦ ఇళ్లు లేని కుటుంబాలు ♦ అనాథలు ♦ పాకీ పని చేసే కుటుంబాలు (మాన్యువల్ స్కావెంజర్స్) ♦ ఆదిమ గిరిజన సమూహాల కుటుంబాలు ♦ విముక్తి పొందిన నిర్బంధ కార్మికులు ఇళ్లు లేదా గుడిసె ఉన్నా పై కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ జారీ చేయాలి. నిర్ణీత అర్హతలతో వీరు కూడా అర్హులే.. (మూడో స్థాయి) పేద కుటుంబాలను గుర్తించే దారిద్య్ర సూచీకి సంబంధించి ఈ కింది 7 అంశాల ఆధారంగా ఉచిత విద్యుత్ కనెక్షన్‌కు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ♦ ఒక గది కలిగి కచ్చా గోడలు, కచ్చా పై కప్పు గల ఇళ్లల్లో ఉండే కుటుంబాలు ♦ 16–59 ఏళ్ల మధ్య వయసు గల వారెవరూ లేని కుటుంబాలు ♦ 16–59 మధ్య వయసుండి పురుష సభ్యులెవరూ లేకుండా కుటుంబ పెద్దగా మహిళ ఉన్న కుటుంబాలు ♦ వికలాంగులు, శరీరం సహకరించని వయోవృద్ధులున్న కుటుంబాలు ♦ ఎస్సీ/ఎస్టీ కుటుంబాలు ♦ 25 ఏళ్లకు పైగా వయసు కలిగి అక్షరాస్యులైన సభ్యులెవరూలేని కుటుంబాలు ♦ భూమి లేక కూలీపై ఆధారపడిన కుటుంబాలు -
ఏక చక్రం.. వాలు వేగం
ఫొటో చూసి.. ఇదేదో సర్కస్ ఫీట్ ఏమో అని అనుకునేరు. కానే కాదు. ఇది అక్షరాల మన రోడ్లమీద పరుగెత్తగల మోటర్సైకిలే? పేరు ఊనోబోల్ట్. బోలెడన్ని విశేషాలున్నాయి దీంట్లో. అన్నింటి కంటే ముందుగా చెప్పుకోవాల్సింది దీని ఒంటి కాలి గురించి! సర్కస్‌లో ఒంటిచక్రం సైకిళ్లను పోలినప్పటికీ పడిపోకుండా దీనిని నడపాలంటే మనం పెద్దగా కష్టపడనవసరం లేదు. దీంట్లో ఉండే జైరోస్కోపులు.. సెన్సర్లు ఎప్పటికప్పుడు మోటార్‌సైకిల్ ఎలా ఉందన్న విషయాన్ని గమనిస్తూ.. బరువును అటుఇటూ మారుస్తూ నిలకడగా. నిట్టనిలువుగా ఉంచుతాయి. రెండో విశేషం.. మీరు అనుకుంటున్నట్లే.. ఇది పూర్తిగా విద్యుత్తుతో మాత్రమే పనిచేసే మోటార్‌సైకిల్. ఒకసారి చార్జ్ చేస్తే 4.4 ఆంపియర్ అవర్స్ బ్యాటరీ సాయంతో దాదాపు 40 కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లవచ్చు. ఛార్జ్ చేసేందుకు పట్టే సమయం దాదాపు 45 నిమిషాలు మాత్రమే. అరవై వోల్టులు, వెయ్యి వాట్ల విద్యుత్తు మోటార్ చక్రం మధ్యలోనే ఉంటుంది. కేవలం ఇరవై కేజీల బరువు మాత్రమే ఉన్నప్పటికీ దీనిపై దాదాపు 127 కిలోల బరువున్న వాళ్లూ సులువుగా ప్రయాణించవచ్చు. కొన్నేళ్ల క్రితం వచ్చిన సెగవే పర్సనల్ ట్రాన్స్పోర్ట్ వాహనం మాదిరిగానే దీంట్లో ప్రత్యేకంగా యాక్సలరేటర్ లాంటిదేమీ ఉండదు. హ్యాండిల్ బార్‌ను పట్టుకుని మనం కాస్త ముందుకు వాలితే వేగం అందుకుంటుంది. వెనక్కు వాలితే నెమ్మదిస్తుంది. బ్రేక్‌ను నొక్కితే ఆగిపోతుంది. పక్కలకు తిరగాలంటే.. ఆ వైపునకు కొంచెం వాలితే సరిపోతుంది. ఇంకో విషయం.. ఈ మోటార్‌సైకిల్‌లో రివర్స్ గేర్ కూడా ఉందండోయ్! ఊనోబోల్ట్ పేరుతోనే కంపెనీ ఏర్పాటు చేసిన కొంతమంది ఔత్సాహికవేత్తలు ప్రస్తుతం ఈ ఒంటికాలి మోటార్‌సైకిల్‌ను వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేసేందుకు కిక్‌స్టార్టర్ వెబ్సైట్ ద్వారా నిధులు సేకరిస్తున్నారు. ప్రచారం మొదలుపెట్టి కొన్ని రోజులు కూడా కాలేదుగానీ.. ఇప్పటికే వారు లక్ష్యానికి మించి డబ్బులు సేకరించగలిగారు. అన్నీ సవ్యంగా సాగితే.. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా ఊనోబోల్ట్లు రోడ్లపైకి వస్తాయని అంటున్నారు ఈ ఇటలీ కంపెనీ సీఈవో సీన్ ఛాన్! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కొత్త పార్టీ ఏర్పాటు.. గుర్తు మోటార్ సైకిల్?
ఉత్తరప్రదేశ్‌లో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైనట్లేనా? ప్రస్తుత పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తోంది. అందులోనూ సాక్షాత్తు సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్ యాదవే ఈ విషయం చెబుతుండటంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. రాంగోపాల్ యాదవ్ కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారని, దానికి మోటార్ సైకిల్ గుర్తును ఆయన తీసుకున్నారని ములాయం సింగ్ యాదవ్ ఆరోపించారు. దానికి 'అఖిల భారతీయ సమాజ్‌వాదీ పార్టీ' అని పేరు కూడా పెట్టినట్లు చెప్పారు. తాజాగా ములాయం, అఖిలేష్ యాదవ్‌ల మధ్య జరిగిన సమావేశంలో పార్టీ జాతీయాధ్యక్ష పదవి విషయంలో ఇద్దరూ రాజీ పడలేదని తెలుస్తోంది. ఎన్నికల గుర్తు సైకిల్ కోసం ఇరు వర్గాలు దాఖలు చేసుకున్న పిటిషన్లను ఉపసంహరించుకోవాలని ములాయం చేసిన ప్రతిపాదనను కూడా అఖిలేష్ తోసిపుచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కావాలంటే శివపాల్ యాదవ్, అమర్‌సింగ్‌లను ఈ ఎన్నికల నుంచి పక్కకు పెట్టడానికి సరేనన్న ములాయం.. అమర్‌సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించడానికి మాత్రం ససేమిరా అన్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడిగా తానే ఉంటానని, ఇన్నాళ్లూ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాంగోపాల్ యాదవ్ అనుభవించిన అధికారాలన్నింటినీ అఖిలేష్‌కు ఇస్తానని కూడా ములాయం ప్రతిపాదించారు. అంటే, రాంగోపాల్ యాదవ్‌ను మాత్రం పార్టీ నుంచి బయటకు పంపాలన్నదే ములాయం ప్రతిపాదనగా తెలుస్తోంది. -
వ్యక్తి దారుణ హత్య
- సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డోన్ సీఐ - కుటుంబసభ్యులు అనుమానిస్తున్న వ్యక్తి ఇంటివద్దకు వెళ్లిన డాగ్‌స్క్వాడ్ కృష్ణగిరి: మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన బోయ ప్రతాప్(55)ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. మంగళవారం రాత్రి హత్య చేసి మోటార్‌సైకిల్‌పై మృతదేహాన్ని తీసుకువచ్చి మృతుని పొలంలోనే పారవేసినట్లు అనుమానాలున్నాయి. బుధవారం ఉదయం మృతుని భార్య పొలానికి వెళ్లగా తన భర్త మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులకు తెలియజేసింది. విషయం తెలుసుకున్న డోన్ సీఐ శ్రీనివాసులు, కృష్ణగిరి ఎస్ఐ సోమ్లానాయక్, డోన్ రూరల్ ఎస్ఐ రామసుబ్బయ్య సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీం బృందాలను రంగంలోకి దింపారు. డాగ్ స్క్వాడ్ సంఘటనాస్థలం నుంచి గ్రామంలోకి వెళ్లి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్న వ్యక్తి ఇంటివద్దకు వెళ్లి తిరిగి మృతదేహం వద్దకు చేరుకుంది. క్లూస్‌టీం సిబ్బంది మృతదేహం పరిసరాల్లో ఉన్న మద్యం బాటిళ్లు తదితర వాటిపై వేలిముద్రలను సేకరించారు. మృతుడు మంగళవారం గ్రామానికి చెందిన మరోవ్యక్తితో మోటార్‌సైకిల్‌పై తిరిగాడని అయితే రాత్రి అయినా తిరిగి రాలేదని కుటుంబసభ్యులు పోలీసులకు తెలియజేశారు. మృతుని భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. -
మంటలార్పడానికి ఇక ద్విచక్రవాహనం
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర విపత్తుల అగ్నిమాపక శాఖలో కొత్త అస్త్రం చేరింది. ఇరుకు గల్లీల్లో జరిగే అగ్ని ప్రమాదాలను సైతం నిమిషాల వ్యవధిలో అదుపులోకి తీసుకొచ్చే మినీ ఫైర్ టెండర్ వెహికల్స్‌ను ప్రభుత్వం అందించింది. ‘మోటార్ సైకిల్ మౌంటెడ్ మిస్ట్ ఎక్విప్మెంట్’గా పిలిచే ఈ వాహనాలతో భారీ అగ్నిమాపక యంత్రాలు వెళ్లలేని చోటుకు సులువుగా వెళ్లి మంటలను ఆర్పివేయవచ్చు. గతేడాది సిటీలో 21 మినీ ఫైర్ టెండర్ వెహికల్స్‌ను ప్రయోగాత్మకంగా పరిచయం చేశారు. వాటితో సత్ఫలితాలు రావడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ 100 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. వీటిలో గ్రేటర్‌లోని 25 అగ్నిమాపక కేంద్రాలకు రెండేసి చొప్పున కేటాయించారు. గల్లీల్లో సైతం ఇక ఈజీ.. జనసమ్మర్ధ ప్రాంతాలు, ఇరుకైన రోడ్లు, గల్లీల్లో అగ్ని ప్రమాదాలు జరిగిన చోటికి భారీ అగ్నిమాపక యంత్రాలు వెళ్లడం కష్టం. నగర ట్రాఫిక్‌లో పెద్ద వాహనాలు చేరుకోవడం కొంత ఇబ్బందే. ఇలాంటి సమయంలో ఈ బుల్లి వాహనాలు సమర్థవంతంగా సేవలు అందిస్తున్నాయి. తొలి ఐదు నిమిషాల్లోనే ఘటనా ప్రాంతానికి చేరుకుని తమ పని ముగిస్తున్నాయి. ప్రమాదం మరీ పెద్దదైతే.. భారీ అగ్నిమాపక యంత్రాలు వచ్చేదాకా మంటలు వ్యాపించకుండా వీటితో ‘ఫస్ట్ ఎయిడ్’ చేస్తున్నారు. దీంతో ఆస్తి, ప్రాణ నష్టం తగ్గుతోంది. వాహనం ప్రత్యేకతలివీ.. రాయల్ ఎన్ఫీల్డ్ 350 సీసీ బైక్‌తో ఈ యంత్రాలను రూపొందించారు. దీనికి పది లీటర్ల సామర్థ్యం గల వాటర్ సిలిండర్ ఉంటుంది. దీనికి మిస్ట్గన్ పరికరాలు అమర్చి ఉంటాయి. 10 లీటర్ల నీరులో 9.3 వాటర్, 0.3 ఫోమ్ ఉంటుంది. ఇందులోని నీరు 1000 మైక్రాన్ లోపు నీటి తుపరగా మారుతుంది. 200 బార్స్ ఒత్తిడి గల ఎయిర్ సిలిండర్లు నాలుగు ఉంటాయి. ఒత్తిడితో ఉన్న గాలి, నురుగు, నీటి తుంపరలు బలంగా చిమ్మడం ద్వారా మంటలు అదుపులోకి వస్తాయి. వాహనానికి ఉన్న మిస్ట్ గన్‌తో నీరు 14 మీటర్ల ఎత్తుకు వెళుతుంది. ఘటనాస్థలికి వెళ్లే సమయంలో సైరన్ మోగిస్తూ ట్రాఫిక్‌ను చేదించుకుని దూసుకెళ్లవచ్చు. 30 సెకన్లలో మంటలను అదుపులోకి తీసుకువచ్చే సామర్థ్యం దీనికుంది. దీని వినియోగం భారీ అగ్నిమాపక యంత్రం మాదిరిగానే ఉంటుంది. -
ఇద్దరికి గాయాలు
కంచిలి : జాతీయ రహదారిపై మండల కేంద్రం వద్ద శనివారం మధ్యాహ్నబ జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు మోటారుసైకిళ్లు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు చెప్పిన వివరాలు... కంచిలి మండలం శాసనాం గ్రామం వద్ద విద్యుత్ టవర్స్ నిర్మాణంలో పని చేస్తున్న కోల్‌కత్తాకు చెందిన జబ్బర్ అలీ, గరీబుద్దీన్‌లు డీజిల్ కోసం కంచిలి వచ్చారు. డీజిల్ కొనుగోలు చేసిన అనంతరం తమ బైక్ మీద గరీబుద్దీన్ బైక్ నడుపుతుండగా జబ్బర్ అలీ ఆయిల్ క్యాన్ పట్టుకొని వెనుక కూర్చున్నాడు. వీరు స్థానిక తహసీల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి అంపురం వైపు వెళ్తుండగా... అదే మార్గంలో వెనుక నుంచి వస్తున్న బైక్ వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో జబ్బర్ అలీ తీవ్ర గాయాల పాలయ్యాడు. వెనుక నుంచి వచ్చి ఢీకొన్న బైక్ వజ్రపుకొత్తూరుకు చెందిన కె.రవి, రాజు తమ బైక్‌లో వజ్రపుకొత్తూరు నుంచి ఇచ్ఛాపురం వైపు ఎలక్ట్రికల్ సామానులు కొనుగోలు చేయటానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో ముందు బైక్‌లో ఉన్న జబ్బర్ అలీతో పాటు వెనుక బైక్‌ను నడుపుతున్న రాజు తీవ్ర గాయాలపాలయ్యాడు. వీరిని సోంపేట ప్రభుత్వాసుపత్రిలో ఎన్‌హెచ్ అంబులెన్స్‌లో చేర్పించారు. జబ్బర్ అలీ ఫిర్యాదు మేరకు స్థానిక హెచ్‌సీ పి.నీలకంఠేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జబ్బర్ అలీ తీవ్ర గాయాల పాలవ్వటంతో బరంపురం ఎంకేసీజీ ఆసుపత్రికి తరలించారు. -
పోలీస్ స్టేషన్లో అత్మాహత్యాయత్నం
రాజమండ్రి: తనపై అన్యాయంగా కేసు పెట్టారంటూ ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వీరవాసరం మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన గంటసాల నాగరాజు పంచాయతీ పైప్‌లైన్‌ను పాడు చేస్తున్నాడంటూ సర్పంచ్ గురదాసి లక్ష్మణరావు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గురువారం ఉదయం నాగరాజును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వరకు అతడిని స్టేషన్లోనే కూర్చోబెట్టారు. ఈ నేపథ్యంలో తనపై అన్యాయంగా కేసు పెట్టారన్న ఆవేదనతో నాగరాజు స్టేషన్లో ఉన్న మోటార్ సైకిల్ నుంచి పెట్రోల్ తీసి ఒంటిపై పోసుకుని నిప్పటించుకున్నాడు. అనంతరం బాధను తట్టుకోలేక స్టేషన్ ప్రాంగణంలో గల బావిలో దూకేశాడు. బావిలో నీరు లేకపోవడంతో మంటలు చెలరేగి అతడి శరీరం బాగా కాలిపోయింది. స్టేషన్ సిబ్బంది, ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు నాగరాజును బావిలోంచి బయటకు తీసి భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రై వేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వడ్డిగూడెం గ్రామస్తులు వీరవాసరం తరలివచ్చి పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. -
బైక్ డిక్కీలో ఉంచిన రూ.3 లక్షలు మాయం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పట్టపగలే ఓ మోటారుసైకిలు డిక్కీలో ఉంచిన రూ.3 లక్షలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు. వివరాలివీ...పొందూరుకు చెందిన పశువుల వ్యాపారి వి.వెంకట్రావు శ్రీకాకుళంలోని ఎస్బీఐ నుంచి రూ.3 లక్షలు డ్రా చేసుకుని, తన బైక్ డిక్కీలో పెట్టారు. అనంతరం ఆయన రామలక్ష్మణ్ జంక్షన్లో బైక్‌ను ఉంచి పక్కనే ఉన్న మరో బ్యాంకులోకి వెళ్లి వచ్చి చూసేసరికి డిక్కీ తెరిచి ఉంది. డబ్బు మాయమైన విషయం గుర్తించిన ఆయన వెంటనే పోలీసులను ఆశ్ర యించారు. -
రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
గద్వాల న్యూటౌన్, న్యూస్‌లైన్ : పెళ్లి వేడుకలకు హాజర వ్వడానికి వస్తున్న త ండ్రీ కూతుళ్లు ప్రమాదం బారిన పడ్డారు. చిన్నారి మృత్యువాత పడగా తండ్రికి సైతం తీవ్ర గాయాలు తగిలాయి. ఈ సంఘటన గురువారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో గద్వాల మండల పరిధిలోని జమ్మిచేడు శివారులో చోటుచేసుకుంది. పూర్తి వివరాలిలా.. కర్నూలు జిల్లా దేవరకొండ మండలం నెలకొండి గ్రామానికి చెందిన రామాంజనేయులు తన భార్య రామేశ్వరిలు ఇద్దరు కూతుళ్లు శృతి(5), కీర్తిలతో కలిసి మోటార్ సైకిల్‌పై గద్వాల సమీపంలో ఉన్న బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహానికి హాజరయ్యేందుకు ఉదయం బయల్దేరారు. వారి వాహనం జమ్మిచేడు శివారుకు చేరుకోగానే గద్వాల నుంచి అనంతపురం వైపు వస్తున్న హుస్సేన్, రాముడు అనే యువకులు బైకుపై వస్తూ ఎదురుపడి ఢీకొన్నారు. ఈ సంఘటనలో ముందు భాగంలో కూర్చున్న చిన్నారి శృతి, రామాంజనేయులు ఎగిరి రోడ్డుపక్కన పడ్డారు. చిన్నారి తలకు తీవ్ర గాయాలవ్వడంతో ఆమె ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందింది. రామాంజనే యులుతోపాటు, రాముడు, హుసేన్‌లకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. వారిని కర్నూలు స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చిన్నారి మృతితో ఆస్పత్రి ఆవరణలో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. శుభకార్యానాకి వస్తూ ప్రమాదం బారిన పడటంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
సింగిల్ టైర్ బైక్..
కేవలం ఒకే చక్రమున్న మోటారు సైకిల్ ఇది. పేరు రైనో. అమెరికాకు చెందిన రైనో మోటర్స్ కంపెనీ దీన్ని తయారుచేసింది. ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీలో దీంతో ఎంచక్కా దూసుకుపోవచ్చని.. మోటారుసైకిల్‌తో పోలిస్తే.. చాలా తక్కువ స్థలం ఆక్రమించే దీన్ని ఫుట్‌పాత్‌లు, ఇంటి కారిడార్లలోనూ నడపొచ్చని సదరు కంపెనీ సీఈవో క్రిస్హాఫ్మన్ (చిత్రంలోని వ్యక్తి) చెబుతున్నారు. అంతేకాదు.. లిఫ్ట్‌లోకి(పక్కనున్నవారు ఒప్పుకుంటే) కూడా తీసుకెళ్లవచ్చని అంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. బ్యాటరీని తీసేసి.. మనం చార్జింగ్ పెట్టుకోవచ్చు. దీన్ని నడిపే విధానం వేరేగా ఉంటుంది. నడిపేటప్పుడు మనం ముందుకు వంగితే వేగం పెరుగుతుంది. వెనక్కు వెళ్తే.. వేగం తగ్గుతుంది. 57 కిలోల బరువున్న రైనో బైక్ ధర రూ.3.3 లక్షలు. -
సుజుకి కొత్త టూవీలర్లు
ముంబై: జపాన్ టూ-వీలర్ దిగ్గజం సుజుకి... సోమవారం రెండు కొత్త టూ-వీలర్లను ఆవిష్కరించింది. లెట్స్ పేరుతో ఒక స్కూటర్‌ను, జిక్సర్ పేరుతో కొత్త మోటార్ బైక్‌ను తెస్తున్నట్లు సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా(ఎస్ఎంఐఎల్) ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ అతుల్ గుప్తా చెప్పారు. లెట్స్ స్కూటర్‌ను బాలీవుడ్ నటి పరిణితి చోప్రా, జిక్సర్ బైక్‌ను హీరో సల్మాన్‌ఖాన్ ఆవిష్కరించారు. వచ్చే నెలలో జరిగే ఆటో ఎక్స్‌పోలో ఈ టూవీలర్ల ధరలను వెల్లడిస్తామని, ఇతర కంపెనీలకు గట్టి పోటీనిచ్చేలా ధరలుంటాయని గుప్తా తెలిపారు. ఈ ఏడాదిలోనే మరో రెండు కొత్త టూవీలర్లను అందిస్తామన్నారు. వచ్చే నెల నుంచి లెట్స్ స్కూటర్లను, జూలై నుంచి జిక్సర్ బైక్‌లను విక్రయిస్తామని చెప్పారు. లెట్స్ స్కూటర్ ‘ 98 కేజీలు ప్రస్తుతం మార్కెట్లో సుజుకి యాక్సెస్, స్విష్ ఉన్నాయి. లెట్స్‌లో ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక వైపు ఆయిల్-డాంప్డ్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ట్యూబ్‌లెస్ టైర్లు, 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ వంటి ప్రత్యేకతలున్నాయి. తక్కువ బరువుండే(98 కేజీలు) లెట్స్ 5 రంగుల్లో లభిస్తుంది. సుజుకి ఈకో పెర్ఫామెన్స్ (సెప్) టెక్నాలజీతో రూపొందిన ఈ స్కూటర్ 63 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ తెలియజేసింది. జిక్సర్ బైక్ ప్రత్యేకతలు ఇవీ... ఈ 150 సీసీ బైక్‌లో సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఎస్ఓహెచ్సీ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్, ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనక వైపు మోనో షాక్ సస్పెన్షన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్ వంటి ప్రత్యేకతలున్నాయి. యమహా ఎఫ్‌జడ్, హోండా సీబీ ట్రిగ్గర్, బజాజ్ పల్సర్ 150, టీవీఎస్ అపాచీలకు ఈ కొత్త బైక్ గట్టి పోటీనివ్వగలదని సుజుకి భావిస్తోంది. -
నాన్నా...నీ దగ్గరికే వస్తున్నా..
14 నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందాడు.. ప్రమాదంలో గాయపడిన కుమారుడు ‘నాన్నా నీదగ్గరికే వస్తున్నా.. అంటూ శుక్రవారం తుదిశ్వాస విడిచాడు.. వేంపల్లెకు చెందిన అబ్దుల్‌ఖాదర్ సంచుల వ్యాపారం చేసేవాడు.. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కుమారుడు బాబావల్లీ(34)తో కలిసి 2012 అక్టోబర్ 12న మోటార్‌సైకిల్‌పై కడపకు బయలుదేరారు. తంగేడుపల్లె వద్ద గేదెలు అడ్డురావడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఆ రోజు రాత్రే అబ్దుల్‌ఖాదర్ మృతి చెందాడు. తీవ్రగాయాలతో తిరుపతిలో చికిత్స పొందుతుండటంతో తండ్రి అంత్యక్రియలకు కూడా బాబావల్లీ రాలేకపోయాడు. చికిత్స అనంతరం యధాప్రకారం సంచుల వ్యాపారం చేసుకునేవాడు.. గాయాలు పూర్తిగా మానకపోవడంతో సోమవారం తీవ్ర జ్వరం వచ్చింది. . తిరుపతికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచాడు.. ఏడాది కాలంలోనే భర్తతో పాటు కుమారుడిని కోల్పోయిన షబానా ‘ దేవుడా.. మాకు దిక్కెవరు’ అంటూ బోరున విలపిస్తోంది. -న్యూస్‌లైన్, వేంపల్లె -
సంపూర్ణం
సాక్షి, కడప: రాష్ర్ట విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ కడపలో జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, నియోజకవర్గ సమన్వయకర్త అంజాద్‌బాషా ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ఉదయమే పార్టీ కార్యకర్తలు అప్సరసర్కిల్లో రోడ్డుపై టైర్లు తగులబెట్టారు. వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. మోటర్‌సైకిళ్లను కూడా తిరగనివ్వలేదు. అంజాద్‌బాషా నేతృత్వంలో కార్యకర్తలు వాహనాల్లో నగరమంతా తిరిగిబంద్ను పర్యవేక్షించారు. దుకాణాలను మూయించారు. జిల్లా అధికారప్రతినిధి అఫ్జల్ఖాన్ కూడా బంద్ చేయించారు. ఆర్టీసీబస్సులు డిపోలకే పరిమతమయ్యాయి. దీంతో ఆర్టీసీబస్టాండ్ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది. రాకపోకలకు ఆటంకం ఏర్పడటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఏపీఎన్జీవోలు కూడా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వకార్యాలయాలు, బ్యాంకులు మూసేశారు. పట్టణకన్వీనర్ పోలా శ్రీనివాసులరెడ్డి బంద్‌లో పాల్గొన్నారు. మైదుకూరులో పార్టీ క్రమశిక్షణకమిటీ సంఘం సభ్యుడు రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. పట్టణంలో తిరిగి దుకాణాలను మూయించారు. ఉపాధ్యాయులు కూడా బంద్‌లో పాల్గొన్నారు. పార్టీనాయకులు మదీనా దస్తగిరి, ధనపాలజగన్, షౌకత్‌అలీ బంద్‌ను పర్యవేక్షించారు. పులివెందులలో పార్టీ మునిసిపల్ ఎన్నికల పరిశీలకుడు శివశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ప్రభుత్వ కార్యాలయాలు మూసేశారు. ఎన్జీవోలు బంద్‌లో పాల్గొన్నారు. వ్యాపార దుకాణాలను కూడా స్వచ్ఛందంగా మూసేశారు. రైల్వేకోడూరులో డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కొల్లం బ్రహ్మానందరెడ్డి, పంజం సుకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ జరిగింది. వైఎస్సార్‌సర్కిల్‌లో రెండుగంటలపాటు బైఠాయించి వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. సమైక్యనినాదాలు చేశారు. ఏపీఎన్జీవోలు కూడా బంద్ చేశారు. విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని దుకాణాలను మూయించారు. బద్వేలులో మునిసిపల్ మాజీ చైర్మన్ మునెయ్య ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఆర్టీసీబస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు మూసేశారు. పోరుమామిళ్లలో గాంధీ విగ్రహం నుంచి బస్టాండ్ వరకూ పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి బంద్ చేపట్టారు. కమలాపురంలో మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపారదుకాణాలను మూయించారు. వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. జమ్మలమడుగులో వైఎస్సార్సీపీ నాయకురాలు అల్లెప్రభావతి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. పట్టణంలో ర్యాలీ, పాతబస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపారదుకాణాలను మూయించారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ప్రొద్దుటూరులో పార్టీ కార్యకర్తలు బంద్ చేపట్టారు. ఆర్టీసీబస్సులు డిపోలకే పరిమతమయ్యాయి. వ్యాపారసంస్థలను మూయించారు. రాజీవ్ సర్కిల్లో మానవహారం చేపట్టారు. బంద్‌లో గోపవరం సర్పంచ్ దేవీప్రసాద్‌రెడ్డి, మురళీధరరెడ్డి పాల్గొన్నారు. రాయచోటిలో జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ దేవనాథరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఉదయమే ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపారదుకాణాలను మూసేశారు. ఏపీ ఎన్జీవోలు కూడా బంద్ నిర్వహించారు. ఆర్టీసీబస్సులు డిపోలకే పరిమతమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా పోలీసులు గట్టిబందోబస్తు చర్యలు తీసుకున్నారు. కడపలో మినహా కనిపించని ‘తమ్ముళ్ల’ బంద్: ఏపీ ఎన్జీవోల ఆధ్వర్యంలో జరిగే సమైక్యబంద్కు సంపూర్ణమద్దతు ప్రకటిస్తున్నట్లు తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి గురువారం ప్రకటించారు. అయితే శుక్రవారం కడపలో మినహా తక్కిన ఏ నియోజకవర్గంలో కూడా తెలుగుతమ్ముళ్లు కనిపించలేదు. కడపలో మాత్రం పార్టీ నేతలు గోవర్దన్‌రెడ్డి, అమీర్‌బాబు కాసేపు నగరంలో కలియతిరిగారు. పుత్తా నరసింహారెడ్డి నాయకత్వం వహిస్తున్న కమలాపురం, ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సొంత నియోజకవర్గం జమ్మలమడుగుతో పాటు జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రొద్దుటూరులో కూడా పచ్చజెండా ఆచూకీ కనిపించలేదు. దీంతో బంద్‌కు మద్దతును ప్రకటించడం, పార్టీ కార్యకర్తలు మాత్రం బంద్‌లో పాల్గొనకపోడం ఏంటని జిల్లా వ్యాప్తంగా చర్చ మొదలైంది. అసెంబ్లీకి తెలంగాణబిల్లు వచ్చినపుడు కూడా ఇదే రకంగా తమ్ముళ్లు వ్యవహరించారని, మళ్లీ ఇదే పునరావృతం కావడం చూస్తే వారి మనోగతం ఏంటో అంతుపట్టడం లేదని చర్చించుకుంటున్నారు. బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొనలేనప్పుడు ప్రకటనలు చేయడం ఎందుకుని విమర్శిస్తున్నారు. -
డమ్మీ డాక్టర్!
గద్వాల ఏరియా ఆస్పత్రి తీరు నానాటికి తీసికట్టు...అనే చందంగా మారుతోంది. ఇటీవల జబ్బు ఒకటైతే మందు మరొకటి ఇచ్చి ఇద్దరు చిన్నారుల ప్రాణం పోయేంతా పనిచేశారు. ఇది మరకముందే మరోలీల బయటపడింది. ఓ డమ్మీ డాక్టర్ ఎంచక్కా ఇక్కడే తిష్టవేశాడు. రోగులకు దర్జాగా వైద్యపరీక్షలు నిర్వహించాడు. అతడు ప్రభుత్వ వైద్యుడే కాదు.. అసలు వైద్యుడో కాదో కూడా తెలియదు.. చివరకు ఈ తతంగం బయటపడటంతో మెల్లగా జారుకున్నాడు. గద్వాల న్యూటౌన్, న్యూస్‌లైన్: పట్టణానికి చెందిన ఎల్ఐసీ ఏజెంట్ రమేష్ గురువారం రాత్రి రాజీవ్‌మార్గ్‌లో మోటార్ సైకిల్‌పై వస్తూ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. విష యం తెలుసుకున్న ఎల్ఐసీ బ్రాంచ్ మేనేజర్ రామ్‌జీ, ఇతర ఏజెంట్లు అక్కడి కి చేరుకున్నారు. అప్పటికే రమేష్‌కు డ్యూటీలో ఉన్న పేరు తెలియని వైద్యుడు చికిత్స చేస్తున్నాడు. తలకు తీవ్రగాయాలు అయ్యాయని, కర్నూలుకు తీసుకెళ్తామని స్నేహితులు వైద్యున్ని కోరారు. ఈ క్రమంలోనే ఏరియా ఆస్పత్రిలోనే పని చేసే డాక్టర్ విజయ్‌కుమార్‌ను కొంతమంది ఎల్ఐసీ ఏజెంట్లు సహకారంగా ఉంటుందని పిలిపించారు. ఆయ న ఆస్పత్రికి రాగానే అంతవరకు డ్యూటీ లో ఉండి చికిత్సచేసిన సదరు వ్యక్తి అక్కడినుంచి ఉడాయించాడు. దీంతో ఆ డాక్టర్ ఎవరని అక్కడున్న ఇతర సిబ్బం దిని ఎల్ఐసీ ఏజెంట్లు ప్రశ్నించారు. తమకు తెలియదని వారు సమాధానమిచ్చారు. దీంతో అసలు డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ ఎవరనే విషయం చర్చనీయాంశంగా మారింది. చికిత్సచేసిన డాక్టర్ ప్రభుత్వ వైద్యుడు కాదని తెలిపోవడంతో రోగులు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. ఇంతలో గాయపడ్డ రమేష్‌ను కర్నూలుకు తరలించారు. మీడి యా ఆస్పత్రికి చేరుకుని ఆరాతీయగా సదరు వ్యక్తి డమ్మీ డాక్టర్ అని తేలింది. సాయంత్రం 7 గంటల నుంచి చికిత్స చేసినట్లు గుర్తించారు. ఇంతకుముందు మరో ఇద్దరిని కర్నూలుకు రెఫర్చేసినట్లు తేలిం ది. ఇదిలాఉండగా డ్యూటీలో కిషోర్‌కుమార్ అనే వైద్యు డు ఉండాల్సి ఉండగా, అతడు అందుబాటులో లేడు. ఈ విషయమై అక్కడున్న స్టాఫ్ నర్సు ఇందిరను అడగ్గా చికిత్సచేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదన్నారు. అంతలోనే డాక్టర్ కిషోర్‌కుమార్ అక్కడికి చేరుకున్నారు. వచ్చిన వ్యక్తి పేరు బాషా అని, అతను తన వెంట వచ్చాడని తెలి పారు. లేబర్ రూములో మరో రోగికి తా ను చికిత్స చేస్తున్నానని అదే సమయంలో గాయపడ్డ వ్యక్తికి వైద్యపరీక్షలు చేయమని తానే చెప్పానని చెప్పుకొచ్చాడు. దీంతో స్థానిక వైద్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. -
జీవనయానంలో కడతేరిన ప్రాణం
కోవూరు, న్యూస్‌లైన్ : కుటుంబాన్ని పోషించుకునే జీవనయానంలో ఓ నిం డు ప్రాణం కడతేరిపోయిన సంఘటన శుక్రవారం కోవూరు సమీపంలో జాతీ య రహదారిపై సాయిబాబా మందిరం ఎదురుగా చోటు చేసుకుంది. అతి వేగంతో వెళుతున్న లారీ నిండు ప్రాణాన్ని బలిగొంది. బాధితుల కథనం మేరకు.. కొడవలూరు మండలం నార్తురాజుపాళెం మహాలక్ష్మమ్మ గుడి ప్రాంతానికి చెందిన పాశం కొండలరావు (50) స్టీలు సామాన్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నెల్లూరు నుంచి స్టీలు సామాన్లు తీసుకుని వచ్చి వాయిదాల రూపంలో పలువురికి ఇస్తుంటాడు. శుక్రవారం అమ్మకాలు పోను మిగిలిన స్టీలు వస్తువులను మోటార్ సైకిల్‌పై తీసుకుని నెల్లూరులోని దుకాణానికి అందజేసేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. స్థానిక సాయిబాబా మందిరం ఎదురుగా జాతీయ రహదారి వద్ద వెనుక నుంచి ఓ గుర్తుతెలియని లారీ ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో కొండలరావు అక్కడక్కడే మృతి చెందాడు. కొండలరావు మోటార్‌సైకిల్‌ను లారీ అర కిలో మీటరు తీసుకెళ్లి పడేసింది. సంఘటన స్థలాన్ని చూసిన ప్రతి ఒక్కరు లారీ ఎంత వేగంగా వెళ్లి ఉంటుందో అంచనా వేసి ఆశ్చర్యపోతున్నారు. సంఘటన స్థలానికి కొడవలూరు ఎస్ఐ జగన్మోహన్రావు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కోవూరు ఎస్ఐ గంగాధర్ తెలిపారు.