సాక్షి, ముంబై: బీర్‌తో నడిచే బైక్ ఎపుడైనా చూశారా? అవును బీర్ బైకే.. అది కూడా గంటకు 240 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుందట. ప్రస్తుతం ఈ బీర్ బైక్ ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. అమెరికాకు చెందిన మైఖేల్సన్ బీర్ బైక్ సృష్టికర్త.
గతంలో రాకెట్‌తో నడిచే టాయిలెట్, జెట్‌తో నడిచే కాఫీపాట్‌ను కనుగొన్న మైఖేల్సన్ తాజా బీర్‌బైక్‌ను రూపొందించడం విశేషం. దీనికి సంబంధించిన వివరాలను ఫాక్స్9తో షేర్ చేసిన అతగాడు బైక్‌లో అమర్చిన హీటింగ్ కాయిల్ బీర్‌ను 300 డిగ్రీల వరకూ మండిస్తుందని, దీంతో నాజిల్స్‌లో ఆవిరి జనరేట్ అవ్వడం ద్వారా బైక్ పని చేస్తుందని మైఖేల్సన్ తెలిపారు. బీరుతో నడిచే మోటార్‌సైకిల్ బ్లూమింగ్టన్‌లోని అతని గ్యారేజీలో నిర్మించారట.
ఈ బైక్ గంటకు 240 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుందని చెప్పాడు మైఖేల్సన్. గ్యాస్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ఇదొక వినూత్న ఆవిష్కరణ అని వెల్లడించాడు. అంతేకాదు రెడ్ బుల్, కారిబౌ కాఫీతో సహా ఏదైనా ద్రవం కూడా తన బైక్ ఇంధనంగా మార్చుకోవచ్చని కూడా పేర్కొన్నాడు. తాను డ్రింక్ చేయనని, అందుకే దీన్ని ఇంధనంగా మలచి మెరుగ్గా వాడుకోవాలని ఆలోచించానని చెప్పుకొచ్చాడు.
రాకెట్‌మ్యాన్‌గా పేరొందిన మైఖేల్సన్ బీర్ బైక్ స్ధానిక కార్ షోస్‌లో టాప్ ప్లేస్ స్ధానంలో నిలవడం విశేషం. కొన్ని ప్రదర్శనల అనంతరం తన ఇంటిలోని మ్యూజియంలో ఈ బైక్‌ను ఉంచుతానని మైఖేల్సన్ తెలిపాడు. 9 నెలల క్రితం తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వీడియోను షేర్ చేశాడు. అతని కుమారుడు దీని గురించి సవివరమైన సమాచారం ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment