రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి | child died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

Published Fri, Jun 6 2014 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM

రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

గద్వాల న్యూటౌన్, న్యూస్‌లైన్ : పెళ్లి వేడుకలకు హాజర వ్వడానికి వస్తున్న త ండ్రీ కూతుళ్లు ప్రమాదం బారిన పడ్డారు. చిన్నారి మృత్యువాత పడగా తండ్రికి సైతం తీవ్ర గాయాలు తగిలాయి. ఈ సంఘటన గురువారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో గద్వాల మండల పరిధిలోని జమ్మిచేడు శివారులో చోటుచేసుకుంది.
 
  పూర్తి వివరాలిలా.. కర్నూలు జిల్లా దేవరకొండ మండలం నెలకొండి గ్రామానికి చెందిన రామాంజనేయులు తన భార్య రామేశ్వరిలు ఇద్దరు కూతుళ్లు శృతి(5), కీర్తిలతో కలిసి మోటార్ సైకిల్‌పై గద్వాల సమీపంలో ఉన్న బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహానికి హాజరయ్యేందుకు ఉదయం బయల్దేరారు. వారి వాహనం జమ్మిచేడు శివారుకు చేరుకోగానే గద్వాల నుంచి అనంతపురం వైపు వస్తున్న హుస్సేన్, రాముడు అనే యువకులు బైకుపై వస్తూ ఎదురుపడి ఢీకొన్నారు.
 
 ఈ సంఘటనలో ముందు భాగంలో కూర్చున్న చిన్నారి శృతి, రామాంజనేయులు ఎగిరి రోడ్డుపక్కన పడ్డారు. చిన్నారి  తలకు తీవ్ర గాయాలవ్వడంతో ఆమె ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందింది. రామాంజనే యులుతోపాటు, రాముడు, హుసేన్‌లకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. వారిని కర్నూలు స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చిన్నారి మృతితో ఆస్పత్రి ఆవరణలో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. శుభకార్యానాకి వస్తూ ప్రమాదం బారిన పడటంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement