
మోటార్‌సైకిల్ తయారీదారు రాయల్ ఎన్‌ఫీల్డ్ సెప్టెంబర్‌లో విక్రయాలు పెరిగినట్లు కంపెనీ సీఈఓ బి.గోవిందరాజన్ తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది విక్రయాలు 11 శాతం పెరిగి 86,978 యూనిట్లకు చేరినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గోవిందరాజన్ మాట్లాడుతూ..‘కంపెనీ మోటార్ సైకిల్ విభాగంలో విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. 2023 సెప్టెంబర్‌లో 78,580 యూనిట్ల విక్రయం జరిగింది. ఈసారి అదే సమయంలో 11 శాతం విక్రయాలు పెరిగి 86,978కు చేరాయి. 2024 ప్రారంభంలో క్లాసిక్ 350 మోడల్‌ను లాంచ్ చేయడం సంస్థ విక్రయాలు పెరిగేందుకు తోడ్పడింది. గతేడాది సెప్టెంబర్‌లో ఎగుమతులు 4,319 యూనిట్లుగా ఉండేది. అది గత నెలలో 7,652 యూనిట్లకు పెరిగింది’ అన్నారు.
ఇదీ చదవండి: పాలసీను సరెండర్ చేస్తే ఎంత వస్తుందంటే..?
Comments
Please login to add a commentAdd a comment