జీవిత బీమా పాలసీని వెనక్కిచ్చేసినప్పుడు (సరెండర్) పొందే ప్రయోజనాలపై నూతన నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం గతంలో కంపెనీలిచ్చే సరెండర్ వాల్యూ పెరగనుంది. ప్రస్తుతం కంపెనీలు అమలు చేస్తున్న నియమాలు ఎలా ఉన్నాయో, కొత్త విధానం అమలులోకి వస్తున్న నేపథ్యంలో ఎంతమేరకు సరెండర్ వాల్యూ వస్తుందో తెలుసుకుందాం.
జీవిత బీమా పాలసీల గడువు ముగిసే వరకు వేచి చూడకుండా, ముందస్తుగానే వైదొలగాలని భావించే వారికి మెరుగైన రాబడులు అందించడమే కొత్త నిబంధనల ఉద్దేశం. జీవిత బీమా పాలసీని తీసుకున్న తర్వాత నుంచి ఎన్నేళ్ల పాటు ప్రీమియం చెల్లించారు, అప్పటి వరకు ఎంత బోనస్‌లు జమయ్యాయన్న తదితర అంశాల ఆధారంగా సరెండర్ వ్యాల్యూని బీమా సంస్థలు నిర్ణయిస్తుంటాయి. ఇలా సరెండర్ చేసే పాలసీలపై బీమా సంస్థలు గతంలో తక్కువ ప్రయోజనాలనే పాలసీదారులకు చెల్లించేవి. ఉదాహరణకు ఎల్‌ఐసీలో వినయ్(35) వనే వ్యక్తి జీవన్ ఆనంద్ పాలసీను ఎంచుకున్నాడనుకుందాం. పాలసీ కాలం ముప్పై ఏళ్లు. పాలసీ మొత్తం రూ.10 లక్షలుగా భావిస్తే, వినయ్ నెలవారీ దాదాపు రూ.3,175 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఏటా రూ.38,100 చెల్లించాలి. ఐదేళ్లు పాలసీ ప్రీమియం చెల్లించాలరనుకుందాం. రూ.38,100*5 మొత్తం రూ.1,90,500. ఐదేళ్ల తర్వాత వినయ్ తన పాలసీను సరెండర్ చేస్తే తనకు 30-35 శాతం సరెండర్, ఇతర ఛార్జీలు విధించి రూ.1,27,863 మాత్రమే కంపెనీ చెల్లిస్తుంది. మిగతా రూ.62,637 నష్టపోవాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: వాటర్ బాటిల్ ధర తగ్గనుందా..?
కొత్త నిబంధనల ప్రకారం సరెండర్ చేసే పాలసీపై సరెండర్ ఛార్జీలు, ఇతర ఛార్జీలను తగ్గించనున్నారు. దాంతో పాలసీదారుడికి గతంలో కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు సమకూరుతుంది. ఇదిలాఉండగా, కేవలం డబ్బు కోసమే పాలసీను సరెండర్ చేయాలనుకునేవారికి మరో అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పైన తెలిపిన ఉదాహరణలో వినయ్ చెల్లించిన ఐదేళ్ల పాలసీ ప్రీమియంను ఉపయోగించి లోన్ తీసుకునే వెసులుబాటు ఉంది. పాలసీను సరెండర్ చేస్తే రూ.1,27,863 వస్తుంది కదా. అదే తన పాలసీపై లోన్‌కు వెళితే సుమారు రూ.89,500 వరకు పొందే అవకాశం ఉంది. దాంతో పాలసీ కొనసాగించేలా జాగ్రత్త పడవచ్చని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment