జీవిత బీమా పాలసీని వెనక్కిచ్చేసినప్పుడు (సరెండర్) పొందే ప్రయోజనాలపై నూతన నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందుకు బీమా సంస్థలు ఇప్పటికే సన్నద్ధం అయ్యాయి. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) సవరించిన సరెండర్ వ్యాల్యూ నిబంధనలను ఈ ఏడాది ఆరంభంలోనే ప్రకటించడం గమనార్హం.
జీవిత బీమా పాలసీల గడువు ముగిసే వరకు వేచి చూడకుండా, ముందస్తుగానే వైదొలగాలని భావించే వారికి మెరుగైన రాబడులు అందించడమే కొత్త నిబంధనల ఉద్దేశం. జీవిత బీమా పాలసీని తీసుకున్న తర్వాత నుంచి ఎన్నేళ్ల పాటు ప్రీమియం చెల్లించారు, అప్పటి వరకు ఎంత బోనస్‌లు జమయ్యాయన్న తదితర అంశాల ఆధారంగా సరెండర్ వ్యాల్యూని బీమా సంస్థలు నిర్ణయిస్తుంటాయి. ఇలా సరెండర్ చేసే పాలసీలపై బీమా సంస్థలు గతంలో తక్కువ ప్రయోజనాలనే పాలసీదారులకు చెల్లించేవి. దీనివల్ల పాలసీ సరెండర్‌పై పాలసీదారులు సరైన విలువను పొందలేకపోయేవారు. నూతన నిబంధనలతో పాలసీ కమీషన్‌లో మార్పులు చోటు చేసుకోవచ్చని, ప్రీమియం రేట్లలో హెచ్చుతగ్గులు ఉండొచ్చని కేర్ ఎడ్జ్ రేటింగ్స్ డైరెక్టర్ గౌవర్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: 2030 నాటికి భారత ఎకానమీ రెట్టింపు
Comments
Please login to add a commentAdd a comment