![Indian economy will double by 2030](/styles/webp/s3/article_images/2024/10/1/economy01.jpg.webp?itok=Ui98Fw2k)
భారత ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి రెట్టింపవుతుందని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 2026–27 సమయానికి మూడో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవించాలన్న లక్ష్యం సాకారం అయ్యేందుకు పటిష్ట వ్యూహాన్ని అమలు చేయాల్సి ఉంటుందన్నారు.
వాతావరణ మార్పులకు సంబంధించి క్లైమేట్ టెక్నాలజీలో భారత్ అగ్రగామిగా ఎదిగేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని సుబ్రహ్మణ్యం చెప్పారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (పీఏఎఫ్‌ఐ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. భారత్ ప్రస్తుతం 3.7 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో అయిదో అతి పెద్ద ఎకానమీగా ఉంది. ప్రకృతి విపత్తులు, పేదరికం వంటి సవాళ్లను అధిగమించడంలో దేశం గత దశాబ్దకాలంగా గణనీయ పురోగతి సాధించిందని, 2047 నాటికి తలసరి ఆదాయం 18,000–20,000 డాలర్ల స్థాయికి పెరుగుతుందని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆర్థిక వ్యవస్థను పర్యావరణ అనుకూలమైనదిగా తీర్చిదిద్దే దిశగా తీసుకోతగిన చర్యలపై టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు.. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన వివరించారు. గ్లోబలైజేషన్ నేపథ్యంలో పురోగమించాలంటే సరఫరా వ్యవస్థను సంస్కరించుకోవాలని సుబ్రహ్మణ్యం చెప్పారు.
ఇదీ చదవండి: యూఎస్ వెళ్లేవారికి శుభవార్త! 2.5 లక్షల వీసా స్లాట్లు
Comments
Please login to add a commentAdd a comment