పాలసీ దారులకు ఎల్‌ఐసీ బంపరాఫర్ ఇచ్చింది. కోవిడ్‌తో పాటు ఆర్ధిక కారణాల వల్ల కట్టలేని పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిచ్చింది. ఆలస్య రుసుము చెల్లించడం ద్వారా ఆగిపోయిన పాలసీలు మళ్లీ పునరుద్ధరించుకోవచ్చని ఇప్పటికే ఎల్‌ఐసీ అధికారిక ప్రకటన చేసింది. అయితే మరో వారం రోజుల్లో ఎల్‌ఐసీ ఇచ్చిన అవకాశం ముగియనుండడంతో.. పాలసీ దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎల్‌ఐసీ కోరింది.
కోవిడ్-19 మహమ్మారి లైఫ్ ఇన్సూరెన్స్ అవసరాల్ని గుర్తు చేసింది. అందుకే సకాలంలో బీమా చెల్లించలేని కుటుంబాలకు ఆర్ధిక ప్రయోజనాల్ని కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నాం. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 25లోపు పాలసీదారులు ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్దరించుకునే అవకాశం కల్పిస్తున్నాం' అంటూ ఎల్‌ఐసీ ప్రకటనలో పేర్కొంది. అయితే ఇచ్చిన గడువు మరో వారం రోజుల్లో ముగుస్తుండగా, అందుకే పాలసీ దారులు పాలసీలను పునరుద్దరించుకోవాలని ఎల్‌ఐసీ అధికారిక వర్గాలు కోరుతున్నాయి.
Press Release - Special Revival Campaign pic.twitter.com/uHIl8YF6OD
— LIC India Forever (@LICIndiaForever) February 7, 2022
నిబంధనలకు మేరకు మొదటి చెల్లించని ప్రీమియం తేదీ నుండి ఐదేళ్లలోపు నిర్దిష్ట అర్హత గల ప్లాన్‌ల పాలసీలను పునరుద్ధరించవచ్చని స్పష్టం చేసింది. చెల్లించే మొత్తం ప్రీమియంలను బట్టి టర్మ్ అస్యూరెన్స్, హై-రిస్క్ ప్లాన్‌లు కాకుండా ఇతర ఆలస్య రుసుములలో రాయితీలు పొందవచ్చు. వైద్య అవసరాలపై ఎలాంటి రాయితీలు లేవు. అర్హత కలిగిన ఆరోగ్య, సూక్ష్మ-బీమా ప్లాన్‌లు కూడా ఆలస్య రుసుముతో రాయితీకి అర్హత పొందగలరని పేర్కొంది.
రూ.లక్ష వరకు స్వీకరించదగిన మొత్తం ప్రీమియంతో సంప్రదాయ, ఆరోగ్య పాలసీలను ఎల్‌ఐసీ గరిష్ట పరిమితి రూ.2,000తో ఆలస్య రుసుముతో 20 శాతం రాయితీని అందిస్తోంది. అదేవిధంగా రూ.3 లక్షల కంటే ఎక్కువ ప్రీమియం మొత్తానికి, రూ.3,000 పరిమితితో 30 శాతం రాయితీ అందించబడుతుంది. మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్‌ల కోసం ఎల్‌ఐసీ ఆలస్య రుసుములలో పూర్తి రాయితీని అందిస్తోంది.
చదవండి: మే 12వరకూ ఎల్‌ఐసీకి గడువు
Comments
Please login to add a commentAdd a comment