
రైలు వేగాన్ని తగ్గించినప్పటికీ ఇంజన్‌లోకి బైక్ ఇరుక్కుపోయింది.
నెక్కొండ: గూడ్స్ రైలు ఇంజన్‌లో టూ వీలర్ వాహనం ఇరుక్కోవడంతో రైలు అర గంటపాటు నిలిచిపోయింది. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలంలోని గేటుపల్లిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. మండలం లోని గొల్లపల్లికి చెందిన ఓ రైతు తన ద్విచక్ర వాహనాన్ని గేటుపల్లి వద్ద రైలు పట్టాలను దాటిస్తున్నాడు. ఈ క్రమంలో వరం గల్ నుంచి విజయవాడ వెళ్తున్న గూడ్స్ రైలు దగ్గరకు రావడం తో గమనించిన రైతు తన వాహనాన్ని విడిచి వెళ్లిపోయాడు. అప్పటికే అప్రమత్తమైన డ్రైవర్ రైలు వేగాన్ని తగ్గించినప్పటికీ ఇంజన్‌లోకి బైక్ ఇరుక్కుపోయింది. అరగంటపాటు శ్రమించి టూవీలర్‌ను తొలగించాక రైలు తిరిగి బయలుదేరింది.
చదవండి: టీచర్ మందలించాడని.. ఆత్మహత్య చేసుకున్న పదోతరగతి విద్యార్థి