కోవూరు, న్యూస్‌లైన్ : కుటుంబాన్ని పోషించుకునే జీవనయానంలో ఓ నిం డు ప్రాణం కడతేరిపోయిన సంఘటన శుక్రవారం కోవూరు సమీపంలో జాతీ య రహదారిపై సాయిబాబా మందిరం ఎదురుగా చోటు చేసుకుంది. అతి వేగంతో వెళుతున్న లారీ నిండు ప్రాణాన్ని బలిగొంది. బాధితుల కథనం మేరకు.. కొడవలూరు మండలం నార్తురాజుపాళెం మహాలక్ష్మమ్మ గుడి ప్రాంతానికి చెందిన పాశం కొండలరావు (50) స్టీలు సామాన్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నెల్లూరు నుంచి స్టీలు సామాన్లు తీసుకుని వచ్చి వాయిదాల రూపంలో పలువురికి ఇస్తుంటాడు.
శుక్రవారం అమ్మకాలు పోను మిగిలిన స్టీలు వస్తువులను మోటార్ సైకిల్‌పై తీసుకుని నెల్లూరులోని దుకాణానికి అందజేసేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. స్థానిక సాయిబాబా మందిరం ఎదురుగా జాతీయ రహదారి వద్ద వెనుక నుంచి ఓ గుర్తుతెలియని లారీ ఢీకొని వెళ్లిపోయింది.
ఈ ప్రమాదంలో కొండలరావు అక్కడక్కడే మృతి చెందాడు. కొండలరావు మోటార్‌సైకిల్‌ను లారీ అర కిలో మీటరు తీసుకెళ్లి పడేసింది. సంఘటన స్థలాన్ని చూసిన ప్రతి ఒక్కరు లారీ ఎంత వేగంగా వెళ్లి ఉంటుందో అంచనా వేసి ఆశ్చర్యపోతున్నారు. సంఘటన స్థలానికి కొడవలూరు ఎస్‌ఐ జగన్మోహన్‌రావు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కోవూరు ఎస్‌ఐ గంగాధర్ తెలిపారు.
జీవనయానంలో కడతేరిన ప్రాణం
Published Sat, Oct 26 2013 3:18 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement