14 నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందాడు.. ప్రమాదంలో గాయపడిన కుమారుడు ‘నాన్నా నీదగ్గరికే వస్తున్నా.. అంటూ శుక్రవారం తుదిశ్వాస విడిచాడు.. వేంపల్లెకు చెందిన అబ్దుల్‌ఖాదర్ సంచుల వ్యాపారం చేసేవాడు.. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కుమారుడు బాబావల్లీ(34)తో కలిసి 2012 అక్టోబర్ 12న మోటార్‌సైకిల్‌పై కడపకు బయలుదేరారు. తంగేడుపల్లె వద్ద గేదెలు అడ్డురావడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఆ రోజు రాత్రే అబ్దుల్‌ఖాదర్ మృతి చెందాడు.
తీవ్రగాయాలతో తిరుపతిలో చికిత్స పొందుతుండటంతో తండ్రి అంత్యక్రియలకు కూడా బాబావల్లీ రాలేకపోయాడు. చికిత్స అనంతరం యధాప్రకారం సంచుల వ్యాపారం చేసుకునేవాడు.. గాయాలు పూర్తిగా మానకపోవడంతో సోమవారం తీవ్ర జ్వరం వచ్చింది. . తిరుపతికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచాడు.. ఏడాది కాలంలోనే భర్తతో పాటు కుమారుడిని కోల్పోయిన షబానా ‘ దేవుడా.. మాకు దిక్కెవరు’ అంటూ బోరున విలపిస్తోంది.
-న్యూస్‌లైన్, వేంపల్లె
నాన్నా...నీ దగ్గరికే వస్తున్నా..
Published Sat, Jan 11 2014 2:19 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement