తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతున్న జబ్బర్ అలీ
ఇద్దరికి గాయాలు
Published Sat, Sep 3 2016 10:34 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
కంచిలి : జాతీయ రహదారిపై మండల కేంద్రం వద్ద శనివారం మధ్యాహ్నబ జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు మోటారుసైకిళ్లు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు చెప్పిన వివరాలు... కంచిలి మండలం శాసనాం గ్రామం వద్ద విద్యుత్ టవర్స్ నిర్మాణంలో పని చేస్తున్న కోల్‌కత్తాకు చెందిన జబ్బర్ అలీ, గరీబుద్దీన్‌లు డీజిల్ కోసం కంచిలి వచ్చారు. డీజిల్ కొనుగోలు చేసిన అనంతరం తమ బైక్ మీద గరీబుద్దీన్ బైక్ నడుపుతుండగా జబ్బర్ అలీ ఆయిల్ క్యాన్ పట్టుకొని వెనుక కూర్చున్నాడు. వీరు స్థానిక తహసీల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి అంపురం వైపు వెళ్తుండగా...
అదే మార్గంలో వెనుక నుంచి వస్తున్న బైక్ వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో జబ్బర్ అలీ తీవ్ర గాయాల పాలయ్యాడు. వెనుక నుంచి వచ్చి ఢీకొన్న బైక్ వజ్రపుకొత్తూరుకు చెందిన కె.రవి, రాజు తమ బైక్‌లో వజ్రపుకొత్తూరు నుంచి ఇచ్ఛాపురం వైపు ఎలక్ట్రికల్ సామానులు కొనుగోలు చేయటానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో ముందు బైక్‌లో ఉన్న జబ్బర్ అలీతో పాటు వెనుక బైక్‌ను నడుపుతున్న రాజు తీవ్ర గాయాలపాలయ్యాడు. వీరిని సోంపేట ప్రభుత్వాసుపత్రిలో ఎన్‌హెచ్ అంబులెన్స్‌లో చేర్పించారు. జబ్బర్ అలీ ఫిర్యాదు మేరకు స్థానిక హెచ్‌సీ పి.నీలకంఠేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జబ్బర్ అలీ తీవ్ర గాయాల పాలవ్వటంతో బరంపురం ఎంకేసీజీ ఆసుపత్రికి తరలించారు.
Advertisement