ఆ మోటర్‌ సైకిల్‌కి నాటి పాక్‌ అధ్యక్షుడు ఇప్పటికీ డబ్బు చెల్లించలేదు! | Manekshaws Bike And1000 Rupees But Pak Presiden Paid Half His Country | Sakshi
Sakshi News home page

ఆ మోటర్‌ సైకిల్‌కి పాక్‌ అధ్యక్షుడు ఇప్పటికీ డబ్బు చెల్లించలేదట!పాక్‌గా ఏర్పడక ముందు జరిగిన ఘటన

Published Tue, Jan 30 2024 4:54 PM | Last Updated on Tue, Jan 30 2024 5:24 PM

Manekshaws Bike And1000 Rupees But Pak Presiden Paid Half His Country - Sakshi

రెండు దేశాల సైనిక నాయకుల మధ్య జరిగిన ఆసక్తికర ఘటన. ఇది భారతదేశాన్ని బ్రిటీష్‌ వాళ్లు పాలిస్తున్నప్పుడు చోటు చేసుకున్న రసవత్తర ఘటన. బ్రిటీష్‌ పాలనా కాలంలో భారత్‌కి చెందిన సామ్ మానెక్షా, పాక్‌కి చెందిన యాహ్యా ఖాన్ మధ్య చోటు చేసుకుంది ఈ ఘటన. నిజానికి ఈ ఇద్దరూ ఆంగ్లేయుల పాలన కాలంలో మిలటరీ లీడర్లుగా పనిచేయడంతో వీరి మధ్య కొద్దిపాటి స్నేహం ఏర్పడింది. ఆ టైంలో మానెక్షా లెఫ్టినెంట్ కల్నల్ పనిచేయగా, యాహ్యా ఖాన్ మేజర్. అయితే యహ్యా ఖాన్‌కి మానెక్షా వద్ద ఉండే ఎరుపు రంగు మోటార్‌ సైకిల్‌పై ఆశ ఉండేది.

దీంతో ఒకరోజు యహ్యా ఖాన్‌ మానెక్షాని నాకు ఆ సైకిల్‌ ఇవ్వు నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను అన్నాడు. మానెక్ష ఆ వెయ్యి రూపాయాలకు ఆశపడి తన వద్ద ఉన్న ఎరుపు రంగు మోటార్‌ సైకిల్‌ని ఇచ్చేయడం జరిగింది. ఈలోగా బ్రిటీష్‌ వాళ్ల మనదేశాన్ని విడిచిపెట్టిపోవడం వెళ్తూ పాక్‌ని అంటగట్టడం జరిగింది. అదికాస్త 1947లో మన భారత్‌ నుంచి వేరుగా దేశంగా ఏర్పడటం అన్నీ చకచక జరిగిపోయాయి. దీంతో యహ్యా ఖాన్‌ ఆ సైకిల్‌ని తీసుకుని పాక్‌కి వెళ్లిపోవడం కూడా జరిగిపోయింది. అయితే పాపం మన భారత ఆర్మీ నాయకుడు సామ్ మానెక్షాకి మాత్రం యహ్యా ఖాన్‌ డబ్బు చెల్లించ లేదు. ఆంగ్లేయులు వెళ్లిపోయిన అనంతరం మానెక్షా మన భారత ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

అయితే అనుకోకుండా 1971లో భారత్‌కి పాక్‌కి మధ్య భయానక యుద్ధం జరిగింది. ఆ టైంలో మన మానెక్ష భారత ఆర్మీ ఛీప్‌గా సైన్యాని నిర్వహిస్తుండగా, యహ్యా ఖాన్‌ పాక్‌ అధ్యక్షుడిగా ఉన్నాడు. అయితే ఆ యుద్ధంలో మన మానెక్ష సారథ్యంలో భారత ఆర్మీ పాక్‌ సైన్యాన్ని మట్టికరిపించి విజయకేతనం ఎగురవేసింది. ఈ యుద్ధం కారణంగానే బంగ్లాదేశ్‌ ఒక దేశంగా ఏర్పడటం కూడా జరిగింది. ఈ మేరకు ఓ పత్రిక ఇంటర్వ్యూలో మానెక్షా ఈ ఘటన గురించి చెబతూ తాను 24 ఏళ్లుగా తమన మోటర్‌ సైకిల్‌ డబ్బులు వెయ్యి రూపాయాలు ఎప్పుడు వస్తాయా? అని 24 ఏళ్లుగా ఎదురు చూసినట్లు తెలిపారు. అయితే యహ్యా ఖాన్‌ ఇప్పుడూ తన దేశ ఓటమితో తనకు మూల్యం చెల్లించాడంటూ చమత్కరించారు మానెక్షా.

అలాగే తాను యహ్యా ఖాన్‌ని ఎప్పుడూ ఆ వెయ్యి రూపాయల్ని వడ్డితో సహా చెల్లించమని అడగను కూడా అడలేదని చెప్పుకొచ్చారు. దీని గురించి 2008లో ఆంగ్ల పత్రికా కాలమిస్ట్‌ రాసుకొచ్చాడు. ఐతే ఇంటర్వ్యూలో మానెక్ష ఆ ఘటనను ఎన్నడూ మర్చిపోలేనని అన్నాడు. ఇద్దరూ వారి దేశాలకు సంబంధించిన అత్యున్నత హోదాలో సాగినా..స్నేహితులుగా ఉన్నప్పుడూ జరిగిన ఘటన మానెక్షని ఎన్నటికీ మర్చిపోనివ్ల లేదు. ఆ ఘటన మానెక్షా మనుసులో మర్చిపోలేని ఘటనగా ఉండిపోయింది. 

స్నేహం పేరుతో ఓ వ్యక్తి చేసిన మోసం భవిష్యత్తులో కాలం ఎలా బదులు తీర్చుతుంది అనేందుకు ఉదాహరణే ఈ గాథ. అదీగాక తనను మోసం చేసి తన వస్తువుని స్నేహితుడి పట్టుకుపోతే ఆ వ్యక్తి  పట్ల సదరు స్నేహితుడి మనుసులో ఎలాంటి ముద్రపడుతుందనేందుకు ఈ ఘటనే నిలువెత్తు సాక్ష్యం. ఇక యుద్ధం గెలిచినప్పటికీ దీనివవల్ల మానవ నష్టం ఎంత ఉంటుందో గుర్తించాడు జనరల్‌ మానేక్షా. ఇక యహ్యాఖాన్‌ తర్వాత క్రమక్రమంగా రాజీకయ పతనాన్ని చవిచూశాడు. కాగా ఈ ఘట్టం 2003లో​ బాలీవుడ్‌లో తీసిన శ్యామ్‌ బహుదూర్‌ సినిమాలో కూడా ఉంది. ఇందులో  విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్ర పోషించారు. 

(చదవండి: ఈజిప్ట్‌ అమ్మాయి నోట మన దేశభక్తి గీతం..మోదీ ప్రశంసల జల్లు!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement