భారతీయ ఆర్మీ పోస్టును కూల్చేశాం: పాక్ ఆర్మీ
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో గల భారతీయ ఆర్మీ పోస్టులను కూల్చేశామంటూ పాకిస్తాన్ ఆర్మీ ఓ వీడియోను విడుదల చేసింది. దీనిపై స్పందించిన ఓ భారతీయ ఆర్మీ అధికారి పాకిస్తాన్ విడుదల చేసిన వీడియో అబద్దమని తెలిపారు. బుల్లెట్లను తట్టుకుని నిలబడగల సామర్ధ్యం భారతీయ పోస్టుల గోడలకు ఉందని వెల్లడించారు.
నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తానీ పోస్టులను నేల కూల్చిన వీడియోను భారత్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏం చేయాలో అర్ధం కాని పాకిస్తాన్ ఆర్మీ అధికారులు నౌషెరాలో గల భారత ఆర్మీ పోస్టుపై మంగళవారం దాడి చేసి ధ్వంసం చేసినట్లు ఓ నకిలీ వీడియోను విడుదల చేశారు. ఈ మేరకు పాకిస్తాన్ ఆర్మీ ట్వీటర్ ద్వారా వీడియోను విడుదల చేసింది. ఈ నెల 13వ తేదీన భారతీయ ఆర్మీ అమాయకులైన పాకిస్తాన్ పౌరులపై కాల్పులు జరిపి హతమార్చినందుకు ప్రతీకారంగా భారత చెక్ పోస్టుపై దాడి చేశామని పేర్కొంది.
On 13 May 2017, India targeted innocent civilians. In befitting response Pak Army destroyed Indian posts in Nowshera Sec. 2/2. pic.twitter.com/jHLZVOoHSa
— Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) 23 May 2017