గద్వాల ఏరియా ఆస్పత్రి తీరు నానాటికి తీసికట్టు...అనే చందంగా మారుతోంది. ఇటీవల జబ్బు ఒకటైతే మందు మరొకటి ఇచ్చి ఇద్దరు చిన్నారుల ప్రాణం పోయేంతా పనిచేశారు. ఇది మరకముందే మరోలీల బయటపడింది. ఓ డమ్మీ డాక్టర్ ఎంచక్కా ఇక్కడే తిష్టవేశాడు. రోగులకు దర్జాగా వైద్యపరీక్షలు నిర్వహించాడు. అతడు ప్రభుత్వ వైద్యుడే కాదు.. అసలు వైద్యుడో కాదో కూడా తెలియదు.. చివరకు ఈ తతంగం బయటపడటంతో మెల్లగా జారుకున్నాడు.
గద్వాల న్యూటౌన్, న్యూస్‌లైన్: పట్టణానికి చెందిన ఎల్‌ఐసీ ఏజెంట్ రమేష్ గురువారం రాత్రి రాజీవ్‌మార్గ్‌లో మోటార్ సైకిల్‌పై వస్తూ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. విష యం తెలుసుకున్న ఎల్‌ఐసీ బ్రాంచ్ మేనేజర్ రామ్‌జీ, ఇతర ఏజెంట్లు అక్కడి కి చేరుకున్నారు.
అప్పటికే రమేష్‌కు డ్యూటీలో ఉన్న పేరు తెలియని వైద్యుడు చికిత్స చేస్తున్నాడు. తలకు తీవ్రగాయాలు అయ్యాయని, కర్నూలుకు తీసుకెళ్తామని స్నేహితులు వైద్యున్ని కోరారు. ఈ క్రమంలోనే ఏరియా ఆస్పత్రిలోనే పని చేసే డాక్టర్ విజయ్‌కుమార్‌ను కొంతమంది ఎల్‌ఐసీ ఏజెంట్లు సహకారంగా ఉంటుందని పిలిపించారు.
ఆయ న ఆస్పత్రికి రాగానే అంతవరకు డ్యూటీ లో ఉండి చికిత్సచేసిన సదరు వ్యక్తి అక్కడినుంచి ఉడాయించాడు. దీంతో ఆ డాక్టర్ ఎవరని అక్కడున్న ఇతర సిబ్బం దిని ఎల్‌ఐసీ ఏజెంట్లు ప్రశ్నించారు. తమకు తెలియదని వారు సమాధానమిచ్చారు. దీంతో అసలు డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ ఎవరనే విషయం చర్చనీయాంశంగా మారింది.
చికిత్సచేసిన డాక్టర్ ప్రభుత్వ వైద్యుడు కాదని తెలిపోవడంతో రోగులు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. ఇంతలో గాయపడ్డ రమేష్‌ను కర్నూలుకు తరలించారు. మీడి యా ఆస్పత్రికి చేరుకుని ఆరాతీయగా సదరు వ్యక్తి డమ్మీ డాక్టర్ అని తేలింది. సాయంత్రం 7 గంటల నుంచి చికిత్స చేసినట్లు గుర్తించారు. ఇంతకుముందు మరో ఇద్దరిని కర్నూలుకు రెఫర్‌చేసినట్లు తేలిం ది. ఇదిలాఉండగా డ్యూటీలో కిషోర్‌కుమార్ అనే వైద్యు డు ఉండాల్సి ఉండగా, అతడు అందుబాటులో లేడు.
ఈ విషయమై అక్కడున్న స్టాఫ్ నర్సు ఇందిరను అడగ్గా చికిత్సచేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదన్నారు. అంతలోనే డాక్టర్ కిషోర్‌కుమార్ అక్కడికి చేరుకున్నారు. వచ్చిన వ్యక్తి పేరు బాషా అని, అతను తన వెంట వచ్చాడని తెలి పారు. లేబర్ రూములో మరో రోగికి తా ను చికిత్స చేస్తున్నానని అదే సమయంలో గాయపడ్డ వ్యక్తికి వైద్యపరీక్షలు చేయమని తానే చెప్పానని చెప్పుకొచ్చాడు. దీంతో స్థానిక వైద్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
డమ్మీ డాక్టర్!
Published Fri, Jan 3 2014 3:55 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement