చికిత్స పొందుతున్న వృద్ధురాలి మృతి | old women death is being treated | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతున్న వృద్ధురాలి మృతి

Published Mon, Oct 7 2013 3:32 AM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM

old women death is being treated

నకిరేకల్, న్యూస్‌లైన్:  పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సూర్యాపేటకు చెందిన ఎముకల వైద్యుడు గత 20 ఏళ్లుగా పట్టణంలోని రఘురామ థియేటర్ పక్కన ఆస్పత్రి నిర్వహిస్తున్నా డు.
 
 పతి ఆదివారం ఇక్కడి వచ్చి రోగులకు వైద్య పరీక్షలు చేసి వెళ్తుంటాడు. కాగా తిప్పర్తి మండలంలోని చిన్నాయిగూడెంకు చెందిన బైరగోని పెంట మ్మ(62) మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ ఆది వారం ఆస్పత్రికి రాగా డాక్టర్ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి ఫ్లూయిడ్స్ ఎక్కించారు. అనంతరం డాక్టర్ ఆదేశాల మేరకు కంపౌండర్ పెన్సిలిన్ ఇం జక్షన్ ఇచ్చాడు. ఆ తరువాత పెంటమ్మ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వేరే ఆస్పత్రికి తరలించేం దుకు 108 అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తుండగానే పెంటమ్మ మృతి చెందింది.
 
 ఆస్పత్రి ఎదుట ఆందోళన
 పెంటమ్మ మృతిపట్ల ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ  ఆస్పత్రి ఎదుట ఆందోళనకు ది గారు. వైద్యం వికటించడం వల్లే పెంటమ్మ మృతి చెందిందని వారు ఆరోపించారు. అంతేకాకుండా ఆస్పత్రిపై దాడి చేసి ఫర్నిచర్, మందులను ధ్వం సం చేశారు. డాక్టర్‌ను నిలదీశారు. సమాచారం అం దుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతురాలి కుటుంబీకులకు నచ్చజెప్పి శాంతింపజేశారు. వైద్యం వికటించడం వల్లే తమ తల్లి మృతి చెందిందని, ప్రభుత్వ అనుమతి లేకుండా ఆస్పత్రి నిర్వహిస్తూ, మందులు విక్రయిస్తున్న డాక్టర్‌పై చర్య తీసుకోవాలని కుమారులు జానయ్య, శ్రీనువాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  
 
 డాక్టర్ వివరణ
 పెంటమ్మ మృతిపై డాక్టర్‌ను వివరణ కోరాగా  తా ను వైద్యం చేసిన విషయం వాస్తవమేనన్నారు. అ యితే ఒక ఫ్లూయిడ్స్ పెట్టి, ఇంజక్షన్ తన సిబ్బంది తో వేయించానని చెప్పారు. దీంతో ఆమె కళ్లు తిరుగుతున్నాయని అంటూనే మృతి చెందిందని తెలిపా రు. ఆమె ప్రాణాలు కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వివరించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement